డాటర్స్‌ ఆఫ్‌ ఇండయా

సుజాత
ఈ మూడేళ్ళలో ఎన్నో పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి. కాని కుదరలేదు ఇంటర్వ్యలు బాగానే చేసింది.

కాని ఉద్యోగం రాలేదు. ఇప్పుడు అయిదో ఇంటర్వ్యకు వెళ్ళి వచ్చింది. మేనేజ్‌మెంట్‌ (యజమాన్యం) వారు కళాశాల అభివృద్ధికి పదివేలు ఇవ్వమంటారు. మొదట్లో కోపగించుకున్న వసంత దేనికైన రెండవ ఆలోచన వుండాలని కోపాన్ని మనసులో దాచుకుని ఏ విషయమైన రేపు చెపుతానని వస్తుంది.
వసంతతో పాటు ఇంటర్వ్యకు వచ్చినతను ఆమె చేరకుంటే తాను పదిహేనువేలైన పెట్టి ఆ ఉద్యోగంలో చేరుతానని, ఆమె ఉద్యోగంలో చేరినా పెళ్ళైతే ఉద్యోగం వదిలి భర్త దగ్గరకు వెళ్ళాల్సి వస్తుంది, ఉద్యోగం కొనే బదులు పెళ్ళి చేసుకుంటే మంచిది అనే ఉచిత సలహా ఇస్తాడు. వసంత తల్లి కూడ ఆ మాటే అంటుంది.
వసంత తండ్రి మాత్రం తన దగ్గరున్న డబ్బు ఇరవైవేలని వాటిని ఆమె ఎట్లా ఉపయెగించుకున్న తనకు అభ్యంతరం లేదంటాడు. ఎట నిర్ణయించుకోలేని వసంత అసలీ ప్రపంచానికి ఆధారం రపాయి నాణెం అని. పెళ్ళయ్యే వరకు అన్ని ఖర్చులకు తల్లి తండ్రులపై ఆధారపడతామని స్కూల్‌ టీచర్స్‌గా చేరిన తమ స్నేహితురాళ్ళ అనుభవాన్ని, అభిప్రాయలను, గుర్తు చేసుకుని, మరొక స్నేహితురాలు కాత్యాయని సలహాకూడా తీసుకుని పెళ్ళి తరువాత చేసుకోవచ్చునని, ముందు ఉద్యోగం కొనుక్కునటమే సమంజసమని నిర్ణయించు కుంటుంది. దానిని అమలు చేయడం కోసం ఆమె తండ్రితో చెక్‌బుక్‌పై సంతకం చేయించుకుని బ్యాంకుకు బయలుదేరడంతో కథ ముగుస్తుంది. కథా విశ్లేషణ : చదువుకుని అర్హతలకు తగిన ఉద్యోగాలు సంపాదించుకోవడం అనే పరిస్థితి డెబ్బైల నాటికి మారింది. నిరుద్యోగ సమస్య ప్రబలింది ఉద్యోగ సంపాదన పోటీలో నెగ్గటానికి చదువుకు, అర్హతలకు అదనంగా డబ్బు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవినీతి, లంచగొండితనం, ప్రైవేట్‌ సంస్థల విషయంలో అది వ్యవస్థ నిర్వహణ ఖర్చుకాకపోతే డొనేషన్‌ ఏదైనా కావచ్చు.
వసంత ఒక ప్రైవేట్‌ కాలేజీలో లెక్చరర్‌ ఉద్యోగానికి ఇంటర్వ్యకు వెళ్ళింది. పదివేలిస్తే ఉద్యోగం ఇస్తామని కాలేజి నిర్వాహకులు చెప్పారు. ఆమె ఆలోచనలో పడింది ఇది ఈ కథలోని సమస్య.
ఈ సమస్య రెండు కోణాలనుంచి కథకు ఇతివృత్తాన్ని ఇచ్చింది. ఆడపిల్లకు ఉద్యోగం ముఖ్యమా? పెళ్ళి ముఖ్యమా? అన్నకోణం ఒకటి ఈ కోణాన్ని వసంతతో పాటు ఇంటర్వ్యకి హాజరైన యువకుడు వసంత తల్లి ఇద్దరు ఆలోచించారు. ఆడపిల్లకు పెళ్ళి తప్పదు. పెళ్ళైనాక భర్తకి ఎక్కడ ఉద్యోగమైతే అక్కడికి వెళ్ళక తప్పదు. ఉద్యోగానికి డబ్బు పెట్టి, పెళ్ళికి ఇవ్వాల్సిన కట్నంకోసం డబ్బు ఖర్చుపెట్టి భర్తతో వెళ్ళి పోవాల్సి వచ్చినప్పుడు ఉద్యోగానికి పెట్టిన డబ్బు వదులుకోవాల్సిన పరిస్థితిలో ఆడపిల్ల వుంటుంది. అందువలన ఈ విషయమే చెప్పి యువకుడు వసంతను నిరుత్సాహ పరచాలని చూస్తాడు. తాను ఉద్యోగానికి డబ్బు పెట్టినా కట్నంగా అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందని తను అక్కడే ఉండి ఉద్యోగంలో స్థిరపడగలనని అతను మగవాళ్ళకు ఈ సమాజం ఇచ్చిన అనుకోని అవకాశాలవల్ల కలిగిన ధైర్యంతో మాట్లాడాడు. పదివేలు కట్టి ఈ రోజు ఉద్యోగంలో చేరి పెళ్ళై వెళ్ళి పోతే ఆ డబ్బు దండగే కదా అని తల్లి కూడ వసంతను నిరుత్సాహపరుస్తుంది. వసంత పెళ్ళికి ఖర్చు చేయల్సిన డబ్బు సంగతి చెప్పి ఇప్పుడు ఉద్యోగానికి అప్పుడు పెళ్ళికి డబ్బు పెట్టడం లాభదాయకం కాదని తేల్చి చెప్పింది.
ఆడపిల్ల ఉద్యోగానికి, పెళ్ళికీ వైరుధ్యం ఉందన్న విషయం ఇంటర్వ్యకి వచ్చిన యువకుడు, వసంత తల్లి గ్రహించారు. ఆడపిల్ల విషయంలో ఉద్యోగం కంటే పెళ్ళే ముఖ్యమని తేల్చారు. వీళ్ళిద్దరు వెలిబుచ్చిన అభిప్రాయలు ఆడపిల్ల విషయంలో లోకం వైఖరిని వ్యక్తం చేస్తాయి. ఆడపిల్ల జీవితం ఎలా ఉండాలో లోకం నిర్దేశించిన పద్ధతి అది. ఇక ఆడపిల్లలు తమ జీవితం గురించి తాము ఏమను కుంటున్నారు? అన్నది అసలు సమస్య.
ఈ కథలో వసంత ఎకనామిక్స్‌ ఎం.ఏ. చదువును సార్ధకం చేసుకోడానికి ఆర్థికంగా తనకాళ్ళ మీద నిలబడటానికి ఉద్యోగం చేయలనుకుంది. ఎం.ఏ. అయినప్పటి నుండి మూడేళ్ళుగా ఉద్యోగాన్వేషణలో ఉంది. ఉద్యోగానికి పోటీ ఎక్కువగా వుండటమే కాదు, ఉద్యోగాన్వేషణలో ఆడపిల్ల కావడం వలన పరిమితులు కూడా ఉన్నాయి. పొరుగరు పంపరు, ఒక్కతిని వుండనివ్వరు వున్నవూళ్ళో ఉద్యోగం వస్తే అంగీకరిస్తారు. అందువలన ఆడపిల్లల ఉద్యోగవకాశాలు పరిమితమైనవని అర్థం చేసుకోవచ్చు.
వసంతలాంటి మధ్య తరగతి ఆడపిల్లలకు ఆర్థిక వనరులు కూడ పరిమితం. ఆమె పెళ్ళి కోసం తండ్రి ఇరవైవేలు జాగ్రత్త చేసి ఉంచాడు. ఇప్పుడు ఉద్యోగాన్ని డబ్బు పెట్టి కొనాలంటే అదనంగా సమకూర్చలేడతను. తమకున్న పరిమిత ఆర్థిక వనరుల కారణంగా వసంత ఇప్పుడు డబ్బు పెట్టి ఉద్యోగాన్ని కొనుక్కోవాలా? మొగుణ్ణి కొనుక్కోవాలా? అన్న విచికిత్సలో పడింది. తనలోని సంఘర్షణకు, సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి తన తోటి ఆడపిల్లలతో మాట్లాడటమే ఆమెకున్న ఏకైక వర్గం. ఎందుకంటే వాళ్ళవి కూడ తనలాంటి అనుభవాలే. కనుక అందుకని కాత్యాయనితో ఫోనులో మాట్లాడింది. ఉద్యోగం కొనటమే సబబు మనిషిని కొనడం కన్న అన్న కాత్యాయని అభిప్రాయన్ని తన అభిప్రాయంగా చేసుకుని వసంత కార్యరంగంలోకి దిగడంతో కథ ముగుస్తుంది.
వసంత లాగ కాత్యాయని లాగ కట్నాలిచ్చి మొగుళ్ళను కొనుక్కోవలసిన స్థితిలోను పెళ్ళిళ్ళ మార్కెట్లో పెళ్ళి కొడుకుల అవసరాలను, ఆకాంక్షలను బట్టి ఉద్యోగాలు చేయవలసిన వాళ్ళుగానువుంట, ఆధునిక చదువుల వలన ఏర్పడిన స్వేచ్ఛ స్వాతంత్య్ర భావాలను, ఆడపిల్లలుగా తమ జీవితాలకు అభివృద్ధి వ్యవస్థ విధించిన పరిమితులకు మధ్య ఘర్షణ పడుతున్న వాళ్ళు వీళ్లంత ఆధునిక భారతదేశపు ఆడబిడ్డలు, వీళ్ళ సంవేదనను చూడమని చెప్తుందీ కథ.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో