అవును… ఇక్కడ అత్యాచారమూ పవిత్రమైందే! స్వేచ్ఛ

‘ఇక్కడ పెళ్లిని పవిత్రమైనదిగా పరిగణిస్తాం. ఇలాంటి సమాజంలో భర్త బలవంతాన్ని నేరంగా పరిగణించలేం’ అంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి ప్రకటించారు. నిజమే.. ఇక్కడ పెళ్లే కాదు, అత్యాచారమూ పవిత్రమైందే. అందుకే వైవాహిక అత్యాచారంపై చట్టం చేయడం ఈ దేశంలో సాధ్యంకాదు. ఎందుకంటే… స్త్రీపై సర్వాధికారాలు పురుషుడివైన చోట… స్త్రీ స్వేచ్ఛ అపవిత్రమైన విషయమవుతుంది గనుక. పాలకుల తీరు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశాన్ని మతమే నడిపిస్తుందనడానికి ఇంతకు మించిన

ఉదాహరణ ఇంకేమి కావాలి?

ఒక మహిళను తన అనుమతి లేకుండా ఎవరైనా బలప్రయోగం ద్వారా లొంగదీసుకున్నా, బలాత్కారం చేసినా అది నేరమే అవుతుంది. అది పెళ్ళి చేసుకున్న భర్తయినా, సహజీవనం చేసే వ్యక్తయినా, ప్రేమించిన వాడైనా. అంతర్జాతీయంగా రేప్‌పై గల అవగాహన ఇది. కానీ దేశంలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉండడం గమనార్హం. పెళ్లిని అత్యాచారానికి అధికారికంగా అనుమతించే తతంగంగా మార్చేశారు పాలకులు. దీన్ని భారతీయ సంస్కృతిలో భాగమైన విషయంగా ప్రకటించేస్తున్నారు. చట్టాల సాక్షిగా స్త్రీని పురుషుడి స్వంత ఆస్థిగా మార్చడం కంటే దుర్మార్గమైంది మరొకటి ఉండదేమో?

‘ఐపీసీ సెక్షన్‌ 375 ప్రకారం భర్త బలవంతంగా అనుభవించినా అది రేప్‌ కాదనే మినహాయింపు ఉంది. దీన్ని సవరించేందుకు ఏమైనా బిల్లు తెస్తున్నారా?’ అని డీఎంకే ఎంపి కనిమొళి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి హరీభాయ్‌ చౌదరి అలాంటి యోచన లేదంటూ సమాధానమిచ్చారు. ‘భార్యకు సమ్మతి లేకుండా బలవంతంగా శారీరకంగా కలిస్తే అది విదేశాల్లో రేప్‌గా పరిగణిస్తారు. కానీ భారత్‌లో నెలకొన్న భిన్నమైన, సామాజిక స్థితిగతుల నేపథ్యంలో దీనిని ఇక్కడ రేప్‌గా నిర్వచించలేము. అలాంటి ఆలోచన కేంద్రానికి లేదు’ అంటూ సెలవిచ్చారు. అంతే కాదు… ‘ఇక్కడ పెళ్ళిని పవిత్రమైనదిగా పరిగణిస్తాం. మన సమాజంలో అక్షరాస్యత శాతం, పేదరికం, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, విలువలు, మతపరమైన విశ్వాసాలు ఉన్నాయి. ఇలాంటి సమాజంలో భర్త బలవంతాన్ని నేరంగా పరిగణించాలనే డిమాండ్‌లను అమలు చేయడం అంత సులభం కాదు’ అంటూ సమర్థించుకున్నారు.

అవును మరి… పార్లమెంట్‌లో మెజారిటీ సభ్యులు మగవాళ్లే కాబట్టి, వాళ్ళందరి ఆలోచనలూ అలాంటివే కాబట్టి ఇలాంటి చట్టం తీసుకురావడం సాధ్యం కాదు. అసలు భారతీయ సంస్కృతి అంటే వీళ్ళ దృష్టిలో… భార్యపై సర్వాధికారాలు భర్తకే ఉండటం, భార్యకు ఇష్టాఇష్టాలు, స్వయం నిర్ణయాధికారం ఉండకపోవడమే కాబోలు. తమ పురుషాధిపత్య సమాజం నిర్ణయించిన చట్రం దాటోద్దని చట్ట సభల్లోనే ఆక్షేపిస్తుంటే రాజ్యాంగం కల్పించిన ప్రాథమి హక్కుల సంగతేమిటనే ప్రశ్న తలెత్తక మానదు. స్త్రీ వ్యక్తిత్వానికీ, స్వేచ్ఛకు భంగం కలిగించే ఇలాంటి చర్యలు దేశంలో స్త్రీల రక్షణనే కాదు ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది.

వైవాహిక అత్యాచారం గురించి మాట్లాడగానే అదేదో నేరమైపోయినట్టు, వైవాహిక అత్యాచారం గురించి చర్చించే వాళ్ళకు భార్య భర్తల బంధం మీద నమ్మకం లేనట్లు, వాళ్ళంతా వివాహేతర సంబంధాలను ప్రోత్సహించే వాళ్లనట్లు చూస్తుంటారు చాలామంది.

నాలుగు గోడల మధ్య వ్వవహారాన్ని కోర్టుల వరకు తేవడం సరైంది కాదనేది మరికొందరి వాదన. ఇటువంటి వాదనలు చేసేవాళ్ళు గుర్తుంచుకోవలసిన, తెలుసుకోవలసిన. ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వైవాహిక బంధంలో ఆడ, మగ ఇద్దరూ సమానం అన్న భావన ఉంటే అది ఆరోగ్యకరమైన అనుబంధం అవుతుంది. అలా కాకుండా ఒకరు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి సంస్కృతి, సంప్రదాయాల ముసుగు తగిలించి హింసను ప్రయోగించడం సరైంది కాదు.

ఢిల్లీ నిర్భయ ఉదంతంపై వెలువడిన బీబీసి ‘ఇండియాస్‌ డాటర్‌’ డాక్యుమెంటరీలో వాస్తవాల్ని ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టాలనుకున్న పాలక వర్గనీతి సగటు భారతీయ పురుషుడి స్వభావానికి నిదర్శనం. అసలు ఈ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఏంటి? ఆడవాళ్ల ఆత్మగౌరవాన్ని, వక్తిత్వాన్ని, హక్కుల్ని కాలరాయడమేనా? ఆడవాళ్లను తమ ఆస్తులుగా చూడడమేనా? మారిటల్‌ రేప్‌ చట్టం చేస్తే పురుషుడి ఆధిపత్యాన్ని స్త్రీ ప్రశ్నిస్తుంది. కనుక అందకు భారతీయ సంస్కృతి అనుమతించడం లేదన్నమాట.

అసలు వైవాహిక అత్యాచారం చట్టం తీసుకవస్తే వచ్చే ఇబ్బందులేమిటి? ఇష్టం, అంగీకారం లేకుండా భర్త భార్యను లైంగికంగా వేధించడం కుదరదనా? భార్య ఇష్టానికి విలువిస్తే మగవాడిననే అహం దెబ్బతింటుందనా? లేక భార్యని కూడా సాటి మనిషిగా గుర్తిస్తే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు భంగం కలుగుతుందనా? లేదంటే… నెలసరి లేదా రుతుక్రమంలో ఆమెకు రక్తస్రావం జరుగుతున్నప్పుడు, సెక్స్‌ కోసం వేధించే అవకాశమో, గర్భవతిగా ఉన్నప్పుడు లైంగిక వాంఛ తీర్చలేదని వేధించే అవకాశమో సగటు భారతీయ పురుషుడు కోల్పోతాడని భయమా? లేదా మనువాదం బోధించే నీతులకు భంగం కల్గుతుందనా?

ప్రభుత్వం వైవాహిక అత్యాచారాన్ని గుర్తించ నిరాకరిస్తోందంటే మహిళల పట్ల ఈ పాలకుల వైఖరేంటి? భార్యను శారీరకంగా, మానసికంగా, లైంగింకంగా భర్త అదుపులో ఉంచుకోవాలనే భావజాలాన్ని కాపాడుకోవడమే అని స్పష్టమవుతోంది.

అవును స్త్రీని ఒక భోగ వస్తువుగా చూసే భావజాలాన్ని నరనరాన ఇంకించుకున్న సమాజం ఆమెకు ఇష్టాఇష్టాలు, హక్కులుంటాయని ఏలా గుర్తింస్తుంది?

ఆడవాళ్ళ హక్కుల గురించి ఆడవాళ్ళే మాట్లాడుకోవాలి, ఆడవాళ్ళే పోట్లాడుకోవాలి. మంచినీళ్ళ సమస్య ఆడవాళ్ళదే అవుతుంది. ఇంటిపని, వంట పని ఆడవాళ్ళదే అవుతాయి. అవేవి మగవాళ్ళ పనులుకావు. వాటి అవసరం వాళ్ళకు లేదు కాబోలు. అందుకే అవి ఆడవాళ్ళ సమస్యలని వాళ్ళకే వదిలేశారు. కానీ ఆడవాళ్ళ ఆలోచనలపై శరీరంపై మగవాడి పెత్తనాన్ని నిలబెట్టుకునేందుకు తాపత్రయపడుతుంటారు.

పుట్టిన ప్రతి మనిషికీ హక్కులున్నట్టుగానే, ఆడవాళ్ళకీ హక్కులుంటాయి. ఇష్టయిష్టాలుంటాయి. ఆత్మగౌరవం, వ్యక్తిత్వమూ

ఉంటాయి. చాలా మంది యువకులు చదువులైపోయి ఉద్యోగాల్లో స్థిరపడగానే ‘వంటకు ఇబ్బందిగా ఉంది పెళ్ళి చేసుకోవాలి’ అంటారు. వండుకొని తింటే మగప్రతిష్ట దిగజారిపోతుందా? ‘ఇంటి పని కష్టమౌతోంది, భార్య కావాలి’ అంటారు. ఇంటిపని మగవాడు చేస్తే పరువుపోతుందా? ఇలాంటి ఆలోచనలే వివాహబంధంలో అణచివేతకు పునాది. ఇప్పటికీ భారతీయ పురుషుల్లో అత్యధికులు భార్య అంటే జీతం ఇవ్వాల్సిన అవసరంలేని పనిమనిషి, వంటమనిషి, ఒంటిమనిషిగానే చూస్తుంటారు.

ఒక వ్యక్తిగా మహిళకు ఉండే హక్కులు వివాహం కారణంగా కోల్పోవడాన్ని సమర్థిస్తున్న సమాజమిది. ఫలితంగా స్త్రీ ఏలాంటి హక్కులు లేని ఒక లైంగిక వస్తువుగా మిగిలిపోవాల్సిన దుస్థితి నెలకొంది.

భారతీయ సమాజంలో ఇటువంటి హింస దాదాపు తొంభైౖ శాతం కుటుంబాల్లో ఉంటూనే ఉంది. కానీ దాన్ని హింసగా గుర్తించి ఆపే ప్రయత్నాలు తక్కువనే చెప్పాలి. వీలైనంత మేరకు ఆడవాళ్ళు ఈ హింసను భరించే విధంగానే పురుషాధిక్య సమాజం ప్రోత్సహిస్తోంది. పెళ్ళికి పవిత్రతను ఆపాదించి మగవాడు ఏం చేసినా ఒర్చుకోక తప్పదు అని, వాడు లేకపోతే ఆడదాని జీవితానికి అర్థం లేదని, భరించక తప్పని స్థితికి నెట్టివేస్తారు. ఇలాంటి హితబోధల్లో హింసను భరించడమనేది ఆడవాళ్ళ సహజగుణం అనే దుర్మార్గపు భావజాలాన్ని రుద్దుతూనే ఉంది ఈ సమాజం.

పురాణాలు, మనువాదం పేరుతో ఇప్పటిదాకా ఈ పురుషాధిపత్య సమాజం ఆడవాళ్ళను అన్ని విధాలుగా గుప్పిట్లో ఉంచుకోగల్గిందేమో కానీ, కాలం గడుస్తున్న కొద్ది మహిళల దృక్పధంలో మార్పు వస్తుంది. అన్నిరంగాల్లో మహిళలు దుసుకెళ్తున్నారు. ఆత్మవిశ్వాసంతో బతకాలనుకుంటున్నారు. కానీ మగవాళ్ళు మాత్రం ఇవేవి జీర్ణించుకోలేకపోతున్నారు. సమాజికంగా, ఆర్థికంగా స్వేచ్ఛగా జీవించే వాతావరణం ఉంటే భార్యను గౌరవించాల్సి వస్తుందని అహంభావంతో రగిలిపోతున్నారు. స్త్రీ పురుష బంధంలో ఒకరిపై ఒకరికి ఉండాల్సిన ప్రేమాభిమానాలు, గౌరవం స్థానంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాడు పురుషుడు. కానీ గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే బంధమే అసలైన ప్రేమకు నిదర్శనమని తెల్సుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వైవాహిక జీవితం సవ్యంగా ఉంటుంది. కానీ ఇవన్నీ సులభంగా సాధ్యమయ్యే మార్పులు కావు. అన్ని రంగాల్లో సమాన హక్కుల కోసం ఉద్యమిస్తున్న మహిళలు తమ ఇష్టఇష్టాలు ఇతరుల దయాదాక్ష్యిణ్యాలపై నిర్ణయించడాన్ని ప్రతిఘటించాల్సిందే. ఇలాంటి ఆధిపత్యాన్ని ప్రశ్నించాల్సిందే. అప్పుడు మాత్రమే వివాహబంధం పేరుతో జరుగుతున్న హింసనుంచి విముక్తి సాధ్యమవుతుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో