కళ్యాణ సుందరి కమనీయ కథనం మాడంత మబ్బు

ఇప్పుడు, వందేళ్ల తెలుగు కథని స్మరిస్తూ పతిక్రలలో వ్యాసాల పరంపర కనపడుతున్న సందర్భంలో, సమీక్షకులు, విమర్శకులు మర్చిపోయినా, మనం గుర్తు చెయ్యవలసిన కథా రచయిత్రి ఒకరు మన వెనక ఉన్నారు. ఆవిడ కథలు మనని మన పుట్టిళ్ళకి తీసుకు వెడతాయి. గామ్రీణ బాల్యం అనుభవించిన వాళ్ళకి ఆ రంగు రంగుల జీవన దృశ్యాలను కళ్ళముందు నిలబెడతాయి. కవను తీగెలమీద మధుర విషాద రాగాలు పలికించి కంటి చెమ్మ ఆరకుండా కాపాడతాయి.
అచ్చమైన తెలుగు నుడికారం, పల్లెల పచ్చదనం పల్లెజీవన వైవిధ్యం, పల్లెపడుచుల నిష్కల్మష పేమ్రలు, వారి జీవితాలలో సంపద్రాయలు నింపిన ఆనంద విషాదాలు., ఇవి ఆమె మనకి ఏమతం ఆవేశ పడకుండా నిండుకుండలా చెబుతారు. ఇటువంటి గొప్ప రచయితుల్ర వారసత్వం మనదని ఉప్పొంగే హృదయంతో మరోసారి ఆమె కథ ”మాడంత మబ్బు” చదివి ఆమె కథాకధన చాతుర్యాన్ని, కథా శిల్పాన్నీ, కథ చెప్పడంలో ఆమె చూపించే సమతకాన్నీ ఆస్వాదిద్దాం.
కొల్లేరులో పక్షులు ఎత్తుగా గళ్ళు కడితే ముంపు తప్పదని పల్లెజీవులకి తెలుసు. పక్రృతి వాళ్ళకి తెరిచిన పుస్తకం. అయినా అది కరుణించకపోతే వాళ్ళకి తిప్పలే. వరసగా మూడుసార్లు పంట చేతికి రాక అప్పుల్లో కూరుకుపోయి పట్నంలో కూలికి పోయి అప్పు తీరుస్తున్న పెద్దిరాజుకి తనులేనప్పుడు భార్య భాగ్యం పవ్రర్తన మీద అనుమానమే కథ
కళ్యాణ సుందరి కమనీయ కథనం మాడంత మబ్బు
”మరుగున పడిపోతున్న మనపూర్వపు నాగరికత, ఔన్నత్యమూ, సాంపద్రాయల, నమ్మకాలు అంటే తలవంపులు తెచ్చే అజ్ఞానాల, మూఢనమ్మకాల, తప్పుల తీసేస్తే చాలావరకూ అర్థ వంతమైనవనే తోస్తుంది. దీర్ఘంగా ఆలోచిస్తే ఆనాటి ఘనతల భాగ్యాల, ఈనాటి యువతీ యువకుల ముందుకి తీసుకు రావాలని నా ఉద్దేశం. దేశ ఔన్నత్యం పట్టణాలలోన భాగ్యవంతుల జీవిత విధానాల్లోన కాదు, ముఖ్యంగా గామ్రవాసుల జీవితాల్లోనే అని కదా శాస్త్రజ్ఞులు అంటున్నారు..” అంటారు కళ్యాణసుందరి. గొప్ప కథకుల పేర్లతో వారి చితాల్రతో పతిక్రలు కళకళ లాడుతున్నాయి, వందేళ్ళ కధా పండుగ సందర్భంగా ఆ చితాల్రలో ఒక్క రచయితి కనపడకపోతే, మంచి కథలు వాస్రిన రచయితుల్రు లేనట్టుకాదు, ఆయ సమీక్షకుల చూపులో తేడా మాతమ్రే. అందుకే భూమిక ఆనాటి రచయితుల్రని జ్ఞాపకం చేసే కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. వారి కథా సంపదని అందిస్తోంది.
ఇది ప్రారంభం …… పి.సత్యవత

ిదూరాన్న-పొలాల మీద చిన్న మబ్బు పట్టినట్టు కనిపించింది.
భాగ్యం భుజంమీది నిండుబిందె గుమ్మంలో దించింది. మనస్సులో అమృత వర్షం కురుస్తోంది.
చట్టుక్కున కాస్తభయం వేసింది. అతనేమనుకున్నాడో! నా అమ్మ కడుపు బంగారంకాను! అదేమిటి, అల్లానవ్వాను? నవ్వు ఆపుకుని నిదానంగా వుండాలనైనా తోచలేదు! కాసేపటికి తోచింది. కాని, నా ముఖంలో కనిపించే ఉంటుంది. ఆ అబ్బాయి నివ్వెర పోయడు.
పది నిముషాల క్రితం నీలాటి రేవులో జరిగిన దంతా జ్ఞాపకం వచ్చింది. మళ్ళా అట్టే వీధి గుమ్మంలో నిలబడి పోయింది.
బిందె కాలుమీద వెపేటప్పటికే శేషయ్య ఎదురుగా చీలుబాట మీద ఆగాడు. శేషయ్య, భాగ్యం చిన్నప్పుడు కలసి ఆడుకున్న వాళ్ళే. ఎన్ని సార్లో పొలం గట్టు మీదకి పిల్లిపెసరకాయలకి వాళ్ళ ముఠా వీళ్ళ ముఠా కీచులాడుకునే వాళ్ళు. తన పెళ్ళయిన తరువాత భాగ్యం శేషయ్యతో మాట్లాడడమే మానేసింది. మరి, అదేమిటి అల్లా ఆగాడు ఎదురుగానే! భాగ్యం తలవంచుకుని బిందె ఎత్తుకో బోయింది.
”పెద్దిరాజు వస్తున్నాడు,” అన్నాడు, భాగ్యం ముఖం చేటంతయింది! ఏమనడానికి తోచలేదు. కళ్ళప్పగించి చూస్త ఊరుకుంది.
ఉన్నట్టుండి ఫక్కున నవ్వింది. వెంటనే తెలివి తెచ్చుకుని ముఖం నిబ్బరం చేసుకుంది. శేషయ్య ఒక్క క్షణం ఖంగారు పడ్డాడు. కాని, వెకిలి చేష్ట అని, వచ్చిన చిరునవ్వు ఆపేసి కాలు కదిపాడు, నాలుగడుగులు వేసి, వెనక్కి తిరిగి రామగిరి పాడు బస్సు స్టాండులో చూశాను. వాళ్ళ ఫాక్టరీ యజమానిని బస్సు ఎక్కిస్తూ, ”ఈ సాయంత్రం తప్పక ఇంటికి వెళ్ళిపోవాలి,” అంటున్నాడు.
నేను కేక వేశాను. బజారు గొడవల్లో అతనికి నాకేక వినబడలేదు. నన్ను ్చూడనైనా ొచూడలేదు. ”నిన్ను ొచూస్తే చెప్పబుద్దేసింది,” అని వెళ్ళిపోయడు.
తెప్పరిల్లి భాగ్యం బిందె ఎగరేసి ఎత్తుకుంది. ఈ వేళ బిందె తేలిగ్గా వుంది కూడాను.
ఇంటి కెళ్ళి పొయ్యి అంటించి వంట చెయ్యలి. ఇప్పుడిక ఇల్ల అదీ సుభ్రంగా సర్ది, అన్నీసరిగ్గా పెట్టాలి, అసలే బస్తీలో ఉండి వస్తండె తను, ఎంతో నాజాగ్గా ఉండాలి ఇల్లు. లేకపోతే బావ మనస్సు ఎంత చివుక్కు మంటుందో!
ఏమి టేమిటో ఆలోచనలతో నడిచింది ఇంటికి. తన సంతోషానికి మేర లేదు. ఆవయదారి సంతోషమే శేషయ్య దగ్గర కూడా మర్యాద వుండ నివ్వలేదు.
భాగ్యం ఇంట్లోకి వెళ్లి, పొయ్యి రాజేసి బియ్యం చేటలో పోసింది.
ప్రక్కమునసబు గారి పెరట్లో నించి ఎడ్ల మెళ్ళల్లో మువ్వల గల గలలు, పాలేళ్ళ అదలింపులు విన బడుతున్నాయి. దుక్కి టెడ్లు దానా తింటున్నట్టున్నాయి.
భాగ్యం ఇల్లు సర్దడం మొదలెట్టింది. గొంతెత్తి ఏదో కూనిరాగం కూడా ఆరంభించింది.
”మాడంత మబ్బు పట్టె మంగళ గిరి మీద
కురిసేను తిరుపతిలో కుంభవర్షాలు”
ఈ పాట అత్తయ్య పాడేది తన చిన్నప్పుడు. పాటంతా సరిగా జ్ఞాపకం లేదు.
”కుంభవర్షాల్‌ కురిసె స్తంభాలె తడిసె
వెంకన్న కూచున్న వెండరుగు తడిసె
మంగమ్మ కూచున్న మండపమె తడిసె”
మునసబుగారింట్లోనించి అపుడే పుట్టింటి కొచ్చిన సుబ్బులు. ”ఏఁవక్కో, రాగా లెక్కువయినాయి! బావొస్తున్నాడా ఏం? అంట పెరటి గోడమీద ముఖం పెట్టింది.”
భాగ్యం చిరునవ్వుతో తలవంచు కుంది. ”నిజమే? చెప్పావు గావుగా?” అంది సుబ్బులు. భాగ్యం తలెత్తింది.
”ఏమవ్మ ఇంత చిక్కి పోయవు!” అని ఆశ్చర్యపడ్డది సుబ్బులు. ”అయినా చక్కని వాళ్ళు చిక్కినా సన్నని బట్ట మాసినా అందమే నంటారు పెద్దలు.” అంది నవ్వుతూ.
బావ ఎంత చిక్కి పోయిఉంటాడో అనుకుంది భాగ్యం, బస్తీలో ఏ అమ్మ వండి పెడుతుంది! తనకిది ఇష్టమని చెప్పడు గదా. అసలే స్వయం పాకంమనిషి. అన్నట్ట సన్న చీరలు కట్టాలని ఎన్నాళ్లనించో ముచ్చట సుబ్బులు చీరలు చూచాక. మరీ ఆ నల్ల నేత చీర – జరీ చందమామలు వేసి నేసింది – తనకెంతో సరదా. బావ కొంటానన్నాడు.
వంట చేసుకుంటోంటే గడచిన తన జీవితమంతా – తన కాపురం, అత్తగారు పోవడంలగాయిత అన్నీ ఒక్కసారి వివరంగా జ్ఞాపకం వచ్చాయి భాగ్యానికి.
ఆయేడు చేను ఈనిన వెంటనే సుంకుమీద వాన ముసుళ్లు పట్టాయి. ఎల్లాగో కాల క్షేపం చేశారు. ఆ మరుసటి ఏడ అంతే.
తరువాత ముంపు వచ్చింది- వరుసగా రెండేళ్లు. అసలు ఆయేడు ముంపు వస్తుందని భాగ్యానికి కూడా ముందరే తెలుసు. తొలకరికి ముందు ప్రక్క ఊళ్ళో ఉన్న చుట్టాలని చూసి వస్తంటే కొల్లేరు ఎండిఉంది. అక్కడక్కడ గుంటలలో నీళ్ళు ఉన్నాయి. జమ్ము నిలువెత్తుకి పైగా పెరిగి ఉంది. రాజు చూడమన్నాడు. జమ్ములో కొంగలు నిలు వెత్తున గళ్ళు ట్టుకున్నాయి. పెద్ది రాజు నిలబడి పోయడు. ”ఈయేడు ముంపు వస్తుందే. మనగతి ఏమిటో! గళ్ళు చూడు. ఎంత ఎత్తుగా కట్టాయె పిట్టలు, ఈయేడు!” అన్నాడు. భాగ్యం క్రుంగి పోయింది.
”మన పల్లపు చేలకి ఈ గతి తప్పదు గా.” అన్నాడు మరో ఆయన ప్రక్కన నిలబడి – భాగ్యంతో.
ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది. ఆ అన్నది- శేషయ్య. వాళ్ళింటికే వెళ్లి వస్తంటే, సాగనంపటానికి కూడా వచ్చాడు. అదేం? బావ అల్లా మిరి మిరి, చూశాడు? తాను శేషయ్యతో మాట్లాడితే బావ కిష్టంలేక పోయేది! అసలు భాగ్యం మాట్లాడేదే కాదు. ప్రయణంలో ఏదో సందర్భంలో అవసరం వచ్చింది. తను జవాబు చెప్పింది. ఏదో కొంటెగానో చెప్పినట్లు జ్ఞాపకం – బావ అండ చూసుకుని శేషయ్య నవ్వాడు. కాని బావకోపం దిగ మింగాడు. ఇంటికొచ్చే వరకూ ఎవ్వరఏమీ ఎక్కువ మాట్లాడలేదు. ఊరు పెద్ద చెరువు గట్టుమీద నించే, శేషయ్య భద్రంగా వెళ్లి రమ్మని తిరుగు ముఖం పట్టాడు.
అసలు బావ తను ఎవ్వరితో మాట్లాడినా ఒప్పు కోడు. తను అదో వెస్తరు. మిగత విషయల్లో దేవుడి లాంటివాడు.
భాగ్యం, తృప్తితో చిరునవ్వుతో తల వంచుకుని కూరలు తరుగుతంది.
అల్లాగే ఇదివరలో ఓనాడు బావ సంతకి వెళ్లి మర్నాడుగాని రానన్నాడు. అంతా జ్ఞాపకం వచ్చింది. ఒకవేళ ఎల్లా పోయి ఎల్లా వస్తుందో ఎందుకైనా మంచిదని ఓలోటా పాలు కాచి కిటికీలో పెట్టింది. మునసబుగారి భార్య రెండు బంతి పువ్వులిస్తే తల్లో పెట్టుకుంది. అనుకున్నట్టు సంతలో పడ్డ బేరం కుదరలేదు. పెద్దిరాజు ఆనాడే ఇంటికి తిరిగి వచ్చాడు. కాచినపాలు, తల్లో పువ్వుల చూసి చాలా చికాకు పడ్డాడు. భాగ్యానికి అర్థం కాలేదు. ముఖం చిన్న పుచ్చు కుంది. భాగ్యం పాల వైనం పువ్వుల వైనం బ్రతిమాలి చెప్పేటప్పటికి ఆ రాత్రి తొలికోడి కూసింది. తన అనుమానాలకే పెద్దిరాజు చాలా సిగ్గు పడ్డాడు. చాలా నొచ్చు కున్నాడు.
భాగ్యం అర్థం చేసుకుంది. ”పోనిలే నామీద నువ్వు కోపగించుకో పోతే ఇంకెవ్వరు కోపగించుకుంటారు బావా వెర్రిగాని!” అంది. కాని తనకీ కోపమే ఒక్కొక్కసారి, ఇక ఇట్లా కోపగించుకో కూడదు అసలు బావ ఎంత అనువనంగా ప్రవర్తించినా తనే ఓపికగా వుండాలి. బావ రాగానే ఈ ముక్క చెప్పేద్దామని నిశ్చయించింది. భాగ్యం.
మేనకోడల్ని పెంచి కొడుక్కి చేసుకుంది అత్తయ్య. పుట్టింటి వారులేని కొరత లేకుండా చూస్తాడు పెద్దిరాజు. భార్యని అరచేతిలో నిమ్మపండులా చూసుకుంటాడు అనుకుంది.
ఒకసారి మునసబు గారి భార్య రెండు తామరకాయలిచ్చింది. ”నాకివి చానా ఇష్టం చిన్నవ్మ” అంది భాగ్యం. విననట్టే ఉన్నాడు బావ, చద్దన్నం తింటో, రెండో నాటికి సందెడు కాయలు వచ్చి పడ్డాయి ఇంట్లో! భాగ్యం గుండె నీరై పోయింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బావకి నీటిగండం ఉందని అంటండేది అత్తయ్య.
అన్నీ జ్ఞాపకం వస్తున్నాయి.
కనకం- వాళ్ళ ఆవు మునసబు గారింట్లో ఒక్క రంకె వేసింది.
చివరికి ఆవుని కూడా మునసబు గారికి తోలవలసి వచ్చింది. ఒక కష్టమా! వరుసగా చేలు పండక అప్పుల పాలైనారు భాగ్యమూ, రాజూ. ఆఖరికి గత్యంతరం లేక రామగిరి పాడు బస్తీలో కూలిపనికైనా ఒడబడ్డాడు ఉన్న ఊళ్ళో అయితే పువ్వులమ్మిన వూళ్ళో కట్టెలమ్మి నట్టుంటుంది అని. పైగా, బస్తీకిపోయి నాలుగు రాళ్లు సంపాదిస్తే, అప్పులు తీరితే అదేచాలు. ఈసారి నడుంకట్టి పొలంలో బంగారం పండిస్తానన్నాడు రాజు.
నాళ్లు గడిచినాయి. వర్షాలు ఎక్కువగా కురిశాయి. చెరువులో తామ రల కలువల కలకల లాడుతున్నాయి. చేలల్లో నీళ్లు నిలగట్టారు.
స్వతంత్రం, నమ్మకంమీద మునసబుగారినే నర్చి కుప్ప వెయ్యమని చెప్పి బస్తీకి బయలు దేరాడు రాజు. త్వరలోనే తిరిగి వస్తానన్నాడు.
ఆనాటి దృశ్యం కళ్ళకి కట్టి నట్లుంది భాగ్యంకి. రోజంతా అదో మాదిరిగా ఉన్నాడు రాజు. ఏదో బాధ పడుతున్నట్ట కనిపించాడు. ఆ ముఖం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా భాగ్యానికి కడుపు తరుక్కు పోతుంది. ఆనాడు భోంచేస్త, ”నువ్వు ఒంటరిగా ఉండగలవా?” అని ఛటాలున అడిగాడు.
”నీతో నేను వస్తా,” నన్నది. రాజు కళ్లెర్రజేశాడు. ”బస్తీ నమ్మకూడదు. అక్కడికొద్దు,” అన్నాడు. భాగ్యం మాట్లాడలేదు. సుబ్బుల వాళ్ళంతా బస్తీ పోవడం లేద? బావ కిష్టంలేదు. అంతే! ”ఇక్కడేమన్నా వెర్రిచేష్టలు చేశావా, నేను దేశాంతరం పోతా,” అన్నాడు భాగ్యం గుండె గబగబా కొట్టుకుంది. ”అదేమిటట్లాగ!” అంది గాభరాగా.
రాజు చిరునవ్వు తెచ్చుకున్నాడు, ”బయపడకు. నాకసలు కోపం ఎక్కువ,” అన్నాడు.
భాగ్యం మనస్సు మరింత బరు వెక్కింది. రోజంతా ఇద్దర మాట్లాడకుండానే గడిపారు.
ఆ సాయంత్రం, ”రేపీ వేళకి బస్తీలో ఉంటావు బావా! పల్లెటరు జ్ఞాపకం ఉంచు కుంటావా? మేము జ్ఞాపకం ఉంటావ?” అని చిరునవ్వు తెచ్చుకుని అంది భాగ్యం.
పంచెలు మడతలు పెట్టుకుంటున్న రాజు తలెత్తకుండా, ”నల్ల జలతారు చీరతెస్తానులే,” అన్నాడు కొట్టొచ్చినట్టు.
మరోక్షణం గడిచింది. ”అసలు ఇంతకష్టం నాకెందుకు-నీకోసం గద? మనం ఎప్పుడ ఇట్లాగే ఉంటామని ఎట్లా చెప్పడం? పెద్దలు గడించినదైనా తరువాత వాళ్ళకి ఇచ్చిపోవద్ద?” అన్నాడు వినీ వినబడని స్వరంలో. భ్యాగం గుండె కరిగి పోయింది. బావ వెస్తరే అది!
మరునాడు తూర్పు తెల్లవారకముందే బస్సురోడ్డుకి బయలు దేరాడు పెద్దిరాజు. పొలం గట్టువరకూ సాగనంపి వస్తానని, మునసబుగారు కూడా పొన్నుగర్ర చేత పట్టుకుని బయలు దేరాడు.
”ఇక నువ్వుండు, భద్రం,” అని మాత్రం అన్నాడు పెద్దిరాజు.
”నేను సాగనంపి వస్తానులే. ఇక నువ్వు ఇంటికి పదవ్మయి,” అన్నారు మునసబు గారు.
అక్కడే వీధిచివరనే ఆగిపోయింది భాగ్యం. నోటమాట రాలేదు. తన గుండె లెవ్వరో బలవంతంగా ఈడ్చుకు పోతున్నట్ల యింది తనకి.
మనస మసకగా ఇద్దరు మగాళ్ళూ రోడ్డు మలుపు దాటాక భాగ్యానికి గొంతు వచ్చింది, ”శుభంగా వెళ్లి లాభంగా తిరిగి ర”మ్మంది.
ఆ దీవెన్ని ఆకాశం మీద ఆఖరు చుక్కమాత్రం విన్నది.
నాటినించీ భాగ్యం జీవితం బరువుగానే నడుస్తున్నది. ఒంటరిగా గుప్పెడు బియ్యం ఉడకేసుకుని తినడం అంటే ”ఎందుకులే!” అనిపించేది, క్షుద్భాధకోసం ఆ నాలుగు గింజల పొయ్యిమీద పెట్టినప్పుడల్లా, రాజు తిన్నాడో లేదో, ఎల్లా ఉన్నాడో! అక్కడ ఎవర్ని అడుగుతాడు! అడిగే మనిషి కాదాయె- అన్న బాధ ఎక్కువయ్యేది. కళ్ళల్లో నీళ్ళు చిమ్ముకొచ్చేవి.
నురిపిడి అయిపోయింది. అసలే సారంలేని భూమి. తప్పా తాలపోన ఏదో గ్రాసానికి మట్టుకు గింజలు చేరాయి. మునసబు గారు తన ఇంట్లోనే గరిసె కట్టించారు.
కాని, హృదయంలో బరువు తగ్గ లేదు. సర్యభగవానుడు అటు ఉదయించి ఇటు కృంగుతున్నాడు. నిన్న నేడ అనే వివక్షత లేకుండా రోజులు గడిచిపోతున్నాయి భాగ్యానికి.
పెరట్లో బరుగుచెట్టు పువ్వుపూసి కాయ కాసింది. వేసవి గడుస్తంది.
సంపాదన లేకపోతే పోనీలే, పొలం పోతే పోనీ ఒక్క గట్లో పడి ఉంటే చాలు. మునసబుగారి చేత కార్డు వ్రాయిద్దావ అనుకుంది కూడాను ఎన్నోసారు- భాగ్యం. రాజు ఛటుక్కున వినే మనిషి గాదు. అప్పు తీర్చకపోతే నావెషీ పడతాడు. అప్పుడే నాలుగైదుసార్లు తపాల్లో డబ్బు పంపాడు మునసబుగారి పేర. చేతి ఖర్చుకి ఆ డబ్బు తనకే ఇవ్వమన్నాడు.
మృగశిర ప్రవేశించింది. మునసబు గారు తన మళ్ళతోపాటు రాజు దుక్కి కూడా ఆరంభించారు.
అనుకోకుండా ఈ వేళ బావ వస్తున్నాడు.
ఈ పరమ్మానందంలో వంట అయి పోయింది. బయట చిన్న చిన్న చినుకులు ఆరంభమయినయి. వెలిగించిన హర్రికేను లైటు చుట్ట నుసుములు బొంయ్‌ బొంయ్‌ మంట తిరుగుతున్నాయి. మునసబుగారి గొడ్లసావిట్లో, పశువులకి పెట్టిన కుమ్మపొగ ఇల్లంతా అలుముకుంది.
రెండు కంచాలు కడిగింది భాగ్యం.
ప్రక్క ప్రక్కన పీటవేసి కంచాలు పెట్టింది. తన ధైర్యానికి తనకే ఆశ్చర్యం వేసింది.
అసలు కాపురం మొదలెట్టాక ఇద్దర కలసి భోంచెయ్యందే! ఆ సరిక్రొత్త ముచ్చట్లు ఏవె, అంతే!
రెండులోటాల్తో నీళ్లు పెట్టింది. స్వయంగానే వడ్డించుకుని తినొచ్చు. సుబ్బుల వాళ్ళాయనా బస్తీలో ఇంతేనట. సుబ్బులు ఎన్నోసార్లు చెప్పింది.
అప్పుడే, సుబ్బులు పంపించిన బస్తీ ఆకులు, వక్కల మంచంమీదనే పెట్టి ఉంచింది. కబుర్లు చెప్పుకుంట సున్నం రాసుకోవచ్చు ఆకులకి.
కొంపతీసి బావ అనుమానం పడడుగదా! తన అనుమానాలకి తనకే నవ్వొచ్చింది భాగ్యానికి! అయినా బావని నవ్వించేద్దాం అనుకుంది.
రెండు రవికల మార్చి మార్చి తొడుక్కుంది శ్రద్ధగా.
అన్నం తినగానే బెల్లంగడ్డ నోట్లో వేసుకునే అలవాటుంది బావకి. ఇంట్లో బెల్లం లేదు. వీధి చివర భషణం గారింట్లో అమ్ముతారు. తానెప్పుడ వెళ్ళలేదు. పైగా బయట సన్నగా జల్లు పడుతుంది. మరి బెల్లం లేదే – ఎట్లా?
బావకి ఇంటిముందర దారి తెలియటానికి లైటు పడేటట్టు కిటికీ తెరిచిపెట్టి, తలుపు గొళ్లెం పెట్టి, తడుస్త బయలుదేరింది.
”ఏం కోడల వానలో వచ్చావు? దా,” అంట చాప చూపించింది జానికమ్మ గారు, భషణంగారి భార్య. భాగ్యం ముస్తాబు ొచూసి తబిసీళ్లు అడిగి తెలుసుకుంది. బెల్లం చేతికిచ్చి, బొట్టెట్టివాళ్ళ చిన్నవాణ్ణి తోడిచ్చి తిరిగి పంపింది. వర్షం కొంచెం పెద్ద దయింది. తలుపు తియ్యగానే హర్రికేనులైటు గప్‌ గప్‌ మంది – బైట గాలి విసురికి.
తాను బస్సురోడ్డు చస్త, గుమ్మం లోపలగా కూచుంది-తలుపుని ఆనుకుని. ఇటు తిరిగి ఇంట్లోకి చూసింది – తెరిచిన కిటికీ లోంచి జల్లుపడ్డదల్లె వుంది. కిటికి లోపల క్రింద, క్రీనీడ తడిసి నల్లగా వుంది. అయినా కిటికీ మూయదలచు కోలేదు. మూస్తే బావ దారికి చీకటి.
వర్షం మరింత పెద్దదయింది. గాలి విసురు ఎక్కువయింది. మెరుపు మెరిసి నపుడల్లా ఎదురుగా బస్సు రోడ్డు క్షణం సేపు కనిపిస్తోంది. అల్లాగే బయటికి చూస్త కూచుండి పోయింది భాగ్యం నిద్ర ొమాత్రం రావడం లేదు.
రాత్రి రెండు జాములయింది. బయట గాలి హోరు ఎక్కువయింది. భాగ్యానికి భయంవేసింది. ఇక ఈ రాత్రి బావ రాడు. ఇక రేపే, పోనీలే. ఈ మాయదారి వర్షంలో ఏం ముంచుకు పోయిందని తను తడవడం అనుకుంది.
కిటికీలోనించి జల్లునట్టింటి వరకూ పడుతంది. భాగ్యం లేచి కిటికీ మూయ బోయింది.
కిటికీ క్రీనీడలో కాలుక్రింద మెత్తగా ఏదో వస్తువు తగిలింది. భాగ్యం చటుక్కున వెనక్కి గెంతింది.
ఇందాక బయటనించి రాగానే కనిపించింది ఇదే – తడికాదు. మసక వెలుతురులో అల్లా కనిపించింది.
దీపం తెచ్చి దగ్గరగా చూసింది. ఓ చిన్న బొక్కిసా అది. చేత్తో మెల్లగా ఎత్తింది. బావ నీలం చొక్కాయిలో చుట్టిన ఏవో గుడ్డలు మెత్తగా తగిలాయి.
అయితే బావ వచ్చేశాడు. ఏడీ? మునసబుగారింటికి వెళ్ళాడా ఏం – తను ఇంట్లో లేనందువల్ల! అపుడే వచ్చి ఉండాలి. అయితే, ఇంతసేపు వారింట్లో ఏం చేస్తున్నట్ల? గుమ్మంలోకి వెళ్లి వంగి ప్రక్క ఇల్లు చూసింది. తలుపులన్నీ మూసి ఉన్నాయి, దీపాలే లేవు. వాళ్లంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు.
భాగ్యానికి ఏమీ తోచలేదు. ఆలోచనలు పరిగెత్తుతున్నాయి. లోపలికి ఉరికింది. ఆ మూటని నిదానించి ొచూసింది. మెల్లగా విప్పింది. లోపల బావ తీసికెళ్లిన గుడ్డల, క్రొత్తది ఓ నల్లటి చీరా ఉన్నాయి. దీపం వెలుగులో చీరమీద జరీ అక్కడక్కడ తళతళ లాడింది. జరీ చందొమామల చీర. తనకోసం. ఎంత జ్ఞాపకం పెట్టుకు తెచ్చాడు బావ! అయితే కిటికీ క్రింద తడిలో పెట్టడమేం-మంచం మీద పెట్టకుండా?
భాగ్యానికి వెర్రి ఎత్తినట్టనిపించింది. తల పడిపోతున్నట్లయింది. అక్కడే చతికిలబడి పోయింది.
మరుక్షణం ఇటువైపుగా కంచాల మధ్య చెల్లాచెదురుగా ఏవో పడి ఉన్నాయి. తన కాళ్లకి దగ్గరగా బావ మనీపర్సు పడిఉంది. చేతికి చాలా బరువుగా ఉంది. ఓ బస్సు టిక్కెట్టు, ఒక రసీదు, వేలెడు కర్ర పెన్సిల పడివున్నయి. గుప్పున అర్థం అయింది-భాగ్యానికి. కిటికీలోంచి విసిరిపుచ్చుకొని బావ లోపలి కిసిరేశాడు – వీటన్నింటినీ. కోపంగా వేసినట్టయింది. ఎందుకంత కోపం? వేసి ఎక్కడికెళ్ళాడు? తల పగిలిపోతుంది!
బయట చూరునీళ్లు కిటికీ ప్రక్కగా ఏకధారగా పడుతున్నాయి. గాలి ఈల వేస్తంది. వర్షం ఎక్కువయింది. కుంభ వృష్టి.
భాగ్యం వీపుమీద జల్లుపడుతంది. మెదలలేదు. బిత్తర చూపులు ొచూసింది. తనచుట్ట ఉన్న వెలుగుల, నీడల ఒకేలాగు కనిపించాయి, భాగ్యానికి. కళ్ల నిండా నీళ్లు నిండాయి.
మరుక్షణమే తన వెనక ఆకాశం మీద పెద్ద మెరుపు మెరిసింది. కళ్లముందు తళతళా తోమిన రెండు కంచాలు రెండు లోటాలు తళుక్కున మెరిసాయి.
బయట వర్షపు ధార.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

3 Responses to కళ్యాణ సుందరి కమనీయ కథనం మాడంత మబ్బు

  1. ఇక్కడి కధ ఇంకా చదవలేదు గాని, చాల చక్కని ఆలోచన ఇది. ఇలా మరుగున పడిపోయిన రచయిత్రులు చాలా మంది ఉన్నారు. కల్యాణ సుందరి జగన్నాధ గారి “అలరాస పుట్టిళ్ళు” (అప్పట్లో ఎమెస్కొ ప్రచురణ) గురించి మొన్నీమధ్యే సాహితి మిత్రులం కొంతమంది గుర్తుచేసుకున్నాం. ఇక్కడ ప్రత్యక్షం! 🙂 చాల సంతోషం.

  2. అద్భుతమైన కథనం! మూడేళ్ళ క్రితం ఎమెస్కోవారి “వందేళ్ళ తెలుగు కథ”లో అలరాస పుట్టిళ్ళు చదివాను. నిస్సందేహంగా గొప్ప తెలుగు రచయిత్రుల్లో ఈమె ఒకరు. Thanks for sharing this story!

  3. కళ్యాణ సుందరీ జగన్నాథ్ గారి ‘మాడంత మబ్బు’ కథ పూర్తిగా చదవండి అన్నారు, గానీ లింకు పని చేయట్లేదేమో…అనిపిస్తోంది. నేను అలరాస పుట్టిళ్లు చదివాను. నేను చదివిన అధ్బుతమైన కథల్లో అలరాస పుట్టిళ్లు ఒకటి. ‘మాడంత మబ్బు’ పూర్తికథ కోసం వెదుకుతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో