నీలాటి రేవు

స్థానాపతి రుక్మిణమ్మ
మగవాళ్ళందరూ పడుకోవడం తడవుగా హరికథకంట రాత్రి పదిగంటల య్యాక పోయి-వంటిగంటా, రెండు గంటలకి ఇంటికి వస్తూవుంటే ఏతల్లి సహిస్తూ ఊరుకుంటుందే లక్ష్మీ!”
”శాంతమ్మ నిజంగా శాంతమ్మ కాబట్టి దాని ఆటలు సాగుతున్నాయి. నాలాంటిదైతే చావగొట్టి-చంపి ఉప్పుపాతర వేయించి వుండే దేమనుకున్నావో కాని.”
”ఆ మొగుడు ముండాకొడుకు దాన్ని పుట్టింట ఇన్నాళ్లుంచి ఊరుకోవడమేమిటే? వాడికి వేమయినా తెలుసా అంటా?”
”వాడేమి చేస్తాడు. దాని పాదాలికి ఒక్క దణ్ణం పెట్టి మరీ ఊరుకున్నాడనుకోవాలి. వాడింటిదగ్గర కరణంతో- అది జరిపిన హంగామా అంతా విన్నాడు. దాని గయ్యళి తనానికి నోరు మూసుకుని మారు మాట్లాడలేక వాణ్ణింటికి రావద్దన్నాట్టు. ఆ మాటకా కరణం రెండు రోజులు వీడితో మాటాడడం మానేసి మూడో నాడు మళ్ళీ సిద్ధమయ్యాట్ట.”
”ఎంచేత వాడలా చేస్తున్నాడంటావు? వాడికేదో కరణంగాడివల్ల లాభం వుండి వుండాలి.”
”ఆ కరణంగాడు వఠి తుంటరి. వాడి తుంటరితనాన్ని భరించలేక- తల్లిదండ్రులు వాణ్ణింట్లోంచి తగిలేశారు. వాడు వీళ్లింటి దగ్గర మకాం పెట్టాడు. వాడు రైతుల్ని కొట్టి తెచ్చినదంతా వీళ్లింట్లో పడేస్తున్నాడు. దీని మొగుడికి ఆ వూళ్లో ఒక్క సొట్టకానీ అయినా అప్పు పుట్టదు. కానీ కావాలంటే వీడికి కరణమే శరణం. వాడి మూలంగా ఇంటి పైఖర్చు వెళ్లిపోతూవుంది. వాడికేం నొప్పా? మొగుడు తెచ్చింది దీని మొగంమెరుగులకే వాలదు. వాడు తెచ్చిన డబ్బెందుకూ చాలనట్టు పద్దేసి చూపించిందట! ఆ పిచ్చిముండావాడు దాని మాటే నమ్ముతాడు. ఇద్దరి కెంత కావాలన్న జ్ఞానం వాడికి లేదు. వాడికి చదువా సంధ్యా – ఏమీ లేదు. వట్టి శుంఠ. తద్దినంపొత్తర్లకే పనికివస్తాడు. అన్నట్టీ మధ్య క్రాపింగు పెట్టుకుని షోకు డవయిస్తూ వుంటే వూళ్లోవాళ్లా పొత్తర్లకికూడా రావద్దన్నారు. ఇంకెలా బ్రతుకుతున్నాడో ఆలోచించుకో.”
”అందుకా-అది-ఆడిందాటా-పాడింది పాటగానూ వుంది. అంత తెగించిన ఆడదాన్నీ – మొగాణ్ణీ కూడా ఎవ్వరూ ఏమీ చేయలేదు.”
”ఓ సంగతి చెపుతాను విను- మొన్న దాని వమ్మ తన కూతురు వెంగమ్మతో ఏమిటో చెపుతూ వుంది. అప్పుడు నేనూ అక్కడ ఉన్నాను. ఆవిడ చెపుతూవున్న సంగతి దీనికి సంబంధించింది కానేకాదు. ఏదో దాని సంగతే అనుకుంది కామొసు- చర్రున ఎక్కణ్ణుంచో వచ్చి- ఏమిటే ముసలిముండా! తెగపేలుత వున్నా వంట తాడిచెట్టులా లేచింది. ఇంకేం చెప్పమన్నావు- దాని రౌతుతనం! మొగాళ్ళెందరో అక్కడ పడుకుని ఉన్నారు. ఓ మూల తల్లి ఊరుకోమంటూనే వుంది. అయినా ఊరుకుంటేనా. అప్పుడంద రం కలిసి దాని నోరు మూసేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇలాంటి ఆడదాన్నెక్క డా చూడలేదు. నేరాలు చేసేవాళ్ళ నోరలా వుంటుంది కాబోలు. లేకపోతే వాళ్ళదినం ఎలా తెల్లారుతుంది?”
”ఆ ముసలమ్మూరుకుందా?”
”అర్థం పర్థం లేకుండా అది అలా లేస్తే- ఊరుకోక ఏమి చేస్తుంది! పయిగా కొడుతుందేవెనని హడలెత్తిపోయింది.”
”సరి సరి. అది కూడానా.”
”గభాల్ను ఆ అక్కుపక్షి మీద ఆ పిడక చేతులు పడితే ఏమౌతుంది చెప్పూ!”
”ఏమే రామి! లచ్చీ! ఏమిటే చెప్పు కుంటున్నారు?”
”అబ్బే ఏమీ లేదే వీరం!”
”ఆఁ- ఎదో మాటాడుకుంటున్నారు. నన్ను చూసి మానేశారు. ఆ రహస్యం చెప్పరా?”
”నిజంగా నీతోడు. ఏమీ చెప్పుకోవడం లేదు. నమ్మువనమాట. ఏమీ మాట్లాడు కున్నాం మామూలు లోకాభిరామాయణమే. నువ్వేమిటో చెప్పడానికి వచ్చినట్టున్నావ్‌? మీ అత్తగారు వండుతున్నారా నీళ్ళ కింత ఆలస్యంగా వచ్చావ్‌?”
”ఆఁ- పోనీలేస్తురు. మీరన్నీ నాదగ్గర లాగడమే కాని మీ గుట్టు మట్టులేమీ నాతో చెప్పరు. నాకు తెలిసన సంగతులు నేను మాత్రం మీ కెందుకు చెప్పాలి?”
”అయ్యె! చెప్పకు దాచుకో. చెప్ప వలసిందయితే చెప్పు వింటాం వినకూడని మాటయితే చెప్పకు మేమూ వినం.”
”అంత వినరాని మాటేమీ కాదు లెండి.”
”అయితే నువ్వు చెప్పావచ్చు- మేము వినావచ్చు.”
”శ్రీపతి వారి పెద్దవ్మయి జయశ్రీని మీరెరుగుదురా?”
”ఆఁ- ఎరక్కేం, బాగా ఎరుగుదుం.”
”జయశ్రీ అందచందాలకు గాని, గుణగణాలకు గాని, విద్యావినయలకు గాని, నీతినియామాలకు గాని, క్షమాశీలాదు లకు గాని పేరుకు తగిన మనిషి. అంతే కాదు- దాని సంతానంకూడా అలాంటిదే. రామీ! నువ్వు కూడా దాన్నెరుగుదువా?”
”బాగుందేవ్‌. ఎరుగుదువా అని నెమ్మదిగా అంటున్నావు. అదీ నేనూ ఫష్టుఫారందాకా స్కూల్లో చదువుకున్నాం. అది ఆ తర్వాత స్కూలు మానేసి సంస్కృత కావ్యాలూ, నాటకాలూ వగైరా చదువుకుని ప్రయివేటుగా ఉభయభాషాప్రవీణ, విద్వాన్‌ పరీక్షలకు వెళ్ళింది. నేనాపట్టున స్కూలు ఫనలుదాకా చదివాను.”
”ఇహ నేం! మీరిద్దరూ బాగా దాన్నెరు గుదురన్నమాటే.”
”అన్నమాటేమిటి అన్నమాటా, తమ్ముడు మాటాను. బాగా తెలుసునని చెప్పుతున్నాంగా.”
”వీరం! చిన్నప్పటినుంచీ మాకు తెలుసునమ్మా!”
”దాని అత్తవారిది చెన్నపట్నం.”
”అవును.”
”అయితే?”
”వినండి మరి- వాళ్ల పట్నంలో ఆ మధ్య బాంబులు పడ్డాయి. ఆ భయంవల్ల పట్నమంతా కాళీ అయిపోయింది. వీళ్ళ ఇరుగూ పొరుగూ కూడా రాత్రికి రాత్రి కాళీ చేసి వెళ్లిపోయారు. అంతవరకూ వీళ్లక్కడే ఉన్నారు. ఇంకక్కడ పిలిస్తే పలికేవాళ్ళు కరువయిపోయరు. ఇంకాయింట్లో వుండ లేకపోయరు. ఆ వెంటనే తగుమాత్రం సామాను పట్టుకుని ఇక్కడికి వచ్చేశారు.జనం లేని అరణ్యంలోనైనా వుండొచ్చు గాని జనం ఉండి లేచిపోయిన గ్రామంలో గాని పట్నంలో గాని ఉండలేం బాబూ!”
”అయితే వాళ్లిప్పుడెక్కడున్నారు?”
”ఆని చిన్నాన్నింట్లోనైనా ఉండకుండా అగ్రహారంలో ఉంటున్నారు.”
”వాళ్లపొలం దాని మేనవమా కవులుకు చేస్తున్నాడు కామొసు? వాళ్లింట్లో నేనా ఉండకుండా పైనెందుకున్నారో?”
”రాగానే కొన్నాళ్లు వాళ్లింట్లోనే ఉన్నారు. వాళ్ళ భూమి పాతికయకరాల దాని మామచేతిలోనే ఉంది. అసలు భూమిపరిమితియెంతో – దానిమీద ఏమి వస్తుందో- ముప్పయియేళ్ళు దానికున్నా – ఇంతవరకూ దానికి తెలియదు. భూమిమీద వచ్చేదంతా వాడే తినేస్తున్నాడు. భూమిశిస్తు ఎర్రని ఏగాని వీళ్ళకు తెలియదు. పట్నంలో జీతంమీదే వాళ్ళు జీవిస్తున్నారు. ఇక్కడికి వచ్చికూడా అంతే. పొలంలోని పూతిక పుడకయినా వాళ్లెరగరు. ఒకనాడు జయశ్రీ- ‘మామయ్య! మా పొలంలో కందులు పండాయట! మాకెక్కడా కందులు దొరకటం లేదు. కొనుక్కుంటాం ఏమయినా ఇస్తావా?’ అంది. ఆపళంగా ఇల్లు కాళీచేసి పొమ్మన్నారు. కందులడిగితే వచ్చిన ఫలం ఇది. వాళ్లింట్లో అడుగుపెట్టింది లగాయితు దాని కర్చులు అది చేసుకుంటూ, ఇంటికి అద్దె ఇస్తూ కాలక్షేపం చేస్తూవుంది. పొరపాటుగానయినా వాళ్ళింటూ విస్తర వేయలేదేమనుకున్నారో! పట్నంనుండి మొగుడు పంపే డబ్బుతో సంసారం ఈడుస్తూ వుంది.”
”అయ్యె! అయ్యె!! ఎంత దారుణం! పిల్లలతో అంత బాధపడుత ఉందా!”
”ఆ వచ్చే జీతపురాళ్ళతో ఇల్లు గడుపుకుంటను, పిల్లలకు చదువుసంధ్యలు చెప్పించుకుంటాను- సంతోషంగా కథల కార్యాల జరుపుకుంటాను కాలాన్ని తోసుకు వస్తూవుంది. రేపో మాపో వాళ్ళ భూమి వాళ్ళెలాగా లాక్కుంటారిందాక వచ్చాక మానేస్తారా యేమిటి? ఊళ్ళో పెద్ద మనుష్యులు లేరా! కాని తగువులు తెల్లారేదాకా బాధపడాలి కదా?”
”ఆఁ. తప్పకుండా పడాలి. ఇలాంటి సంగతులు అనుభవించిన వాళ్ళకీ, ఆలోచించినవాళ్ళకీ తెలుస్తాయి. ఆ ఇతర్లకి తెలియవు. పోనీ గరిక తినే గాడిద చెడుతుంది కాని గరిక చెడుతుందా? వినాశ కాలానికి విపరీత బుద్ధులు. భూమి వాడెన్నాళ్ళనుభవిస్తాడు? అయితే ఆపదలు. మంచివాళ్ళకే వస్తాయి. మొసగాళ్ళకేమీ రావు. దీనికి వాడెదో నిర్వాకం చేస్తాడని భూమి పుట్రా వాడిచేతిలో పెట్టారు పెద్దలు. వాడీవిధంగా తయారయ్యాడు.”
”అది అలా జరగ్గా మరో వింత జరిగింది. మొన్న వాడింట కార్యమెదో జరిగితే అందుకు దీన్ని కూడా పిలిచారు వెళ్లింది. ఆయన కూతుళ్లు భద్రప్పా రుద్రప్పా అంతముందే వచ్చారు. అప్పుడందులో భద్రప్ప ‘ఓసీ! ఇన్నాళ్ళయి మాయింట పడి తెగతిని- ఇప్పుడు భూమి లెక్కలు వేయడం, కందు లిమ్మనడం చేస్తున్నావా? ఇంట్లో తిని ఇంటివాసాలు లెక్కలెడుతున్నావే. సిగ్గు లేదే నీకు?’ అంటూ వళ్ళు హూనమయేటట్టు కాళ్ళా వేళ్ళా శ్రీని కుమ్మి పారేసింది. చూడు వాళ్ళ ఒఫయిత్యం ఎలావుందో! పాపం ఆ సుకుమారి దెబ్బలన్నీ పడిందే కాని పల్లెత్తి మాటాడలేదు.”
”ఎంత పని జరిగింది! అసలు వాళ్ళింటికి వెళ్ళడం మానేయవలసింది. అవును ఇలా జరుగుతుందని దానికి తెలుసాయేమిటి. అలా జరుగుతూ వున్నప్పుడు చూస్తూవున్న వాళ్లెవరూ దాన్నడ్డు కోలేదా? అడ్డుకుంటే దానికి దెబ్బలెలా తగుల్తాయి?”
”ఈరోజుల్లో ఇలాగే అన్నీ జరుగుతున్నాయి. ఊఁ- అంటే- తప్పు- ఆఁ- అంటే అపరాధంగాన ఉంది. తప్పుదారి త్రొక్కేవాళ్ళని తప్పు కాదా? అంటే తప్పు. పాపం దానికి గట్టిదెబ్బలు తగిలాయి కాబోలు. వెళ్ళి చూడాలి.”
”పైకి దెబ్బలేమీ కనిపించడం లేదు కాని- ఒళ్ళంతా నలిగిపోయింది.”
”మొగుడిక్కడే ఉన్నాడేమొ! వెంటనే ఇంటికి వెళ్ళి సంగతంతా చెప్పలేక పోయిందా?”
”చెపితే మాత్రం లాభమేమిటి? తెగించినవాళ్ళని అడగడానికి వెడితే కొట్టడానికి వచ్చాడంటారు. కొట్టడానికి వెడితే నరకడానికి వచ్చాడంటారు. పోనీలే అని ఊరుకుంటే వట్టి ససవ అంటారు. చస్తవుంటే పిలుస్త వున్నాడంటారు. పయిగా ప్రాణాలమీదికి తెస్తారు. చిత్రాంగిను లానాడే కాదు ఈనాడ ఉన్నారు. నిజంగా భద్రప్పా రుద్రప్పా ఈనాడు మహాచిత్రాంగిను లేమన్నా సరే.”
”ఆఁ- మువ్మటికి. పయికి ఆడది లోపల గాడిది.”
”ఇలాంటి వాళ్ళమూలంగా ఆడవాళ్ళ పరువు ప్రతిష్ఠలు పోతున్నాయి.”
”పాపం- అన్ని దెబ్బల పడి పరమ ప్రశాంతంగా ఉంది!”
”ఆలోచిస్తే ఇంటి పేరు ప్రతిష్ఠలు ఇల్లాలివి. మొగవానికి ఏ సంబంధమూ లేదు. మగవాడు పదార్థాలన్నీ తెచ్చి ఇంటపోస్తాడు. ఆ పదార్థాలు ఇల్లాలిని అనుభవిస్త ఇంట్లో ఉండమంటాడు. తాను చేసిన పున్నెంలో సంగోరు దానికి ఇస్తాడు. పరప్రసక్తి లేకుండా బ్రతకమంటాడు. ఆహారపదార్థాలు కమ్మగా చేసి, తిని తనకింత పెట్టమంటాడు. ఆడదాని కంతకంటె కావలసినదేముంది! ఇల్లు ఇల్లాలిదే కదా! ఇంతకు మించిన స్వాతంత్య్రం, స్వేచ్ఛా వేరే ఉందా? గృహరాజ్యమేల గలిగితే సామ్రాజ్యమేలడం కాదా? ఇల్లు స్వర్గంగా చేసుకుని సంతానాన్ని జ్ఞానవంతులుగానూ, శౌర్యవంతులుగానూ తయారు చేసి సంతృప్తిగా జీవించడం ఆడదాని పని.”
”ఇన్నీ జయశ్రీకి ఉన్నాయి.”
”నేను శ్రీతో- ‘జయ! స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఆడవాళ్ళకు సంపూర్ణంగా వుండాలని గగ్గోలు చేస్తున్నారేమిటి?’ అన్నాను. దాని కది- ‘రామీ! అవి మన మనోవాగ్గతాలు. నోరు మంచిదైతే ఊరంతా మంచిదే అవుతుంది. అలాగే సమస్తమూ అనుకో. కాలాన్ని బట్టి ఆర్థికస్వాతంత్య్రం కోరుతున్నారు గాని అందుకు మనం వంచి చదువు సంధ్యలు కల వాళ్లం కావాలి. అయినా – రుక్మిణికీ, దమయంతికీ, ఝాన్సీలక్ష్మీబాయ్‌కి, రుద్రాంబకీ, మల్లమ్మకీ తక్కువేమిటి? స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో వాళ్ళు బ్రతకలేదా? ఏనాటిమాటో ఎందుకూ కస్తరీబాయి సంగతి? కీర్తిప్రతిష్ఠలామెకు తక్కువా? గాంధీగారామెను గురించి- తనకు ఓర్మి నేర్పిన గురువన్నారు. గృహనిర్వ హణమూ, భర్తృసేవా ఆమె దినకృత్యాలు. అలాంటివారికి స్వాతంత్య్రాలన్నీ అరచేతిలో వుంటాయి.సంపాదించిన శ్రుతపాండిత్యంతో ఆమె ఉపన్యాసకురాలయింది. భారత జాతీయతావబోధకాలయిన ఆమె ఉపన్యాసాంశాలు దేశసౌభాగ్య సంపదుద్దీప కాలు. ఇలాంటి వారి జీవితాలు లోకాదర్శ కాలు. అయితే అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటంటే అప్పుడు దేశం మనది. ఇప్పుడ మనదే కాని- పరప్రభుత్వంక్రింద ఉంది. కాబట్టి- దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కావాలనే దీక్షతో ఆడవాళ్ళందరూ గృహపరిశ్రమల్ని విస్తారం చేయలి. విశ్రాంతి సమయలలో స్త్రీ తనకు కావలసిన వస్త్రాలు, గృహోపకరణాలు మున్నగునవి తయరు చేసుకుంటూను, స్వభాషాభ్యాసం చేస్తూను వుంటే పనికిమాలిన మాటలు వినడానికి గాని, పనికిమాలిన పనులు చేయడానికి గాని, పనికిమాలిన ఆలోచనలుకు దిగడానికి గాని అవకాశం ఉండదు. అందువల్ల ఆత్మసుఖం అసంతం. లేకుంటే- కాలం కయ్యలక్రింద ఖర్చు అవుతవుంది. స్త్రీలు కాలం విలువను బాగా గమనించాలి. కాలాన్నిబట్టి పిల్లలకు హిందీ కాని, ఇంగ్లీషు కాని చెప్పించినా మన భాషా, మన సాంప్రదాయల విధిగా వాళ్లకు నేర్పుతూ ఉండాలి. రాజకీయపరిజ్ఞానం కూడా అలవర్చుకోవాలి” అంది.
”అలాంటివిషయలు బోధిస్తూ అక్షరాలా తానాచరిస్తూ వున్నది- వాళ్ళని పల్లెత్తి మాటంటుందంటే నాకు నమ్మకం లేదు. కొందరమ్మలక్కలు- అదే మంటే వాళ్లు కొట్టారో- అని బుగ్గలు నొక్కుకునే వాళ్లున్నారు. అందు కంటున్నాను. దక్షిణాఫ్రికాలో గాంధీగారు రైలులో కూర్చుంటే- సబబు సందర్భం లేకుండా వాడెవడో దొరగాడు ఆయన్ని బండిలోంచి బరబరా ప్లాటు ఫారంమీదికి ఈడ్చేశాడట! అందువల్ల ఆయన ముఖమూ, చేతులు, కాళ్లూ చీరుకుపోయి నెత్తురుమండలాలయి పోయాయట! నిరపరాధుల్ని అలా దౌర్జన్యంగా బాధించేవారెందరో ఉన్నారు.”
”అది- పోనీలే అని ఊరుకుంటే- ‘తనదగ్గిర తప్పు ఉంది కాబట్టి అన్ని తన్నులు తిన్నదనీ- చేతకానిదనీ అనే దండుముండలున్నారు.”
”సవ్యంగా, సలక్షణంగా షట్కర్మల చేస్తూవున్న స్త్రీకి ఎలాంటి హక్కులతోనూ అవసరం లేడంది చివరికి.”
”నిజమే. ఇంటిపనులు చేసేటప్పుడు దాసిలాగా, భర్తకు ఆలోచనలు చెప్పేటప్పుడు మంత్రిలాగా, ఓర్మికి భూమిలాగా, భోజనం పెట్టేటప్పుడు తల్లిలాగా మసులుకునేదానికి సర్వస్వతంత్రాలు కాళ్ళముందుంటాయి. అయినప్పుడు ఇహపరాలు హస్తగతాలు.”
”వినయవిధేయలతో మెలగుతూ, సర్వసంమత, సహసం, పతివ్రతాత్వ గలదానికి ఏలోపమూ రాదు.”
”అలాంటిదానికి కంటక వర్గ మయినా పూలబాటే.”
”ఎంతమందెన్నిబాధలు పెట్టి దాన్నేమిచేస్తారు? ఏమీ చేయలేరు.”
”లోకంలో కీర్త్యపకీర్తుల, మంచి చెడ్డల ఉండి పోతాయి.”
”ఆడదాని కంత దురుసుతనం పనికిరాదేమనుకున్నావో.”
”అనుభవిస్తారు.”
”భగవంతుడున్నాడా?”
”భగవంతుడున్నాడని తెలియడం గానీ, అనుభవించడం గాని ఇంతత్వరగా జరుగుతుందా? జరిగితే ఇందువల్లనే అని అనుకుంటారా?”
”అనుకున్నా అనుకోకపోయినా బెల్లం తింటేనే కాని- కడుపునొప్పి రాదు, కుంచం నిండితేనే కాని బోర్లపడదు.”
”పరోపకారంవల్ల పుణ్యం, పరపీడవల్ల పాపం విధిగా వస్తాయి.”
”చాలాసేపయి వచ్చాను. లచ్చీ! నేను వెడతాను.”
”మంచిది. మా అమ్మ వంట చేస్తూవుంది కదా అని ఇంతసేవున్నాం. ఇంటికి పోయి మంచి పుస్తక మెదేనా చదువుకోవాలి. మేమూ వెడతాం.”
(కథానిలయం సౌజన్యంతో)

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో