రెండు దశాబ్దాల స్తీల్ర పయ్రాణం

స్త్రీలంటే శరీరాలు, స్త్రీలంటే పని… స్త్రీలంటే కన్నీళ్ళు, కష్టాలు… స్త్రీలంటే శృంగార సాహిత్య రూపాలు మాత్రమే అయిన సామాజిక సందర్భం నుండి స్త్రీలకి శరీరమూ, హృదయమూ, మెదడూ వున్నాయనీ, వాటికి సరయిన వ్యాయామం యివ్వాలనీ గుర్తించి, పితృస్వామ్య సంస్కృతి స్త్రీల జీవితాల చుట్టూ అల్లిన మాయాజాలమును బద్దలు కొట్టి స్త్రీవాద భావజాలం తెలుగు పౌర సమాజంలో విస్తరించడానికీ, వేరుచుకొనడానికీ చేసిన పోరాటం, ఆ క్రమంలో సాహిత్యంలో వివిధ కోణాలనుండి బహుముఖీనంగా… విశ్వరూపం తో విస్తరించిన స్త్రీ రచయితలు… ఈ మొత్తం సాహిత్య పరిణామాలన్నింటికీ కూడా కాత్యాయనీ విద్మహే ప్రత్యక్ష సాక్షీభూతం… సాహిత్య అధ్యయన, అధ్యాపక రంగాలలో ఆమె చేస్తోన్న నిరంతర కృషి. తొలినాటి నుండీ స్త్రీల పోరాటాలలోనూ, సాహిత్య సందర్భాలలోనూ కలిసి అడుగులు వేసిన విషయం మనందరికీ విదితమే.

కాత్యాయనీ వివిధ సందర్భాలలో, వివిధ ప్రదేశాలలో సమర్పించిన సెమినార్ పత్రాలు, యిచ్చిన ఉపన్యాసాలూ… స్త్రీవాద సాహిత్యం మీద వ్రాసిన వ్యాసాలూ (వివిధ ప్రత్యేక సంచికల కోసం) ఇలా ఒకచోట గుది గుచ్చి సంపుటి చేయడం నిజంగా అభినందించదగిన విషయం. ఉపయుక్తమైనదీ కూడా…

‘ఆధునిక తెలుగు సాహిత్యం – స్త్రీవాద భూమిక’ అన్న ఈ చారిత్రక సంపుటిలో మొత్తం తొమ్మిది వ్యాసాలున్నాయి. పితృస్వామ్య భావజాలంపై, పెత్తనంపై స్త్రీలు చేసిన సమరాల నుండి… శరీర రాజకీయాలు, లైంగిక సంబంధాలు, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు… యివ్వాళ సామాజిక సంబంధాలకి కూడా స్త్రీలు ఎలా సాహిత్య రూపాన్ని యిస్తూ వస్తున్నారో సవివరంగా చర్చించబడిందీ వ్యాసాల్లో…

ఐక్యరాజ్య సమితి 1975 వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించడం… ఈ అంతర్జాతీయ ప్రేరణ దేశీయ స్థితి గతులను సమీక్షించుకుని స్త్రీల సమస్యలకు కారణాలను అన్వేషించేందుకు, అధ్యయనం చేసేందుకు… గ్రూపులుగా సమీకృతమయ్యేందుకు స్త్రీలకెలా తోడ్పడిందో చెప్తూ… ఆనాటి నుండీ ఈనాటివరకూ విముక్తి పోరాటాలలో, సాహిత్య రూపాలలో స్త్రీల పాత్రను, కృషినీ వివరిస్తుందీ పుస్తకం…

సావిత్రి వ్రాసిన ‘బందిపోట్లు’ కవిత లోకంలో సర్వసాధారణంగా, ప్రయోగింప బడుతోన్న అభివ్యక్తులకు – స్త్రీవాద సిద్ధాంత జ్ఞానం పెళ్ళికి, మొగుడికీ వున్న అసలు అర్ధాలను తెలియజెప్తుంది… బందిపోట్లు కవిత ఈ తెలివిడిని యిస్తే ఆ పీడకీ, అధికారిక వ్యవస్థల మీద విమర్శ, నిరసన, ధిక్కారం జీవిత దృక్పధంగా అభివృద్ధి చేసుకోవటాన్ని ‘మాఘ-సూర్యకాంతి’ కథ, ‘జానకీ విముక్తి’ నవల ఎలా నిరూపించాయో చెప్తారు.

ఇక అక్కడ్నుండీ తమ స్త్రీవాద, ప్రాపంచిక దృక్పధంతో, సృజనశక్తితో ఓల్గా, ఈశ్వరి, కొండేపూడి నిర్మల, జయప్రభ, విమల, ఘంటశాల నిర్మల, మంధరపు హైమవతి, పాటిబండ్ల రజని, కె. గీత, అనిసెట్టి రజిత, ఎస్. జయ, కె. వరలక్ష్మి, శిలాలోలిత, సి. సుజాత, సి. మృణాళిని వంటివారు ఎలా స్త్రీవాద సాహిత్య ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ వచ్చారో సోదాహరణంగా వివరిస్తారు…

అయితే ఈనాటి స్త్రీవాద సాహిత్యాభివృద్ధికి ఏర్పడిన మౌలిక పునాది చరిత్రని మనం ఎంత మాత్రమూ విస్మరించరాదనీ… శివరాజు సుబ్బలక్ష్మి, రంగనాయకమ్మ, అబ్బూరి ఛాయాదేవి వంటివారు ఈ పునాదిని మనకు సమకూర్చి పెట్టారని గుర్తుచేస్తూ ఆనాడు వారు రాసిన కథలు ఎలా స్త్రీ అంతరంగపుటాలోచనలకు అద్దం పట్టి పాఠకుల ముందు ఆవిష్కృతమయ్యాయో విశ్లేషిస్తారు…

స్త్రీవాద సాహిత్యానికి మరింత చేర్పును చేసిన పురుష రచయితలని కూడా ఆమె ప్రస్తావిస్తారు… కేతు విశ్వనాథ రెడ్డి, కవన శర్మ, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, మధురాంతకం నరేంద్ర వంటివారు కుటుంబంలోనూ, బయటా స్త్రీల ఒత్తిడిని గురించి అర్థం చేయించినవారే అంటూ లోకంలోని అసమానతల పట్ల ద్వేషమూ, ఉన్నత మానవ సంబంధాల పట్ల ఆపేక్షా వున్న సాహిత్య సృజనకారులు స్త్రీవాద కథా రచయితలు కావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అంటుందామె…

మొత్తం మీద మానవ సంబంధాలను ఉదాత్తీకరించే అసలైన సాహిత్య స్వభావాన్ని జీవలక్షణంగా గత రెండు దశాబ్దాలుగా వస్తోన్న స్త్రీవాద సాహిత్యం స్త్రీ, పురుష సంబంధాలపై, సామాజిక సంబంధాలపై విమర్శనాస్త్రమై పదునెక్కి స్త్రీలను స్వ స్వరూప జ్ఞాన చైతన్యాలను కల్గించడంలో విజయం సాధించిన క్రమమంతా ఈ పుస్తకంలో పొందుపరచ బడింది.

స్త్రీల పోరాటాల గురించీ, స్త్రీవాద సాహిత్యాన్ని కొత్తగా తెలుసుకోగోరుతున్న వాళ్ళు, ఇదివరకే అధ్యయనం చేస్తున్నవాళ్ళూ, ప్రత్యక్ష సాక్షులుగా వున్న వాళ్ళూ కూడా చదవదగిన చారిత్రక సంపుటి ఇది…

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుని స్త్రీవాద సాహిత్యానికే కలికితురాయిగా నిలిచిన అబ్బూరి ఛాయాదేవి ఈ వ్యాస సంపుటికి ముందుమాట వ్రాయటం సరిగ్గా అమిరింది… అలాగే చేయీ చేయీ కలిపి పట్టుకుని కలిసి నడుస్తోన్న అనేకమంది స్త్రీలు ఐక్య సంఘటన ముఖచిత్రంగా రూపుదిద్దుకోవడం కూడా తగినట్లుగా వుంది.

వాస్తవ సామాజిక స్త్రీ పురుష సంబంధాల పునర్నిర్మాణానికి ఒక గొప్ప వాగ్ధానం ఈ పుస్తకం…

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో