మహిళలు – ఆహారం – ఆరోగ్యం ఒక సూక్ష్మ స్థాయి పరిశీలన

డా. హజారీ గిరిజారాణీ, డా. కొలిపాక శ్రీదేవి
మహిళలు – అభివృద్ధి – సాధికారత అనే పదాలు అన్ని సందర్భాలలో, అన్ని వర్గాలలో, అన్ని వేళలలో, అందరి నోళ్ళలో నానుతున్న పదాలు.

రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలలో తమకు సంబంధించిన నిర్ణయలు తీసుకోవటమే కాక వాటిని అమలు పరిచే అవకాశం, అమలు పరచటానికి అవసరమైన వనరులు అందుబాటులో ఉండటం ‘సాధికారత’ అని అనుకుంటే దానిని సాధించటానికి ముందుగా ఆరోగ్యం, విద్య, ఉపాధి, చట్టసభలలో ప్రవేశించే అవకాశాలు అందుబాటులో ఉండాలి. మహిళల అభివృద్ధికి, వారు ఏ రంగంలోనైనా రాణించటానికి ఆరోగ్యమనేది తప్పనిసరి కారకమవుతుంది. స్త్రీల మానసిక ఆరోగ్యము కుటుంబ సంబంధాలపై, సమాజంలోని మానవీయ విలువలపై ఆధారపడుతుంది. అదే విధంగా భౌతికారోగ్యము, పౌష్టికాహారము లభ్యతపై వైద్యసౌకర్యాల అందుబాటుపై కూడా ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో స్త్రీల భౌతికారోగ్యము అనేది ఒక తీవ్రమైన సమస్యగా పరిణమించిందనేది ప్రభుత్వ నివేదికల ద్వారా, అధ్యయనాల వల్ల తెలుస్తుంది.
భారతదేశంలో కాన్సు సమయంలో తల్లుల మరణాల రేటు ప్రతి లక్ష జననాలకు 407 కాగా, శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు 70గా ఉందని, దాదాపు 50 శాతానికి మించిన స్త్రీలు రక్తహీనతతో బాధ పడ్తున్నారని ప్రభుత్వ నివేదికలు తెలియ చేస్తున్నాయి.
స్త్రీల అనారోగ్యానికి ఒక ముఖ్య కారణము పౌష్టికాహార లేపమే. మహిళల ఆరోగ్యము వారు తీసుకునే పౌష్టికాహారంపై ఆధారపడి ఉంటుంది. కనుక వారు ఆహారం తీసుకునే స్థాయిని అంచనా వేయటానికి నేషనల్‌ ఫామిలి హెల్త్‌ సర్వే-2 ( -1998-99, -2) బాడీ మాస్‌ ఇండెక్స్‌ ఔఖని సూచికగా ఉపయెగించింది. వ్యక్తి బరువును వారి ఎత్తును మీటర్లలో తీసుకుని స్క్వేర్‌ చేసి భాగించడం ద్వారా లెక్కించవచ్చు.

ఈ వ్యక్తులలోని అనారోగ్య సమస్యలు లేక పౌష్టికాహారం తీసుకోవడంలో ఉన్న లోపాన్ని గుర్తించటానికి తోడ్పడుతుంది. ఔఖ| విలువ 18.5 కంటే తగ్గటం తీవ్రమైన పౌష్టికాహార లోపాన్ని ని తెలియ చేస్తుంది. కొన్ని నెలలుగా లేక కొన్ని సంవత్సరాలుగా సరిపడినంత, సరైన ఆహారం తీసుకోకపోవటాన్ని శోచిస్తుంది. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే ప్రకారం భారతదేశంలో 1/3 వంతు కంటే ఎక్కువ అంటే 36 శాతం మంది స్త్రీలు తీవ్రమైన ఆహారలోపం సమస్య (్పుజూఈ)తో బాధ పడ్తున్నవారి విలువ ఔఖ| 18.5 కంటే ఎక్కువగా ఉంది.
1990లో సగటు మనిషి ఆహార ధాన్యాల వినియెగం 476 గ్రాములు ఉండగా 2001 నాటికి 418 కి పడిపోయింది. మన సమాజిక పరిస్థితులలో స్త్రీల విషయంలో ఈ వినియెగం మరింత తగ్గుతుందనేది స్పష్టం. ఐక్యరాజ్యసమితి వనవహక్కు కౌన్సిల్‌ ”భారతదేశంలో ఆకలి-పోషకాహారాల కొరత” అనే సెప్టెంబర్‌ 2006 నివేదికలో ప్రపంచంలోని ప్రజానీకంలో పోషకాహార విలువల కొరత ఉన్న అత్యధిక సంఖ్యాకులు భారతదేశంలో ఉన్నారని, ముఖ్యంగా పిల్లల్లో పోషకాహార లోపం ఉన్నవారు ఉన్నారని తెలిపింది. పోషకాహార లోపం వలన పిల్లల్లో 41 శాతం మంది ఉండాల్సిన బరువుకన్నా తక్కువ ఉన్నారు. ప్రజారోగ్యానికి మరో ముఖ్యమైన కొలబద్ధ రక్తహీనత 2005-06 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 6 నించి 35 నెలల మధ్య వయస్సుగల పిల్లలు ప్రతి ఐదుగురిలో నలుగురు, గర్భందాల్చిన ప్రతి ఐదుగురి స్త్రీలలో ముగ్గురు రక్తహీనతతో బాధపడ్తున్నారు.
అంతర్జాతీయ ఆహార పరిశోధనా సంస్థ 118 దేశాలను పరిశీలించి తయరుచేసిన, ఆకలికి సంబంధించిన సచికల్లో భారతదేశం 94వ స్థానంలో, పిల్లల పౌష్టికాహార విషయంలో 117వ స్థానంలో ఉంది. దేశంలో రోజుకు 2400 కంటే తక్కువ క్యాలరీల ఆహార పదార్థాలు తీసుకుంటున్న ప్రజలు దేశంలో 87 శాతం ఉన్నారని జాతీయ నమూనా సర్వే 61వ నివేదిక తెలియచేస్తుంది. రక్తహీనతతో బాధ పడే మహిళలు 1996-2006 సంవత్సరాల మధ్య 52.9 శాతానికి పెరిగారని, రక్తహీనతతో బాధపడే 3 సం||ల లోపు పిల్లలు 74 నుండి 79 శాతానికి పెరిగారని పిల్లల వయస్సుకు తగిన విధంగా ఎముకల ఎదుగుదల లేని వారు 48 శాతం ఉన్నారని, వయస్సుకు తగ్గ బరువు లేని వారు 43 శాతం ఉన్నారని 2005-06 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక పేర్కొన్నది. ఈ లెక్కన భావి భారత పౌరుల ఆరోగ్యస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కష్టించి పని చేసే వారిలో వీరే అత్యధికులు. సహజంగా వారు పని చేసే శక్తి, పనితనం కుంటుపడటమేకాక, వారి మనోవికాసం మందగిస్తుంది.
ఈ నేపధ్యంలో యుక్తవయస్సు వచ్చిన 17-20 అమ్మయిల ఆహారపు అలవాట్లు, వారి ఔఖ| అంచనా వేసే ఉద్దేశంతో ఈ అధ్యయనం చేపట్టడం జరిగింది. వరంగల్‌లోని ఒక మహిళా కళాశాలలోని అనుభవం ఈ అధ్యయనాన్ని ప్రేరేపించింది. కళాశాలలోని జాతీయ సేవా విభాగం చేపట్టిన రక్తదాన శిబిరంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు 100 మంది ఉత్సాహంగా రక్తదానం చేయటానికి ముందుకు వచ్చారు. పరీక్షలు జరిపి వయస్సుకు తగిన బరువు, తగినంత రక్తంలో హివెగ్లోబిన్‌ శాతం ఉన్నవారి నుండి మాత్రమే రక్తం సేకరిస్తారు. అయితే 100 మంది అమ్మయిల్లో కేవలం 8 మంది మాత్రమే రక్తదానం చేయడానికి అర్హులుగా గుర్తించబడ్డారు. నిజంగా ఇది చాలా విస్మయన్ని కలిగించింది. కనుక ఏ ఆహారపు అలవాటు వారి రక్తహీనతకు, బరువు తక్కువ ఉండటానికి మూల కారణమైన వారి సాంఘీక, ఆర్థిక హోదా వెనుకబాటు తనానికి మూల కారణమనేది పరిశీలించే ఉద్దేశంతో ఈ అధ్యయనం చేపట్టడం జరిగింది.
ఈ అధ్యయనం కొరకు వరంగల్‌ పట్టణంలోని ఆకారపు శరత్‌చంద్రికా దేవి మెవెరియల్‌ మహిళా ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలోని 100 మంది విద్యార్థినులను ర్యాండమ్‌ ప్రతిచయన పద్ధతిన ఎంపిక చేయడమైంది. వీరందర 17-20 సం||ల మధ్య వయస్సు ఉన్నవారు. ఎయిడెడ్‌ కళాశాల కనుక దానిలో చదివే విద్యార్థినులు దాదాపు అందర తక్కువ ఆదాయ వర్గానికి చెందినవారు. సంవత్సరానికి ర. 15,000 లోపు ఆదాయం ఉన్నవారు 86 మంది కాగా, ర. 20,000 లోపు ఆదాయం కలవారు 11 మంది, ర. 20,000 పైబడి ఆదాయం కలవారు ముగ్గురు మాత్రమే. వారి తల్లితండ్రులందరిలో చాలా మంది నిరక్షరాస్యులు. కొద్దిమంది మాత్రమే పాథమిక స్థాయి వరకు చదివారు. తల్లులు మాత్రం 80 శాతం వరకు నిరక్షరాస్యులే. మొత్తం 100 మందిలో ఇతరకులాల వారు 13 మంది, వెనుకబడిన తరగతుల వారు 68 మంది, షెడ్యల్డ్‌ కులాల వారు 11 మంది, షెడ్యల్డ్‌ తెగల వారు 8 మంది ఉన్నారు.
ఈ 100 మంది నుండి వారి ఎత్తు, బరువుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి లెక్కించడం జరిగింది. వారి కి సంబంధించిన వివరాలు కులాల వారీగా పట్టిక-1లో ఆదాయల వారీగా పట్టిక-2లో పొందుపరచడమైంది. మొత్తం 100 మందిలో 65 మంది విద్యార్థుల 18.5 కంటే తక్కువగా ఉంది. వీరు తీవ్రమైన ఎనర్జీ లోపంతో బాధ పడ్తున్నారు. 35 మంది మాత్రం 18.5-25 మధ్యలో కలిగి ఉన్నారు. అంటే సాధారణ ఆరోగ్య స్థాయిలో ఉన్నారు. కులాల వారీగా వారి ్పుజూఈ స్థాయిని పరిశీలించగా, ఇతర కులాలలో 69 శాతం, వెనుకబడిన తరగతులలో 64 శాతం, షెడ్యల్డ్‌కులాలలోన 64 శాతం, షెడ్యల్డ్‌ తెగలలో 62 శాతం 18.5 కంటే తక్కువ స్థాయిలో కలిగి ఉన్నారు. ఆదాయ వర్గాన్ననుసరించి వారి ఈ స్థాయిని పరిశీలించగా, 10 వేల రూపాయలకంటే తక్కువ ఆదాయం కల వారిలో 82 శాతం, 15 వేలరపాయల లోపు ఆదాయ వర్గంలో 57 శాతం, 20,000 ర. లోపు ఆదాయం ఉన్నవారిలో 18 శాతం కాగా, 18.5 కంటే తక్కువ ఔఖ| ఉన్నవారు 20,000 ర. పై ఆదాయం ఉన్నవారిలో ఎవర లేరు. ఉన్న ముగ్గురు 18.5 పైన 25 లోపు ఔఖ| కలిగి సాధారణ ఆరోగ్యంతో ఉన్నారు. కులాల వారీగా ఔఖ| లో వ్యత్యాసం పెద్దగా లేకపోయినా ఆదాయ వర్గాన్ననుసరించి ఔఖ| లో తేడాలను పట్టిక-2లో స్పష్టంగా చడవచ్చు. ఆదాయం పెరుగుతున్న కొద్దీ 18.5 కంటే తక్కువస్థాయిలో ఉన్నవారు క్రమేణా తగ్గుతున్నారు.
100 మందిలో 65 మందికి 18.5 కంటే తక్కువగా ఉండటానికి వారు తీసుకునే ఆహారం కూడా కారణమవుతుంది. కనుక కళాశాలకు వచ్చేముందు ఉదయం ఎంత మంది ఆహారం తీసుకుంటున్నారు అని పరిశీలించగా, రోజుకు మూడు సార్లు ఆహారం తీసుకునేవారు 100 లో 62 మంది కాగా, 38 మంది ఏ రకమైన ఆహారం తీసుకోకుండా కళాశాలకు వస్తున్నారు. ఎందుకు ఏమి తినకుండా కళాశాలకు వస్తున్నారని ప్రశ్నించగా టైమ్‌ చాలదు అన్నవాళ్ళు 10 మంది, వంటకాదు అని చెప్పినవారు 12 మంది, తినటానికి ఇష్టంలేదు అన్నవారు 9 మంది కాగా లావు అవుతారని తినటం లేదనేవారు ముగ్గురు. అయితే కారణం చెప్పని వారు నలుగురు. టైమ్‌ చాలకపోవటం, వంటకాకపోవటం అన్నది ఆడపిల్లలకు కళాశాలకు వచ్చే ముందు ఉన్న ఇంటిపని వత్తిడిని, వారి భోజనం పట్ల ఇంట్లోని వారికి ఉన్న శ్రద్ధను తెలుపుతుంది. తినటానికి ఇష్టం లేదు అని కొంత మంది చెబితే, కొందరు ఏ కారణం చెప్పలేదు. ఇదికూడా వారి ఆర్థిక స్థితి, ఆరోగ్య స్థితిని వారి ఆహారం పట్ల కుటుంబ సభ్యుల శ్రద్ధను స్పష్టపరుస్తుంది. కేవలం ముగ్గురు మాత్రం లావవుతామనే భయంతో తినటం లేదన్నారు. ఇది ప్రస్తుత సమాజంలో అందం పట్ల ప్రపంచీకరణ ప్రవేశపెట్టిన భావజాల ప్రభావం యువతపై ఉన్నదనటానికి ఒక నిదర్శనం. చదువ, ఆరోగ్యం కంటే అందమే ప్రధానం అన్న భావన యువతలో పెరుగుతుందనే విషయన్ని సూచిస్తుంది.
వీరందరి ఆహారపు అలవాట్లను పరిశీలించగా మా౦సాహారాలు 31 శాతం కాగా, శాకాహారాలు 83 శాతం. రోజూ పాలు వినియెగించేవారు కేవలం 23 శాతం మాత్రమే. నెలలో రెండుసార్లు లేదా ఆపైన గుడ్లు ఆహారంలో తీసుకునే వారు 61 మంది కాగా వారానికి కనీసం రెండు లేక ఎక్కువ సార్లు ఏవైనా పండ్లు తీసుకునేవారు 67 మంది ఉన్నారు. కాని ఆహారంలో రోజూ పప్పు ధాన్యాలు వాడే వారి సంఖ్య 38 మాత్రమే.
వీరిలో కూడా సరిపడినంత పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం లేదనేది స్పష్టమవుతుంది. వంసకృత్తులు, ఖనిజాలు ఇచ్చే పప్పుధాన్యాలు, పాలు, పండ్లు లాంటి ఆహారం అతి తక్కువగా తీసుకుంటున్నారు. 2400 క్యాలరీల కంటే తక్కువ ఆహారం తీసుకోవటం పేదరికానికి సూచికగా భావించబడుతుంది. దాదాపు వీరందర 10 నుండి 20 వేల లోపే ఆదాయం ఉన్నవారు.
ఆహారం ఇవ్వటంలో కుటుంబంలో ఆడ, మగ పిల్లల మధ్య తేడా ఉందా అన్న ప్రశ్నకు ఉందనేది 60 మంది సవధానం. కళాశాలకు రెగ్యులర్‌గా రాని వాళ్ళని కారణం అడిగితే ఆరోగ్యం సరిగా లేనందున రాలేదని సమాధానం వచ్చింది. ఏమిటనే దానికి కళ్ళు తిరగటం, కాళ్ళు లాగటం, కడుపు నొప్పి, తరచ జ్వరం వంటి సమస్యలతో బాధ పడ్తున్నారని చెప్పటం జరిగింది.
ఇదంతా దేశ ఆర్థికాభివృద్ధికి, మహిళాభివృద్ధికి సూచిక అవుతుందా? అని ఆలోచించడం అవసరం.
ఆడపిల్లల పట్ల వివక్షత ఉందనేది ఎప్పటికీ చర్చల్లో ఉన్న విషయం ఐనప్పటికీ ఈ సూక్ష్మస్థాయి పరిశీలన కూడా యుక్త వయస్సులో ఉన్న చదువుకుంటున్న ఆడపిల్లలకు ఎంతవరకు ఆహార భద్రత, ఆరోగ్య భద్రత ఉందనేదానిని స్పష్టపరుస్తుంది. ఈ రకమైన ఆహారం తీసుకునే వారికి రక్తహీనత కాక మరేముంటుంది. వీరు ఆటల్లో కాని, చదువులో కాని రాణించటానికి, భవిష్యత్తులో ఈ సంక్లిష్ట సమాజంలోని సవాళ్ళను ఎదుర్కోవటానికి కాని కావలసిన వనసిక స్థైర్యం ఇవ్వటానికి, పై విధమైన ఆరోగ్య పరిస్థితులు ఎంతవరకు తోడ్పడతాయనేది ప్రశ్నార్థకం.
మహిళాభివృద్ధికి మౌలికమైన మొదటి మెట్టైన ఆరోగ్యం, దానికవసర మైన పోషకాహారం అందుబాటులో లేనప్పుడు వారికి సాధికారత ఎంతదరంలో ఉందనేది తీవ్రంగా ఆలోచించ వలసిన విషయం.

పట్టిక-1
కులాల వారీగా
కులము స్థాయి
18.5 18.5-25
09 04 13
(69%) (31%) (100%)
44 24 68
(64%) (36%) (100%)
07 04 11
(64%) (36%) (100%)
05 03 08
(62%) (38%) (100%)
65 35 100

ఆదాయన్ననుసరించి
ఆదాయము(ర) స్థాయి
న18.5 18.5-25 మొత్తము
న10,000 46 10 56
(82%) (18%) (100%)
10,000-15,000 17 13 30
(57%) (43%) (100%)
15,000-20,000 02 09 11
(18%) (82%) (100%)
ట20,000 – 03 03
(100%) (100%)
మొత్తము 65 35 100

ఉదయం భోజనం చేయకపోవటానికి కారణాలు
కులము/ మొత్తము
భోజనం చేయకపోవ
టానికి కారణాలు
టైమ్‌ లేకపోవడం 03 04 02 01 10
వంట కాకపోవడం 02 09 01 – 12
తినటానికి ఇష్టం లేదు 02 03 02 02 09
లావు అవుతామని – 01 01 01 03
ఇతర కారణాలు 01 02 01 – 04
మొత్తము 08 19 07 04 38

కులాలననుసరించి ఆహారపు అలవాట్లు
కులము మొత్తము
ఆహారపు అలవాట్లు 05 49 04 04 62
ఆహారం రోజుకు మూడుసార్లు తీసుకునేవారు 02 22 04 03 31
మా౦సాహారం తీసుకునేవారు 07 62 10 04 83
శాకాహారం తీసుకునేవారు 07 62 10 04 83
రోజూ పాలు తీసుకునేవారు 02 16 04 01 23
నెలలో రెండు, ఆపైన గ్రుడ్లు తీసుకునేవారు 05 47 05 04 61
వారానికి రెండు లేక ఎక్కువసార్లు పాలు తీసుకునేవారు 08 46 09 04 67
ఆహారంలో రోజూ పప్పుధాన్యాలు తీసుకునేవారు 05 28 02 03 38
రోజుకు రెండుసార్లు భోజనం చేసేవారు 08 19 07 04 38

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.