‘భూమిక’ ఉద్దేశ్యాలు

 

ఏ ఏ మాత్రం గుర్తింపు పొందని, అంచులకు నెట్టి వేయబడిన స్త్రీల చరిత్ర, కళలు, సాహిత్యాలను వివిధ భాషల నుంచీ సేకరించి ప్రచురించటం.

ఏ స్త్రీలు సృజనాత్మకమైన తమ ప్రతిభా పాటవాలను ఇతరులతో పంచుకునే విధంగా చోటు కల్పించటం.

ఏ భారతీయ సాహిత్యంలోనూ, ప్రపంచ సాహిత్యంలోనూ ఉన్న స్త్రీల సాహిత్యాన్ని పరిచయం చేయటం.

ఏ మూస పద్ధతిలో కాకుండా, స్త్రీల వాస్తవ జీవితాశలను ప్రతిబింబించే కథలు, కవితలు, పాటలు సేకరించటం.

ఏ స్త్రీవాద దృక్పధం నుంచి సాంఘిక-ఆర్థిక-రాజకీయ పరిస్థితులను విశ్లేషణాత్మకంగా పరిశీలించటం.

ఏ వివిధ రంగాలలో నిపుణులైన స్త్రీ కళాకారుల జీవన పరిస్థితులు, చరిత్ర గురించి వారి మాటల్లోనే పరిచయం.

ఏ సినిమాలు, టెలివిజన్‌, రేడియో కార్యక్రమాలపై, అలాగే ప్రాచుర్యం పొందిన ఈనాటి సంస్కృతిని సమీక్షిస్తూ చర్చలు నిర్వహించటం.

ఏ ఇప్పటివరకు ముఖ్యమైన విషయాలుగా గుర్తింపబడని స్త్రీల ఆరోగ్యం, కుటుంబ హింస, ఇంటిచాకిరి వంటి అంశాల గురించి చర్చించటం.

ఏ స్త్రీలు, దళితులు, మైనారిటీలకు సంబంధించి ఏ వివక్షతా ధోరణులకూ తావీయని పిల్లల సాహిత్యాన్ని అన్ని భాషల నుంచి సేకరించి ప్రచురించటం.

ఏ స్త్రీల విషయాల మీద ప్రభుత్వ ప్రణాళికలు, వాటి పనితీరు ఫలితాలపై సమాచారం, అలాగే వాటి మీద స్త్రీల సంఘాల, కార్యకర్తల అభిప్రాయాలు, అనుభవాలు సేకరించటం.

ఏ కులం, మతం, వర్గం వంటి సరిహద్దులు లేకుండా స్త్రీలు తమ జీవితాల్లోని సంఘర్షణలనూ, అనుభవాలనూ పంచుకోవటానికి అవకాశం కల్పించటం.

ఏ స్త్రీల విషయాలపై ఇప్పటి వరకూ ఉన్న చట్టాలు, వాటి వివరాలు, వాటి పని తీరు, న్యాయస్థానాల్లో వివక్షతా ధోరణులు – న్యాయవాదుల ప్రతిస్పందన.

ఏ స్త్రీల కోసం స్వయం ఉపాధి అవకాశాలు-వాటి వివరాలు (వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న ప్రణాళికల వివరాలు).

ఏ విద్యా, ఉద్యోగ రంగాలలో స్త్రీలకున్న రిజర్వేషన్‌ సౌకర్యాలు.

ఏ స్త్రీల ఆరోగ్య సమస్యలు – వైద్య వ్యవస్థ గురించి అవగాహన.

ఏ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్త్రీల ఉద్యమాలు, సంస్థల నివేదికలు.

ఏ పుస్తక సమీక్షలు.

ఏ వార్తా సంకలనాలు, సంబంధిత సమావేశాల నివేదికలు.

ఏ ఛాయా చిత్రాలతో కూడిన వార్తా నివేదికలు.

Share
This entry was posted in భూమిక సూచిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.