పద్మశ్రీ’ని మించిన ప్రతిభా సేవ సూలగిత్తి నర్సవ్వ’ జూపాక సుభద్ర

భారతదేశ అవార్డుల చరిత్రలో ఇప్పటిదాకా ఎస్సీ మహిళలకు పద్మశ్రీ అవార్డు ఇచ్చిన చరిత్ర లేదు. పద్మశ్రీలు, పద్మభూషణ్‌, విభూషణ్‌, భారతరత్న లాంటి అవార్డులన్నీ సవర్ణ కులాల మగ, ఆడవాళ్ళకు ఎస్సీల్లో కూడా అతి కొద్దిమంది మగవాళ్ళకొచ్చాయి గానీ ఎస్సీ, అణగారిన మహిళలకు ఈ అవార్డులు అంటరానివే అయినవి. కానీ 2017లో ఒక తొంభై ఏడేండ్ల చదువులేని ఎస్సీ తెలుగు మహిళ సూలగిత్తి నర్సమ్మకు డాక్టర్‌ బిరుదు, పద్మశ్రీ అవార్డు రావడం మొదటిసారి. ఇది అణగారిన మహిళలకు ప్రముఖమైన అంశం, ప్రత్యేకమైన విషయం.

సూలగిత్తి అంటే కానుపులు చేయడంలో మొనగత్తె అని కన్నడంలో అర్థం. నర్సవ్వ పుట్టి పెరిగిందంతా అనంతపురం జిల్లా రొడ్డం దగ్గర కృష్ణాపురం. ఆ పక్కనే కర్నాటక బార్డర్‌ జిల్లా తుముకూరు జిల్లాలోని పావగడ తాలూకాలోకి బత్క బొయిండ్రు. ఆమె డెభ్భైÛయైదేండ్ల సర్వీసులో దాదాపు 20 వేల కానుపులు ఒక్కటి కూడా అపజయం కాకుండా చేసిందట. కడుపు చూసి పుట్టబోయేది ఆడబిడ్డనా, మగబిడ్డనా, ఏ రోజు కానుపు గడియల్తో సహా చెప్పేదట. ఆమె అంచనాలు తారుమారెన్నడూ కాలేదట. డాక్టర్లు, ఆసుపత్రులు లేని కాలంలో నర్సమ్మనే పెద్ద డాక్టరై వేల కానుపులు చేసింది. నర్సింగ్‌ హోమ్‌లు బెట్టి కానుపులను వ్యాపారంజేసి అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్‌లు జేసి డబ్బులు జలగల్లాగ గుంజుతున్న కాలంలో కూడా ఆమె చేతి చలవగా ప్రసూతిలు జరగాలని కోరుకుంటున్నారిప్పటికీ అంటే… ఆమె ఎంతటి ప్రతిభాశాలో, ఎంతటి సేవాతత్పరో అర్ధం చేసుకోవచ్చు.

పద్మశ్రీ పొందిన మొదటి ఎస్సీ మహిళ సూలగిత్తి నర్సమ్మకు తొంబయి ఏడేండ్లు దాటి మొన్న జూన్‌ 16కి తొంబయి ఎనిమిదేండ్ల జన్మదినం జరుపుతున్నారని తెలిసి ‘బహుజని’ నుంచి పోయినం.

సూలగిత్తి నర్సమ్మకు పన్నెండు మంది సంతానం. తెలుగు దప్ప కన్నడ అస్సలు మాట్లాడది. తన 21వ ఏట నుంచి కానుపులు చేస్తున్నానని చెప్పింది. ఈ కులం, ఏ కులం వాళ్ళు అనే భేదం లేక బాపనాడోళ్ళ కాన్నుంచి బైండ్లాడోళ్ళ దాక కానుపులు జేసిన. ఇప్పుడప్పుడనే టైముగాక ఎప్పుడెవ్వరు కానుపు చెయ్యాలని పిలిచినా అర్థరాత్రి, అపరాత్రి లేకుండా ఉరికి పోయేదట. కడుపుల బిడ్డ అడ్డం దిరిగినా, పేగులు మెడలేస్కున్నా, ఉమ్మనీరు దాగినా, అయే పొయే ప్రాణాలగ్గూడ ఆయువు బోసిందటని చెప్పుకుంటున్నరు.

ఆధిపత్య కులాలు ఆమె చేతి చలవతో కానుపులు చేయించుకుంటారు గానీ ఆమె ఇంట్లల రావొద్దు. ఆమె ఇంట్ల కొస్తే ఇల్లు మైలబడ్తదనీ, బైట షెడ్డులేసి నర్సవ్వతోనే ఎంతటి గడ్డు కానుపులైనా, కష్ట కానుపులైనా చేయించుకొనేది.

ఆమె చేతి చలవపట్ల అంటరాని తనాలుండయి. కడుపుల బిడ్డను, కడుపును ముట్టుకుంటే మైలగాదు కానీ ఇంట్లకొస్తేనే మైలట. ఇలాంటి కుల దురహంకారాలను, అవమానాలను సహించి సర్వీసునందించిన గొప్ప సామాజిక సేవకురాలు సూలగిత్తి నర్సమ్మ. ఆమె కానుపులు చేస్తే తల్లీ, పిల్లకు ఢోకా ఉండదని ఒక నమ్మకం బలంగా పాతుకుపోడానిక్కారణం నర్సమ్మ అందించిన ప్రతిభా నైపుణ్యాల సర్వీసే. ప్రతిఫల మాశించని సర్వీసు. ఆధిపత్య కులాలు ప్రతిఫలంగా పాత సీరెలు గూడా ఇచ్చేవారట పైసలివ్వకుండా. ఇక పేదవారన్నా తులమో, ఫలమో ఇచ్చేదానికి ఆత్రపడే వారంటది. తుముకూరు, పానగడ ప్రజలంతా ఆమె సర్వీసును ప్రతిభను వేనోల్ల చెప్పుకుంటున్నరు.

నర్సమ్మ జన్మదినం (జూన్‌ 16) నాడు మెటర్నిటీ దవఖానల వాల్లు ఆమెని సత్కరించి ఆమె ఆశీస్సులు కావాలని డాక్టర్లు, నర్సులు పోటీపడి ఆమె కాళ్ళు మ్కొడం ఆశ్చర్యమైంది. డాక్టర్స్‌కి అలివికాని కానుపులను ఆమె అవలీలగా చేసేదనీ ఆమె ఒక అద్భుతమనీ చెప్పుకున్నరు. డాక్టర్లుగా పట్కార, కత్తెర ఇంకా అనేక పరికరాలున్నా ప్రసవం చేయడానికి హైరాన పడ్తుంటము కానీ సూలగిత్తి నర్సమ్మ ఇవేవీ లేకుండా కేవలం చేతులనే పరికరాలుగా చేసి ప్రసవాల్ని అత్యంత ప్రతిభావంతంగా చేయడం ‘అవ్వ’ సొంతమంటారు. ‘పశువులకు ఆప్రీషండ్లన్నమా! మనుషులకెందుకు ఆపరేషండ్లు చేసుడు, కడుపులు కోసుడు’ అంటది.

‘అవ్వా నీకు పద్మశ్రీ వచ్చింది గదా నీకేమనిపిచ్చింద’ంటే ‘ఏందో ఏమో ఇన్నేండ్లు కానుపులు జేసినందుకు గౌర్నుమెంటు ఢిల్లీకి ఇమానంల పిలిపిచ్చుకొని దండేసి శాలువ గప్పింది మెచ్చుకొని”.

భారతదేశంలో అంటరాని అణగారిన ప్రతిభామూర్తులెంతమందున్నరో సూలగిత్తి నర్సమ్మలాగ. వారి ప్రతిభా నైపుణ్యాలు, సమాజానికి అందించే సర్వీసు ఎంతెంతమంది చేస్తున్నారో వాళ్ళంత గుర్తింపులకు, గౌరవాలకు ఆవల్నే

ఉన్నరు. నిజానికి నర్సవ్వకు చదువు లేకున్నా, కడు పేదరికంలో ఉన్నా… తనకు తెల్సిన విద్యా నైపుణ్యాల్ని సమాజానికి డెబ్భైయైదేండ్లు చేసిన సర్వీసుకు నర్సమ్మకు భారతరత్న ఇవ్వాలి. సేవాభావంతో నిర్విరామంగా డెబ్బై అయిదేండ్లు సర్వీసు చేస్తే… ప్రజల ప్రశంసలకు తప్పదన్నట్లుగా పద్మశ్రీ ఇచ్చింది భారత ప్రభుత్వం. నర్సవ్వలాగా ఎందరెందరో బహుజన కులాల ఆడవాళ్ళు భారతదేశ మంతా వ్యాపించి ఉన్నారు. వారి వారి ప్రతిభల్ని, సేవాభావాల్ని గుర్తించి గౌరవించాల్సి ఉంది.

నర్సవ్వ చేసిన 75 సం||ల ఉచిత సర్వీసుకు ఆమెకు పెన్షన్‌ ఇవ్వాలి. మెటర్నిటీ ఆసుపత్రులకు స్కీములకు ఆమె పేరు పెట్టాలి. సూలగిత్తి నర్సమ్మ సేవా జీవితాదర్శ ప్రతిభా పాటవాల్ని పాఠ్యాంశంగా తెలుగు, కన్నడ ప్రభుత్వాలు పొందు పర్చాలి.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.