ఇంట్లో ప్రేమ్‌చంద్‌-3 ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్ర

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌.శాంతసుందరి

(గత సంచిక తరువాయి)
మహోబా
తరవాత మా ఆయన మహోబాకి వెళ్లారు. మా నాన్న ఇంతకుముందే నన్ను పుట్టింటికిరమ్మని పిలిచాడు. మా ఆయన్ని కూడా రమ్మని పిలిస్తే ఆయన వస్తానన్నారు. నేను వెళ్లే రోజు తీరా రానే వచ్చింది. గుమ్మం బైట టాంగా కూడా వచ్చి ఆగింది. అప్పుడు ఆయన పిన్ని రుసరుస లాడుతూ, ”ఆమెని పంపావంటే ఊరుకునేది లేదు. నువ్వేవె మహోబాకి పోతున్నావాయె, ఆమెని పుట్టింటికి పంపించటం ఎందుకు?” అంది.
”ఆమె వెళితే నీకేం?”
”లేదు, ఆమెని పుట్టింట్లో దిగబెడితే ఊరుకోను. టాంగాని పంపెయ్యి.”
”నేనిక్కడ ఉండనుగాక ఉండను!” అన్నాను.
”నన్నేం చెయ్యమంటావు, చెప్పు?” అన్నారాయన.
”మీరలా మాట్లాడటం నాకు నచ్చదు”, అన్నాను.
అప్పుడాయన నవ్వుతు, ”ఆవిడని ఒప్పించటం కష్టం, నిన్ను అలా కాదు. నువ్విక్కడ ఒక వారం రోజులుండు, ఆ తరవాత నేనొచ్చి నిన్ను తీసుకెళ్తాను. నిన్నిప్పుడు పుట్టింట్లో దిగబెట్టి వస్తే ఈ ముసల్ది నా ప్రాణాలు తోడేస్తుంది!” అన్నారు..
సరేనని, నేనే ఒప్పేసుకున్నాను. ఆయన వెళ్లిపోయరు. అక్కడికెళ్ళి ఉద్యోగం ఛార్జి తీసుకున్నారు. పదకొండోరోజు అక్కణ్ణించి ఇంటికొచ్చారు. అందరం కలిసి మహోబాకి వెళ్లటానికి సిద్ధం అవుతంటే, ఆవిడ, ”నేను రాను”, అంది. కారణం, ఆవిడ అన్నదమ్ములిద్దరు కాన్పర్‌లోనే ఉన్నారు, మాతోనే ఉన్నారు. తన అన్నయ్య నెలకి పాతిక రూపాయలు సంపాదిస్తున్నాడు, ఆవిడకి వాళ్లతోనే ఉండాలని ఉంది.
”నువ్వు వచ్చినా రాకపోయినా మా ఆవిణ్ణి మాత్రం నా వెంట తీసుకెళ్తున్నాను,” అన్నారు మా ఆయన.
”సరే తీసుకెళ్ళు”, అంది ఆవిడ.
ఆ తరవాత పిన్ని అన్నయ్య ఆవిడతో, ”నువ్వు కూడా వాళ్ళ వెంట వెళ్లు. వెళ్లకపోతే తరవాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. నవాబ్‌ మునుపటిలా నీ వెంటపడి నిన్ను బతిమాలుతాడని అనుకోకు,” అన్నాడు.
అప్పుడిక పిన్ని కూడా సరేనంది. ఆవిడ కూడా మహోబాకి వచ్చింది. మూడు నెలలుండి ఆ తరవాత తన కొడుకుతో కాన్పర్‌కి వెళ్లిపోయింది.
మహోబాలోమా ఆయన జీవితం, పొద్దున్నే లేవటం, ఏమైనా తినటం, ఆ తరవాత సాహిత్యసేవ చెయ్యటం. ఆయన అక్కడ తన ఆఫీసరుతో ప్రేమగా ఉండటం చూశాను. తనకింద పనిచేసేవాళ్లని ఆయన స్నేహితులుగా చేసుకోవాలని తాపత్రయ పడేవాడు. అక్కడే నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. కమల అక్కడే పుట్టింది. మహోబా లో పది నెలల పాటు నేను ఒంటరిగా ఉన్నాను. ఆయనకి టర్లు ఉండేవి. ్టూరు మీద వెళ్లితే నెలా పదిహేను రోజులో, రెండు నెలలో పట్టేది రావటానికి. నేను కూడా తన వెంట టూర్లమీద రావాని ఆయన కోరిక. నేను మహోబాలో ఒంటరిగా ఉండటం ఆయనకి నచ్చేది కాదు. కానీ టూర్లలో జీవితం నాకు అస్సలు నచ్చేది కాదు. అందుకే నేను మహోబాలోనే ఉండి పోయేదాన్ని.
మహోబాలో పాలు, నెయ్యి, వంట పాత్రల ఫ్రీగా దొరికేవి. కానీ వెచ్చాలు ఆయన బైటినించి తెప్పించేవారు. పాలు విపరీతంగా దొరకటంతో నౌకర్లు కోవా చేసుకుని తినేవాళ్లు. మొదట్లో ఫ్రీగా తీసుకోనని ఆయన ఎంతో చెప్పారు. అప్పుడు అక్కడున్న ధనవంతులు, అది అక్కడి పరిపాటి అనీ, ఇప్పుడు కనక మా ఆయన ఈ పరిపాటిని ఆపినట్టయితే, ఇకమీదట పాలు అలా ఇవ్వటం మానేస్తారనీ, అన్నారు. అప్పుడు కూడా మా ఆయన , అయితే ఆ పాలు నేను వాడను, నా నౌకర్లు వాడుకుంటారని అన్నారు.
అక్కడి వాళ్లకి మరొక రివాజుండేది. ఆఫీసరుగా ఉన్నవారికి బొట్టు పెట్టి, డబ్బులిస్తారు. మా ఆయన బొట్టు పెట్టించు కుని, అక్షింతలు వేయించుకునే వారు, కానీ కిళ్లీ తీసుకుని నోట్లో పెట్టుకున్నాక వాళ్లని కావలించుకుని, వాళ్లు డబ్బులివ్వబోతే మాత్రం, ”నన్ను క్షమించండి!” అనే వారు. అవతలి వ్యక్తి ఇది ఇక్కడి రివాజు అని అంటే, చాలా తియ్యగా, ”వద్దు బాబ! ఇది నా సిద్ధాంతానికి తగదు, ఈ విషయంలో మాత్రం మీరు నామాట మన్నించాలి!” అనే వారు.
ప్యూన్లకీ వాళ్లకీ ఏవైనా డబ్బులు ముడితే దానికి ఆయన ఏమీ అభ్యంతరం చెప్పేవారు కాదు. టూర్లకి వెళ్ళేప్పుడు ఆయన గుర్రమెక్కి వెళ్ళే వారు. చలికాలంలో తాను కంబళి కప్పుకుని, గుర్రానికి ఉన్ని శాలువ కప్పేవారు. ఆయనకి ఏ ప్రాణిని ్చూసినా ప్రేమే. వాటికి కూడా సేవలు చేసేవారు. చాలా అ్మాయకమైన మనిషి, అంత అమాయకుల్ని నేనెక్కడా చూడలేదు. నాకు ఎప్పుడ కోపం ముక్కు మీదే ఉండేదాయె. కానీ, అంత కోపిష్టినైన నా కోపాన్ని ఆయన క్షణంలో పోగొట్టేసేవారు. ఇంట్లో ఉండే సమయంలో ఆయన అందర తనని చూసి భయపడేలా ప్రవర్తించేవారు కాదు. సాయంకాలం అయితే చాలు కబుర్లు చెపూతూ గడిపేవారు. పని లేకుండా ఊరికే తిరిగి రావటానికి ఎక్కడికీ వెళ్లేవారు కాదు. ఒకసారి, కార్తీక మాసంలో ఒక ఎడ్ల బండి కొనాలనుకున్నారు, కానీ కొనటానికి చేతిలో డబ్బుల్లేవు. ”ఎడ్ల బండి కొనాలి, కానీ డబ్బుల్లేవు. ఎడ్లబండి కొంటే కనీసం ఇరవై రూపాయలు బత్తెం కింద దొరుకుతాయి,” అన్నారు ఆయన నాత

నా పెట్టెలో డబ్బులున్నాయని నాకు కూడా తెలీదు. ఎందుకంటే నా చేతికిచ్చిన డబ్బుని నేను పెట్టెలో ఎప్పటికప్పుడు పడేస్తూ ఉండేదాన్ని. ఆ తరవాత దాన్ని గురించి పట్టించుకోవాలనే ఆలోచనే ఉండేది కాదు. నేను నౌకరుకి డబ్బులు ఇచ్చే సమయంలోనే ఆయన నన్ను డబ్బులడిగారు. పెట్టె తెరిచి చూస్తే దాన్లో బోలెడన్ని రూపాయలు కనిపించాయి. ఉన్న డబ్బంతా బైటికి తీశాను. నోట్ల, చిల్లరా కలిపి నూటయభై రూపాయలున్నాయి. నేను ఆనందం పట్టలేక ఆయన దగ్గరికి గబగబా వెళ్లి, ”మీకు నేను నూటయభై రూపాయలివ్వగలను,” అన్నాను. ఆయన నవ్వుతూ, ”భలే దానివే! నీ పెట్టెలో నూటయభై రూపాయలున్నా యన్న విషయమే నీకు తెలియలేదా?” అన్నారు.
”ఏదో పేదవాడి పెళ్లాంలాగా రోజూ డబ్బులు లెక్కపెట్టి ్చూసుకుంట ఉంటానా? ఆ పెట్టెలో పడేస్తే అందులోనే పడి ఉంటాయి! ఖర్చయిపోతే ఎలా ఉంటాయి?” అన్నాను.
”పోన్లే అక్కర తీరిపోయింది. ఈ డబ్బుల్తో బండీ, ఎడ్ల అన్నీ కొనుక్కోవచ్చు,” అన్నాడాయన.
మర్నాటికల్లా ఎడ్ల, బండీ వచ్చేశాయి. ఆయన నాతో, ”నా మాట ఒక్కసారి విను. చర్‌ఖారీలో రేపు తిరనాళ్లుంది. ఇద్దరం వెళ్దాం,” అన్నారు.
”సరే అలాగే వెళ్దాం,” అన్నాను.
మేమందరం మొత్తం పదిమందిమి. అందరం ఎడ్లబండి మీదే వెళ్లాం. ఆయన మటుకు గుర్రం మీదెక్కి వచ్చారు.
అక్కడికెళ్లాక, డేరా వేయించారు. రాజుగారి మనుషులకి డెప్యూటీ గారు వచ్చారని తెలిసింది. సాయంకాలానికల్లా భోజనసామగ్రి వచ్చింది. సాయంత్రం వంట వండారు. ప్యూన్లలో ఒకాయనకి వంట వచ్చు, అతనే వంట చేశాడు. అందరం భోజనాలు చేశాక తిరనాళ్లు చూడటానికి బైలుదేరాం. నే్ను, నా స్నేహితురాలొకామే ఆడవాళ్ల విభాగంలోకీ,మా ఆయన మగవాళ్ల విభాగంలోకీ వెళ్లాం. అక్కడ సర్కస్‌ చాలా బావుంటుందని ప్రతీతి. కానీ రెండు గంటలు గడిచాక నాకు గాభరా అనిపించి, నా స్నేహితురాలితో డేరా దగ్గరకి వచ్చేశాను. ఆయన రాత్రి ఏ ఒంటిగంటన్నరకో వచ్చారు. నేను నా స్నేహితురాలితో డేరా లోపలున్నాను, మగవాళ్లందరు బైట – లోపలికొచ్చి ఆయన నాతో, ”ఏమిటి, నువ్వేమీ చూడలేదా? అంత త్వరగా వెళ్లిపోయవు?” అన్నారు.
”అవును. నాకు ఒంట్లో బాగాలేదనిపించింది. ఇంత దూరం కష్టపడి వచ్చి కూడా ఏమీ చూడలేదు!” అన్నాను.
మర్నాడు మేం ఇంటికొచ్చేశాం. ఆ తరవాత ఏడేళ్లు మేం అక్కడే ఉన్నాం. ఎన్నోసార్లు ఆయన తిరునాళ్ల కెళ్దామన్నా కూడా నేను రానన్నాను. ఆయన ఒక్కరే వెళ్లారు. ఎప్పుడైనా అలా తిరిగి రావాలనిపించినప్పుడు, అడవిలోకి వెళ్దామని అనేదాన్ని. ఆయన ఆనందంగా ఒప్పుకునేవారు. అడవి బైటే బండి దిగి ఇద్దరం నడిచి లోపలికి వెళ్లేవాళ్లం. పగలంతా అక్కడే తిరుగుత, వాగుల్లో నీళ్లూ తాగుతు, చెట్లకున్న పళ్లు కోసుకుని తిం్టు, గడిపేసేవాళ్లం. కొండమీదికెక్కి అక్కడంతా తిరిగి ్చూసేవాళ్లం. సాయంకాలానికల్లా ఇంటికి చేరుకునేవాళ్లం. నేను ప్రేమించే వాటినన్నిటినీ ఆయన కూడా ప్రేమించేవారు. మహోబాలో మేం ఉండిన పేటలో అందరూ కాయస్థులే ఉండేవాళ్లు. పండగలకీ పబ్బాలకీ ఒకరింటికి ఇంకొకరు వెళ్లేవాళ్లు. కానీ నేను ొమాత్రం ఎవరింటికీ ఎప్పుడ వెళ్లలేదు. మా ఆయన మాత్రం అందరితో స్నేహంగా ఉండేవారు. మిగతా ఆడవాళ్లు మా ఇంటికి వచ్చేవాళ్లు.
మహోబాలో ఎవరింట్లోనైనా పెళ్లయితే, ఆ యింటి ఆడవాళ్లు పెళ్లికొడుకు ఊరేగుతు వెళ్లిన తరవాత రాత్రి ఇంటింటికీ వెళ్లి పాటలు పాడేవాళ్లు. ఒక చేతిలో హారతి పళ్లెం, రెండో చేత్తో అప్పడాలకర్రా పట్టుకుని ఇల్లిల్ల తిరిగేవారు. ఇంట్లో ఉండే మగాళ్లు మాత్రం పెళ్లికొడుకుతో ఊరేగింపుగా వెళ్లేవారు కాదు, వాళ్లని ఈ ఆడవాళ్లు ఆ అప్పడాలకర్రల్తో కొట్టేవాళ్లు.
ఒకసారి వాళ్లు మా ఇంటికి కూడా వచ్చారు. మా ఆయన గుమ్మంలోనే పడుకుని ఉన్నారు. ఆడవాళ్లు ప్యూన్లనీ వాళ్లనీ కొట్టారుకాని, ఎందుకో ఆయనమీద మాత్రం జాలి చూపించారు. ఆయన భయంతో అసలు ముందే గదిలోకి పారిపోయరు.
మహోబా (2)
మహోబాలో నేను ఒంటరిగా ఉండటం ఆయనకి బాధ కలిగించేది. మాటిమాటికీ, నువ్వు కూడా నాతో రాకూడదా, అంటూ ఉండేవారు. నువ్వొక్కదానివీ ఎంత అవస్థపడుతున్నావో కదా అని ఎప్పుడ నీగురించే ఆలోచిస్తూ ఉంటాను, అనేవారాయన.
”నేను మీతో వచ్చి అక్కడ ఎలా ఉండగలను?” అనేదాన్ని.
”అందులో తప్పేముంది? నేను ఇన్‌స్పెక్షన్‌కి వెళ్లేప్పుడు కూడా నువ్వు నావెంట రావచ్చు. నాకక్కడ ఒక కాన్వాసు డేరా ఏర్పాటుచేస్తారు. నువ్వు అందులో కూర్చుని హాయిగా చదువుకోవచ్చు. వంటతను ఎలాగ మనతోనే ఉంటాడు. నేను కూడా రోజంతా బైటే గడపను కదా, మహా అయితే ఒక గంటసేపు. సాయం కాలాలు మనం కొండలవైపుకి షికారుకి వెళ్లచ్చు.”
”మనదేశంలో మగాళ్లెవరు పెళ్లాలని వెంటపెట్టుకుని ్టూర్లకి వెళ్లరు. అందరు వింతగా ్చూస్తారు.”
”నాకేమీ వింతగా అనిపించదు. నువ్వు నీ బుర్రలోంచి ఈ పాత చింతకాయపచ్చడి ఆలోచనల్ని తీసెయ్యలి అని చెపుతనే ఉన్నాను, కానీ నువ్వు వినిపించుకుంటేగా?”
”నాకు అది అపహాస్యంలా అనిపిస్తుంది,” అన్నాను.
”ఇంగ్లీషువాళ్లని చూడు, ఎంత హాయిగా, సరదాగా ఉంటారో!”
”ఇది ఇంగ్లీష్‌ వాళ్ల దేశం కాదు, మనదేశం!”
”అందుకే ఇలా అవస్థలు పడు తున్నాం. నిన్నిలా వదిలివెళ్లటం నాకు చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. నువ్విక్కడా, నేనక్కడా, ఇలా ఒకరిగురించి ఒకరం ఆందోళనపడుత ఉండటం వల్ల లాభం ఏమిటి?”
”మీరెన్నైనా చెప్పండి, నాకు సిగ్గని పిస్తుంది. ఇక అక్కడ హాయిగా ఎలా ఉండగలుగుతాను? మీరు ఒకరోజు ఇక్కడా, మర్రోజు మరోచోటా ఉంటారు. నేనొచ్చినా ఏం లాభం?”
”నేన రోజూ తిరగవలసి వస్తుంది.”
”అవును, అలా తిరగటానికే ప్రభుత్వం మీకు జీతం ఇస్తోంది, అది కాక బత్తెం కూడా ఇస్తుంది. నాకేం దొరుకుతుంది?”
”నీకు విశ్రాంతి దొరుకుతుంది, ఇంకేమిటి?”
”నాకు అలాంటి విశ్రాంతి అక్కర్లేదు.”
”అయితే ఇక నేను చెయ్యగలిగిందేమీ లేదు!”
మా ఆయన అక్కగారు, ఆయనా
ఆయన అక్కయ్యకీ, పిన్నికీ ఒక్క క్షణం పడేది కాదు. పిన్నితో పోట్లాట పెట్టుకుని మా ఆడబడుచు పదిహేనేళ్లు పుట్టింటి మొహం చూడలేదు. నేను తరచు ఆయన్ని, మీ అక్కగార్ని ఎందుకు రమ్మని అనరు? అని అడిగేదాన్ని.
”ఆవిణ్ణి ఎలా రమ్మనేది? ఆవిడకీ ొమా పిన్నికీ మధ్యన పచ్చిగడ్డి వేస్తే భగ్గు మంటుంది!”
”అయితే మీ పిన్నికి మీరు పూర్తిగా దాసోహం అయిపోయినట్టేనా? ఆవిడకన్నా ముందు మీ అక్కయ్యకే ఈ ఇంటిమీద హక్కుంది,” అన్నాను.
”కానీ పరిస్థితులు బాగాలేవు కదా! నాన్న లేరు. అక్కయ్య తనింట్లో హాయిగా బతుకుతోంది. ఇక్కడికొస్తే ఈవిడతో పోట్లాటలు తప్ప ఏమీ ఉండదు. పోనీ ఈవిడ తన పుట్టింటికి వెళ్తుందా అంటే, అదీ లేదాయె! ఈవిడ అన్నదమ్ములిద్దరు నా నెత్తినే ఎక్కి కూర్చున్నారు!”
”అది మీ తప్పే,” అన్నాను.
”చాలా అన్యాయంగా ్మాట్లాడు తున్నావు.”
”అన్యాయంగా మాట్లాడటమేమిటి? తల్లీ తండ్రీ లేని తోబుట్టువుని, ఒకే ఒక తమ్ముడు బతికుండి కూడా, ఇంటికి పిలవకపోతే, ఏమనాలి? ఆవిడ మనసులో ఏమనుకుంటోందో! ఒకవేళ నేనే రావద్దని అన్నా మీరు మాత్రం ఆవిడని రమ్మని పిలవటమే న్యాయం.”
”నీకు తెలీదు. నీతోనే ఇరవై నాలుగ్గంటల పోట్లాడుతు ఉంటుంది ్మా పిన్ని. ఇక మా అక్కయ్య కూడా వచ్చిందంటే నీకు సుఖం లేకుండా పోతుంది.”
”ఇంతకన్నా మీరు పెళ్లి చేసుకోకుండా ఉన్నా బావుండేది.”
”అరె, నీకూ మా అక్కకీ తేడా లేదా? నువ్వు మా పిన్నికి ఎదురుజవాబివ్వగలవు, మా అక్క నోరు కూడా తెరవలేదు.”
”నేను మీ వాదనలు వినదల్చు కోలేదు.”
”నువ్వే ఆలోచించు, నాకు మాత్రం మా అక్క ప్రేమ అక్కర్లేదా? ఆవిడ మీద నాకు ప్రేమ ఉండదా?”
”కానీ మీరు పిరికిపంద కదా? మీరే మీ పిన్నిని నెత్తికెక్కించుకున్నారు. లేకపోతే అందరికీ వాళ్ల వాళ్ల స్థానం దొరికేదే!”
”అవును, నువ్వు కావాలంటే నేను పిరికిపందనని అను, కానీ నాకు హృదయం లేకపోలేదు. నాకు కూడా ఈ విషయం ఆలోచించినప్పుడల్లా బాధగానే ఉంటుంది.”
”మీ పిన్ని మీతో ఏమంత మంచిగా ఉంటోందని ఆవిడ చెప్పినట్టు వింటున్నారు? మీ సంపాదన ఆవిడ అన్నదమ్ములు తినచ్చుకానీ, మీ అక్కయ్య తినకూడదా?”
”ఇదంతా ఆత్మాభిమానం ఉన్న ఆడవాళ్లకి వర్తిస్తుంది. కానీ అవిలేని వాళ్ల పట్ల నన్ను కూడా చెడ్డగా ప్రవర్తించ మంటావా?”
”మీ అక్క మీ గురించి ఏమను కుంటోందో ఏవె!”
”అక్కయ్యకి కూడా పరిస్థితి తెలుసు కాబట్టి ఏడ్చి ఊరుకుంటుంది.”
”దేవుడిచ్చిన శిక్షని మనిషి భరిస్తాడు, కానీ తనవాళ్లే బాధపెడితే ఎవరైనా ఎలా మర్చిపోగలరు?”
”అమ్మ చనిపోయిందన్న బాధ నాకున్నట్టే మా అక్కకి కూడా ఉంటుంది.”
”అయితే మీ అక్క ఏడుపుని పట్టించుకునే వాళ్లెవరున్నారు?”
”మరేం చెయ్యలో నువ్వే చెప్పు!” అన్నాడాయన.
”ఏం చెయ్యద్దు, చేతులు ముడుచుకుని కూర్చునుండండి!” అన్నాను.
”నా లెక్కన మా అక్కయ్య ఇక్కడికన్నా అక్కడే సుఖంగా ఉంది. ఒకటిరెండుసార్లు నేను రమ్మంటే వచ్చింది. ఇక్కడ ఆవిడ పరిస్థితిని నేను కళ్లారా చూశాను.”
”మీలాంటి బుద్ధిలేని మనుషులున్న చోట, మరి పరిస్థితులు అలా ఉండక ఏంచేస్తాయి!” అన్నాను.

నేనామెని ఒక్కసారే ొచూశాను. ఆ తరవాత ఆవిడ పోయింది. అక్క పోయి, ొమా పిన్ని విడిగా ఉండటం మొదలుపెట్టాక, అక్కయ్య కూతుళ్లు ముగ్గుర్నీ ఈయన సొంత కూతుళ్లలాగ చూసుకోసాగారు. ప్రతి సంవత్సరం ముగ్గుర్నీ ఇంటికి పిలిచేవారు. చనిపోయిన తన అక్కయ్యని ఆయన వాళ్లలో ొచూసుకునేవారు. ఆ అమ్మాయిల పిల్లల్ని ఎత్తుకుని ఆడించేవారు, ముద్దుచేసేవారు. మీరు మీ అక్కయ్యని కూడా ఇంత ప్రేమగా చూసుకుని ఉంటే ఆవిడ సంతోషించేది కాదా? అని నేనప్పుడప్పుడ అనేదాన్ని.
”ఏం చెయ్యను? గత్యంతరం లేక పోయింది కదా! నేను ొమా అమ్మకీ, అక్కయ్యకీ ఏమీ చెయ్యలేకపోయను.” ఇలా అంటున్నప్పుడు ఆయన గొంతు తరచు గద్గదమయేది.
1905
నేను రాకముందునించే ఆయన సాహిత్యసేవ చేస్తున్నారు. ఆయన రాసిన మొదటి నవలను, ‘కృష్ణా’ ప్రయగలో అచ్చయింది. నా పెళ్లైన ఏడాదే ఆయన రెండో నవల ‘ప్రెమ’ ప్రచురించబడింది. దాని పేరు ఆ తరవాత ‘విభవ్‌’ అని మార్చారు. నా పెళ్లైన ఏడాది తరవాత ఆయన మొదటి కథాసంపుటి, ‘సోజెవతన్‌’ (మాతృభమికి కష్టకాలం) అచ్చయింది. దానిమీద కోర్టు కేసు కూడా నడిచింది. మేం అప్పుడు మహోబాలో ఉన్నాం. అక్కడిక్కూడా పోలీసు గూఢచారులు వచ్చారు. ఆ తరవాత కలక్టర్‌ దగ్గర్నించి తనని వచ్చి కలవమని ఆజ్ఞ అయింది. టూర్‌ మీదుండగా కలెక్టర్‌ పంపిన ఆర్డర్‌ ఆయనకి అందింది. రాత్రంతా ఎద్దుబండిలో ప్రయణం చేసి ఆయన కుల్‌పహాడీ చేరుకున్నారు. ఆ రోజే అసలు ఆయన ఇంటికి రావలసి ఉంది. మర్నాడు వచ్చాక, నిన్నంతా ఎక్కడున్నారని అడిగాను.
”చెపుతానుండు, పెద్ద చిక్కులో ఇరుకున్నాను. రాత్రంతా బండిలో ప్రయణం చేస్తూనే ఉన్నాను,” అన్నాడాయన.
”అరే, ఏమయింది?” అన్నాను.
” ‘సోజేవతన్‌’ గురించి అడగటానికి కలెక్టర్‌ నన్ను పిలిపించాడు.”
”ఇంతకీ అసలు సంగతేమిటి?”
”కలెక్టర్‌ దగ్గరకెళ్లేసరికి ఆయన బల్ల మీద నా పుస్తకం కనిపించింది. దాన్ని గురించి మాట్లాడటానికి రమ్మన్నాడు.”
”అయితే ఏం జరిగింది చివరికి?”
” ‘ఈ పుస్తకం నువ్వు రాసినదేనా?’ అని అడిగాడు కలెక్టర్‌. నేను అవునన్నాను. దాన్ని చదివి వినిపించాను కూడా. అంతా విని, ‘ఈనాడు ఇక్కడ ఇంగ్లీషువాళ్ల పరిపాలన లేకపోయుంటే, నీ రెండు చేతుల్నీ నరికేసేవారు. నువ్వు కథలు రాసి తిరుగు బాటు తీసుకొద్దామనుకుంటున్నావు. నీ దగ్గర ఉన్న ఈ పుస్తకం ప్రతులన్నీ నాకు పంపించెయ్యి. ఇక మీదట ఎప్పుడ కూడా ఏమీ రాయటానికి వీల్లేదు! అన్నాడు”.
”ఆ పుస్తకాలేవో పంపించేద్దుర,” అన్నాను.
”బావుంది! అరే, కొద్దిలో పోయింది. నేనింకా పెద్ద ఆపదే వస్తుందని అను కున్నాను.”
”అయితే మరి ఇంక మీదట రాయటం కూడా మానేస్తారా?” అన్నాను.
”ఎందుకు రాయను? మారుపేరుతో రాయలి. పోన్లే, ఈసారికి ప్రమాదం తప్పింది. కానీ ఇది ఇంతటితో ఆగిపోదనే అనుకుంటా,” అన్నారు.
”లేదండీ, అవాల్సిందంతా అయిపోయింది. ఆ కథల వల్ల మీకింత ఆపద కలిగింది, కానీ నేను ఆ కథలు చదవనే లేదు!” అన్నాను.
”ఇది ఎప్పుడ ఉండేదేలే! ఏదైనా పుస్తకాన్ని ప్రభుత్వం నిషేధిస్తే దాన్ని కొనేవాళ్ల సంఖ్య పెరుగుతుంది. అందులో ఏముందో తెలుసుకోవాలన్న కుతహలమే దానికి కారణం.”
”మీరెప్పుడ ఆ కథలు చదివైనా వినిపించలేదు. నాకు ఉర్దు రాదు కదా!”
”సరే, ఈసారి అచ్చయినప్పుడు వినిపిస్తాలే,” అన్నారాయన.
”తప్పకుండా వినిపించాలి,” అన్నాను.
పెళ్లికి ముందు నాకు సాహిత్యంలో అసలు అభిరుచే ఉండేది కాదు. దాన్ని గురించి నాకేమీ తెలీదు కూడా. నా చదువు కూడా అంతంత మాత్రమే.
కాన్పర్‌లో ఉండగా ‘సోజెవతన్‌’ కాపీల పార్సిల్‌ వచ్చింది. ఒక కాపీ నేను తీసి పెట్టుకున్నాను. మిగతావన్నీ మేజిస్ట్రేటు దగ్గరకి పంపేశారు.
ఆ రోజుల్లో నేను ఒంటరిగా మహోబాలో ఉండేదాన్ని. ఆయన ఖాళీగా ఉన్న సమయంలో నాతోనే గడిపేవారు, తన రచనల్ని వినిపించేవారు. ఇంగ్లీషు వార్తా పత్రిక చదివి, దాన్ని తర్జుమాచేసి నాకు చెప్పేవారు. ఆయన రాసిన కథలు వినీవినీ నాకు కూడా సాహిత్యమంటే అభిరుచి కలగసాగింది. ఆయన ఇంటిదగ్గర ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి చదివి వినిపించ మని అడిగేదాన్ని. పొద్దున్న రాసుకునేవారు. ఆ తరవాతే ఇన్‌స్పెక్షన్‌కి వెళ్లేవారు. ఈ విధంగా నాకు ఆయన సాహిత్య జీవనాన్ని పంచుకునే అవకాశం దొరికింది. ఆయన టూరుకి వెళ్లినప్పుడు నేను రోజల్లా పుస్తకాలు చదువుకునేదాన్ని. ఈ రకంగా నాకు సాహిత్యంలో ప్రవేశం దొరికింది.
ఆయన ఇంట్లో ఉంటే, నాకు చదవాలని అనిపించేది కాదు. నాకు కూడా కథలు రాయలనిపించేది. నాకున్న జ్ఞానం నామ మాత్రమైనదే అయినా, ఎలాగోలాగ కథ రాయలని ప్రయత్నించేదాన్ని. ఆయనలాగ ఏం రాయగలను కానీ, రాస ిరాసి చింపేసేదాన్ని. ఆయనకి చూపించే దాన్ని కాదు. ఆయన కథల గురించి ఏదైనా విమర్శ వస్తే నాకు చదివి వినిపించేవారు. ఆయన్ని విమర్శకుడు పొగిడితే నాకు బావుండేది. చాలాసేపు ఆ ఆనందం అలాగే ఉండేది. నా మొగుడి గురించి ఇంత గొప్ప విమర్శ వచ్చింది కదా అని గర్వంగా కూడా ఉండేది. ఆయన గురించి ఎవరైనా తప్పుపడుతూ విమర్శించినా దాన్ని ఆయన చాలా ఇష్టంగా చదివేవారు. కానీ నాకు చాలా బాధ అనిపించేది.
నేను అలా కథలు రాస్త, చింపేస్తూ ఉండేదాన్ని. తరవాత సంసారంలో పడి, కొన్నాళ్లు నేను రాయటం వనేశాను. ఎప్పుడైనా మనసులోకి ఏదైనా ఆలోచన వస్తే ఆయనకి చెప్పేదాన్ని, దాన్ని కథగా మలచమని అడిగేదాన్ని. ఆయన కూడా కథ రాసేవారు.
చాలా ఏళ్ల తరవాత 1913 ప్రాంతాల్లో, ఆయన హిందీలో కథలు రాయటం ప్రారంభించారు. ఒకోసారి ఊర్ద కథని హిందీలోకీ, హిందీకథని ఉర్దూలోకీ అనువదించేవారు.
నా మొదటి కథ ‘సాహస్‌’ చాంద్‌ అనే పత్రికలో అచ్చయింది. నేనా కథని ఆయనకి చూపలేదు. పత్రికలో పడ్డాక ్చూశారు. మేడమీదికి వచ్చి, ‘ఓహో! అయితే తమరు కూడా రచయిత్రి అయిపోయరా? ఈ కథని నేను ఆఫీసులో చూశాను. ఆఫీసులో అందర చదివి ఒకటే నవ్వటం. చాలా మంది నేనే రాసి ఉంటానని అను వనించారు!” అన్నారు.
అప్పట్నించీ నేనేం రాసినా ఆయనకి చూపించేదాన్ని. కానీ ఒక విషయం గురించి ొమాత్రం నాకు కొంచెం ఆందోళనగా ఉండేది, నా కథలు ఆయన కథల్ని అనుకరించటం లేదు కదా? అనిపించేది. ఎందుకంటే నాకు లోకం ఏమైనా అంటుందనే భయం ఎక్కువ.
ఒకసారి గోరఖ్‌పూర్‌లో ఉండగా డా|| అనిబిసెంట్‌ రాసిన ఒక పుస్తకాన్ని ఈయన తీసుకొచ్చారు. నేనా పుస్తకం చదువుతానని అన్నాను. నీకు అర్థం కాదన్నారాయన. ”ఎందుకు కాదు? నాకివ్వండి, ముందు!” అన్నాను. ఆ పుస్తకాన్ని వదలకుండా ఆరునెలలపాటు చదివాను. రావయణం లాగ పైకే చదివేదాన్ని. ఆ పుస్తకంలోని ప్రతిమాటనీ నా మనసులో ముద్రించుకోవా లన్నది నా ప్రయత్నం. మరి ఆయన ఆ పుస్తకం నాకర్థం కాదని అన్నారుగా, అందుకే పట్టుదల. నేనా పుస్తకాన్ని ముగించి, ఆయన చేతికిస్త, ”సరే, ఈ పుస్తకం గురించి మీరు నన్ను ప్రశ్నలడగండి. నేను దీన్ని పూర్తిగా చదివేశాను,” అన్నాను. ”అలాగా?” అన్నారాయన నవ్వుతూ.
”మీకు వెయ్యి పనులుంటాయి. మరి నాలాంటి పనీపాటాలేనివాళ్లూ ఏదైనా మొదలుపెడితే పూర్తి చేసికాని ఊపిరి పీల్చుకోరు!” అన్నాను.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో