వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రిియాతి ప్రియమైన ‘శివరాజు సుబ్బలక్ష్మి’ గారికి ఎంతో ఉద్వేగంతో, ప్రేమతో రాస్తున్న లేఖ ఇది. మిమ్మల్ని తొలిసారి చూసీ చూడడంతోనే ప్రేమలో పడ్డాను. 92 ఏళ్ళ వయసులో కూడా మీరు ఉత్సాహ తరంగంలా ఎగిసిపడటం, చిరునవ్వుల నదిలా ప్రవహించడం, ఒక నైర్మల్మాన్ని సంతరించుకున్న మోముతో కనిపించడం నాకెంతో ముచ్చటగొల్పింది. నిన్న అంటే 21.7.2017న తెలుగు యూనివర్శిటీలో మీ అవార్డు సభలో మిమ్మల్ని తొలిసారిగా చూసాను. ‘మాలతీచందూర్‌’ లాంటి అత్యంత ప్రతిభావంతురాలి అవార్డు, అంతే ప్రతిభగల మీకు రావడం అందరం హర్షించదగ్గ విషయం. ఇప్పటికీ రచనా వ్యాసంగం పట్ల మీకున్న ఉత్సాహం తగ్గలేదు. బుచ్చిబాబుగారు మిమ్మల్ని వీడిపోయి 50 ఏళ్ళు దాటుతున్నా, ఆయన జ్ఞాపకాల్తోనే ఆగిపోకుండా, ఆయన రచనలను వ్యాప్తి చేసే, పరిరక్షించే బాధ్యతలను ఎంతో ఇష్టంగా చేస్తూనే ఉన్నారు. ఆయన ట్రాన్స్‌లేషన్‌ వర్క్స్‌ని కూడా పుస్తకరూపంలో తీసుకురావాలని ఉందంటే సభికుల్లో నుంచి ఆ పుస్తక బాధ్యతను తీసుకోవడానికి సిద్ధపడ్డారు.

మీరొక అద్భుతమైన చిత్రకారిణి కూడా కావడంవల్ల కథల్లో వాతావరణ చిత్రణను బొమ్మకట్టులా చూపించడం మీ ప్రత్యేకత. బుచ్చిబాబు ప్రకృతి వర్ణన ఎక్కువగా చేస్తే, మీరేమో వాతావరణ, సన్నివేశ చిత్రణకే ప్రాధాన్యతనిచ్చారు. కథల్లో మీ పాత్రోచిత భాష చాలా బాగుంటుంది. ఆయా పాత్రలకు తగినట్లుగా సహజంగా రాస్తారు. ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీల జీవితాలనే ఎక్కువగా చిత్రించారు. కుటుంబ వ్యవస్థ స్త్రీలను, పురుషులను ఎలా తయారుచేస్తుందో ఆ రోజుల్లోనే చాలా ప్రతిభావంతంగా చెప్పారు. స్త్రీలు మారాల్సిన తీరును, లోపాలను చెబుతూనే, పురుషుల పట్ల వ్యతిరేకత కాకుండా సంయమన ధోరణితో కథల్ని మలిచారు. మీ కథల్లో కానీ, నవలల్లో కానీ మార్పులు, మలుపులు ఉండవు, తీర్పులివ్వరు. వ్యాఖ్యానాలు చెయ్యరు. వాస్తవాలను వాస్తవాలుగా వ్యక్తీకరిస్తూ పోతారు. మనుషులుగా కలిసి జీవించడానికి, ఆలోచనా ధోరణి మారాల్సిన తీరుని ఆయా పాత్రలతోనే చెప్పడం మీ ప్రత్యేకతగా అన్పించింది. చాలా బ్యాలెన్స్‌డ్‌గా రాస్తారు. మీ నవలల్లో నాకిష్టమైనవి ‘నీలంగేటు అయ్యంగారు’, ‘అదృష్టరేఖ’. ‘తీర్పు’ నవల దొరకలేదు. మీ దగ్గర కూడా లేదని విన్నాను.గౌతమీ తీరాన రాజమండ్రిలో పుట్టిన మీరు, 12 ఏళ్ళకే పెళ్ళయిపోయి కుటుంబభారంతో పాటు సాహిత్య జీవితాన్ని కూడా ప్రారంభించారు. గాంధీని, రవీంద్రనాధ్‌ ఠాకూర్‌ని మీరు కలిసానని చెప్పడం ఎంతో సంతోషంగా అన్పించింది. మీతో ఓల్గాకు, కాత్యాయనీ విద్మహే గార్లకు మంచి స్నేహం, ఆత్మీయత ఉన్నాయని విన్నాను. మీ పట్ల ఉన్న ఇష్టంతోనే కొండవీటి సత్యవతి భూమికలో ఆర్టికల్‌ వేశారు కూడా. ఇంతెందుకు మీ కథల్ని చదువుతుంటే మన చుట్టుపక్కల జీవితాల్ని చూస్తున్నట్లే

ఉంటుంది. ఊహాలోకాల్నుంచి ఊడిపడ్డ పాత్రలో, సహజత్వానికి దూరంగా ఉండే పాత్రలో ఉండనే ఉండవు.

ఐతే, అందరు రచయిత్రులకు జరిగినట్లుగా, మీ పట్ల కూడా జరిగింది. బుచ్చిబాబు గారు అసామాన్యమైన రచయిత. ‘చివరకు మిగిలేది’ కూడా ఆయన ఆలోచనాధోరణి, ప్రతిభా వ్యుత్పత్తులే. ఆయన భార్య కావడం వల్ల మీరు నీడగానే మిగిలిపోయారు కానీ, వెలుగు కాలేదు. మిమ్మల్ని విడిగా చూసినప్పుడు మీరు గొప్ప రచయిత్రి. రావాల్సిన గుర్తింపు రాలేదు. ‘బాపూ’గారి పిన్నమ్మ అయిన మీరు, గీతల్ని నేర్పించి దిద్దిన మీరు, మామూలు వ్యక్తి కాదు. నాకెప్పటికీ బాధ కలిగించే విషయమే ఇది. ఇన్నాళ్ళకైనా, మీరెంతో అభిమానించే, మిమ్మల్ని ఎంతో అభిమానించే ‘మాలతీచందూర్‌’ అవార్డు మీకు రావడం నాకెంతో తృప్తిని కలిగించింది.

నిన్నటి సభ ఏమిటో మర్చిపోయి, గందరగోళపడినా, మృణాళినిగారి ఉపన్యాసంతో ఆ కొరత తీరింది. రెంటాల జయదేవ్‌ కూడా సభా నిర్వహణ అద్భుతంగా చెయ్యడంతో పాటు మీ పట్ల గల అపారమైన గౌరవంతో ప్రశ్నలు వేయడం, మీరు వాటికి చక్కని సమాధానాలు ఇవ్వడం సభకే నిండుదనాన్నిచ్చింది. రచయిత్రులతో గ్రూప్‌ ఫోటో కూడా కలకాలం దాచుకునే అమూల్య వజ్రం. మీ నుంచి జవాబును కోరుకుంటూ…

– మీ ప్రేమికురాలు శిలాలోలిత

 

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో