లౌకిక రాజ్యాంగం చుట్టూ మత రాజకీయాలు -సత్యవతి

2017 ముగుస్తోంది. సంవత్సరాలదేముంది. వస్తుంటాయ్‌. ముగుస్తుంటాయ్‌. 2017లో ఏమి జరిగింది? ముందు మందు ఏం జరగబోతోంది? సంవత్సరాంతాన ఇలాంటి ప్రశ్నలు ఎదురౌతూంటాయి? మనుష్యుల జీవితాల్లో ప్రగతిని ఎలా కొలుస్తాం. సమాజంలో మార్పుని ఎలా కొలుస్తాం. ఎలాంటి కొలమానాలు ఉపయోగించాలి? సమాజాన్ని మొత్తంగా తీసుకుంటే అంచుల్లో ఉన్న, అణిచివేతకు గురవుతున్న వారి జీవనస్థాయి, భద్రత, సాధికారతని లెక్కగడితే గత సంవత్సరం ఎలా ఉంది? ఎలా గడిచింది అర్థమవుతుంది.

2017 సంవత్సరమంతా నాకు ప్రస్ఫుటంగా కనబడింది మతోన్మాదం, అసహనం, తిరోగమన భావజాలం. గౌరీ లంకేష్‌ని ఆమె ఇంటిముందే హత్య చేయడం, హంతకుడిని పట్టుకోలేకపోవడం, హంతకుడు ఒకే ఆయుధాన్ని ఉపయోగిస్తూ వరస హత్యలు చేసుకుంటూ పోవడం, తర్వాత సీరియల్‌ హంతకుడి టార్గెట్‌ ఎవరో ఒకరు ఉండి ఉంటారు… ఆ ఒక్కరూ కూడా హత్యకు గురయ్యాక ప్రభుత్వాలు కమిటీలేసి కాలయాపన చేసి విచారణ పురోగతిలో ఉంది అని ప్రకటిస్తారు.

ఇంకా కొన్ని పదాలు భారతమాత, దేశద్రోహం, మనుస్మృతి, నూతన సంవత్సర వేడుల నిషేదం లాంటి పదాలు విరివిగా ప్రసార మాధ్యమాల్లోను, సామాజిక మాధ్యమాల్లోనూ కనబడుతున్నాయి. అసలు మాతల్ని గాలికీ, ధూళికీ వదిలేసిన వాళ్ళు సైతం భారతమాత భావజాలాన్ని ముందుకు తెచ్చి సామాజిక కార్యకర్తల మీద దాడులు చేయడం చూస్తున్నాం. తెల్లతోలు తన్మయంలో మునిగి, పాశ్చాత్యులకు సాష్టాంగపడిన పాలకపక్షాలు, మతవాదులు జనవరి మొదటి తేదీ పండుగ కాదు, పండుగ చేసుకున్నారంటే గంజీళ్ళు తీయిస్తాం, కాళ్ళిరగ్గొడతాం అంటూ ఫత్వాలు జారీ చేయడం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే జనవరి ఒకటి వేడుక మనది కాదు, ఆరోజు గుళ్ళకెళ్ళి పూజలు చేయకండి, ఉగాది హిందువుల పండగ, బుద్ధిగా అది జరుపుకోండి అంటూ అధికార పత్రాన్ని విడుదల చేయడం చూస్తున్నాం.

ఈ సంపాదకీయం రాయడానికి కూర్చున్నప్పుడు నా మనస్సు చాలా గందరగోళంగా, ఆందోళనతో నిండివుంది. 2017 విజయాలు, వైఫల్యాలు, చేయాల్సిన పనులు, నడవాల్సిన దూరాలూ… వ్యక్తిగతంగాను, సంస్థాపరంగాను ఏమి ఉన్నాయ్‌ అని ఆలోచిస్తుంటే చిత్రంగా నా గురించి, నేను బాధ్యురాలిగా ఉన్న సంస్థ గురించిన అంశాలేవీ ముందుకు రాకుండా మొత్తం సమాజం తోసుకొస్తోంది. భూమిక ఏం చేసింది? ఏం చెయ్యలేక పోయింది. అనే విషయాలు అప్రధానమైపోయాయి. పైన నేను పేర్కొన్న పదజాలం, భావజాలం మాత్రమే భయానకంగా నా ముందుకొచ్చి నిలబడుతున్నాయ్‌. గౌరీ లంకేష్‌ రక్తం మడుగులో గిలగిల్లాడిన దృశ్యాలే మనోఫలకం మీద తారాడుతున్నాయ్‌. పసి పిల్లల్నించి, పండు ముదుసళ్ళ వరకు వావి, వరస, వయస్సు ఏవీ లేకుండా కేవలం ఒక జననాంగంగా, పురుషాంగాన్ని చొప్పించదగిన ఒక అవయవంగా మాత్రమే పురుషులకు కనబడుతున్న బీభత్స, భయానక దృశ్యాలు ఒక దాని తరవాత ఇంకొకటి కళ్ళ ముందుకొచ్చి కలవరపెడుతున్నాయ్‌. మనిషి సృష్టించుకున్న కరెన్సీ కాగితాల ముందు వెలాతెలాపోతున్న మానవ సంబంధాల విధ్వంశం, గుప్పిట్లో ఇమిడే ఒకానొక ”పరికరం” మనుష్యుల మీద, మానవీయ కోణాల మీద చేసిన అణు విస్ఫోటనం కన్నా ప్రమాదకరమైన దాడి నా ముందు నిలబడి వికటాట్టహాసం చేస్తోంది.

మనిషి కోసమే పుట్టినట్టు నటించే మతాలు, మానవుల ఉద్ధరణకే మేమున్నామని నమ్మబలుకుతూ చీకటి సెక్స్‌ స్కాండల్స్‌ బురదలో వరాహాల్లా పొర్లుతున్న సకల సన్యాసులూ, బాబాలూ… కులం పేర, మతం పేర, ప్రాంతం పేర ముక్కలు చెక్కలౌతూ ఒకరి మీద ఇంకొకరు కత్తులు దూస్తున్న దారుణాలు…

2018ని ఆహ్వానించొద్దనే వాళ్ళు, పాశ్చాత్య సంస్కృతి వద్దని ఫత్వాలు జారీ చేస్తున్న వాళ్ళు భారతీయత పేరుతో, భారతీయ సంస్కృతి పేరుతో ఏ విలువల్ని మనమీద రుద్దబోతున్నారు? మతాన్ని, సంస్కృతిని కలగాపులగం చేసుకుంటూ మతోన్మాదాన్ని, మతద్వేషాన్ని, అసహన భావజాలాన్ని ప్రేమించే వీళ్ళు ఈ దేశాన్ని ఏ దిశ వైపు నడిపించబోతున్నారు? రాజ్యాంగాన్నే మార్చేస్తామని ప్రకటిస్తున్న ఈ మతోన్మాద వర్గం పాలన ఈ దేశంలోని మహిళలు, దళితులు, మైనారిటీ బహుజనుల్ని ఏ నిప్పుల కుంపట్లలోకి, ఏ కత్తుల బోనుల్లోకి తోసేయబోతోంది? ఇప్పటికే గోమాత, భారతమాత, రామరాజ్యం, రామాలయ నిర్మాణం లాంటి ఉద్రేకపూరిత, ఉద్వేగపూరిత పద ప్రయోగాలు పదే పదే వినబడి రామరాజ్యం గురించిన భయాలు తీవ్ర ఆందోళనకి గురిచేస్తున్నాయి. రామరాజ్యంలోని శంభూక వధ, శూర్పణక అవమానం, సీతకి జరిగిన అన్యాయం, పదే పదే గుర్తొచ్చి… రామరాజ్యం పేరు వింటేనే శరీరం గగుర్పాటుకు గురౌతోంది. భారత రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యం, లౌకిక ఆచరణ వీటన్నింటినీ దాటి మాట్లాడుతున్న వారి మాటలు చాలా భయపెడుతున్నాయి.

నా మనసునిండా ఆందోళన… ఆందోళన… ఆందోళన… అదే ముందుకు తోసుకొస్తున్న వేళ నా కళ్ళకు పాత సంవత్సరం, కొత్త సంవత్సరం… ఏమీ తేడా తెలియడం లేదు…

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో