బంజార ఆడపడుచుల సంప్రదాయ వేడుక తీజ్‌ పండుగ -డా|| జి.వెంకటలాల్‌

పరిచయం: గిరిజన తెగలలో ప్రధానమైన తెగ బంజార. ఈ బంజారులు జరుపుకునే వేడుకల్లో ఈ తీజ్‌ పండుగ ప్రధానమైనది మరియు ప్రత్యేకమైనది. ప్రపంచీకరణలో భాగంగా పాశ్చాత్య పోకడలతో అనాదిగా వస్తున్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వేషధారణలు మరుగున పడుతున్నప్పటికీ బంజారులు మాత్రం ప్రతి ఏటా తీజ్‌ పండుగను జరుపుకుంటూ వాటిని కాపాడుకుంటున్నారు. ఆషాఢ మాసం చివరి వారం నుంచి శ్రావణ మాసం రెండో వారం వరకు తండాల్లో తీజ్‌ పండుగ కోలాహలం

ఉంటుంది. పెళ్ళికాని యువతులు తొమ్మిది రోజుల పాటు సేవాలాల్‌ మహారాజ్‌, దండి మేరామయాడీలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. యువతీ, యువకుల మధ్య జరిగే తీయని అనుబంధాల వేడుకకు తీజ్‌ పండుగ ప్రతీకగా నిలుస్తుంది. తండావాసులు సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, మంచి భర్త రావాలని పెళ్ళి కాని యువతులు వేడుకలను జరుపుకుంటారు. సాంప్రదాయ బద్ధంగా ఏటా వర్షాకాలం ఆరంభంలో గిరిజనులు జరుపుకునే తీజ్‌ ఉత్సవాలు గిరిజన తండాల్లో ఘనంగా ప్రారంభమవుతాయి. పండుగ సందర్భంగా లంబాడి (గిరిజన) తండాలన్నీ కళకళలాడుతుంటాయి.

ముఖ్యంగా ఈ వేడుక బతుకమ్మ వేడుకను పోలి ఉంటుంది. ఈ పండుగను మొలకల పండుగ అని కూడా అంటారు. యువతులు తీజ్‌ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు వివిధరకాల పేర్లతో

ఉత్సాహంగా పండుగలో యువతీ, యువకులు, పెద్దలు పాల్గొంటారు. తీజ్‌ తొమ్మిదో రోజు ముగింపు అసలు ఘట్టం ఉంటుంది. ఆ రోజు ఉదయం తండాలోని ప్రతి ఇంటినుంచి బియ్యం పిండి, బెల్లం, నెయ్యి సేకరించి గోధుమ నారు ఉన్న ప్రాంతంలో కుల దైవాలకు నైవేద్యం పెడతారు. తండా వాసుల సమక్షంలో హోమ గుండాన్ని ఏర్పాటు చేసి నైవేద్యాన్ని దేవతలకు సమర్పిస్తారు. మేరామయాడికి యాటపోతును బలిస్తారు. ఆ తర్వాత గోధుమ నారును శిబ్బుల్లో నుంచి కొన్నింటిని తెంచి తండా పెద్దకు జేబులో పెట్టి తలపాగలో గుచ్చి ఆటలాడతారు. మిగతా నారును మగవారికి ఇస్తారు. మధ్యలో యువతులు నానబెట్టిన శనగలను రేగుముళ్ళకు గుచ్చగా యువకులు ఆ శనగలను రాలగొట్టి యువతులను ఆటపట్టిస్తారు. అనంతరం ఊరేగింపుగా బయలుదేరి సమీపంలోని చెరువుల్లో శిబ్బులను నిమజ్జనం చేయడంతో ఈ పండుగ ముగుస్తుంది.

తీజ్‌ పండుగ : తొమ్మిది రోజుల సంబరాలు, కఠోర నియమాలు, డప్పుల మోతలు, తండాంతా కేరింతలు, పెళ్ళికాని ఆడబిడ్డల ఆటపాటలు, అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళ అనుబంధాలు, బావామరదళ్ళ అల్లరి చేష్టలు, ఆ పై భక్తిభావం వీటన్నింటి మేళవింపే తీజ్‌ పండుగ.

తెలంగాణలోని ప్రతి గిరిజన తండా తీజ్‌ పండుగతో కళకళలాడుతుంది. తరతరాలుగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలుగా ఈ తీజ్‌ పండుగను లంబాడీలు ఘనంగా జరుపుతారు. ఈ పండుగ బతుకమ్మను పోలి ఉంటుంది. తీజ్‌ను ఎనిమిది రోజులపాటు పూజించి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవాలను తండాలోని పెళ్ళికాని ఆడపిల్లలే నిర్వహిస్తారు. వీరికి తండా పెద్దలు, సోదరులు సహకరిస్తారు. వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘తీజ్‌’ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా ‘తీజ్‌’గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే, తీజ్‌లో గోధుమ మొలకలను పూజించడం లంబాడీల ఆనవాయితీ.

‘మారో బాపూ బజరజ్‌ హూంసియో కనాయియో’

‘ఓరి భేటీవూన తీజ్‌ బొరాదూ కేరోయే’

పెళ్ళీడుకు వచ్చిన ఆడపిల్లలకు పెండ్లయితే వచ్చే ఏడాదికి ఇంట్లో ఉండరనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తీజ ఉత్సవాలను నిర్వహిస్తారు. పెళ్ళీడుకు వచ్చిన ఆడపిల్లల తల్లిదండ్రులు తమకంటే వయసులో పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారు. వర్షాకాలం ప్రారంభమై నాటు పూర్తయిన తర్వాత ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. సీత్లాభవాని (లంబాడీల దేవత) పూజ ముగిసిన తర్వాత తీజ్‌ను జరుపుతారు.

‘నాయక్‌ బాపూ బొరాయో తీజ్‌, బాయీరే పాలేణా!

నాయెక్‌ బాపుతి రాజీయేగి తీజ్‌, బాయీరే పాలేణా!’

ఆడపిల్లలంతా కలిసి ఇల్లిల్లు తిరిగి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఉత్సవాలు నిర్వహించడానికి అనుమతి కోసం ‘నాయక్‌’ దగ్గరికి వెళ్తారు. తండాకు పెద్ద మనిషి ‘నాయక్‌’ కాబట్టి, తండాలో ఎలాంటి శుభకార్యం జరిగినా ఆయన అనుమతి తప్పనిసరి. ఇది గిరిజన తండా కట్టుబాటు. అనుమతి పొందిన తర్వాత ఏర్పాటు పనులను మొదలుపెడతారు. ఆడపిల్లలందరూ కలిసి ఇంటింటికీ తిరిగి వేడుకల కోసం విరాళాలు సేకరిస్తారు.

‘ఘేవూలారయే తోన శారేతీ మంగాయీ

ఘేవూలారయేతో టపారే మా గోకి’

ఆ విరాళాలతో వారంలో ఒకరోజు అంగడికి వెళ్తారు. ఉత్సవాలకు కావలసిన గోధుమలు, శనగలు, ఇతరత్రా సామగ్రిని తెచ్చుకుంటారు. సాయంత్రానికి గోధుమలను నానబెట్టి, తీజ్‌లను మొలకెత్తించడానికి ఆడపిల్లలు, వారి సోదరులు బుట్ట(ఓల్డి)లను అల్లుతారు. ఇందుకోసం అడవిలో దొరికే దుసేరు తీగ (పిలోణీరే వేళ్ళీ)ను వాడుతారు. గోధుమలను నానబెట్టే క్రమం అత్యంత పవిత్రంగా ఉండాలి. పుట్టమట్టిని తెచ్చి అందులో మేక ఎరువును కలుపుతారు. లంబాడీల దేవతలు దండియాడి (తొళ్జాభవాని), సేవాభాయా, సీత్లాభవాని పేర్లతో ‘దుసేరు తీగ’తో తయారుచేసిన బుట్టలో మొదటగా తండా నాయకుని చేత ఎరువు కలిపిన మట్టిని పోయిస్తారు. ఆ తర్వాత నానబెట్టిన గోధుమలు చల్లిస్తారు. ఈ తీజ్‌ ఉత్సవంలో దేవుని కోసం చేసే ప్రతి కార్యం పాటతోనే సాగుతుంది.

‘శీత్లా యాడీ బొరాయీ తీజ్‌, బాయీ తారో పాలేణా

సొనేరో డాక్ళే ఘలాన, బాయీ తారో పాలేణా’

తండాలోని ఒక్కొక్క ఆడపిల్ల ఒక్కక్క తీజ్‌ బుట్టను పెడతారు. ఆ బుట్టలన్నీ ఒకచోట ఉండేందుకు పందిరిని ఏర్పాటు చేస్తారు. ఆ పందిరిని వర్ణిస్తూ ఆడపిల్లలందరూ పాట అందుకుంటారు. ఒక్కొక్క ఆడపిల్ల తన బుట్టను గుర్తుపెట్టుకుని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆ బుట్టలపై నీళ్ళు పోయాల్సి ఉంటుంది. రోజంతో ఏ పనుల్లో ఉన్నా ఆ సమయానికి ఖచ్చితంగా తీజ్‌కు నీళ్ళు పోయాల్సిందే!

బోరడి ఝష్కేరో… బోరడి ఝష్కేరో కార్యక్రమం తీజ్‌ పండుగలోనే ఒక ప్రత్యేకమైన ఘట్టం. ‘బోరడి’ అంటే రేగుముళ్ళనీ, ‘ఝష్కేరో’ అంటే గుచ్చడమని అర్థం. నానబెట్టిన రేగుముళ్ళను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని ఈ పేరుతో పిలుస్తారు. గోధుమలను బుట్టల్లో చల్లేరోజు సాయంత్రం బోరడి ఝష్కేరోని నిర్వహిస్తారు. ఇది పూర్తి వినోదభరితం. పెళ్ళికాని ఆడపిల్లలు రేగుముళ్ళకు శనగలు గుచ్చేటపుడు వాళ్ళకు బావ వరుసవారు ముళ్ళను కదిలిస్తారు. అయినా సహనంతో ఆడపిల్లలు శనగల్ని ముళ్ళకు గుచ్చాల్సిందే. చెల్లెల్ని ఏడిపించే అన్నల్ని కూడా ఈ కార్యక్రమంలో చూడవచ్చు.

‘ఖొద ఖొదారే సేవభాయకువలో ఖోద

కువలేరో పాణి అకెలాబి భరే, సకేలాభీ భరే’

బంజార లంబాడీలు సేవాభాయాను తమ దైవంగా భావిస్తారు. తమ నీటి కష్టాలను తీర్చడానికి సేవాభాయా బావిని లోతుగా తవ్వించాడని బంజారాలు భావిస్తూ తీజ్‌ కోసం నీళ్ళను తెచ్చే సందర్భంలో ఆడపిల్లలు సేవాభాయాను పాటలో స్మరించుకుంటారు. సేవాభాయా తవ్వించిన బావి నుంచే నీళ్ళను తెచ్చి తీజ్‌పై చల్లుతున్నట్లుగా భావిస్తారు.

‘లాంబీ లాంబీయే లాంబడి ఎకేరియా

లార లేరియే లాంబడి ఎకేరియా’

గోధుమలు, శనగలు మొలకెత్తి గునుగుపూలలా పొడుగ్గా పెరిగి వంగాలని ఆకాంక్షిస్తారు. ఇలా పెరిగితేనే నచ్చిన జీవిత భాగస్వామి దొరుకుతాడని, తమ బతుకులు పచ్చగా ఉండి, తండా బాగుపడుతుందని వారి నమ్మకం. కాలం మంచిగా అయ్యి పంటలు బాగా పండుతాయని తండా పెద్దలు భావిస్తారు.

ఏడో రోజు జరిపే కార్యక్రమం ‘ఢమోళి’. ‘చుర్మో’ (రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానికి సమర్పించే కార్యక్రమాన్నే ఢమోళి అంటారు. ఈ రోజు మేరామా భవానికి బలి ఇవ్వడం ఆచారం. వెండితో చేసిన మేరామా భవాని విగ్రహం కానీ, రూపాయి బిళ్ళ కానీ ముందుంచి మేకపోతును బలి ఇస్తారు. దీన్నే ‘అకాడో’ అంటారు. ప్రతి ఇంటి నుంచి పావు సేరు చొప్పున బియ్యం సేకరించి పాయసం (కడావో) వండుతారు. వండిన పాయసాన్ని, బలిగా ఇచ్చిన మేక మాంసాన్ని ఇంటింటికి పంపిస్తారు. ఆ రోజు తీజ్‌ వద్ద ఆటపాటలతో తండావాసులంతా ఆనందంగా గడుపుతారు.

ఎనిమిదో రోజు తమ బంజారా ఆరాధ్య దేవతల ప్రతిరూపాలను మట్టితో చేసి పూజిస్తారు. వారికి పెళ్ళి చేస్తారు. అబ్బాయి (డోక్రా), అమ్మాయి (డోక్రి) ప్రతిరూపాలను మట్టితో చేసి ఆరాధిస్తారు. పెళ్ళి కాని ఆడపిల్లలు తమను డోక్రీలుగా ఊహించుకుంటారు. పెళ్ళి అయితే తమ పుట్టింటిని వదిలి వెళ్ళాల్సి వస్తుందని దుఃఖంతో ఏడుస్తారు. వారిని ఓదార్చుతూ సోదరులు, ఆటపట్టిస్తూ బావ వరుసవారు, ఇలా కొంచెం దుఃఖం, కొంచెం ఆనందంతో కొనసాగుతుంది.

తొమ్మిదవ రోజును బంజారాలు ఘనంగా జరుపుకుంటారు. తీజ్‌ నిమజ్జనానికి బంధు మిత్రులందరినీ ఆహ్వానిస్తారు. కొత్త బట్టలు వేసుకుని అత్యంత పవిత్రంగా మేరమా భవాని, సేవాభాయాకు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. డప్పు చప్పుళ్ళతో, సంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. తొమ్మిది రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆడబిడ్డలు పెంచిన తీజ్‌ను తండా నాయక్‌ పరిశీలించి ఒక్కొక్క బుట్టను ఆడపిల్లలకు అందిస్తారు. మొదటి తీజ్‌ (గోధుమ నారు)ను నాయక్‌ రుమాలులో పెట్టిన తర్వాత, ఆపదల నుంచి రక్షించాలని ఆడపిల్లలు తమ అన్నదమ్ములకు నారు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు (ఇది రాఖీ పండుగను పోలి ఉంటుంది). ఈ నారు అత్యంత పవిత్రమైందని, దీనివల్ల శుభం జరుగుతుందని వారి నమ్మకం. ఆడపిల్లలు వరుసగా తీజ్‌ బుట్టలను పట్టుకొని డప్పుల చప్పుళ్ళతో నిమజ్జనానికి బయలు దేరుతారు. నృత్యాలు, పాటలు, కేరింతలతో ఆనందభరితంగా ఈ నిమజ్జన వేడుక సాగుతుంది. చెరువు దగ్గర తీజ్‌ నిమజ్జనం ఓ అద్భుతమైన సన్నివేశం. తీజ్‌ తమను వదిలేసి వెళ్ళిపోతుందనే దుఃఖంతో ఆడపిల్లలు ఏడుస్తుంటే పెద్దలు, సోదరులు వారిని ఊరడిస్తుంటారు. జీవితాంతం నీకు నీడగా ఉంటూ రక్షిస్తానని చెల్లెల్ని పీటపై నిల్చోబెట్టి కాళ్ళను కడిగి పాదాభివందనం చేస్తాడు అన్నయ్య. ఆ తర్వాత తీజ్‌ను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇది ఒక అరుదైన పుస్తకం. సాధారణంగా ఎవరూ స్పృశించటానికి సాహసించని అంశాలలో ఒకటైన వేశ్యలకు సంబంధించిన విషయాన్ని తీసుకుని ఇటు భారతీయ సాహిత్యంలోను, అటు పాశ్చాత్య సాహిత్యంలోను ఆ అంశానికి సంబంధించిన ప్రస్తావనల గురించి విస్తారంగా చర్చించిన రచన ఇది. రచయిత డా|| పి.రమేష్‌ నారాయణ ఎరుపు వేశ్యావృత్తికి, ఆకాశం విషయ వ్యాప్తికి సంకేతాలుగా స్వీకరించి ఈ పుస్తకానికి ఎర్రని ఆకాశం అనే పేరు పెట్టడం ఔచిత్యంగా ఉంది.

ఆర్ష భారతీయ సంస్కృతికి మూలాలైన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వైదిక సాహిత్యంలో ముఖ్యమైన ఆపస్తంబన సూత్రాలు, యాజ్ఞవల్క్య స్మృతి, సంవర్త, శంఖ, మనుస్మృతులు, బోధాయన ధర్మశాస్త్రం, మహా కావ్యాలలో వివాహేతర సంబంధాలు, లైంగిక సంబంధాలు, స్త్రీ పురుషుల కామవికారాలు, బహుభార్యాత్వం, వేశ్యాధోరణులకు ఈ పుస్తకంలో

ఉదాహరణలు లభిస్తాయి.

నాట్యశాస్త్రంలోను, వాత్స్యాయన కామసూత్రాల్లోను, సురవరం ప్రతాపరెడ్డిగారి ఆంధ్రుల సాంఘిక చరిత్రలోను ప్రస్తావించబడిన వేశ్యా సంస్కృతికి చెందిన విషయాలను ఇందులో చర్చించారు. తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగంలో వెలువడిన ప్రసిద్ధ కావ్యాలలో, ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలైన కథలు, నవలలు, నాటకాలు, కవితలు, వ్యాసాలలో, వేశ్యా ప్రసక్తిని ఈ పుస్తకం తడిమింది. తెలుగు స్త్రీ వాద సాహిత్యంలో అక్రమ లైంగిక సంబంధాలు, వ్యభిచార ధోరణులు, వేశ్యావృత్తి వంటి అంశాలు భిన్న కోణాల్లో చిత్రించిన నవలలు, కథలు, కవితలు మొదలైనవాటిని ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఇతర భారతీయ భాషలైన మరాఠీ, గుజరాతీ, హిందీ, ఉర్దూ, అస్సామీ, తమిళ, కన్నడ, బెంగాలీ, మళయాళ సాహిత్యాలలో వేశ్యా ప్రసక్తిని మనకు పరిచయం చేస్తుంది. ప్రపంచ సాహిత్యాలలో ఆంగ్ల సాహిత్యం, ఫ్రెంచి సాహిత్యాలలోని వేశ్యలకు సంబంధించిన ప్రస్తావనలను మనకు వివరిస్తుంది. చిత్ర కళా రంగంలోను, భారతీయ, ప్రపంచ చలనచిత్ర రంగాలలోను వ్యభిచార ధోరణులకు సంబంధించిన వివరాలున్నాయి.

కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షంలో వేశ్యా సంబంధమైన ఒక బూతు పదం ఉందని రచయిత అంటారు. ఈ పుస్తకంలో ఆ బూతు పదం మినహా వేశ్యలకు సంబంధించిన రూపజీవి, వారాంగన, పణ్యాంగన, వ్యభిచారిని, వారస్త్రీ, వారవనిత, వారమణి, వేశ్య, శ్యాలభంజిక, నర్మవీధికా, గణిక, భంజిష్ట, బర్బర, మందహాసిని, బోగముది, సాని, కులట, దేవదాసి, బసివిని, మాతమ్మ, జోగిని, దాసి, రూపదాసి, స్వైరిణి వంటి అనేక పేర్లు పేర్కొన్నారు.

ఈ వేశ్యలలో పండిత కవయిత్రులుగా ప్రసిద్ధి చెందిన రంగరాజమ్మ, రామభద్రాంబ, మధురవాణి (కన్యాశుల్కంలోని పాత్ర కాదు), ముద్దుపళని మొదలైనవారు ఉన్నారు. సాహిత్య రచనలలో పింగళ, వసంతసేన, ఆమ్రపాలి, వాసవదత్త, మధురవాణి, నానా, కామిల్‌, చింతామణి, థాయిస్‌, బాదమ్మ, రామి, విద్యావతి, టెస్‌, ఊన్‌ లీ, రత్నావళి, ఎమిలి, నతాషా మొదలైన ప్రసిద్ధి చెందిన వేశ్య పాత్రలున్నాయి.

ఈ రచనకు రచయిత ఉపయోగించుకున్న గ్రంథాలను, రచయితలను గమనిస్తే ఇక ఈ అంశంపై ఈ గ్రంథంలో ప్రస్తావనకు రాని విషయం అంటూ ఏమీ మిగిలి ఉండదని అనిపిస్తుంది.

భారతీయ కథా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన పంచతంత్ర కథలు అరబిక్‌ భాషలో కలీలా వ దిమ్నా (ఖaశ్రీఱశ్రీa షa సఱఎఅaష్ట్ర) అంటూ అనువదించబడి, అరబ్బుల ద్వారా ఐరోపా ఖండంలో ప్రవేశించి ఈసోప్‌ కథలకు (ూవరశీజూ టaపశ్రీవర) మూలాధారమైనదని ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది. దిగంబర కవిత్వం మూడవ సంకలనం యశోద అనే వేశ్య చేత ఆవిష్కరింపబడిన విషయం కూడా ఈ పుస్తకంలో ఉంది. రచయిత లోతైన పరిశోధనకు ఇవి తార్కాణాలు.

వేశ్య అంటే వైశికీకళలో నిష్ణాతులైనట్టి స్త్రీ అని అర్థం. వైశికీకళ వాత్స్యాయన కామసూత్రాలలో వివరించబడిన ఒక ప్రత్యేక అంశం అంటూ రచయిత పేర్కొంటూ అదే పేరా చివరలో ‘ఇలాంటి ప్రత్యేకమైన శాస్త్ర పరిజ్ఞానం ప్రాచీన కాలంలో వేశ్యలకు విశేషంగా ఉండడం వలన ఈ కళ వైశికీ కళగా ప్రసిద్ధి చెందింది’ అంటారు. అంటే వైశికీ కళ నుండి వేశ్య అనే పదం పుట్టిందా? లేక వేశ్య నుండి వైశికీకళ అనేది ఉద్భవించిందా? అని పాఠకులకు సందేహం వస్తుంది.

ఈ పుస్తకం వెల 200 రూపాయలు, కావలసిన వారు డా||పి.రమేష్‌ నారాయణ, విశ్రాంత ప్రధానాచార్యులు, 13-2-172, రామచంద్రనగర్‌, అనంతపురము-515001, ఆం.ప్ర. అనే చిరునామాకు వ్రాసి తెప్పించుకోవచ్చు.

రచయిత పుస్తకం చివరిలో వ్రాసిన ఈ క్రింది వాక్యాలతో నా ఈ పరిచయ వ్యాసం ముగిస్తాను.

ఈ నేపథ్యంలో వెలువడిన సాహిత్యం సైతం స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను, వివక్ష ధోరణులను ప్రతిఫలించే రచనలుగా ఉన్నప్పటికీ సమాజంలో ఒక ప్రధానమైన అంతర్భాగంగా ఉంటున్న వేశ్యారంగంపై మాత్రం ప్రభావశీలకమైన ప్రతిస్పందన పూర్తిస్థాయిలో వ్యక్తపరచకపోవడం ఒక విచారించదగ్గ అంశంగా ఉండిపోయింది. ఇలాంటి అంశాలను తీసుకుని సంఘసంస్కరణ వాదులు, స్వచ్ఛంద సేవాసంస్థలు, అన్ని రంగాలలో స్త్రీల ఉన్నతికి కృషి చేసేవారు సెక్స్‌ వర్కర్లకు సమాజంలో గౌరవనీయ స్థానం కలిగించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. తరతరాల సాంస్కృతిక వ్యవస్థలో స్త్రీ జాతిలో తమదైన విశిష్టతను ప్రత్యేకంగా రూపొందించుకుని చిరకాలంగా మనుగడ కొనసాగించిన వేశ్యాసంస్కృతికి సభ్య సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని రూపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

 

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో