పాటలా సాగాల్సిన జీవితం… ప్చ్‌! – పి. ప్రశాంతి

‘పల్లెపల్లెను లేపి… గుండె గుండెను ఊపి… జనజాగృతి చేసే…’ పాటెనక పాట ప్రవాహంలా సాగిపోతున్నాయి. సాయం కాలపు నీరెండలో జొన్న చేలల్లో పాలకంకులు మెరుస్తున్నాయి. చేల మీదుగా గిరికీలు కొడుతున్న పిట్టలు… పచ్చిక బయళ్ళలో మేస్తున్న బర్రెలు, గొర్రెలు… గట్లమీదగా నడిచొస్తున్న మహిళలు… చల్లటి గాలి… మట్టి వాసన… ‘బంతి పూవుల దండ దర్వాజ నిండా…’ అలుపులేకుండా సాగుతున్న పాటా, పరిగెడుతున్న జీపూ ఒక్క కుదుపుతో ఆగి పోయాయి. లేగదూడొకటి చెంగు చెంగున రోడ్డుమీదకొచ్చేసింది. ఎదురుగా వస్తున్న బైక్‌ ఒక్కసారిగా బ్రేకేసేసరికి జారి పక్కకొరిగి వెనక కూర్చున్న అమ్మాయి పడిపోవడంతో జీపుకు బ్రేక్‌ వేశాడు డ్రైవర్‌.

అది చూసి ‘అయ్యయ్యో’ అంటూ జీపు దిగి ఆ అమ్మాయి దగ్గరకు పరిగెత్తారు శాంతి, ఆనంద, లక్ష్మి, ప్రమీల. ఆమెని లేపి దెబ్బలేం తగల్లేదని చూసి, మంచినీళ్ళిచ్చి కూర్చోబెట్టారు. 30 ఏళ్ళ ఆ యువకుడు, 15 కూడా నిండనట్టున్న ఆ అమ్మాయి భార్యాభర్తలని, పెళ్ళై ఆర్నెల్లు కాలేదని, పుట్టింట్లో దించడానికి తీస్కెళ్తున్నాడని వారి మాటలద్వారా అర్థమైంది. చీకటి పడుతుండడంతో ఎవరి దారిన వారు తిరిగి ప్రయాణమయ్యారు.

అందరూ ఏదో ఒకటి మాట్లాడు తున్నా అప్పటివరకు పాటల్తో ముంచెత్తిన ఆనంద మౌనంగా అయిపోయింది. ఎప్పుడూ చలాకీగా మాట్లాడుతూ, ప్రతి సందర్భానికో పాట పాడ్తూ, పాటకి అభినయాన్ని జోడించి ఎలాంటి విషయాన్నైనా ఇట్టే అర్థమయ్యేలా చెప్పే ఆనంద సాధారణంగా మౌనంగా ఉండదు… జీవితంలో అతి చేదైన తన అనుభవాలు గుర్తొస్తే తప్పించి. 20 ఏళ్ళ ఆనంద 3ఏళ్ళ కిట్టుకి తల్లి. కిట్టు పుట్టక ముందు ఒకసారి అబార్షన్‌ కూడా అయింది.

14 ఏళ్ళు నిండగానే తొమ్మిదో తరగతి చదువుతున్న ఆనందకి సుమారు 30 ఏళ్ళ వయసున్న వ్యక్తితో పెళ్ళి జరిపించేసింది ఆనంద తల్లి. తండ్రిలేని పిల్లల్ని ఎట్లా సాకగలనా అన్న భయంతో ఆడపిల్ల బరువు తీర్చుకుందామనుకుందామె. పదేళ్ళ కొడుకుని బాగా చదివించి తన జీవితానికి ఆసరాగా చేసుకోవాలనుకుంది. అందుకే తను పనిచేసే కంపెనీలో తెలిసిన వ్యక్తితో కూతురి పెళ్ళి చేసేసింది. ఏడాది తిరక్కుం డానే ఆనంద గర్భవతవ్వడం, మూడ్నెల్లు నిండాక అబార్షనవ్వడం కూడా జరిగి పోయాయి. దాంతో ఆనంద ఆరోగ్యం దెబ్బ తింది. ఆ సమయంలోనే తన భర్త, తన తల్లితో చనువుగా ఉండడాన్ని గమనించి తెల్ల బోయింది. కానీ తను తప్పుగా ఆలోచిస్తోం దని, దీనంతటికీ తన అనారోగ్యమే కారణ మని, ఖాళీగా ఉంటే ఇవే ఆలోచనలు పీడిస్తాయని భావించి తల్లీ, భర్తా ఒద్దన్నా పట్టుబట్టి పదో తరగతి పూర్తిచేసింది.

రిజల్ట్స్‌ వచ్చేనాటికి తను మళ్ళీ గర్భవతని తెల్సింది. దాంతో పైచదువుల కెళ్ళాలని ఉన్నా కాలేజీ దూరమవడంతో వెళ్ళలేకపోయింది. ఇంట్లోనే ఉంటూ బీడీలు చుట్టి ఇంటి ఖర్చులకి వాడుకునేది. నెలలు నిండి ప్రసవం అయ్యేనాటికి తన తల్లి, భర్తల మధ్య ఉన్న సాన్నిహిత్యం స్పష్టంగా అర్థమ యింది. అది అత్తా, అల్లుళ్ళ సాన్నిహిత్యం కాదని, వారికి శారీరక సంబంధం ఉందని తెలిసి గుండె పగిలేలా ఏడ్చింది. ఎవరికీ చెప్పుకోలేని విషయం, తమ్ముడికి అర్థం చేసుకునే వయసు కాదు. బాలింతరాలని, ఒళ్ళు బాలేదని ఏడాదిపాటు భర్తని దూరం పెట్టింది. కానీ దాంతో తల్లి నుంచి, భర్త నుంచి కూడా ఒత్తిడి పెరిగింది.

అంతలో మహిళా సమత గురించి తెలిసి కార్యకర్తగా చేరింది. మండలంలో ఉంటూ వారాంతాలలో ఊరెళ్ళొచ్చేది. రెండేళ్ళు గడచిపోయాయి. శిక్షణ ద్వారా అనేక విషయాలు తెల్సుకుని ఆలోచనా పరిధిని విశాలం చేసుకుంది. తల్లీ, భర్తల సంబంధాన్ని ప్రతిఘటించినా ఫలితం లేక తనే భర్తకు దూరమవ్వాలనుకుంది. అంత లోనే మళ్ళీ గర్భవతైంది. తనమీద తనకే అసహ్యమేసింది. భర్త తనపై చేసిన బలాత్కా రానికి గుర్తును మొయ్యాలనుకోలేదు. చాలా అలోచించి అబార్షన్‌ చేయించుకోవాలనుకుని డాక్టర్‌ దగ్గరకెళ్తే పరీక్షించి చాలా వీక్‌గా ఉందని, అబార్షన్‌ చేస్తే ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో… కిట్టుకి తను తప్ప ఎవరూ లేరనీ, ఆడపిల్లని తన తల్లి దగ్గర వదలడం ఇష్టం లేకా… కిట్టుకోసం తను బ్రతకడం అవసరమని నిర్ణయించుకుంది. ఉద్యోగ బాధ్యతలంటూ ఇంటికి దూరంగా ఉంటూ తను పనిచేస్తున్న గ్రామాలలోని స్త్రీలతోనూ, బాలికలతోనూ దగ్గరగా ఉంటూ వారెవ్వరూ తనలాంటి పరిస్థితిని ఎదుర్కో కూడదని వారి ఆలోచనల్లో మార్పుతీసుకొచ్చి, 18 ఏళ్ళు నిండేదాకా అమ్మాయిలకు పెళ్ళి చేయొద్దని, వారిని కూడా తప్పకుండా చదివిం చాలని నచ్చచెప్పేది, ఒప్పించేది. నెలలు నిండినై. భర్త వస్తూనే ఉన్నాడు. ప్రతిఘటనతో హింస పెరిగింది. కొడుకు పుట్టాడు. కొడుకుని తనకిచ్చేయమని గొడవ చేసిన భర్తపై కేసు పెడతానంది. తల్లి నుంచి ఒత్తిడి పెరగడంతో కులపెద్దల మధ్య పెట్టింది. సర్దుకుపొమ్మన్నారు. మొండికే సింది. ఆఫీసువారి సహకారంతో జిల్లా మార్పించుకుని తల్లిని, భర్తను కూడా రావద్దని హెచ్చరించింది. పరిస్థితి కాస్త మెరుగైంది.

ఒంటరిగా పిల్లల్ని పెట్టుకుని ఉంటున్న ఆనంద చలాకీతనాన్ని, కలుపు గోలుతనాన్ని ఉపయోగించుకుని చాలామంది మగవాళ్ళు దగ్గరవ్వాలని ప్రయత్నించారు. కానీ దాదాపు పదేళ్ళు నిబ్బరంగా ఉన్న ఆనంద, పెళ్ళై ఇద్దరు పిల్లలున్న వాసుని కాదనలేకపోయింది. వయసు అవసరం… లొంగిపోయింది. ఏడాది బానే ఉంది. గుళ్ళో పెళ్ళి కూడా చేసుకున్నారు. తర్వాత ఏడాది నుండి ప్రారంభమైంది హింస… అది లైంగిక హింస. కూతురు పెద్దదైంది. వాసుని వదిలించుకోలేకపోయింది.

మధ్యమధ్యలో తల్లి చేస్తున్న ఒత్తిడికి తలొగ్గి, తన పరిస్థితిలో కిట్టుకి మంచి సంబంధం తెచ్చి పెళ్ళి చేయలేనేమోనన్న భయంతోనూ… ఇష్టం లేకపోయినా, వయసు లో ఎంతో తేడా ఉన్నా… కిట్టుని తమ్ముడికిచ్చి పెళ్ళి చేసింది!!

ఇప్పుడు బైక్‌ మీదొచ్చిన ఈ జంటను చూస్తే ఇదంతా గుర్తొచ్చి మనసు భారమై మౌనం వహించింది. ఈ రోజు సమావేశంలో కూతురిపై కొంతకాలంగా అత్యాచారం చేస్తున్న తండ్రికి దేహశుద్ధి చేసి పోలీసులకి పట్టించిన సంఘటన గురించి మహిళలు షేర్‌ చేసిన విషయం కూడా గుర్తొచ్చుంటుంది. హఠాత్తుగా ఆ మౌనంలో నుంచి ఒక ప్రశ్న దూసుకొచ్చింది… ”సమాజంలో స్త్రీ-పురుషుల సంబంధాలన్నీ లైంగిక సంబంధాలేనా… మానవ సంబంధాలే లేవా?”

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో