స్టేట్‌ లెవల్‌ మీడియా సెన్సిటైజేషన్‌ వర్క్‌షాప్‌ మరియు ఎన్జీఓ సభ్యులకు శిక్షణ భూమిక టీం

భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ మరియు పి.ఎల్‌.డి. (పార్టనర్స్‌ ఫర్‌ లా అండ్‌ డెవలప్‌మెంట్‌) ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో, కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ (నివారణ, నిషేధం, రెడ్రెసల్‌) చట్టం 2013పై ఆగస్టు ఒకటి, రెండు తేదీల్లో హోటల్‌ సంధ్యలో వర్క్‌షాప్‌ నిర్వహించబడింది. ఈ వర్క్‌షాప్‌కి రిసోర్స్‌పర్సన్‌గా పి.ఎల్‌.డి. నుంచి నందిని రావు మరియు అతి బాధ్యత వహించారు. ఈ వర్క్‌షాప్‌ రెండు భాగాలుగా నిర్వహించబడింది. 1) తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో పనిచేసే మీడియా ప్రతినిధులతో, 2) మహిళలు మరియు పిల్లల అంశాలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న వారితో. ఈ వర్క్‌షాప్‌కి దాదాపు 40 మంది సభ్యులు హాజరయ్యారు.

ఈ వర్క్‌షాప్‌ ఉద్దేశ్యం ఏమనగా పని ప్రదేశాల్లో / కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ (నివారణ, నిషేధం, రెడ్రెసల్‌) చట్టం 2013లోని అంశాలను విస్తృతంగా చర్చించుకోవడం, స్పష్టత తెచ్చుకోవడం, పిఎల్‌డి ఈ చట్టం ఆధారంగా తయారు చేసిన రిసోర్స్‌ కిట్‌ (బుక్‌లెట్‌ మరియు పోస్టర్స్‌)ను వర్క్‌షాప్‌లో పాల్గొన్న సభ్యులకు అందచేయడం.

మీడియా సభ్యులతో జరిగిన వర్క్‌షాప్‌లో 10ుహ, ుహ5, ుహ9, హ6 మరియు ఇతర ఛానెళ్ళ ప్రతినిధులు పాల్గొన్నారు. మీడియాతో జరిగిన సమావేశంలో లైంగిక వేధింపుల విషయంపై చర్చ జరిగింది. రిసోర్స్‌ పర్సన్‌గా ఉన్న నందిని ఏ ఏ అంశాలను లైంగిక వేధింపులుగా పరిగణించవచ్చో చెప్పారు. అప్రియమైన చర్యలు ప్రవర్తన, లైంగికపరమైన సంబంధాల కోసం డిమాండ్‌ మరియు అశ్లీల దృశ్యాలు చూపించడం, లైంగికపరమైన జోకులు) మొదలైనవి. నందిని మాట్లాడుతూ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు సంబంధించిన చర్చలు అవసరమని, ఈ అంశం పని ప్రదేశాల్లో ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి సంబంధించిన విషయమని చెప్పారు. మీడియా సభ్యులు కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. వారు రాత్రిపూట పనిచేసే మహిళలు చాలా వేధింపులకు గురవుతున్నారనే భావనను వ్యక్తం చేశారు. రాత్రిళ్ళు పనిచేసే వారిపట్ల ప్రతి ఒక్కరు ప్రతికూల భావన కలిగి ఉన్నారని, వారి పాత్ర ప్రశ్నించబడుతోందని చెప్పారు. చాలా కార్యాలయాల్లో ఉన్న అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి) క్రియాశీలంగా లేదని చెప్పడం జరిగింది. అందుకు రిసోర్స్‌ పర్సన్‌ వారితో ఐసిసి తప్పకుండా ప్రతి కార్యాలయంలో పెట్టుకోవాలని సూచించారు. అలాగే వేధింపులకు గురయిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాట్లాడాలని అది వారి బాధ్యతని అన్నారు. అందువల్ల ప్రతి కార్యాలయంలో లైంగిక వేధింపులంటే ఏమిటి, ఐసిసి అంటే ఏమిటి, లైంగిక వేధింపులకు గురయితే వారు ఏమి చేయవచ్చనే అంశాలపైన మరియు చట్టంపైన అవగాహన కల్పించాలని చెప్పడం జరిగింది.

ఆగస్టు ఒకటవ తేదీ మధ్యాహ్నం నుండి రెండవ తేదీ సాయంత్రం వరకు స్త్రీలు మరియు పిల్లల అంశాలపై పనిచేసే కౌన్సిలర్లు మరియు సోషల్‌ వర్కర్లతో వర్క్‌షాప్‌ నిర్వహించబడింది. వారికి గ్రూప్‌ చర్చలద్వారా ఈ చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగింది. మొదటిగా వర్క్‌షాప్‌కి వచ్చిన వారికి అంచనాలను తెలుసుకుని, ఆ వర్క్‌షాప్‌ లక్ష్యాలను రిసోర్స్‌పర్సన్‌ నందిని వివరించారు. సభ్యులను నాలుగు గ్రూపులుగా విభజించి లైంగిక వేధింపులు అంటే ఏమిటి, లైంగిక వేధింపు అని దేన్ని అనకూడదు అనే విషయంపై చర్చించారు. తర్వాత ఒక్కొక్కరు లైంగిక వేధింపులకు సంబంధించిన వివిధ అంశాల్లో చర్చించారు.

రెండవరోజు పిఎల్‌డి వారు చట్టం ఆధారంగా తయారుచేసిన బుక్‌లెట్‌ని రివ్యూ చేశారు. తర్వాత సభ్యులను గ్రూపులుగా చేసి ఒక్కొక్క గ్రూపులో వేధింపులకు సంబంధించిన ఒక కేసు గురించి చర్చించి ప్రెజెంట్‌ చేయమని చెప్పడం జరిగింది. సభ్యులు అందచేసిన కేసుల ఆధారంగా లైంగిక వేధింపుల్లో వర్గం, కులం, జెండర్‌, విద్య మొదలైనవి ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పారు. అలాగే చట్టంలోని అంశాలు, అంతర్గత కమిటీల బాధ్యతలు, లోకల్‌ కంప్లయింట్‌ కమిటీల గురించి చర్చించుకోవడం జరిగింది. ఆ వర్క్‌షాప్‌కు వచ్చిన సభ్యులు వారి వారి కార్యాలయాల్లో, అలాగే ఇతర పనిచేసే చోట్ల లైంగిక వేధింపుల నివారణ, నిషేధంపై పనిచేయాలని నిర్ణయించుకున్నారు.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో