కరుణ కాదు – కర్తవ్యం ముఖ్యం

-డా. మానేపల్లి

స్త్రీలు ఇంటా బయటా కష్టాలనెదుర్కొని, అభివృద్ధి సాధించి, ఇతరులకు కూడా ఉపయోగపడటం చాలా కష్ట సాధ్యం. పదహారేళ్ళ వయసులో-శాశ్వత అంగవైకల్యానికి గురయి – భయంకర బాధలు అనుభవించి, తట్టుకుని నిలబడినా, చివరికి నడుం కిందభాగం అంతా నిరుపయోగం కావడం- ఇక ఎప్పటికీ చక్రాల కుర్చీలో గడపవలసి రావడం- ఊహించడానికే బాధగా, భయంగా వుంటుంది. అంత జరిగినా సంకల్ప బలంతో, పట్టుదలతో కృషి – తనవంటి వికలాంగుల కోసం ఒక సంస్థ ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తుండటం చాలా అరుదయిన విషయం.

నసీమా హుర్జుక్ మరాఠీ ముస్లిం వనిత. 16 ఏళ్ళ వయసులో విపరీతంగా వీపులో నొప్పి-లెక్కచెయ్యకుండా కళాశాల కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆస్పత్రిలో చేరడం, వెన్నెముకకు సంబంధించిన వ్యాధి అని నిపుణులు చెప్పడం- ఇలా ప్రారంభిస్తుంది నసీమా తన కథ.

ప్రతి పేజీలో చలించిపోతాము. ప్రారంభమే- ఐదారేళ్ళ అవినాష్‌తో ప్రారంభమౌతుంది. చక్కగా పాడతాడు. రెండు చేతులూ లేవు గనుక-అన్నీ కాళ్ళతోనే చేస్తాడు. కరుణ,దయ చాలదు. అటువంటి వారికి ఏం చెయ్యగలం? ఎంతో ఆనందంగా గడిచే నసీమా విద్యార్థి జీవితం- మరణం తప్ప మరొక గత్యంతరం లేదన్నంత దుర్భరంగా మారిపోతుంది. నడుము దిగువ- అంతా కురుపులు-చీమలు, చదువుతుంటేనే వళ్ళు జలదరిస్తుంది. ఎంత మొండి సంకల్ప బలం కావాలి… తగిన సహకారం లభించడం కూడా చెప్పుకోదగిన విషయం.

మొట్టమొదట దృక్పధంలో మార్పు రావాలి. అంకితభావంతో కాదు- ఇది మన సామాజిక బాధ్యత, కర్తవ్యం అనే భావంతో వారికోసం పనిచెయ్యాలి. సేవ కాదు- కర్తవ్యం!

నసీమా చక్రాల కుర్చీతో క్రీడల్లో పాల్గొంటుంది. అరుదైన అవకాశం వచ్చి ఇంగ్లండ్ వెళ్తుంది.

“విమానం దిగగానే ఆ ప్రదేశం సౌందర్యాన్ని, స్వచ్ఛతను చూసి మనస్సు చెదిరిపోయినా, చరిత్ర గుర్తుకు వచ్చి వీళ్ళే కదా భారతదేశాన్ని 150 సంవత్సరాలు బానిస దేశంగా చేశారని మనస్సు ఒక విధమైన ఒత్తిడికి గురయ్యింది” (పే.38). ఇదీ నసీమా దృక్పధం.

హెలెన్ కెల్లర్ గురించి గుర్తు చేస్తుంది నసీమా. తరువాత మరొకరి గురించి.

“హెన్రీ విస్కోర్డ్‌కి రెండు కాళ్ళు లేవు. ఆమెరికాలో వికలాంగుల కోసం కార్ఖానా స్థాపించారు. అక్కడ పనిచేసే వాళ్ళంతా పడుకొని పనిచేస్తారు…”(పే. 44). ఇలాంటివి చదవదగిన అంశాలెన్నో ఉన్నాయి.

కుటుంబ జీవితం, వారి ప్రేమాదరాలు… బాబూ కాక మరణం ఒక విషాద సంఘటన (పే.60, 61) విజయ మర్చంట్ వంటి అరుదైన వ్యక్తుల పరిచయం వల్ల నసీమా ఎంతో సాంత్వన పొందింది. ఐతే అక్కడితో ఆగిపోలేదు. ఉద్యోగం చేసింది. ఎందరెందరికో సహాయం చేసింది.

“హెల్పర్స్ ఆఫ్ ది హాండికాప్డ్” (వికలాంగుల సహాయ సంస్థ) స్థాపన, నిధులు సమకూర్చుకోవడం, ఇబ్బందుల నెదుర్కోవడం – ఇవన్నీ చదవడం ఒక గొప్ప అనుభవం, ఎటువంటి సంస్థ నిర్వహించే వారికయినా ఇవి గుణపాఠాలే. దారిలో ఎన్నెన్నో దయనీయ గాధలు… దేశ్ భ్రాతార్ ఒక అరుదయిన వ్యక్తి. వికలాంగులైన యువతీ యువకుల పెళ్ళిళ్ళ సమస్య- కొందరు బాగా పెడసరంగా ప్రవర్తిస్తుంటారు. అంగవికలురిపై సానుభూతి పోతుందొకోసారి. వాళ్ళ పనులమీద- కొల్హాపూర్ నుంచి బొంబాయి, ఢిల్లీ, కలకత్తా ప్రయాణాలు- సహాయకులతో సమస్యలు – సహాయకులు లేకుండానే కొన్ని పనులు చేసుకోవడం – విచిత్రంగా నసీమాకు కొన్ని పెళ్ళి ప్రతిపాదనలు – ఆమె తిరస్కరిస్తుంది.

ప్రకాష్ అనే పిల్లవాడి మరణం – పుస్తకం పూర్తి చేసిన చాలా రోజుల వరకూ మనల్ని వదలదు.

మహమ్మద్ అనే కుర్రవాడు- మూడవ క్లాసు- రెండు చేతులూ లేవు – కాళ్ళతో అన్నం తినటం చూసి – అవిశ్రాంతంగా పనిచేసి ఒక కృత్రిమ చెయ్యిని తయారు చేస్తాడు శైలేంద్ర అనే ఆయన! అందుకే మరోసారి చెప్పుకోవాలి- కరుణ చాలదు- కర్తవ్య పరాయణత కావాలి!

వికలాంగుల తరఫున నసీమా మాటలు వినాలి, ఆలోచించాలి.

“వికలాంగులకోసం ప్రత్యేక స్కూళ్ళు తెరవాలనుకుంటున్నారు! ఎందువల్ల? మా శరీరాల్లాగే మా మెదళ్ళు కూడా వంకరయ్యాయా? చలన రహితమయ్యాయా? అందరి లాగే సాధారణ తెలివితేటలున్నప్పుడు మమ్మల్నెందుకు వేరు చెయ్యాలనుకుంటున్నారు? ఒకవేళ అలాంటి స్కూళ్ళే తెరిస్తే అది సమాజానికొక కళంకమవుతుంది తప్ప, గర్వించదగ్గ విషయమయితే కాదు. ప్రతి స్కూల్లో వికలాంగుల కవసరమైన సౌకర్యాలు కల్పించి తీరాలి. వికలాంగులకు కూడా విద్యనార్జించే హక్కు వుందని అనుకొని, వారి శరీరాల్లోని వికలత్వం వైపు చూడకుండా వారి తెలివితేటలకే ప్రాముఖ్యమిచ్చి, వారికోసం కూడా విద్యా సంస్థలు తలుపు తెరిచి తీరాలి’ (పే.204)

కొల్హాపూర్ దినపత్రిక “సకాళ్” కోసం రాసిన వ్యాస పరంపర – 1999 లో “చక్రాల కుర్చీ” పేరుతో వచ్చింది. అది ఇవ్వాళ తెలుగు అనువాదంలో లభిస్తున్నది. తెలుగు చేసిన రాధామూర్తిగారు, ప్రచురించిన హైదరాబాద్ బుక్ ట్రస్టువారు అభినందనీయులు.

చదవదగిన పుస్తకం కాదు – చదివించ దగిన పుస్తకం. ఆచరణకు కరదీపికగా చేసుకొనవలసిన పుస్తకం.

(చక్రాల కుర్చీ. మరాఠీ మూలం: నసీమా హుర్జుక్ తెలుగుః రాధామూర్తి, హైదరాబాద్ బుక్ ట్రస్టు, గుడిమల్కాపూర్, హైదరాబాద్ – 67. పే. 8+222, రూ.60)

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో