ఏ టెక్నాలజి ఉన్నా ఏం ఫాయిద – జూపాక సుభద్ర

ఈ మధ్య మాన్‌హోల్‌ బాగా చేయబోయి మా చిన్నాయిన బిడ్డ భర్త చనిపోయిండు. పర్కాల (వరంగల్‌) ఏరియాలో మాన్యువల్‌ స్కెవెంజింగ్‌లో మా కుటుంబంలో చాలామంది పంజేసేది. మా మేనత్తలు, వాల్ల అత్తమామల కుటుంబాలు నెత్తిన బకెటు పెట్టుకొని డ్రై లెట్రిన్స్‌ని సాఫ్‌ చేసేటోల్లు. మా నాయినను ‘నీ పెద్ద బిడ్డెనియ్యి చిన్న బిడ్డెనియ్యే అన్నా నా కొడుక్కు అని మానత్త యెంత బతిమిలాడినా మా నాయిన మా అక్కల్ని ఇవ్వలేదని ఇప్పటికీ చెప్పుకుంటరు. ఎందుకంటే… ‘వద్దే చెల్లే మీ ఇంట్లంత పియ్యెత్తిపోసే బతుకుదెరువు నేనియ్య’ అని ఇయ్యలేదట. మా నాయిన అప్పటికి తన బిడ్డల్ని తప్పించిండేమో! కానీ నా కులాన్ని, తన చుట్టున్న కుటుంబాన్ని ఆ పియ్యెత్తిపోసే వృత్తినుంచి తప్పించే శక్తిలేని మాదిగైన. స్కావెంజర్స్‌ లేనికాడ మాదిగోల్లే ఆ పంజేస్తుంటరు. అట్లా మా కుటుంబాల్లో చాలామంది ఆ వృత్తిలో ఉండిండ్రు వేరే బతుకుదెరువు దారిలేక.

నేంగూడ చదువుకోకపోయుంటె రోడ్లూడిసే కాన్నే ఉందును. అదేందో కుల దుర్మార్గం కాకుంటె ఒక్క కులంలనే అదీ ఆ కులం మహిళలే ఎందుకు చేస్తున్నట్లు స్కావెంజింగ్‌, రోడ్లూడిసే పనుల్ని. ఈ స్కావెంజింగ్‌ అనేది వేల ఏండ్ల నాటి సమస్య ఎవ్వరు పట్టించుకోని సమస్య ఒక్క బాధిత కులాలు, జెండర్లు తప్ప. కులం ప్రాక్టీసు డిస్టర్బ్‌ కావొద్దు. 21 రాష్ట్రాల్లో 1.6 లక్షల మంది మహిళలు ఇంకా ఈ పీతి బకీట్లు నెత్తిన మోస్తానే ఉన్నరని ‘అన్‌సీన్‌’ భాషాసింగ్‌ పరిశోధన చెప్తుంది. మనకు డాటాలు, లెక్కలు చాలానే ఉన్నయి అని ప్రభుత్వాలు చెప్తయి కానీ మాన్యువల్‌ స్కావెంజర్లు ఎంతమంది ఉన్నరనే లెక్క మన ప్రభుత్వాల దగ్గర లేదు. స్కావెంజింగ్‌ వృత్తి చేసే అంటరాని మహిళలు ఎంతమందనేది డాటా లేదు. మ్యాన్‌ హోల్స్‌లో పడి ఎంతమంది చచ్చిపోయారో ప్రభుత్వాల దగ్గర లెక్క ఉండది.

ఏ దేశ చరిత్రలకైనా టాయిలెట్‌ వ్యవస్థల చరిత్ర ఉంది. తిన్నది బైటికి విసర్జించక మానరు. ఆ విసర్జన హిస్టరీ భారతదేశానికి లేదు. ఇక్కడ శూద్ర కులాలు, దళిత కులాలు సెంబట్కపొయి బైటకు పోయే టాయిలెట్‌ వ్యవస్థ ఉంది. ఒక ఆధిపత్య కులాల పియ్యిని ఇంకో అణగారిన గుంపు ఎత్తేసే క్రూరత్వం కుల సమాజంలోనే

ఉంది. వేల ఏండ్ల కిందనే భారత్‌లో టాయిలెట్‌ సాఫ్‌ చేసే వాల్లమీద రాసిండు పాహియాన్‌ భారతదేశానికొచ్చినపుడు. కాని భారత దేశంలో టాయిలెట్స్‌ సాఫ్‌ చేసే వాల్ల మిద, వారెవరని ఏ భారత చరిత్రకారుడు రాయలే.

అంతరిక్షాల్లోకి ఉపగ్రహాల్ని పంపించే టెక్నాలజీ ఉంది ఇండియాకు. కానీ డ్రైనేజి సాఫ్‌ చేసే, టాయిలెట్లు సాఫ్‌ చేసే టెక్నాలజీ మాత్రం ఉండది. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి కులం మైండ్‌సెట్‌తోని ఉంటది. అందుకే స్కావెంజర్లే చెప్పండి పరిష్కారం అంటది. ఎందుకంటే వాల్ల మనస్సులు మేధస్సుల్ని కులం కబలించింది. ప్రముఖ రిసెర్చ్‌ స్కాలర్‌ రవిచంద్రన్‌ బాత్రన్‌ మాటల్లో… ”అంటరాని వాల్లకు ఆలయ ప్రవేశం నిషేధం వల్ల గుడుల్లో టాయిలెట్స్‌ లేవు. గుడుల్లాంటియే సవర్ణ హిందూకులాల యిండ్లు. ఈ రెంటికీ దళితులకు ప్రవేశం లేదు. భారత టాయ్‌లెట్స్‌ ఇంటి బైట వెనక

ఉండడానిక్కూడా కారణం ఇదే అంటడు. దళిత కులాల మహిళలు టాయిలెట్లు కడగడానికి, లేదా తీసెయ్యడానికి యింట్లకు వస్తే ఇల్లు మైలబడ్తది అనే కుల గజ్జి వల్లనే ఇంటి బైట టాయిలెట్లు బెట్టిండ్రు. బ్రిటిష్‌ టాయిలెట్స్‌ నిర్మాణంలో స్కావెంజర్స్‌కి ప్రత్యేక ద్వారాలుండయి. కానీ హిందూ టాయిలెట్ల నిర్మాణాలన్ని బైటనే ఉండడాన్ని చూస్తాం. ”అట్లనే మామూలు ఇంటి పనివాల్ల ప్రవేశ ద్వారాలు, స్కావెంజింగ్‌ పనిచేసే వాల్ల ప్రత్యేక ద్వారాలు వేరుగా ఉంటాయని చెప్తాడు.

మొన్నీ మధ్య కూడా ఢిల్లీలో, దేశ రాజధాని నగరంలో అపార్ట్‌మెంట్స్‌ సెప్టిక్‌ ట్యాంకులు శుభ్రం చేస్తూ అయిదుగురు భంగీలు చచ్చి పోయిండ్రు. ఈ చావుల మీద లేబర్‌ డిపార్టుమెంట్‌ వాల్లు ప్రైవేట్‌ లేబర్‌ మాకేమీ సంబంధం లేదని చెప్తే ఢిల్లీ జల్‌ బోర్డు కూడా అదే మాట్లాడి వదిలించుకున్నది. చనిపోయిన వాల్లంతా 20-25 లోపు వాల్లు. అఖిల భారత సఫాయి కర్మచారీ ఆందోళన సంగం ప్రెసిడెంట్‌, మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్‌ నాయకత్వంలో పెద్ద గొడవ చేసి పోలీసు కేసు పెడితే మంత్రి దిగిరాని పరిస్థితి. ఇది న్యూస్‌ కూడా కాలే. ఒక సైనికుడు చనిపోతే… చాలా రిహంగామా జేస్తది, సంచలనం జేస్తది కుల సమాజ మీడియా కుల ప్రభుత్వము. దేశ భద్రత కోసం ప్రాణాలర్పించిండని చాలా చాలా అవార్డులిస్తయి, ఉద్యోగాలిస్తయి, ఇంకా చాలా హాబిలిటేషన్స్‌ ఇస్తయి. కానీ సమాజ ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాన్‌హోల్స్‌లో శుభ్రత కోసం దిగి చనిపోతున్న వేలాదిమంది సఫాయి కర్మచారీల త్యాగాలు కనీసం వార్త కాదు.

ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లో 23 వేల మంది మున్సిపల్‌ వర్కర్లుగా పనిచేస్తుండ్రు మహిళలు. దాంట్ల 19 వేల మంది మాదిగ మహిళలే ఉన్నరు. ముప్పయ్యేండ్ల నుంచి కాంట్రాక్టు వర్కర్స్‌ ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌గా వెయ్యి రూపాయిలు (నెలకు) చేసిన వాల్లు కూడా వున్నరు. కానీ వాళ్ళు జీతాలు పెంచమంటే పర్మినెంటు చేయమంటే… ప్రభుత్వానికి పట్టకపోగా కుతంత్రాలు చేసి అణచి వేసింది. అంటరాని, అణగరిన మహిళలు గ్రామ పంచాయితీల్లో ఇప్పటికీ ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలని చెప్పుకుంటూ వాల్లతోటి ఎట్టి చేయించడము కుల ప్రభుత్వాల దుర్మార్గము.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో