ఇంకా ఎన్నాళ్లీ కష్టాలు

కె. సాహితి
మరోసారి సభ్యసమాజం నివ్వెరపోయింది. మన సంస్కృతి, నాగరికత అవహేళణయింది. ఇంత దారుణం స్వప్నిక, ప్రణీత అనే సరస్వతీ పుత్రికలపై శ్రీనివాస్‌ అనే ప్రేమ ఉన్మాది చేసిన ఆ ఘోరమైన యసిడ్‌ దాడికి స్పందించని, కళ్ళనీళ్ళు పెట్టని వారుండరు. ఈ సంఘటనలు మన రాష్ట్రంలో క్రొత్త కాదు. ప్రతిరోజు ప్రత్యక్షంగానో, పరోక్షంగాను ఎక్కడోకచోట విద్యార్థినులపై, మహిళలపై జరుగుతూనే వున్నాయి. ఈ దాడుల పట్ల తల్లి, తండ్రులు భయందోళనలు చెందే పరిస్థితి చస్తున్నాం. ఇది మనకు మొదటిసారి మాత్రం కాదు. ఎందరో ముక్కుపచ్చలారని విద్యాకుసువలు భూదేవిపై భూడిద అయ్యరు. ఈ ఆధునిక రాక్షసుల వికృత చేష్టలకు మొదట బలయ్యేది వారే. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ పుణ్యమా అంట తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు సంపాదన ద్వారా విచ్చలవిడి సంస్కృతి యధేశ్చగా దిగుమతి అవుతోంది. ఈజీమనీ, జల్సా, విచ్చలవిడితనంతో, విచక్షణ కోల్పోయిన యువకులు ఈ దాడుల ద్వారా వారి నిజస్వరూపం బయటపెడుతున్నారు.
విద్యార్థిని-రక్షణ : జరుగుతున్న ప్రాంతాలు వేరైనా విద్యార్థినులపై జరుగు తీరు ఒకటే. ప్రేమ ధిక్కరించారనో, మరేదో కారణంతో అవమానించారని దాడులు జరగటం, ప్రభుత్వం ఈ వరస సంఘటనల పట్ల పూర్తి నిర్లక్ష్యం చేయటం వలన మరొక ఉన్మాదికి పరోక్షంగా ధైర్యాన్నిస్తున్నట్లే. మనోహర్‌తో మొదలైన దాడులు ఇప్పటికి కొనసాగుతున్నవి. ఆ రోజే ఆ ప్రేమ ఉన్మాదికి సరైన శిక్ష పడితే మరో ఉన్మాది ఇంత ఘోరానికి పాల్పడే ధైర్యం ఉండేది కాదన్న నిజం ప్రజలందరికి తెలుసు. పోలీసుయంత్రాంగం జరిగినంతసేపు హడావుడి చేయటం మరల దానిని వదిలివేయటం, పై సంఘటనలను రుజువు చేసాయి. కాలేజీ, యూనివర్శిటీల్లో, బస్‌స్టాపుల వద్ద పోలీసు పికెటింగులు ఏర్పాటు చేస్తామన్నా ఆచరణలో అది సాధ్యం కావటం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపిస్తుంది. దాడులకు పాల్పడే వ్యక్తుల పట్ల పోలీసు యంత్రాంగం కఠిన చట్టం ద్వారా శిక్ష పడేటట్లు చడాలి. విద్యార్థినులు పోలీసుస్టేషన్‌లో కంప్లెయింట్‌ చేయగానే వారు స్పందించి ఉంటే ఈ రోజు స్వప్నిక, ప్రణీతలు జీవితాలు మనందరి వలే ఉండేవి. ఒక కార్గిల్‌ వీరసైనికుని ఫిర్యాదుకన్నా ఒక బిల్డర్‌ అబ్బాయి లావాదేవీలకే చాలా ప్రాముఖ్యత యిచ్చారు. ఇంత క్షీణవిలువలతో మన పోలీసు, ప్రభుత్వం ఉంది. ఈ తీర్పుతో బిల్డరు గెలిచాడు. ఒక సాధారణ కుటుంబం కుమిలి, కుమిలి ఏడుస్తుంది. పై అంశాలు పరిశీలిస్తే ప్రభుత్వాలకి మహిళల పట్ల ఎంత చిన్నచూపు ఉన్నదో తెలుస్తోంది.
దాడి జరిగిన 48 గంటలలోనే నిందితులను పట్టుకొని మరో నాలుగు గంటలల్లో అత్యుత్సాహంతో ఎన్‌కౌంటర్‌ చేశారు. పోలీసులపై నిందితులు దాడిచేశారా? ఆ శక్తి వారికి ఉందా? మీ సమక్షంలో ఉన్న శ్రీనివాస్‌కి ఆయుధం ఎక్కడిది? అన్ని విషయలు చెప్పి బైక్‌, యసిడ్‌ సీసాలు ఎక్కడ పెట్టింది చెప్పకుండా ఉంటారా? మీరు అరెస్టు చేసినప్పుడు కత్తులు, పిస్ట్టల్‌ వారివద్ద ఉందా? నిందితులు తిరగబడ్డామనప్పుడు ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు కాని ఒక్క పోలీసు చనిపోలేదు, గాయలు కాలేదు ఇది ఎంత వరకు నిజం? ఇంతకుముందు జరిగిన కేసులు దీనితో పోలిస్తే ఆయేషామీరా కేసులో రాష్ట్రమంత్రి బంధువులు ఉన్నారని మీరా తల్లితండ్రులు అనేకసార్లు మీడియ ముందు చెప్పారు. సంబంధంలేని వ్యక్తులను కేసులోకి లాగారు తప్ప సరైన వ్యక్తిని పట్టుకోలేదు. గతంలో సినీహీరోయిన్‌ ప్రత్యష కేసులో కూడా అప్పటి అధికార పార్టీ మంత్రి అబ్బాయి ప్రమేయం ఉందని ఆ తల్లి వాదించింది. కాని వారి కొడుకును అరెస్టు చేయలేకపోయం. చట్టాలు అందరివి కాదా? కొందరికి చట్టం చుట్టం. మరికొంత మందికి కాల్పులు, ప్రభుత్వం, చట్టాలు, పోలీసులు ఎవరివైపు? ఎవరికి న్యాయం చేస్తారు? ఎన్‌కౌంటర్‌ పరిష్కారమైతే పై రెండు కేసులలో చేయలేదే? ప్రభుత్వ యంత్రాంగం ఎవరికి రక్షణగా ఉందో ప్రజలకు తేటతెల్లమైంది. తప్పుచేసినవారిని ఏం చేయలో నిర్ణయించే పోలీసులే శిక్షలు విధిస్తే చట్టాలు, వ్యవస్థ ఎందుకు? ఈ కేసులో ఆధారాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా గాయపడిన అమ్మయి, యాసిడ్‌ కొనుగోలు, వారి బైక్‌ ఇంత బలంగా ఉన్నా కోర్టుకు తీసుకువెళ్ళకుండా కాల్చిపారేస్తే ప్రజల దృష్టిలో హీరోలు కావచ్చు. కానీ దీనిని ఎవరు హర్షించరు. రేపు ప్రజాసమస్యలపై జరిగే పోరాటాలపై కూడా వారి స్పందన ఈ విధంగానే వుంటుందని భావించాల్సి వస్తుంది. కాబట్టి చట్టసవరణ చేసి క్రొత్త చట్టం ద్వారా వీటికి ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయలి. కఠినశిక్షలు అమలు జరగాలి. ప్రజలకు ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ జవాబుదారీతనం కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలి.
సినిమా, టివీ-ఎలక్ట్రానిక్స్‌, మీడియ పాత్ర : భారతదేశ సంస్కృతి గొప్పదని ప్రపంచదేశాలు చెవులు పిక్కటిల్లేలా చెప్పుకుంటాయి. ఆకాశంలో సగంగా మహిళలను కీర్తించే సంస్కృతీ ఉన్నది. అలాంటి సంస్కృతి ఉన్న మనదేశంలో సినివ, టీవి రంగాల ద్వారా సావ్రజ్యవాద విషసంస్కృతి మన ఇంట్లోకి ప్రవేశించి మన మెదడులకు స్లోపాయిజన్‌ ఎక్కిస్తున్నాయి. గత సినివతో పోలిస్తే కుటుంబం మొత్తం కలిసి టివీ, సినిమా చూసే పరిస్థితి లేదు. యువతీ, యువకులను ప్రధాన పాత్రధారులుగా చేసి అనేక అంగాంగ ప్రదర్శనలు చూపిస్తున్నాయి. అమ్మయి అంటే ప్రేమించాలి. ప్రేమించకపోతే ప్రతీకారం తీర్చుకోవాలి. ఇలా ఒక వస్తువుగా చూస్తున్నారు తప్ప సాటిమనిషిగా గుర్తించేలా మీడియ చేయటం లేదు. మంచి లక్ష్యం వైపు కాకుండా అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు, నిజజీవితంతో సంబంధం లేకుండా ఊహల్లోకి తీసుకుపోతున్నాయి. టివీ సీరియల్స్‌ పరిస్థితి చెప్పనక్కర్లేదు. మొత్తం ఆర్థిక, వ్యాపార సంబంధమైన అంశాలే తప్ప మానవసంబంధం లేదనే చెప్పాలి. అశ్లీలదృశ్యాలు అసభ్యత నిండిన సినిమాలపై మనం పోరాటం చేయలి. ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి ఎండకట్టాలి. పోరాటం ద్వారానే గుణపాఠం చెప్పాలి. ఎలక్ట్రానిక్‌ మీడియ పాత్ర కూడ మనం ఒకసారి పరికించాలి. మంచి సమాచారం ప్రజల వద్దకు చేరవేయటంతో పాటుగా అరగంట టైమ్‌లో వస్తున్న నేరాలు-ఘోరాలు, క్రైంవాచ్‌, క్రైమ్‌స్టోరీల పేరుతో వస్తున్న విషయలు చస్తే ఎలా చంపాలి, ఎలా చెయ్యలి, ఎలా ఉరిపొయ్యలి చూపిస్తున్నప్పుడు చూసేవాళ్ళల్లో ఏ ఆలోచనలు పుడుతాయె ఎప్పుడైనా ఆలోచించామా? ఒక సంఘటన జరిగిన వెంటనే న్యుస్‌ఛానల్స్‌ పదేపదే చూపటం వలన మన మనసులకు ప్రశాంతత ఉంటుందా? ఆర్థిక సమస్యలతో అలమటిస్తున్న చేతివృత్తులవారు, రైతులు, కార్మిక, కర్షకులు ఈ ఛానల్స్‌కి గుర్తురావా? ఎటు తీసుకువెళ్తున్నారు ఈ సమాజాన్ని? ఏ బెటర్‌ సొసైటీ వైపు వెళున్నావె మనం ఒకసారి ఆలోచించాలి.
మానవ సంబంధాలు : క్షీణిస్తున్న విలువలు ఒక సమస్య. ఈ తరుణంలో నా కుటుంబం, నేను, నా సంపాదన అనే ధోరణి వరాలి. అలాటి సమయంలో మహిళా సంఫలు ఎంతో పోరాడుతున్నాయి. అలానే ప్రతి వ్యక్తి ఆయ సమస్యలపై గళమెత్తాలి. ఒకరితో పోయేది కాదు. అది మనందరి సమస్యగా గుర్తించి సమస్యపై సాధించేవరకు పోరాటం చేయలి. నాకెందుకులే అనుకుంటే నీకు, నీ బంధువులకు రేపు గొంతు విప్పే వారుండరు. అందరం కలసికట్టుగా ఉంటే ప్రభుత్వం ద్వారా సాధించుకోలేవ? ప్రేమ ఉన్మాదులకు కఠినశిక్షలు అమలుపరచదా? మనకు అన్యాయం జరిగితే వీరంతా మన వెనుక నిలబడతారు. సరస్వతీ పుత్రికలపై జరుగుతున్న దాడులకు ఐక్యపోరాటం ద్వారా తరిమికొడదాం. మన నాగరికతను నాశనం చేస్తున్న ఉన్మాదాన్ని మట్టుబెడదాం. రండి అడుగు ముందుకేద్దాం! సాధించుకుందాం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.