ప్రతిస్పందన

ఎడిటర్‌ గారికి,

ప్రశాంతి గారి ‘పడిలేచిన అల’ చదువుతుంటే సహజమే అలలు పడిలేవడం వాటి సహజ గుణం, కానీ సమాజంలో పిల్లలు ఇంతటి విషమ స్థితిని ఎదుర్కొనటం నిజంగా చాలా బాధాకరం. రాబోయే తరాలు వీటిని ఎలా అర్ధం చేసుకోవాలి అని ఆలోచిస్తుంటే ‘గుగివా ధియాంగొ’ ఆఫ్రికన్‌ రచయిత తన సొంత దేశం అయిన కెన్యాకు వచ్చిన తరువాత అతని సహచరిపై ఆత్యాచార యత్నం చేస్తారు. ”నా బ్యాగులో ఉన్న డబ్బులు అన్నీ ఇచ్చివేసినా వాళ్ళు ఒక పిల్ల చర్యకు పాల్పడ్డారు. నాలో కూడా భయాన్ని కల్గించాలని చూసారు” అని సూటిగా చెప్పాడు. అలాంటి ధైర్యం అందరిలో కలగాలి. ఈ మధ్య IIూజ= – పుణేకి వెళ్ళినపుడు అక్కడి అమ్మాయిల్లో కన్పించిన ఆత్మస్థైర్యం నాలో కొత్త ఆశలు చిగురించేలా ఆ అమ్మాయిలు, అబ్బాయిలను తీర్చిదిద్దుతూ రాబోవు తరాలకు శాస్త్రవేత్తలనే కాదు ఒక ఆశాజనకమైన మానవ సంబంధాలకు దారులు వేసేలా వాళ్ళ ఆచరణను మరల్చగలరని భరోసా కల్గింది నాలో!

అయితే ఆడవాళ్ళు బయట తిరిగితేనే సమాజాన్ని, వారి స్థితికి కారణమౌతున్న ఆడపిల్లల శిక్షణలోని లోపాలను లోతుగా తెలుసుకుంటారు. తేలికగానే కానీ వారిని అభినవ ద్రౌపదులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతలో మనందరి కర్తవ్యం దాగి ఉందని మరవవద్దు.

‘వాన’ కవిత రచయిత్రి చల్లపల్లి స్వరూప రాణికి నిజంగా వానతల్లి వందనాలు. వాన ఇంత చక్కగా సామాజిక స్థితిగతులనూ చూపుతుందని ఒక చారిత్ర పరిశోధనా పత్రం రాసినట్లు అక్షరాలకు మట్టి పరిమళాన్ని అద్ది మరీ జీవిత లోతుపాతులను తెలియజేయడం, డేగిశాలో బుడుంగు బుడుంగుమంటూ అర్థరాత్రి నిద్రలేపే చెమ్మగిల్లిన మా పూరిల్లు గుర్తుకొస్తుంది. మొదటిసారి కవిత చదివినపుడు అర్థం కాలేదు, రెండవ సారి చదివినపుడు ఆర్ద్రతతో కొద్దిసేపు ఆలోచిస్తే అసలు మనిషి సాహిత్యంతో చేస్తున్న సేద్యం కూడా రైతన్నకు సమానంగా ఉందేమో అనేలా అందరి వాన ఇళ్ళను గుర్తుకు తెచ్చింది. బాల్యంలోకి తీసుకెళ్ళినందుకు స్వరూపక్కకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

కవన భూమికలోని అన్ని కవితలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయనిపిస్తుంది. అందరూ వారిని వారు తెలుసుకుంటూ సమాజంలోని అసమానతలను అర్ధం చేసుకునే విధానం కొత్తగా ఉంది. ఒక ‘అంబేద్కర్‌’ను అప్పటి రాజకీయ పరిస్థితులతో అంచనా వేసి ఆ చైతన్యాన్ని నిగ్గు తేల్చడం చాలా బాగుంది.

‘గుర్తింపు’ కథానిక ముద్దుగారే యశీద ముంగిట ముత్యం వీడు… సౌండ్‌ తగ్గించమన్నందుకు అసలు జీవితంలో సౌండ్‌ పెరిగితే జరిగే ఇంబ్యాలెన్సింగ్‌ ఏంటో ఇంటి పని చేసే వారికి మాత్రమే కథలోని లోతుపాతులు అర్ధమౌతాయి అనుకుంటున్న నాకు ఇలాంటి కథానికల వల్ల కూడా సి.ఏ. చేసిన వాళ్ళు విశ్లేషించినట్టుగా డేటా చూపించారు. కొన్ని ఇళ్ళల్లో ఈ పనులు రివర్స్‌గా కూడా జరుగుతున్న ఆడవాళ్ళకు కూడా కనువిప్పుగా ఉంది. ఆ డేటా ఇవ్వడం, ఇంటి వార్షిక నివేదిక నిజంగా ఆ ఇంటిలో తిరిగి నవ్వులను పూయించడం చాలా సంతోషంగా అనిపించింది. హర్షకిరణ్‌ ఇంకా చాలా కథలు కూడా రాయాలని కోరుకుంటూ…

– కలన, హైదరబాద్‌

……………

భూమిక ఎడిటర్‌కి,

”ఎవరో వేసిన సంకెళ్ళను వారినే వచ్చి తీసివేయమని

ప్రాధేయపడేకంటే సత్తా పెంచుకుని, వాటిని తమంతట తామే చేదించుకోవటం మంచిది” – అంబేద్కర్‌

ఎప్పుడో ఎవరో విజ్ఞానం నేర్వని మనిషి భర్త చనిపోయాక స్త్రీ ఇలాంటి అవమానం అనుభవించాలని పెడితే విజ్ఞానం నేర్చిన ఈ ఆధునిక కాలంలో కూడా స్త్రీ ఎదిరించకుండా మౌనంగా భరించడం స్త్రీదే తప్పు. మన మీద మూఢ ఆచారాలను మనమే తొలగించుకోవాలి. ఈ ‘వికృత తంతు’ని ఆడవారే దగ్గరుండి మరీ వేడుకలా చేయడం మొత్తం స్త్రీ జాతికే అవమానకరం కాదా?!

ఇంకొక ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మన దేశంలో సాంప్రదాయ ముసుగులో కుల, మత వివక్షలు ఉన్నాయి

కానీ ఆ వివక్ష ఎదుర్కొంటున్న బాధిత వర్గం నుండి తిరుగుబాటు రావడం ఎప్పుడో మొదలైంది కానీ స్త్రీని ”నీవు వితంతువువి”, ”ఈ రోజు నీపై అవహేళన జరుపుతాం”, ”నీవు అశుభం”, ”నీవు పక్కకి ఉండు” అని అనగానే ఆమె ఇది ”నా రాత” అని మౌనంగా భరించడమేంటి?

బాధిత వర్గం నుండి కొంచెమయినా తిరుగుబాటు రాకపోవడమేంటి? ఎన్ని పెద్ద చదువులు చదివి ఉన్నా, ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న స్త్రీలయినా కూడా ఈ పరిస్థితి రాగానే బేలగా తలవంచడమేంటి? ఏ స్త్రీకైనా ఈ పరిస్థితి ఎదురైనపుడు ఆ స్త్రీ ఎదిరించడం ఒక్కటే కాదు, సాటి స్త్రీలందరూ తనకు అండగా నిలబడాలి. ఎందుకంటే భర్త పోయిన స్త్రీ పైన అలాంటి అకృత్యం సాటి స్త్రీలే ఒక వేడుకలా జరుపుతారు. ఇది ఆడవాళ్ళందరూ చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఈ మూర్ఖపు ఆచారంలో మన స్త్రీ జాతి మొత్తంపై వివక్ష అవమానం ఉందని ప్రతి ఒక్క స్త్రీ గ్రహించాలి.

అలాగే చాలాచోట్ల ఈ విషయంపై మాట్లాడుతున్నపుడు స్త్రీకి పసితనం నుండి పూలు, బొట్టు, గాజులు ఉంటాయి, భర్తతో కేవలం తాళి, మెట్టెలు వస్తాయి. భర్త పోయాక అవి ఒక్కటి తీసివేస్తే సరిపోతుంది అంటారు. కానీ అది తప్పు. భర్త చనిపోగానే పూలు, బొట్టు, గాజుల వరకు ఉంచి కేవలం తాళి, మెట్టెలు తీసివేయడం కూడా ఆమెను అవమానించడమే. పెళ్ళితో తాళి, మెట్టెలు ధరించాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య జీవితాంతం కలిసి ఉంటామనే ఒప్పందం ఉంటే చాలు. అయితే స్త్రీ పెళ్ళితో తాళి, మెట్టెలు ధరిస్తానంటే అది ఆమె వ్యక్తిగత ఇష్టం. స్త్రీకి తాళి, మెట్టెలు భర్తతో వచ్చినట్లు కాదు, వివాహంతో వస్తాయి. వివాహంతో వచ్చిన గుర్తులు ఆ వివాహ బంధం రద్దయినప్పుడు తీసివేయాలి కానీ భర్త చనిపోతే తీసివేయడం ఎందుకు? విడాకులతో వివాహ బంధం రద్దవుతుంది కానీ భర్త చనిపోగానే ఆ వివాహ బంధం రద్దు కాదు కదా! అలాంటప్పుడు భర్త చనిపోగానే పసితనం నుండి అలంకరించుకున్న వాటితో పాటు వివాహంతో వచ్చిన అలంకరణ వస్తువులను కూడా ఆమెనుండి దూరం చేయడంతో పాటు నీవు అశుభం అని ముద్ర వేయడం చాలా హేయమైన చర్య. ఇది సమాజంలో ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన విషయం.

– తేజస్వి ఉన్నం, ఇ-మెయిల్‌

……………

డియర్‌ సత్యవతి గారు,

వైధవ్యం.. రసి కారుతున్న ఓ రాచపుండు – సారీ మేడమ్‌, వెరీ బ్యాడ్‌ – గుడ్‌ a్‌్‌ఱ్‌బసవ ఎaసaఎ. దీబ్‌ అశ్‌ీ ఇన్‌ తీఱస్త్రష్ట్ర్‌ షaవ.

రక్తం మరుగుతుంది

మంగళసూత్రం నేలకేసి కొట్టాలనిపిస్తుంది

చెత్త ఆచారాలు బోగి మంటల్లో వేసి తగలెయ్యాలి

మనసును మెలిపెట్టే ఇలాంటి అనుభవాలు

భర్తలు చనిపోయిన స్త్రీల పట్ల అత్యంత అమానవీయ పద్ధతుల్ని ఆచరించడం సిగ్గుచేటు

హిందూ మతావలంబికులే ఈ దారుణ ఆచారాలన్నీ కొనసాగిస్తున్నారు

ఆమె చేతిలో ఉన్న పసుపు కుంకుమ పెట్టిన పళ్ళాన్ని ఎగిరి తన్నాలన్నంత కోపమొచ్చింది

సైకో ఫీలింగ్స్‌. ఇష్టం లేకపోతే నచ్చిన మతంలోకి వెళ్ళాలి. ఒక మతం పేరుతో ఇష్టం వచ్చినట్టు చెత్త నెగిటివ్‌ మాటలు ఇంజెక్ట్‌ చేయకూడదు. ఏరు దాటగానే తెప్ప తగలేసినట్లు ఏ మతం అయితే భారతదేశం పేరు గొప్పతనానికి చిహ్నమో దానిని కోట్ల మంది వందల సంవత్సరాలుగా పాటిస్తున్నారు. ణఱర్‌బతీపవస…

– మోహన్‌బాబు, ఇ-మెయిల్‌

……………

భూమిక సంపాదకులకు,

వనజగారి యుద్ధం చేసితినీ అలసితినీ చూసి సిగ్గు పడ్డాను ఓ క్షణం.

ఆవిడ వేదన ప్రతి అక్షరంలో లిఖించలేని, రాయడం రాని అమ్మకు రూపం కాదా? ఇక్కడ వనజగారు అద్దంలో మన బొమ్మే కదా… ముంజేతి కంకణానికి అద్దమెందుకు? ఇక్కడ పోరాటంలో కాన్సర్‌తో ఓటమి కంటే ఇక్కడి అలసటకి బాధగా ఉంది … ఈ కాన్సర్‌కి మందు లేదా? దేనిలోకి మన పిల్లలను లాగుతున్నారు… ఎక్కడో ఉన్న వాళ్ళని వదిలితే ఇక్కడి పసిపిల్లలూ ఇదే వేదనలో… నాతో నడిచే ఉన్నత విద్య, ఉన్నత పదవుల్లో ఉన్నవారు మూర్ఖపు జాడ్యాల్లో ఉండీ దేముడున్నాడు అని నమ్మితే ఇది ఎందుకు వర్తించదు? అనేవారు ఉన్నారు. పిచ్చి సినిమాలకై టీవీలో చర్చించేవారికి ఇది బాధ్యత కాదా?

బలమైన మీడియాలో చర్చలు కొంతమేరకైనా మార్పుకు తోడ్పడతాయి. ఒక్క మనసు మారినా అదో తరాన్ని మారుస్తుంది.

వనజగారు యుద్ధంలో మీరు కాదండి ఓడింది… స్త్రీని మాత్రం గొప్ప సంస్కృతి పేరుతో బలిచేసిన పెద్దోళ్ళు అనే మన చిన్న మనసున్నోళ్ళు… మన తాతలు, నాన్నలు… ఇంకెవరెవరో… వాళ్ళ క్యాన్సర్‌కి మందు కనిపెట్టాలి… నిజం.

– రిషిత, ఇ-మెయిల్‌

……………

 

డియర్‌ భూమిక ఎడిటర్‌,

వాడ్రేవు చినవీరభద్రుడు – పొయట్రీ (2010) చదివి నయనం చెమ్మగిల్లింది. మీజా దృశ్య రూపంలో కనబడింది. చామంతి పువ్వు కవిత కూడా చాలా బాగుంది. ధన్యవాదాలు సర్‌!

ఆవేదనలో నుండి ఆవేశంగా ప్రశ్నించే దశకి వచ్చేసాం సత్యవతిగారూ… మూర్ఖత్వపు ఛాయల నీడ నుండి బయటపడి వెలుగులోకి వచ్చే కాలం వచ్చేసింది.

– వనజ తాతినేని, ఇ-మెయిల్‌

 

 

 

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.