వర్తమాన లేఖ -శిలాలోలిత

 

ప్రియమైన ‘చాగంటి తులసి’ గార్కి నమస్తే. ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి చాన్నాళ్ళ యింది. చాసో సభలో మొదటిసారిగా మిమ్మల్ని చూశాను. ఆ తర్వాత సినారె గారి అవార్డు సభలో మిమ్మల్ని చూశాను. మీరు చేసిన సాహిత్య కృషంతా తెల్సిన తర్వాత మీ పట్ల గౌరవం మరింత పెరిగింది, అట్లాగే ప్రేమ కూడా. ఒక్క మనిషి ఇన్నిన్ని పన్లు చెయ్యగలరా అని ఆశ్చర్యం కూడా వేసింది. విజయనగరంలో చాసో గారింట పుట్టిన మీ చెంత సాహిత్య వాతావరణమంతా అల్లుకొని ఉండడంతో నాలుగో ఏటనే కథను రాయగలిగారు. ‘భరతపక్షి’ అనే ఆ కథను శ్రీరంగం నారాయణబాబు బాలపత్రికకు పంపారు.

విభిన్న ఇతివృత్తాలు మీ కథలకు ప్రత్యేకం. వడదెబ్బ, అప్పన్న, యాష్‌ ట్రే, వలయం, చిన్న దేవేరి, వైవాహిక ఇలా ఎన్నింటినో చెప్పుకోవచ్చు. ఒరియా నుంచి, హిందీ నుంచి తెలుగులోకి అనువాదాలు, తెలుగు నుంచి హిందీలోకి అనువాదాలు విస్తృతంగా చేశారు.

మీ కథలు కాలపరీక్షకు నిలిచి బతికిన కథలు, బతుకును చెప్పిన కథలు. అందుకే మీరు పేరెన్నికగల రచయిత్రి అయ్యారు. ఎంతోమందికి మార్గదర్శకు లయ్యారు. రచనను ఒక సామాజిక బాధ్యతగా, సీరియస్‌గా తీసుకోవడం వల్లనే మీరొక ఉత్తమ రచయిత్రిగా నిలిచిపోయారు. ప్రోగ్రెసివ్‌ థాట్స్‌, కమిట్‌మెంట్‌, ఈక్వాలిటీ ఉండాలని భావించడం, వస్తువు విషయంలో, రచనా రీతి విషయంలో మీకున్న స్పష్టమైన అవగాహన, నైపుణ్యం చెప్పుకోదగ్గవి. మీరు షార్ట్‌ స్టోరీ వరకే పరిమితమై పోకుండా నవలలు, నాటికలు, విమర్శా వ్యాసాలు, కవిత్వం, అనువాదాలు ఇలా భిన్న విభిన్న మైన వాటిల్లో రచనలు చేశారు. మీలోని బహుముఖీన ప్రతిభకు ఇవన్నీ నిదర్శనాలు.

1964లో ఉస్మానియాలో హిందీలో ఎమ్మే చేశారు. ఆంధ్రా యూని వర్శిటీలో 78, 81ల మధ్య హిందీలో ఎం.ఫిల్‌, పిహెచ్‌.డీలు కూడా చేశారు. లెక్చరర్‌గా, రీడర్‌గా, ఒరిస్సా ఎడ్యుకేషనల్‌ సర్వీస్‌లో గెస్ట్‌ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. నaషసబస యూనివర్శిటీలో ఫారిన్‌ లాంగ్వేజెస్‌ స్టడీస్‌లో, సౌత్‌ కొరియాలో డిప్యుటేషన్‌ మీద, న్యూఢిల్లీలోని Iజజ= లో కూడా పనిచేశారు. మీ వ్యక్తిగత ప్రతిభతోనే అమెరికా, జర్మనీ, లండన్‌, పారిస్‌, సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌లలో పర్యటించారు. సెమినార్లలో, వర్క్‌షాప్‌లలో పాల్గొన్నారు. రిసోర్స్‌ పర్సన్‌గా, మంచి వక్తగా మీ ప్రతిభను తెలియచేశారు. ఇవన్నీ తల్చు కుంటుంటే తనువు ఉప్పొంగిపోతోంది. ఒకటీ, అరా కథలు మాత్రమే రాసి కూడా గొప్ప కథలు రాశామని విర్రవీగుతున్న కొందర్ని చూస్తే ఆశ్చర్యమేస్తోంది. అవార్డులు ఆ మాత్రానికే వరించడం ఇంకా విస్మయంగా ఉంది. ఇంతవరకూ మనం విదేశీ సాహిత్యాన్ని దిగుమతి చేసుకుంటున్నాం తప్ప, స్వదేశంలోని ఇరుగు పొరుగు సాహిత్యాలని అంతగా పట్టించుకోవడం లేదు. అది గమనించి మీరు ఇన్నిన్ని అనువాదాలు చేశారేమో అన్పిస్తోంది. ‘మొపాసా’ అన్నట్లు కథారచయితకి ముఖ్యంగా మూడు లక్షణాలుండాలి. అవి ”స్పష్టత! స్పష్టత? మళ్ళీ స్పష్టత!” – అవి మీలో పుష్కలంగా ఉన్నాయి తులసి గారూ!

ఏదైనా రచనను చదివితే, అది మనకో చక్కని అనుభవం కావాలి. మనసు వికసించాలి. కొంచెంసేపు పుస్తకం మూసి ‘మ్యూజింగ్స్‌’లోకి వెళ్ళిపోగలగాలి. అలాంటి అనుభూతిని ‘యాత్ర’ కథ కలిగిస్తుంది. మన మనో మందిరంలో మూసుకున్న కిటికీ తలుపుల్ని తెరుస్తుంది. ఇంద్రచాపాన్ని పట్టి చూపిస్తుంది. ఇలాంటివి ఉదహరిస్తూ పోతే లెక్కకు మించి ఉన్నాయి. మధ్యతరగతి జీవితాల్ని, జీవనాల్ని, వాస్తవిక దృష్టితో అద్భుతంగా మలిచిన, చెయ్యి తిరిగిన రచయిత్రి మీరు. సహజమైన రీతిలో, సజీవమైన భాషతో, పాత్రోచిత సంభాషణతో కథను నడపడం మీ లక్షణం. మీ కథలు హిందీ, ఒరియా, ఉర్దూ, ఇంగ్లీషు, మళయాళం, కన్నడ భాషల్లోకి అనువదింప బడ్డాయి. మీరు స్వయంగా హిందీ, ఒరియా, ఇంగ్లీష్‌ భాషల నుంచి తెలుగులోకి అనువదించారు కదూ!

మీ కథన రీతిలో ఉన్న కీలకాంశం ఏమిటా అని ఆలోచిస్తే, మీకున్న పేషెన్స్‌ అని అర్థమైంది. ప్రతి కథలోనూ ఒక పెద్ద ప్రపంచాన్ని చిన్న గుళికగా మార్చి పాఠకులకు అందించే ప్రయత్నం చేశారు. ఎక్కడా గందరగోళ పడకుండా సఫల మయ్యారు. సాహిత్య అకాడమీ వారి కోసం కూడా చాలా పుస్తకాలు రాశారు. నాకు గుర్తున్నంత వరకు మహాదేవి వర్మ, కౌతు విశ్వనాధరెడ్డి కథలు, పత్తేదార్‌ గోయిందా, బ్రహ్మ రాక్షసుడు, మహాదేవి గీతాలు. మీరు సంపాదకత్వం వహించిన పుస్తకాలు

‘ఉత్తరాంధ్ర కథలు’ మొదలుకొని సుమారు 18 వరకూ ఉన్నాయి. తులసిగారూ! మీ అవార్డుల గురించి రాయాలంటే నా గుండె చిన్నది, మీ అంత విశాలమైంది కాదు. కాలమ్‌ పరిమితి రీత్యా తగ్గిస్తున్నాను. ‘బెస్ట్‌ షార్ట్‌ స్టోరీ రైటర్‌’, సఫ్దర్‌ హష్మీ సత్కారం, తాపీ ధర్మారావ్‌ సత్కారం, ఒడిస్సా లిఖిత్‌ సమ్సద్‌ సన్మాన్‌, ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ సన్మాన్‌, ఇలా 18, 19 వరకూ ఉన్నాయి. ‘మహాదేవి కీ కవితామే సౌందర్యభావన్‌’ అనే విషయమై పిహెచ్‌.డి.ని కూడా చేశారు. ఇన్నిన్ని పన్లు ఎలా చేయగలిగారమ్మా! ముఖ్యంగా మీ నిరాడంబరత, చిరునవ్వుతోనే మనుష్యులను దగ్గర చేసుకొనే మీ ఔన్నత్యం, ఒక ఉత్సాహ తరంగిణిలా, వాక్ప్రవాహంలా సాగే మీ మాటల పోకడ కూడా నాకు చాలా ఇష్టం. 1994లో ‘చాసో ట్రస్ట్‌’ స్థాపించి, ఉత్తమ సాహిత్య స్రష్టలకు ‘చాసో’ అవార్డులు కూడా ఇస్తున్నారు. ఈ అవార్డ్‌ రావడం చాలా గౌరవప్రదమైందని చాలామంది భావిస్తారు.

ఇక, మీ ప్రచురణల వివరాలలోకి వెళ్తే యాత్ర, తులసి కథలు, భగత్‌సింగ్‌, సాహితీ తులసి లిచరేచర్‌, కొరియన్‌ జానపద కథలు, ఒరిస్సా జానపద కథలు, తగువు (ఏకాంకిక), సచ్చిరౌత్‌ రాయ్‌ కథలు, సరళాదాస్‌, ఓల్గా నుంచి గంగకు, హల్లా బోల్‌ సఫ్దర్‌ హష్మీ, కాజీ నజ్మల్‌ ఇస్లామ్‌, సీతారామ్‌ కీ క్యా లప్టే హై’ – ఇలా చూస్తే ప్రతీదీ ఒక ఆణిముత్యంలా విలువైనవిగానే కన్పిస్తాయి. మీ చిరునవ్వులోని పసితనాన్ని, మీ మేధస్సులోని విలక్షణతను అభిమానించే నేను మీకెప్పటికీ అభిమానినే. మీ గురించి నాకు తెలిసిన విషయాల్ని చేరవేస్తూ…

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో