‘మేమే మా సైన్యం’ -ఆదూరి హైమావతి

దినకరుడు తన రథంలో తిరిగి తిరిగి అలసిపోయినట్లున్నాడు, విశ్రాంతి కోసం ఇంటిదారి పట్టాడు. సూర్యుడు కనుమరుగవుతూనే చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి. అంతా స్పష్టంగా కాక నీడగా కనిపిస్తోంది.స్పెషల్‌ క్లాసులైపోయి విద్యార్థులు ఇళ్ళదారి పట్టారు. రుక్మిణి దూరంగా ఉన్న వేపచెట్టు క్రింద కూర్చుని ముణుకుల్లో తల ఉంచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. రుక్మిణి పదహారేళ్ళ అందమైన ఆడపిల్ల. వయస్సును మించిన తెలివితో, అందంతో చూసేవారిని ఇట్టే ఆకర్షిస్తుంటుంది. పచ్చని బంగారు మేనిఛాయ, మోకాళ్ళవరకూ వ్రేలాడే నల్లత్రాచు వంటి జడ, అమ్మాయిలకే మరోమారు చూడాలనిపించే అందం. మంచి స్నేహశీలి. పేద రైతుబిడ్డ. ఉన్నా లేకున్నా తల్లిదండ్రులు తమ బిడ్డను బాగా చదివించి డాక్టర్ను చేసి, తాము పడ్డ కష్టాలకు తమ కుమార్తెను దూరం చేయాలని పట్టుదలగా చదివిస్తున్నారు. రుక్మిణి కూడా తల్లిదండ్రుల కష్టమూ, మనస్సూ ఎరిగి కఫ్టపడి చదువుతోంది. ఇప్పుడామె పన్నెండో క్లాసు. మంచి తెలివైన విద్యార్థులకు స్పెషల్‌ క్లాసులు పెట్టి ఎంసెట్‌ సిలబస్‌ చెప్తున్నారు కాలేజ్‌ వాళ్ళు. దాంట్లో మొదటి విద్యార్థిని రుక్మిణి.

రుక్మిణి కోసం వెతుక్కుంటూ పదిమంది ఆడా, మగా క్లాసు పిల్లలు వచ్చారు. వారంతో పదో క్లాసు వరకూ ఒకే స్కూల్లో చదువుకుని అన్నాచెల్లెళ్ళలా ఒకరి కష్టం ఒకరు పంచుకుంటూ చదువుతున్నారు. మంచి తెలివైన బ్యాచ్‌.

”చీకట్లో ఇక్కడున్నావేంటి? నీ కోసం కాలేజ్‌ గ్రౌండ్‌ అంతా గాలించి వస్తున్నాం.” అంటూ చుట్టూ చేరారు అమ్మాయిలు. ఎప్పుడూ చలాకీగా, సంతోషంగా ఉంటూ, జోక్స్‌ వేసి తమను నవ్వించే రుక్మిణి అలా రోదిస్తుండడం ఆశ్చర్యం కలిగించింది వారందరికీ.

బాలురంతా ”ఏమైంది రుక్మిణీ? చెప్పు. మేమేమైనా సాయం చేయగలమేమో చూస్తాం. నీవలా ఏడుస్తుంటే చూడలేకపోతున్నాం ప్లీజ్‌” అంటూ బ్రతిమాలసాగారు. అంతా అలా అడిగేసరికి రుక్మిణి దుఃఖం ఇంకా పెరిగింది. వెక్కి వెక్కి ఏడ్వసాగింది. రుక్మిణిని అలా చూస్తూ ఉండలేకపోయారు వారు. ఒక అమ్మాయి తనవద్ద ఉన్న మంచినీళ్ళ సీసా యిచ్చి బలవంతంగా త్రాగించింది. ”రుక్మిణీ! ఏమైంది? మీ అమ్మా నాన్నగారు బావున్నారు కదా! వారికే ఆపదా కలుగలేదు కదా?” అంటూ గడ్డం పట్టి ఎత్తి అడిగింది అరుణ. రుక్మిణి తలెత్తి చూసింది. కళ్ళు ఎర్రగా నిప్పు కణికల్లా ఉన్నాయి. అరుణను పట్టుకుని మళ్ళీ పెద్దగా ఏడ్వసాగింది. ”అరుణా! నేను మా ఊరెళ్ళిపోతాను. అమ్మా నాన్నల దగ్గరికెళ్ళి పొలం పని చేసుకుంటాను. నాకీ చదువు వద్దు. నన్ను మా ఊర్లో దింపి రండి, లేదా చచ్చిపోతాను” అంటూ బావురుమని ఏడ్చింది మళ్ళీ.

”చచ్చి ఏం సాధిస్తావే! ధైర్యంగా సమస్యలు ఎదుర్కోవాలని నీవే మాకు అనేకమార్లు చెప్పావు. ఇప్పుడిదేంటీ?” ఆశ్చర్యంగా అడిగింది అరుణ. అంతా అయోమయంగా రుక్మిణిని చూస్తూ మౌనంగా

ఉన్నారు ఏమీ చేయలేక. అరుణ అందర్నీ కొద్దిగా దూరంగా వెళ్ళమని చెప్పి పంపి, రుక్మిణిని బుజ్జగించి విషయం తెల్సుకుంది మెల్లిగా. రుక్మిణి తన మొబైల్‌ ఫోన్‌ అరుణకిచ్చింది. దాన్లోని మెసేజెస్‌ చూశాక అరుణ ముఖం ఎర్రబడి, కోపంతో ఊగిపోయింది. రుక్మిణి భుజం పట్టి మెల్లిగా లేపి స్నేహితులందరి వద్దకూ నడిపించింది. వారందరితో ఏదో మెల్లిగా చెప్పింది. అంతా ఉగ్ర నరసింహ మూర్తుల్లా ఊగిపోయారు. అక్కడున్న రావి చెట్టు క్రింద కూర్చుని అంతా సీరియస్‌గా ఆలోచించసాగారు.

ఇంతలో అక్కడున్న ఒక చెట్టు మొదట్లోని బొరియ నుంచీ ఒక పాము అక్కడున్న ఒక చీమల పుట్ట వద్దకు రాగా, ఆ పుట్టలోని చీమలన్నీ ఆ పామును చుట్టుముట్టి కరవసాగాయి. ఒకేసారి అటాక్‌ చేశాయి. ఆ పాము తప్పించుకోవాలని ఎంతో ప్రయత్నించినా, చీమలు ఆ పామును వదల్లేదు. పుట్టలో చీమలన్నీ వచ్చి పామును చుట్టుముట్టి కరవసాగాయి. పాము చాలా ప్రయత్నించింది తప్పించుకోవడానికి. చీమలన్నీ మంచి శిక్షణ పొందిన సైనికుల్లా దాడిచేసి పామును కదలకుండా పట్టి కరిచి కరిచి ప్రాణం తీశాయి. అదంతా చూస్తున్న అరుణ వెంటనే అందర్నీ దగ్గరగా పిలిచి వారికి రహస్యంగా ఏమి చేయాలో చెప్పింది. అంతా తలలూపి, ‘ధైర్యంగా ఉండమని’ రుక్మిణికి చెప్పారు. అందరూ కలిసి కాలేజ్‌ గేట్‌ దాటి బయటికొచ్చి తమ ఇళ్ళకేసి వెళ్ళారు.

… … …

ప్రాక్టికల్స్‌ మొదలయ్యాయి. చివరి బ్యాచ్‌లో ప్రాక్టికల్స్‌ రుక్మిణి బ్యాచ్‌కి. తన స్నేహితులందరితో కలిసి వచ్చి తన పుట్టినరోజని అక్కడున్నవారందరికీ చాక్లెట్లు తెచ్చి ఇచ్చింది. కెమిస్ట్రీ మాస్టారు కళ్యాణ్‌కూ ఇచ్చి నవ్వుతూ వెళ్ళి ప్రాక్టికల్స్‌కు అటెండైంది. కళ్యాణ్‌ రుక్మిణి పక్కగా వచ్చి నిల్చుని, ఏదో ఆమె పని గమనిస్తున్నట్లుగా దగ్గరగా నిల్చున్నాడు. నవ్వుతూ ఏదో అంటున్నాడు ఆమెకు మాత్రమే విన్పించేలా. రుక్మిణి తలవంచుకుని ఏకాగ్రతగా తన పనిలో ఉంది. వెనుకనుంచీ ఆమెను తాకుతూ అందిన చోటల్లా తడుముతూ, తముడులా (రాహువులా) నవ్వుతూ నిల్చున్నాడు. రుక్మిణికి వంటిమీద తేళ్ళు, జెర్రులూ పాకుతున్నట్లు బాధపడసాగింది. ఐదు నిమిషాలకు కళ్యాణ్‌ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. రుక్మిణి బ్యాచ్‌ బాయ్స్‌ అంతా అతడ్ని జాగ్రత్తగా పట్టుకుని పక్కగదిలో ఉన్న సోఫాలో పడుకోబెట్టారు. అంతా ఎవరి పని వారు చేసుకుంటుండగా ఇద్దరు మాత్రం అతడి దగ్గరున్నారు. వారిలో రమేష్‌ అనే బాలుడు రుక్మిణి దగ్గర డ్రెస్‌ లోపల దాచి ఉన్న మొబైల్‌ ఫోన్‌ అడిగి తీసుకున్నాడు….

… … …

రాత్రి ఎనిమిదైంది. వాణీ కళాశాల గ్రౌండ్‌ అంతా మనుషులతో కిటకిటలాడిపోతోంది. టీవీ వాళ్ళంతా వారి కెమెరాలతో చుట్టూ లైవ్‌ షూట్‌ చేస్తున్నారు. పత్రికల వాళ్ళంతా లోపలికీ, బైటికీ మైక్స్‌ పట్టుకుని తిరుగుతున్నారు. కాలేజ్‌ స్టాఫ్‌, ప్రిన్సిపాల్‌ అంతా ఎవరెవరితోనో మాట్లాడుతున్నారు. కార్లూ, బైక్‌లూ అన్నీ ఎడతెరిపి లేకుండా రానూ పోనూగా ఉంది. రుక్మిణి బ్యాచ్‌లో అరుణ, రమేష్‌ టీవీ మైక్‌ ముందు నిల్చుని ఏదో చెప్తున్నారు. లైవ్‌లో అది దేశమంతా చూస్తున్నారు.

”తండ్రిలాంటి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ప్రవర్తన ఇలాగేనా ఉండాల్సింది? విద్యార్థులకు మంచీ చెడూ చెప్పాల్సిన వ్యక్తి, మేధావి, చదువుకున్నవాడు ఇలాగేనా ప్రవర్తించడం? అమ్మాయిలకు భద్రతే లేదా? చదువుల కోసం బయటకు రాకూడదా? చూడండి ఈ మెసేజెస్‌.. ‘నా మాట వినకపోతే ల్యాబ్‌లో

ఉన్నప్పుడు ఒంటిమీద యాసిడ్‌ పోస్తాను. మత్తు మందిచ్చి నా గదిలో బంధించి నా ఇష్టం తీర్చుకుంటాను. నిన్ను నగ్నంగా వీడియో తీసి అందరికీ పంపుతాను. నిన్ను ప్రాక్టికల్స్‌లో ఫెయిల్‌ చేస్తాను. నీవడిగినట్లు నిన్ను పెళ్ళి చేసుకోవడం మాట ఉత్తది. నాకు పెళ్ళయి ఒక బిడ్డ కూడా. ఇలా అన్ని బ్యాచెస్‌ అందమైన అమ్మాయిలూ నా చేయి పడ్డవారే. నా కోరిక తీర్చకుండా ఈ క్లాస్‌ పాసవలేవు. పల్లెటూరి దానివి నీకేం తెల్సు, ఏమైనా చేయగలను. నీ అందం నన్ను తినేస్తోంది. నీకు వారం టైమిస్తున్నాను. ఈ లోగా నా కోరిక తీర్చకపోతే యాసిడ్‌ పోస్తాను. నీ… ఎంత మెత్తగా ఉన్నాయి! ఎంత హాయిగా ఉంది తాకుతుంటే! మంత్రి మా బంధువు. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు”… ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో మెసేజెస్‌. మేమేం తెలివి తక్కువ వారమా? మాకు గట్స్‌ లేవా? మమ్మల్ని మేం కాపాడుకోలేమా? అంటూ రోషంగా, ఉగ్రంగా ఒకరి తర్వాత ఒకరు, ఇద్దరూ మాట్లాడుతుంటే టీవీ ప్రేక్షకులంతా పక్కనే అర్థ నగ్నంగా ఉండి, బేర్‌బాడీకి కింది భాగం కప్పి చూపుతున్న వ్యక్తిని చూసి ”ఛీ ఛీ” అంటూ ఊయసాగారు. ‘వాడి ముఖం చూపాలి, ఆ వెధవెవరో అందరికీ తెలియాలి. థూ! త్రాష్టుడా! ముఖం కనిపించకుండా చూపడం ఈ టీవీ వాళ్ళకు న్యాయం కాదు’ అని అనుకోసాగారు.

రమేష్‌ ”మేమంతా అక్కచెల్లెళ్ళలాగా పదో తరగతి వరకు చదువుకున్నాం. మా మేడమ్స్‌ మాకు ‘ఐకమత్యంగా ఉండి, దైవ పితృత్వం, మానవ సోదరత్వంతో మెలగి మీకు మీరే సైన్యంలా, మీ వారిని మీరే కాపాడుకోవాలి, ఒకరికొకరు అన్నింట్లో సాయం చేసుకోండి. మానవతా విలువలైన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను పాటిస్తూ, అవసరమైనప్పుడు బుస కొట్టండి. మెత్తగా ఉంటే మిమ్మల్ని అందరూ హేళన చేసి అవమానపరుస్తారు. ఐకమత్యం మహా బలమని మరువకండి. మీ క్లాస్‌ అమ్మాయిలను అందరూ అక్కచెల్లెళ్ళుగా భావించి కాపాడండి. అమ్మాయిలంతా ధైర్యంగా ముందుకు సాగండి, దేనికీ భయపడకండి. నేర్చుకున్న కరాటేను అవసరాన్ని బట్టి వాడుకోండి. ఒకరికొకరు అండగా ఉండండి. అవసరమైనపుడు కఠినశిలగానూ, లేనపుడు మెత్తని పువ్వుగానూ ప్రవర్తించండి. ఫాలో ది మాస్టర్‌, ఫినిష్‌ ది గేమ్‌’ అని బోధించారు. ‘మేమే మా సైన్యం’. అంతా ఇలా ఎవరి ఊరివారిని వారు కాపాడుకోండి. మనతోపాటుగా మన సోదరీమణులను చదవనివ్వండి, సహకరించండి” అంటూ ఉద్రేకంగా చెప్తుండగా అందరూ ”శభాష్‌.మీ సైన్యానికి జై” అని అరవసాగారు.

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో