అనువాద కథాసుమసౌరభం

డా|| కె.బి.లక్ష్మి
తెలుగు సాహిత్య సేవకి, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకి పేరుపొందిన పట్టణం బరంపురం. ఒరిస్సాలో తెలుగు మీడియంలో చదువుకుని, అమ్మ ఒడిలో తెలుగు సంస్కృతి పట్ల అభిమానం, సాహిత్యంలో అభిరుచి పెంచుకుని, తెలుగుదనాన్ని పరిరక్షించు కుంట, ఆంగ్లంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌, బి.ఇడి చేసి ఒరిస్సా ప్రభుత్వ విద్యాశాఖలో రీడర్‌గా, ఆంగ్ల విభాగాధిపతిగా పదవీవిరమణ చేసిన విద్యాధికురాలు, ఒరియ, హిందీ, బెంగాలీ, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో నిష్ణాతురాలైన బహుభాషావేత్త శ్రీమతి ఉపద్రష్ట అనురాధ.
ఒక భాషలో తనకు నచ్చిన రచనను తన మాతృభాష, ఇతర భాషల వారికి అనుసృజనగా అందించాలన్న తపన, మంచి రచనను అనువాదానికి ఎన్నుకునే వివేచన, మూలభాష – అనువాదభాష రెండింటిలోన ప్రావీణ్యత, భాషతో బాటు ఆయ ఆచారవ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయలు తెలిసి వుండడం అనువాదకులకుండాల్సిన ప్రధాన అర్హతలు. అనరాధ ఒక కమిటెడ్‌ అనుసృజనశీలి. ”మా తెలుగుతల్లికి మల్లెపూదండ అని మా అమ్మ పాడుతుంటే ఎంత ఇష్టంగా విని పరవశించేదాన్నో, ‘వందే ఉత్కళ జననీ…’ అని స్కూల్లో నేర్పినపుడు అదే ఇష్టం” అన్న ఆమె మాటలే అందుకు నిదర్శనం.
ముద్రితమైన వాటిల్లో నాల్గవది ఈ సమీక్షాగ్రంథం – ‘ఒరియ కథాసౌరభం’. 16 మంది ఒరియ రచయితల కథానువాదాలు ఇందులో వున్నాయి. కథలు, రచయితల ఎంపికను అనురాధ ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు. 1965 దాకా జీవించిన గోదావరీశ మహాపాత్రనుండి 1965లో పుట్టిన అరవింద పట్నాయక్‌ దాకా 16 మంది కథల్ని అనువదించారు. వీరిలో ఐదుగురు రచయిత్రులు. ముగ్గురు ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీతలు. ముగ్గురిలో ఒకరు శ్రీమతి ప్రతిభారాయ్‌. దాదాపు అందరు ఒడిశి సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. కొందరికి కేంద్ర సాహితీ అకాడమీ అవార్డులు వచ్చాయి. జర్నలిస్ట్‌ రైటర్‌ రమేష్‌ పట్నాయక్‌ వీరిలో ఒకరు. సార్వకాలికము, సార్వజనీనము అయిన కథావస్తువులు, ఇతివృత్త నిర్వహణా సామర్ధ్యం, కథన వైవిధ్యం గల ఒరియ కథల్ని ఎంచుకుని తెలుగువారికి రుచి చూపించిన అనువాదకురాలి అభిరుచి అభినందనీయం.
రచయిత్రులు వీణాపాణి మహంతి, ప్రతిభారాయ్‌, సుధాంశు బాలాపండా, వనసిదాస్‌, సుస్మితా బాగ్చిల రచనలు ప్రత్యేకించి ‘స్త్రీవాద’ కథలన్న ముద్ర లేకున్నా స్త్రీల జీవితాల్లోని విభిన్న పార్శ్వాలని విపులీకరిస్త, పురుషదౌష్ట్యాన్ని ఎండగట్టాయి.
వీణాపాణి కథలోని ‘పటొదేయీ’ గ్రామీణ మూఢనమ్మకాలకి, మూర్ఖత్వానికి, అత్యాచారానికి బలైనా బలంగా బుద్ధి చెప్పి ఆత్మగౌరవ విశ్వాసాల్ని ప్రకటించడం ‘థ్రిల్‌’ కలిగించే ముగింపు. కుటుంబంలో తల్లిగా, భార్యగా బాధ్యతలు నిర్వహిస్త ఆధునిక విద్యావిధానం, బతుకుతెరువు కోసం పిల్లల్ని దురదేశాలకి పంపవల్సి రావడంలోని ఆవేదన, ఆర్ద్రతతో పఠితల్ని కదిలించే సుధాంశు బాలాపండా ‘వలస’లోని లత, పరిస్థితులకు వ్యక్తులు తలవంచి రావల్సిన అగత్యాన్ని అద్దంలో చూపించిన వనసిదాస్‌ ధరణీధర, ఉదాత్త స్త్రీపురుష సంబంధాల్లోని భావ సంఘర్షణకు ప్రతిరపాలైన ప్రతిభారాయ్‌ వెక్షంలోని శోషి, నురిదాసులు, వెలకట్టలేని గృహిణీధర్మాన్ని ఆచరిస్త అనుక్షణం తనని తాను కోల్పోయే సుస్మితాబాగ్చీ ‘క్రమంగా’లోని శోభ మరపురాని రీతిలో రచయిత్రులు సృష్టించిన పాత్రలు.
నిజానికి గోదావరీశ నుండి అరవింద వరకూ ప్రతి కథకుడ ఫెమినిస్టిక్‌ ఓరియంటేషన్‌తోనే పాత్రల్ని నడిపించారు. రెండవ ప్రపంచ యుద్ధం నాటి వ్యవస్థకి (మన శ్రీశ్రీ రాసిన ‘పాడవోయి భారతీయుడా’ పాటలాగ) నేటి వ్యవస్థకి అణువంత కూడా వ్యత్యాసం లేదని ఈ ఒరియ కథాసౌరభాలు చెబుతున్నాయి. ‘వెల్లువ’, ‘జ్యోతి’, ‘పాతాళగంగ’, ‘మరో మగువ’, ‘పొలిమేరల్లో స్త్రీ’ కథలు చదివి తీరాల్సినవి. స్త్రీవాదం, స్త్రీవాద సాహిత్యంలోని వినత్న పార్శ్వాన్ని ప్రకటించిన ఈ కథలు, పాత్రలు రచయితల దృష్టికోణాన్ని ఆ దిశగా ప్రస్ఫుటీకరించాయి.
ఆదర్శవంతంగా, అనుసరణీయంగా 16 కథానువాదాలతో బాటు ఉపద్రష్ట అందించిన ఆయ రచయితల పరిచయలు వారిని తెలుగు పాఠకులకు మరింత సన్నిహితుల్ని చేస్తాయి. అనరాధ ఈ ప్రయత్నానికి హేట్సాఫ్‌.
తెలుగువారు గర్వించదగిన అనువాదకురాలు అనురాధ అందించిన ఈ పరిమళభరిత అనువాదకథాసుమగుచ్ఛం అందరి ఇళ్లలోని పుస్తకాల ఫ్లవర్‌ వేజ్‌ (అల్మైరా)లో వుండదగిన అత్యంత మంచి పుస్తకం.
ఒరియ కథాసౌరభం (వెల ర.120/-, పేజీలు – 170)
ప్రతులకు : శ్రీమతి వి. అనురాధ

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో