చిట్లిన కంటి చినుకు

Posted By on April 1, 2009

వి.ప్రతిమ
రాత్రులకు పహారా కాస్తూ
రాసిందంతా చీకట్లోనే అయినా
కుంచె అంచుతో వెన్నెల అద్దినట్లుగా
ఈ అక్షరాకింత తళతళలెక్కడివి?
అలజడితో, అనుభవాలతో
అవిశ్రాంతంగా పెనుగులాడి, పెనుగులాడి
ముద్దలు ముద్దలుగా గొంతుకడ్డంపడి
ఘనీభవించి పోయిన కోటి దు:ఖాలని
ఏ చిన్ని జ్ఞానాక్షరం కరిగించింది?
కనురెప్పలకింది ఉత్పాతాలని
దోసిళ్ళలోకి ఒంపుకుని
శుష్కించిన కళ్ళ పువ్వుల్లో
మెరుపుల్ని మాత్రం మిగుల్చుకునే వున్న నాకు
తలెత్తడం పెద్ద కష్టమేంకాదు.
ఒక్కసారి తలపైకెత్తితే
భుజాన వెస్తోన్న భగోళం
భళ్ళున జారిపడి బద్దలయిపోతుంది
విరిగిపడిన అలలన్నీ ఉవ్వెత్తున పైకెగుస్తాయి.
చిత్రంగా…
దులుపుతోన్న
భూజుకర్రమీది చేతివేళ్ళు
ప్రతిరాత్రీ కొత్తపంటల్ని కలకంటాయి.
ఎండి ఆకులు రాలుతోన్న చెట్లని ఒడిసి పట్టి సరికొత్త విత్తనాల్ని చల్లుతాయి.
నన్నింక ఎంత మాత్రమూ మట్టిముద్దగా మిగల్చని నమ్మకం
ఒక కొత్త అంతర్నేత్రాన్ని పొదిగి
దయగా కాసిని అక్షరాలను తోడిచ్చి
వేలుపెట్టి నడిపించి
వెన్నెలదారుల్లో వొదిలింది కాబోలు
ఎంతకీ వీడని స్పందన, కోల్పోని
సహజీవన పరిమళం తోడుగా
ఇదిగో నేనొస్తున్నా…

Share

About The Author

Comments

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో