”అరుంధతి” చిత్రంపై సమీక్ష

డా.కె. స్వరూప
ప్రచార ప్రసార రంగాలలో భాగం అయిన సినిమా నేడు మానవ జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతున్నది. సినిమాలు వినోదం కోసమే కాదు దాంతో పాటు విజ్ఞానాన్ని వివేచనాన్ని కూడా కలిగిస్తాయి. అయితే ఎం. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ”అరుంధతి” చిత్రం జనవరి 9న విడుదలై ప్రేక్షకుల కోరికపై 7వ వారం ప్రదర్శించబడుతున్న ఈ చిత్రం కథాంశం అనుష్క అనే అమ్మాయికి సోనూసూద్‌ అనే విలన్‌కీ మధ్య జరిగిన ప్రధాన ఘర్షణ. 1920లోని ఒక అమ్మాయి పాత్ర ప్రస్తుతమున్న అమ్మాయి పాత్ర అని రెండు పాత్రలను అనుష్క ఈ చిత్రంలో పోషించారు. మానవ నమ్మకాల మీద అల్లబడిన కథ ఇదని హారర్‌ సినిమా కాదని నిర్మాత చెప్పడం జరిగింది.
కాని ఈ సినిమా చూసిన చిన్న పిల్లలు ఝడిసి జ్వరం తెచ్చుకుంటున్నారు. ప్రస్తుత అమ్మాయి అనుష్కకి సాయం చేసే ఫకీరు పాత్ర షాయజీ షిండే మంత్రతంత్రాలతో విభూదితో దయ్యలు పట్టిన వారిని హింసించడం ద్వారా బాగుచేస్తూ దయ్యలను సీసాలలో, కుండలలో బంధిస్తూ ఉంటాడు. ఇప్పటికే రాష్ట్రంలో మూఢనమ్మకాలతో గ్రామాలకు గ్రామాలు పాడుబడుతున్నాయి. హింసలు, సజీవ దహనాలు జరుగుతున్నాయి. కొంత మంది మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. ఈ సినిమా సమాజంలో మూఢనమ్మకాలను పెంచి బలవత్తరం చేస్తుందనడంలో అతిశయెక్తి లేదు.
చిత్రంలో విలన్‌ తల్లి ఆర్థిక దోపిడీని కొడుకు దుర్మార్గాన్ని సమర్థిస్తూ కోడలిని కుటుంబ హింసకు గురి చేస్తుంది. తాను మరణించి కూడా విలన్‌ ఆత్మకు మద్ధతునిస్తూ అందరినీ హడలగొడుతుంది. ఇక విలన్‌ పాత్ర విలన్‌కుండాల్సిన లక్షణాలన్నీ మొతాదుకు మించే వున్నాయి. 1920 నాటి అమ్మాయికి ఇతను అక్క భర్త /బావ అవుతాడు. మరదలి గురువు అంగవైకల్యురాలైన నాట్యాచారిణిపై ఇతను జరిపే ఘోరాతిఘోరమైన అత్యాచారం అమానుషం మునుపెన్నడు చిత్రించని విధంగా అత్యంత కిరాతకంగా ఆ దృశ్యాన్ని చిత్రీకరించడం జరిగింది. కాని ఆ దృశ్యాన్ని చూసి నేటి యువతరం ఆనందిస్తున్నారు.
ఆ దృశ్యాన్ని చూసిన మరదలు అసహ్యించుకుంటుంది. విలన్‌ మామ బాధపడతాడు, భార్య ఏమీ చేయలేక మనస్తాపంతో ఉరిపోసుకుని చనిపోతుంది. అప్పుడు కూడా విలన్‌ ప్రవర్తన హేయంగా, నీచంగా ఉంటుంది. 1920 నాటి (అమ్మాయి) బాలిక దాన్ని గర్హించి అతనికి శిక్ష విధించి చనిపోయేవరకు గుర్రాలతో ఈడ్పిస్తుంది. ప్రజలు ఆ చర్యను హర్షిస్తారు. జేజేలు పల్కుత ఆ బాలికను జేజెమ్మగా కీర్తిస్తారు. పాపి చిరాయువు అన్నట్టుగా విలన్‌ అఘోరాల మధ్య అఘోరాగా మారి మంత్రశక్తులను వశం చేసుకుని మరదలి వివాహ సందర్భంగా ఊరు చేరుకుంటాడు. ఆ సమయంలో అతడు జరిపిన హింస తారాస్థాయినందుకొంటుంది. బంధువర్గం అంతా మామగారితో సహా అందరూ అతని చేతిలో మరణిస్తారు. పెళ్ళి కూతురు ధైర్యంగా విలన్‌కి ఎదురుపడుతుంది. ఆ సమయంలో అశ్లీల పదజాలంతో అతను వ్యవహరించిన తీరు జుగుప్సకరంగా వుంటుంది. ఆమెను కూడ డ్యాన్స్‌ టీచర్‌లా అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా జేజెమ్మ టీచర్‌ నేర్పిన సాహస నృత్యంలో విలన్‌ను బంధీ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ నమ్మకాల రూపంలో పెద్దల సలహాతో పగ తీరకుండా చనిపోతే ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుంది కాబట్టి బ్రతికుండగానే అతన్ని భవనంలోనే సమాధి చేసి రక్షలతో దిగ్భంధం చేస్తుంది.
భవనంలో (కోట) సమాధి ఐన విలన్‌ ఆత్మ 48 రోజులకు ఊరును అరిష్టాలకు, జేజెమ్మను ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతూ అడవులకు వెళ్ళి తపస్సులను కలుసుకొంటుంది. వారు చెప్పినట్టుగా తన కుటుంబాన్ని కొంతకాలానికి వదలి ఆత్మత్యాగానికి సిద్ధపడుతుంది. తలపై కొబ్బరికాయలను కొట్టించుకుని రక్తధారలతో చనిపోతుంది. ఆమె మృతదేహాన్ని నిలబెట్టి దహనం చేసి తర్వాత ఎముకలతో ఒక ఆయుధాన్ని తయరుచేస్తారు. ఇదంతా కూడ గ్రాఫిక్‌ వర్క్‌ సలో ఉంటాయి. ఈ ఆయుధం విలన్‌ ఆత్మను చంపటానికి ముందు రక్తంతో పూర్తిగా తడవాల్సి వుంటుంది. ఒక దుర్మార్గుణ్ణి అంతం చేయలంటే స్త్రీకి ఒక జన్మ సరిపోదు ఆత్మాహుతి చేసుకుని మరో జన్మ అదే కుటుంబంలో జన్మించాల్సి వుంటుందని అప్పుడే ఆ ఆత్మ నశిస్తుందనే విషయం సినిమా క్లయిమాక్స్‌లో తెలుస్తుంది. సినిమా ప్రారంభంలో ప్రస్తుత అమ్మాయి అరుంధతిని విలన్‌ ఆత్మ తన ఊరు రప్పించుకుంటుంది. ఇదంతా కూడా చాలా భయానకంగా వుంటుంది. ఊరు ప్రవేశించిన అరుంధతిని ఆత్మ అనేక వేధింపులకు గురి చేస్తుంది. తీవ్ర ఆందోళనను కల్గించే దృశ్యాలు ప్రేక్షకులను పట్టి కుదిపేస్తాయి. దురాగతాలను సాంకేతిక పరిజ్ఞానమనే అందమైన ముసుగేసి చూపించడం జరిగింది.
చివరకు ఆ ఆత్మను నాశనం చెయ్యడంలో అరుంధతి తనను తానే హింసించుకుని ఫకీరు సాయంతో లభించిన జేజెమ్మ అస్థికల ఆయుధాన్ని తన రక్తంతో తడిపి గ్రాఫిక్స్‌ల మధ్య విలన్‌ను అంతం చేస్తుంది. ఇంతటితో ఆత్మ ప్రభావంతో విడిపోయిన అరుంధతి బంధువులందరూ కలుస్తారు. ఇదీ కథ. ఇలా అవాస్తవికత, అమానవీయత, హింసాత్మకత, భయానకంగా చిత్రించారు.
ఈ సినిమా నీచ అభిరుచుల్ని హీనవిలువలని పనిగట్టుకుని ప్రచారం చేస్తుందనిపించింది. అంతేకాక యువతీయువకులకు జీవితం పట్ల, సమాజం పట్ల సరైన దృక్పథాన్ని, ఆదర్శాల్ని, ఆత్మస్థయిర్యాన్ని ఇవ్వటం లేదు. పైగా విలాసాల కోసమొ, క్షణికానందంకోసమొ, ఉద్రేకాల ఉపశమనం కోసమొ, దేనికైనా తెగబడే ధోరణిని వ్యాప్తి చేస్తోంది. మహిళలకు రక్షణ కరువై దాడులు పెరుగుతున్న సమయంలో హింసను ప్రేరేపించే విధంగా ఉన్న ఈ సినిమా హౌజ్‌ఫుల్‌ కలెక్షన్‌తో ఆడడం విషాదకరమని చెప్పాలి. ఇంత దారుణస్థితికి, అమానుష హింసకు మూలమైన వ్యాపార సంస్కృతికి వ్యతిరేకంగా మహిళలందరం సంఘటితంగా పోరాడటం తప్ప మరొక మార్గం లేదు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

27 Responses to ”అరుంధతి” చిత్రంపై సమీక్ష

 1. అరుంధతి గురించి ఒక కొత్త కోణంలో చెప్పారు. ప్రజల్లో మూడ నమ్మకాలని, అంధ విశ్వాసాలని ఈ సినిమా పెంచి పోషిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంత భయపడుతూ ఈ సినిమా చూడవలసిన అవసరం ఏమిటో నాకు అంతుబట్టడం లెదు.

 2. గౌరి says:

  క్రితజ్ఞతలు డాక్టరు గారూ!
  అరుంధతి హిట్ కధనం వినీ వినీ వెళ్ళి సినీమా చూసిన మాకు మతి పోయింది. అసలు మా కుటుంబము లోనే ఏదో లోపం వుందేమో అందరికీ నచ్చిన సినీమా మాకు ఇంత చండాలంగా అనిపించిందేమిటా అని.ఈ రోజు మీ సమీక్ష చదివిన తరువాత హమ్మయ్య అనుకున్నాము ఒక్కరయినా ఇలా ఆలోచించారని. ఇలాంటి సినీమాలు అసలు ఎలా సెన్సారు పాస్ అవుతాయో తెలియటం లేదు.చాలా అసభ్యకరమయిన సీన్లు మాటలు వున్నాయి.మీరు వ్రాసినది అక్షరాలా నిజం.ఈ సినీమా హౌసెఫుల్ కలెక్షన్లతో ఆడటం నిజంగా విషాదం.

 3. rishi says:

  మీకు నమస్సులు… ఎంత గొప్ప సినిమా అని వెల్లిన మాకు నిరాశ .. నవ్వు ..వచ్హింది .పిల్లల తొ వెల్లి భయపెట్టి ఇబ్బందిపద్దవారు ఉన్నరు…ఇకడా ముక్యము గా పత్రికలు, మీడియ …ప్రచారము ఎక్కువ….అనాలి… సినిమ చూదగనె పిల్లలకి చెప్పింది ఒకతె ….మాయబజారు …పాతాలభిరవి….గొప్ప సినిమాలు ఉన్నవి చూడండీ…ఎది ఎమినా ఈ సినిమా అంత పెరు వచ్హె అరహత లెదు…..

 4. మా పని మనిషి కూడా ఈ సినిమా చూసింది. ఈ సినిమా బాగాలేదని ఆమె చెపితే ఏదో అనుకున్నాను. ఆ సినిమాలో బూతు, హారిబిలిటీ ఈ స్థాయిలో ఉంటాయనుకోలేదు.

 5. Raghuram says:

  నా మనసులోని మాట కూడా ఇదే. ఇదే విషయం మా స్నేహితులకి చెబితే నన్ను వింత గా చూశారు.

 6. వాళ్లు ఈ సినిమా చూడలేదనే అనుకుంటాను. ఆ సినిమా ఇంత పాపులర అయ్యింది అని పత్రికలలో వ్రాస్తే కాదనే ధైర్యం లేక ఆ చెత్త సినిమా కూడా మంచి సినిమా అని బల్ల గుద్దినట్టు వాదించి ఉంటారు. చిన్నప్పుడు మీరు దేవతా వస్త్రాలు కథ చదివే ఉంటారనుకుంటాను.

 7. హారర్. ఫేంటసీ,సోషియో-ఫేంటసీ లాంటి పదాలు హాలీవుడ్ లో సినిమాల్ని (genre గా) విభజించడానికి ఉపయోగిస్తే,ఈ ప్రక్రియల్నన్నింటినీ కలగలిపి మన తెలుగువాళ్ళు సినిమాలు తీసేస్తారు. అన్నీ కలిపిన కలగూరగంప కాబట్టి ఏ పేరుతో పిలవాలో తెలీక, “మాయాజాల చిత్రాలు” అని నేనే ఒక genre కనిపెట్టేసా! ఇలాంటి మాయాజాల సినిమాలు విఠలాచార్యనుంచీ మన తెలుగుకి వారసత్వంగా వస్తే, ఈ కథనరీతిని మరోమెట్టుకు తీసుకెళ్ళిన visionary నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి అని ‘అమ్మోరు’ సినిమా నిరూపించింది. ‘అంజి’ నిరాశపరిస్తే,ఇప్పుడు ‘అరుంధతి’ తన సత్తాను నిరూపించిందని చెప్పక తప్పదు.

  చందమామ కథకు పదునైన కథనాన్నీ, పొందికైన గ్రాఫిక్స్ ని సందర్భోచితమైన సొగసుల్నీ అద్దితే అరుంధతి సినిమా అవుతుంది. 80 సంవత్సరాల క్రితం గద్వాల్ సంస్థానంలో పశుపతి అనే దుర్మార్గుడైన ఒక అఘోరా మాంత్రికుడికీ(సోనూసూద్) ఒక అభిమానవతి అయిన రాజకుమారి అరుంధతి- జేజమ్మ (అనుష్క)కీ మధ్య జరిగిన ఘటన మళ్ళీ ఈ అధునిక కాలంలో పునరావృతం అవుతుంది. అరుంధతిగా మళ్ళీ పునర్జన్మ ఎత్తిన జేజమ్మను ఆ అఘోరా క్షుద్ర ఆత్మ ఎలా కష్టాలపాలు చేసేప్రయత్నం చేసింది, ఆ కష్టాలను ఒక ముస్లిం తాంత్రికుడు అన్వర్(షయాజీ షిండే) సహయంతో ఎలా అధిగమించిందీ అనేది కథ.

  10arundh121ఇప్పటివరకూ కేవలం అలంకారప్రాయమైన పాత్రలకో లేక అంగప్రదర్శనకు పరిమితమైన హీరోయిన్ గా ఉన్న అనుష్క ఈ సినిమాలో నటనా పరంగా మంచి ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. అభిమానవతి,సాహసి, రాకుమారి జేజమ్మగా తన గంభీరమైన నటన ఒక ఎత్తయితే మూఢనమ్మకాలని కొట్టిపడేసే ఒక అధునిక యువతి, తన జీవితంలో ప్రత్యక్షంగా అనుభవమయ్యేసరికీ ఏంచెయ్యాలో పాలుపోని కలవరపాటుకు గురవుతూ చివరకు తన కలవరపాటుని ధైర్యంతో పక్కకునెట్టి కార్యసాధనకు పూనుకునే మరొక పాత్రలో అనుష్క నటన ప్రశంసనీయం. తన ఎత్తు, విగ్రహం, స్క్రీన్ ప్రెజెంన్స్ ఈ పాత్రకు వన్నెతెచ్చాయి. స్త్రీలోలుడైన పశుపతిగా ఆ తరువాత అఘోరా మాంత్రికుడిగా సోనూ సూద్ ఆకట్టుకుంటాడు. ముస్లిం తాంత్రికుడిగా షయాజీ షిండే తన సహజమైన హడావిడి నటనను ప్రదర్శించినా, ఆ పాత్ర ఔచిత్యం ఆ పాత్రకు రాసిన తెలివైన సంభాషణల వలన గుర్తుంచుకోదగ్గదిగా మిగిలింది. ఆకాలానికీ ఈ కాలానికీ వారధిగా మిగిలిన పాత్రలో మనోరమ తన తమిళ నటనను ఒలికించింది. తాతయ్యగా కైకాల సత్యనారాయణ నటన సందర్భోచితంగా ఉంది. మిగతా పాత్రలు కేవలం ఉనికేతప్ప ప్రాముఖ్యత లేనివి కాబట్టి పెద్దగా చెప్పుకోవల్సిన అవసరం లేదు.

  ప్రత్యేకమైన కామెడీ ట్రాక్, అనవసరమైన పరిచయ దృశ్యాలూ లేకపోవడం కథనం రీత్యా ఈ సినిమాకు చాలా “ప్లస్” అయ్యే విషయాలు. జేజమ్మ అఘోరాను చంపే దృశ్యంలో వచ్చే నృత్యం మరింత బాగా తీసుండొచ్చు. అరుంధతి పెళ్ళి సందర్భంగా సాగే పాట ఒక అనవసరం. ‘కోటి’ సమకూర్చిన సంగీతం సాంప్రదాయబద్ధంగా ఉన్నా, సినిమా స్థాయికి తగ్గట్లుగా అస్సలు లేదు. ముఖ్యంగా నేపధ్యసంగీతం ఈ సినిమాకు పెద్ద లోటు.అత్యంత కీలకమైన దృశ్యాలలో అత్యంత పేలవమైన నేపధ్యసంగీతాన్ని సమకూర్చి సినిమా స్థాయిని దిగజార్చడంలొ కోటి తనవంతు కృషి చెసారు.అంతేకాక సినిమాలోని ముఖ్యమైన ఘట్టాల్లోవచ్చే నేపధ్యగీతాన్ని భాషరాని, భావం పలుకలేని కైలాష్ ఖేర్ తో పాడించి పాపంకూడా కట్టుకున్నారు. గ్రాఫిక్స్ హాలివుడ్ స్థాయిలో లేకపోయినా, భారతీయ సినిమాలో ఈ స్థాయి విజువల్ క్రియేషన్ ఇదే ప్రధమం అనుకోవచ్చు. ఈ సినిమాకు ఒక pan Indian appeal ఉందనిపిస్తుంది. దర్శకుడిగా కోడిరామకృష్ణ చేసింది నటులదగ్గరనుంచీ నటన రాబట్టడం ఒక్కటే కాబట్టి అందులో తనవంతు సహకారం అందించారనే చెప్పాలి.

  చివరిగా, ‘అరుంధతి’ ఒక మాయాజాలం. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి నమ్మకానికీ, సినిమాపట్ల తనకున్న passion కీ చిహ్నం.అస్సలు నిరాశపరచని చిత్రం. ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం.

 8. మహేషూ, చాలా రోజులు నుంచి నీ వ్రాతలు చదువుతున్నాను. ఇక్కడ కూడా తలక్రిందుల వ్రాతలే. నువ్వు సమర్థించేది వినోదాన్నా, భయాన్నా? హారర సినిమాలు వినోదం కలిగించవు, భయం కలిగిస్తాయి. అయితే ఇలాంటి సినిమాలు జనం ఎలా చూస్తున్నారు అనేది ఇక్కడి ప్రశ్న. భయం పెంచే సినిమాలు చూడడం కూడా అంత అవసరమా?

 9. ఇది నవ తరంగం పత్రిక అనుకుని మహేషు ఇలా వ్రాసేసి ఉంటాడు. పల్లెటూర్లలో చేతబడుల పేరుతో హత్యలు జరుగుతోంతే దెయ్యాలు, మంత్రాలు లాంటి వాటిని చూపిస్తూ మూఢ నమ్మకాలని ప్రోత్సహించే సినిమాలు తియ్యడం ఎందుకు అని ఆలోచించకుండా వ్యాసం దారి మళ్ళించే రిప్లై ఎందుకు?

 10. neelavenu says:

  ప్రతీ సినిమా ఒక రకానికి చెందుతుంది. ఒక హారర్ సినిమాని తీసుకొని మరొకలాగ వుండాలనకూడదు. ముఖ్యమైన సమస్య – పెద్దలకు మాత్రమే అనకపోవడము, పెద్దలు ఇటువంటి సినిమాలకు పిల్లలను తీసుకువెల్లడము. మరొక విషయము – ఈకాలం పిల్లలు చాలా తెలివైనవాళ్ళు, ఒక్క సినిమాతోనే అన్నీ నిర్ణయాలు తీసుకుంటారనుకోకూడదు. ఇలాగైతే ఇంటెర్నెట్ మీద మరింత ఘోరాలు వుంటాయి. మన పొలిటిక్సు మరింత ఘూరం. ఆవి మరింత దారుణంగా పిల్లలను పాడుచేస్తున్నాయి – వాటికేమంటారు?

 11. neelaveni says:

  పిల్లలకు నేర్పించాల్సింది విచక్షణాజ్ణానం, జ్ణానం. చెడుని చూపించకుండా ఎన్నాళ్ళు కాపాడగలరు? ఈ ఓక్క సినిమా గురించి అనడంలేదు (ఇది మాత్రం పిల్లలు చూడదగినది కాదు). అలాగే ఈసినిమా లాటి సబ్జెక్టు గురించి చర్చించడం మంచిది. జ్ణానానికి, మించిన మందు లేదు!

 12. అరుంధతి సినిమా జనం చూడరేమోనని డౌటొచ్చి ఆ సినిమాకి అనవసరమైన పబ్లిసిటీ ఇచ్చి జనాన్ని రప్పించారని నా అనుమానం.

 13. డబ్బుల విషయంలో ఎలాంటి వైరుధ్యాల గురించీ ఆలోచించని వాళ్ళ గురించి నేను ఇంతకు ముందు వ్రాశాను.
  http://telugu.stalin-mao.net/?p=175

 14. @మార్తాండ: నవరసాల్లో భీభత్సం, భయానకం కూడా రసాలే. హారర్ అనేది ఆ genre కు సంబంధించిన ప్రక్రియ. అది సాహిత్యంలోనైనా, సినిమాల్లోనైనా ఉండొచ్చు. ఆ రసస్పందనని ఆశించే జనాలూ ఉండొచ్చు. ప్రతిదాన్నీ దాని ఉద్దేశం దృష్ట్యా కాకుండా చాదస్తంతో చూస్తే ఇలాగే ఉంటుంది.

 15. చాదస్తం ఎవరిది బాబు? భయం కూడా తియ్యని రసంలా కనిపించేవాడిదే నిజమైన చాదస్తం. పెంట తినేవాడికి పెంట రుచిగానే ఉంటుంది కానీ జుగుప్సకరంగా అనిపించదు.

 16. నువ్వు చలం గారికి వ్యతిరేకంగా వ్రాసిన వ్రాతల దగ్గర నుంచి చూస్తున్నాను, నీ వ్రాతలలో హెరెసీ ఎక్కువగా కనిపిస్తోంది.

 17. akasaramanna says:

  అరుంధతి సినిమా మీద ఇంత చర్చ ఎందుకో అర్థం కావడంలేదు. సినిమా నచ్చింతే చూడాలి, లేకపోతే మానెయ్యాలి. అయినా సినిమాలు వినోదం కోసమే కానీ సమాజాన్ని బాగుచేయడం కోసం ఎవరు తీస్తున్నారు. అది ఈ కాలంలో అయినా మరే కాలం అయినా సరే. కొందకచో కొన్ని మంచి చిత్రాలు వచ్చాయి అన్నది నిర్వివాదాంశం అయినప్పటికీ, ఆ మంచి సినిమాలు రావాలంటే ఇలాంటి చెత్త సినిమాలు (కొంతమంది అభిప్రాయం ప్రకారం) అవసరం ఎంతైనా వుంది. తీపి విలువ చేదు తిన్న తర్వాత బాగా తెలుస్తుంది మరి. ఇక ఆచేదుకూడా ఒక రుచే అనుకొని షడ్రుచులూ తినేవారికి అది కూడా అవసరమే.

  ఇక సినిమాలో వున్న హింస, మూఢనమ్మకాలగురించి అంటారా? అది కేవల్ సినిమా. అసలు ఆంగ్లములో సినిమాలతో పోలిస్తే, ఇది ఏపాటి. మనుషులను ముక్కలు ముక్కలుగా నరికే చిత్రాలదగ్గరనుండి, అత్యంత హేయమైన సినిమాల వరకూ అన్నీ వుంటాయి. కాకపోతే అక్కడ జనాలు వారికి నచ్చినవి మాత్రమే చూసి, మిగిలిన వాటిని చూడడం మానేస్తారనుకుంట. మమ్మీ సినిమా చూడండి. అందులోనూ మంత్రాలూ తంత్రాలూ వుంటాయి. చచ్చినవాల్లు బతికి రావడాలు, క్షుద్ర విద్యలూ అన్నీ వుంటాయి. కానీ దాన్ని ఎవరూ అంత సీరియస్ తీసుకోలేదు. ఎందుకంటె సినిమాలు దేనికో వారికి తెలుసుకాబట్టి అనుకోవాలేమో?

  అయినా సినిమాలన్నీ పాతాలభైరవిలానో, గోదావరి, హ్యాపీ దేస్ లానో వుండాలంటే ఎలా? ఒకవేల అలా తిసినా కొన్ని రోజులకే జనాలకు మొహం మొత్తి, సినిమా ఇండుస్త్రీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది.

  మరి, ఇలాంతి చెత్త చిత్రాలు చూసి పిల్లలు చెడిపోవలసిందేనా అంటారా? కేవలం సినిమాలవల్ల పిల్లలు చేదిపోతారు అనే దాన్ని నేను నమ్మను. పిల్ల ప్రవర్థనపై వారి తల్లిదండ్రుల ప్రభావమే ఎక్కువ, ఆతర్వాతే ఈ సినిమాలూ, సీరియల్లు. పిల్లలకు చక్కని విలువలను నేర్పించాలి. సినిమాలు కేవలం వినోదంకోసమే కానీ అవినిజమని కాదని విడమరిచి చెప్పాలి.

  మహేష్ గారు చెప్పినదానితో నేనూ ఏకీభవిస్తున్నాను. అంతేకాదు, ఇంగ్లీషు సినిమాల లాగ అన్ని రకాల సినిమాలు తీసేలా వుండాలి అన్నది నా అభిప్రాయం. అప్పుడు కుటుంబ కథా చిత్రాలలో కేవలం కుటుంబ విలువలే వుండేలా సినిమాలు వస్తాయి. హింస, సృగారంలాంటి వాటిని కుటుంబ కథా చిత్రాలలో చొప్పించి అమ్ముకోవాల్సిన అవరసం వుండదు. సినిమా రేటింగ్ కూడా, ఇప్పుడున్న దాన్ని వదిలేసి, ఇంగ్లీషు చిత్రాలకున్నాట్లు ఎం.పి.పి.ఏ రేటింగ్ లాంటివి వుండాలి. పెద్దల సినిమాలకు చిన్న పిల్లలను అనుమతించ కుండా థియేటరు యాజమాన్యం ష్రద్ద తీసుకోవాలి. నిమాలను ఉల్లంఘించిన థియేటర్ల పైన, వాటి యజమానులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి.

  @ మార్థాండ

  మీకు సినిమా నచ్చకపోతే అది మీ వ్యక్తిగత విషయం. అంతే కానీ, ఇలా ఆసినిమాలు చూసే వారందరినీ కించ పరచడం అవసరమా? మీరు కూడా మావో ఇజమని, స్టాలినిజమని, రక రకాల ఇజాలతో స్త్రీయే పురుషుడ్ని రేప్ చేయాలని చెప్పడమే కాక, కొంతమందిని తమ వ్యాఖ్యాలలో ప్రోత్సహించారు కూడాను!! మరి ఈ విచిత్రమైన (ఒక రకంగా, చండాలమైన) అభిప్రాయలను వ్యక్త పరచిన మీకు, ఆ … తినే, సామెత వర్తించదా మహాశయా?

 18. నేనెన్నడూ స్త్రీలని కించపరిచే వ్రాతలు వ్రాయలేదు. చలం గారి సాహిత్యం గురించి వ్రాస్తేనే అది బూతు అని విమర్శించారు. మహేషు ఇంతకు ముందు కూడా నిజం బూతుని సమర్థిస్తూ వ్రాతలు వ్రాశాడు.
  http://telugu-blog.pkmct.net/2009/04/blog-post_13.html

 19. hero says:

  అమ్మ జెజమ్మ…పని లేని మంగలి పిల్లి ది ఎదొ గొరిగిందని ….నీకు ఎమి పని లెక ఇది రాసావనుకుంట….పొయి పని చూసుకొ

 20. dheeraj says:

  తెలుగు సినిమాలు చూడడం మానెయ్యండెహె..

 21. Marthanda says:

  బ్లాగుల్లో ఇంత పెద్ద చర్చ జరిగింది కదా అని ఆ సినిమా చూసాను. చూసిన తరువాత వాంతొచ్చేంత జుగుప్స కలిగింది. వ్యాపారం పనులు మానుకుని ఈ సినిమా ఎందుకు చూశానురా బాబో అని బాధ పడ్డాను.

 22. ars someswararao says:

  60 లైన్ల కధ రాసేదొకరు ఏ పాత్ర ఎవరు వేసారో రాసేదొకరు….
  ఇంతకీ వీరు చేస్తున్నది ఈ సినిమాకి ప్రచరమా లేక మూఢనమ్మకాల్ని సొమ్ము చేసుకోడమే లక్ష్యంగా సినిమాలు తీసే
  నిర్మాతల నిస్సగ్గరితనాన్ని ఎండగట్టడమా?
  కత్తితో చాలాబాగా పొదిచాడు, రేప్ సీనులో చాలా బాగా నటించాడు.. ఇదా సమాజానికి సైనైడ్ లాంటి సినిమాలని
  ఒక ప్రక్క తెగటార్చుతూ మరోప్రక్క పొగడటం.. ఏ భావానికి నిలబడ్డట్టు…
  ఎవరికి నచ్చిన సినిమాలువారు చూస్తారు..ఎవరికి నచ్చినవి వారు చదువుతారు…అంటే..సమీక్షలనవసరం..

 23. venkata srinivasarao naganaboina says:

  చాల బాగున్నది.

 24. reethu says:

  ఒక సినెమ థీయాలంతె ఎంథ కషతమొ యెవరికి థెలియదు … అంద్ఉకె మీరు ఇంథల చెబుథున్నారు

 25. RohanReddy says:

  ఇండీయా లొ చాలా మందికి ఇదొక సరదా అయిపొయింది. చిన్న చిన్న విషయాలను కుడా విమర్శించటం. సినిమాలు గురించి, మతాలు గురుంచి, కులాల గురుంచి, రాజకీయాలు గురించి, పక్క రాష్త్రాల గురుంచి, భాషలు గురించి, ఒకటి కాదు , రెండు కాదు , మన వాళ్ళు విమర్శించని విషయం లెదు. ఫ్రపంచం లొ ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. తెలుసుకోవటనికి ఎన్నో కొత్త విషయాలు ఉండగా, తీరుబడి గా ఒక సినిమా గురుంచి విమర్శించటం అవసరమా ?
  @డా.కె.స్వరూప, మీరు దేనిలొ డాక్టర్, సాహిత్యం లొనా ? వైద్యం లొనా ??
  People in America, Europe, are knowing about the world, and developing their countries with their research. I want to tell you more about this….If you wish to know, please contact me.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో