స్త్రీల సాంస్కృతిక స్వేచ్ఛ పై బహిరంగ సభ

షరిఫా
ఈసంఘటన తర్వాత ఫిబ్రవరి పధ్నాలుగున జరిగే వాలైంటైన్‌ డే రోజున బహిరంగంగా జంటలుగా తిరిగే యువతీ యువకులకు పెళ్ళిళ్ళు చేస్తామని లేదా రాఖీలు కట్టిస్తామనే హెచ్చరికను శ్రీరామసేవ కార్యకర్తలు జారీ చేసారు.
దీని తర్వాత ఫోరమ్‌ సభ్యులు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ని నిర్వహించి, మంగుళూరు సంఘటనను తీవ్రంగా ఖండించారు. జనవరి 13న బహిరంగ సభ నిర్వహించదలిచామని చెప్పడం జరిగింది. వివిధ కళాశాలలను సందర్శించి, కరపత్రాలు పంచుతూ విద్యార్థినీ విద్యార్థులతో మాట్లాడటం జరిగింది.
13వ తేదీన నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో పన్నెండు స౦ఘాలు, వ్యక్తులు, మీడియ సభ్యులు కలిసి బహిరంగ సభను నిర్వహించారు. ఈ సమావేశానికి అస్మిత నుండి కల్పన కన్నభిరాన్‌ అధ్యక్షత వహించారు. జిలానీ భానో (ఉర్ద రచయిత్రి) ఝన్సీ (దళిత స్త్రీశక్తి), సుమిత్ర (అంకురం) కొండవీటి సత్యవతి (భూమిక) సాగరి రామ్‌దాస్‌ (అంత్ర) జమీలా నిషాత్‌ (షాహీన్‌) తెలకపల్లి రవి(రచయిత) గిరిజ (ఆక్స్‌ఫామ్‌) షరిఫా(ముస్లిమ్‌ వుమెన్స్‌ రైట్స్‌ నెట్‌వర్క్‌) ఇంకా అనేకమంది విద్యార్ధినులు ఈ సమావేశంలో ఉపన్య సించారు.
జిలానీబానో మాట్లాడుత ప్రస్తుత పరిస్థితుల్లో మాట్లాడటం కాదు. ఆచరణలోకి దిగడం అవసరం. మతం పేరుతో అది హిందు, ముస్లిమ్‌ మరే మతమైనా గానీ స్త్రీలకు అన్యాయం తలపెట్టడానికి వ్యతిరేకంగా చాలా గట్టి సమాధానం మనం చెప్పాల్సి వుందని చెప్పారు.
ఝన్సీ పాట నెత్తుకుని తన ఉపన్యాసం మొదలు పెట్టి ఏ సంస్కృతిని మహిళల మీద రుద్ద దలిచారో, హిందుత్వశక్తులు బహిరంగంగా తమ పాలసీని చెప్పాలనీ, ఈ దేశంలో భిన్న సంస్కృతులు, మతాలు ఉన్నాయని, అసలు ఏ సంస్కృతి భారతీయ సంస్కృతో వారు చెప్పాలని డిమా౦డ్‌ చేసారు. జమీలా నిషాత్‌ మాట్లాడుతూ స్త్రీలను అణిచివెయ్యడానికి ‘హానర్‌ కిల్లింగ్స్‌’ లాంటివి ఉపయెగిస్తున్నారని, స్త్రీలని వస్తువులుగా మార్చి వారి కదలికలను కంట్రోల్‌ చేస్తున్నారని అన్నారు. అసలు స్త్రీల కదలికలనెందుకు కంట్రోల్‌ చెయ్యలని ఆమె ప్రశ్నించారు. సుమిత్ర మాట్లాడుతూ తాను ఎప్పుడో జిలానీబానో అన్న ొమాటను గుర్తుకు తెచ్చుకుంటున్నానని, అన్యాయంజరిగిపుడు నిశ్శబ్ధంగా వుండడం అంటే దాన్ని ఆమొదించినట్లేనని ఆమె అన్నారని చెబుతూ ఈ విషయంలో యువత చురుకుగ పాల్గొనాలని చెప్పారు.
కొండవీటి సత్యవతి ొమాట్లాడుత ”స్త్రీల ఉద్యమం చేసిన ఎన్నో సంవత్సరాల పోరాటాల ఫలితం ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ. ఇపుడు హఠాత్తుగా మనం మళ్ళీ అవే అంశాల మీద తిరిగి పోరాడాల్సి రావడం నిజంగా విషాదం. స్త్రీలు ఇంట్లో చపాతీలు చెయ్యలి. గాని పబ్‌లకెళ్ళడమేంటి? మంగుళూరులో స్త్రీలు 7 గంటల తర్వాత బయట తిరక్కూడదు’ అంటూ ”ముతాలిక్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ మీద మీద నాకు విపరీతమైన కోపంగా వుంది. మనని నిర్దేశించడానికి వాళ్లెవరు? ఇలాంటి అంశాల మీద మనం నిరంతర పోరాటం చెయ్యల్సి వుంది. లేని పక్షంలో భవిష్యత్తరాల ఆడపిల్లలు మరిన్ని ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది” అని అన్నారు. గిరిజ మాట్లాడుతూ మనం యువతలో ఈ అంశాలపై చైతన్యం కల్గించాలి. అమ్మాయిలు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడేలా మనం చెయ్యలి. వాళ్ళను ఎలా భాగస్వాములను చెయ్యలి? ఎలా వాళ్ళతో మాట్లాడాలి అనే విషయల గురించి మనం ఆలోచించాలి.” అన్నారు. సాగరి మాట్లాడుతూ ఇటీవలే టెర్రరిజానికి వ్యతిరేకంగంగా ఘోరమైన చట్టం తెచ్చిన కేంద్ర ప్రభుత్వం మతం పేరిట జరుగుతున్న ఇలాంటి టెర్రరిస్ట్‌ దాడుల పట్ల మౌనం వహిస్తోంది అంట హిట్లర్‌ దాడులగురించి వర్టిన్‌ న్యవెలర్‌ కోటేషన్‌ ను ఉటంకించారు.
వసంత్‌ కన్నభిరాన్‌ ొమాట్లాడుతూ ఉగ్రవాదుల బెదిరింపులకు అందరూ భయపడతారని చెబుత తమిళనాడులో జరిగిన ఖుష్‌భూ ఉదంతాన్ని పేర్కొన్నారు. తాను అన్ని ‘దినాలకి’ వ్యతిరేకమని అయితే ఎవర దేన్నీ బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించకూడదని, అది వారి వారి ఛాయిస్‌లను బట్టి వుండాలనేది తన అభిప్రాయమని చెప్పారు. షరిఫా మాట్లాడుతూ మత విధానాల ద్వారా వెనక్కు వెళ్ళిన సమాజాల ఉదంతా నుండి మనం పాఠాలు నేర్చుకోవాలని, భిన్నత్వాన్ని గౌరవించాలని, స్త్రీలను సమానంగా చూసే సంస్కృతిని మనం నిర్మించాలని అన్నారు. చివరగా కల్పన మాట్లాడుతూ ”తాలిబానైజేషన్‌” అనే పద ప్రయెగం ఇబ్బందికరంగా వుందని హిందుత్వ శక్తులను చెడు శక్తులుగానే చూడాలని మనం విమర్శనాత్మకంగా ొచూసే వాలంటేన్‌ డే లాంటి వాటిని సమర్ధించాల్సి రావడం విషాదకరమని అన్నారు. మనం ఈ పరిస్థితిలోకి బలవంతంగా నెట్టబడ్డామని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఎంతోమంది విద్యార్ధులు కూడా ఆనాటి సమావేశంలో మాట్లాడారు.

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో