వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన ‘సమతారోషిణీ’ ఎలా ఉన్నావ్‌? ఎలా

ఉంటావ్‌ నవ్వుతూ పువ్వల్లే బాగానే ఉంటావు. పైకి కన్పించే నువ్వు నువ్వు కాదు. నీ నిర్మలమైన చిర్నవ్వు వెనుక, అమాయకత్వం వెనుక సున్నితమైన హృదయముంది. మనుషులందరూ నీక్కావాలనే తపన ఉంది. నువ్వొక స్నేహ చెలిమివి. అందుకే నువ్వంటే నాకు ఇష్టం ఏర్పడింది. డాక్టర్‌వి కూడా కావడంతో అది రెట్టింపయ్యింది. గ్రామీణ జీవితం అంటేనే ఎక్కువ ఇష్టం నీకు. హాస్పటల్స్‌లో డాక్టర్లు లేక ఎందరు మృత్యువాత పడ్తున్నారో అనే నీ ఆవేదన వెనుక నిజం ఉంది. ‘మహిళా సమత, అంకురం, క్రాస్‌, అమన్‌వేదిక, దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైట’ీ’ లాంటి అనేక సంస్థలతో కలిసి నువ్వు ‘రిసోర్స్‌పర్సన్‌’గా వెళ్ళడం గుర్తుంది నాకు. హెల్త్‌ క్యాంపుల్లో కూడా భువనగిరి, మోత్కూరు లాంటి వంద గ్రామాలకు పైగా పనిచేసిన అనుభవం నీకుంది. ‘భూమిక’ ఫౌండర్‌ మెంబర్‌గా నీకున్న సిన్సియారిటీ కూడా నచ్చుతుంది నాకు. ఒకసారన్నావు -కొండవీటి సత్యవతి ప్రోత్సాహంతో కొన్ని సంపాదకీయాలను రాశాను, హెల్త్‌ కాలమ్‌ కూడా రాసాను అని.

రోషిణీ, నీ పేరులోనే మీ అమ్మా నాన్నల త్యాగజీవితం ఉంది. సమానత్వపు వెలుగులో సమసమాజం ఏర్పడాలన్న ఆశయంతో నీకా పేరు పెట్టారు. ఆ రోజుల్లో పగడాల శ్యామసుందర్రావుగారు, కాంతమ్మగార్ని ఆదర్శ వివాహం చేసుకున్నారు. తనకంటూ పైసా సంపాదించుకోకుండా 21 ఏళ్ళకే ఎమ్మెల్యే అయిన ఘనత మీ నాన్నగారిది. ప్రజల మనిషి ఆయన. ప్రజలకు ఉన్న వైద్యావసరాలను గుర్తించి నువ్వు డాక్టర్‌వు కావాలనుకున్నారు. కానీ ఆయన ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. అప్పట్లో రష్యాలో ఫ్రీ ఎడ్యుకేషన్‌ సౌకర్యం ఉండడంతో ఆకాశమార్గంలో వెళ్ళిపోయావ్‌. రష్యన్‌ లిటరేచర్‌ని బాగా చదవడంతో నీలో సాహిత్యాభిలాష మరింత పెరిగిందని అంటుండేదానివి. చిన్నప్పుడు మీ తాతగారితో పాటు లైబ్రరీకి వెళ్తూ పురాణ సాహిత్యాన్నంతా ఇష్టంగా చదువుకునే దాన్నన్నావు. రష్యన్‌ లాంగ్వేజిని నేర్చుకోవడంతో కొన్ని ‘స్పీచ్‌’లకు అక్కడ అనువాదం కూడా చేస్తుండేదానివి. అలా ట్రాన్స్‌లేషన్‌ పట్ల మక్కువ ఏర్పడింది నీకు. 2011లో అనుకుంటా బెంగాలీ రచయిత ‘చిత్తప్రసాద్‌’ రాసిన పిల్లల కథల్ని ఇంగ్లీషు నుంచి తెలుగులో అనువాదం చేసి పుస్తకరూపంలోకి తీసుకొచ్చావు. నీగ్గుర్తుందా? నువ్వు 3వ తరగతి చదివేటప్పుడు కార్టూన్‌ వేసి బాలానందానికి పంపానన్నావు. పాకిస్థాన్‌ యుద్ధం వచ్చిన సందర్భంలో వేసిందది. తర్వాత్తర్వాత చాలా కార్టూన్లు వేశావు. కొన్ని ‘భూమిక’లో కూడా చూశాను. రష్యాలో సావనీర్‌లా తీసుకొచ్చి కొన్ని అనువాదాలు చేస్తుండేదానినన్నావ్‌. అలాగే, శాంతి-స్నేహం-సోషలిజానికి కూడా అనువాదాలు చేస్తుండేదానివి. ఇక, నీ కథల విషయానికొస్తే, 93’ ఆ ప్రాంతాల్లో అనుకుంటా నువ్వు రాసిన ‘మగాడు’ అన్న కథ గొప్ప సెన్సేషన్‌ని కలిగించింది. చాలా చర్చనీయాంశం అయింది.

‘కలలు కనే కళ్ళున్నాయి’-దళిత ఇష్యూమీద దాసిన కథ అది. ‘ఎలుకనైనా కాకపోతిని’-దళితుల సాంఘిక వివక్షమీద

రాసిన కథ. చదువుకునే రోజుల్లో నీవెదుర్కొన్న వివక్షను ప్రశ్నిస్తూ రాసిన కథన్నావ్‌. సమతా! చాలా వ్యంగ్యమూ, పొయటిక్‌ సెన్స్‌తో కథలకు పేర్లు పెట్టడం నీ ప్రత్యేకత. తెలంగాణా ఏర్పడాలనే తీవ్రమైన కాంక్షతో రాసిన కథ ‘ఊరేగింపు’. భాషను, కల్చర్‌ని కించపరచకూడదనే

ఉద్దేశ్యంతో రాసిన కథ ఇది. అలాగే బాగా చర్చనీయాంశమైన మరో కథ ‘సర్దుబాటు’. ఇది కుటుంబాలలో ఒంటరిగా మిగిలిపోతున్న వృద్ధుల్ని ప్రేమగా, బాధ్యతగా ఉండాలి, చూడాలి అనే ఉద్దేశ్యంతో ఆదిలాబాద్‌ రేడియోస్టేషన్‌కి రాసిన కథ ఇది.

కవితలు ఓ నాలుగైదుకంటే ఎక్కువగా రాసుండవు కదా! ఒక నిండైన మనసున్న స్నేహశీలి డాక్టరు నా మిత్రురాలైనందుకు తల్చుకున్నప్పుడల్లా గర్వపడుతుంటాను. కొంతమంది నిన్ను నాన్‌ సీరియస్‌ మనిషివి అనుకుంటారు కానీ, అది నిజం కాదు. నువ్వెంత నవనీతమో నాకు తెలుసు. అందుకే నువ్వు నాకిష్టం. నన్ను ‘అమ్మా! అని పిలిచినా, యాకూబ్‌ని ‘అయ్యా’ అని పిలిచినా పలికేదందుకే. ముఖ్యంగా నలభై ఏళ్ళు నిండీ నిండకుండానే నూరేళ్ళ జీవితాన్ని వదిలేస్తున్న స్త్రీలను చూసి బాధపడ్తుండేదానివి. అమ్మతనాన్ని, ఆలితనాన్ని మోస్తూ మోస్తూ స్త్రీలు అనారోగ్యాల పాలు పడ్తున్న తీరు నిన్ను ఆవేదనకు గురిచేసేది. పౌష్టికాహార లోపంతో, డెలివరీల్లో చనిపోతున్న స్త్రీలను చూసినా, వారికి తీరని కనీస అవసరాల్ని చూసినా మధనపడ్తుండేదానివి. ‘గోదారి గట్టు కథలు’ పేరుతో నా చిన్ననాటి అనుభవాల్ని కలిపి రాయాలని ఉంది అన్నావ్‌. ఎంతవరకు వచ్చాయవి? నాన్నగారి ఆటోబయోగ్రఫీ సిద్ధం చేసుకుని ఉన్నావ్‌ కదా! పుస్తకరూపంలో ఎప్పుడొస్తుంది తల్లీ! తర్వాతి జీవితానుభవాల్తో ఆటోబయోగ్రఫీ రాయాలన్న నీ ఆలోచన ఎంత వరకు వచ్చింది. రాయాల్సినవి చాలా

ఉన్నాయి. తొందరగా రాయి తల్లీ! ‘భూమిక’ నుంచి రచయిత్రుల మందరం ‘పాపికొండలు’ టూర్‌కి వెళ్ళాం. గుర్తుందా నీకు. మస్తు ఎంజాయ్‌ చేశాం. ఒకసారి చలికి ఒణుకుతున్న నాకు నీ వెచ్చటి షాల్‌ కప్పావు. చిన్నపిల్లలా అందరితో కలిసిపోయే నీ తత్వమన్నా, మనుషుల కోసం నువ్వు పడుతున్న తపన నాకెప్పుడూ అబ్బురాన్నే కల్పిస్తాయి.

గవర్నమెంట్‌ సివిల్‌ సర్జన్‌గా రిటైర్‌ అయిపోయిన తర్వాత కూడా నేనిప్పుడూ రి-టైర్‌ని కొత్త చక్రాన్ని అనుకుంటూ వికారాబాద్‌లో, అనాటమీ ఫాకల్టీగా ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే ఉన్నావు. నిరంతర చలనశీలివి నువ్వు. మరి ఉండనా! ప్రస్తుతానికి. మళ్ళీ ఇంకోసారి ఇలానే మనసు విప్పి మాట్లాడుకుందాం.

 

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.