కార్యాచరణలో మరో అడుగు…

అనిశెట్టి రజిత, మల్లీశ్వరి
మనలో మనం రచయిత్రుల తాత్కాలిక వేదిక ఒక సంవత్సర కాలంలో నిర్వహించాలని నిర్ణయించిన విధంగా మొదటి ప్రాంతీయ సదస్సు 21-22 మార్చి 2009 తేదిల్లో వరంగల్‌లో జరిగింది. కాకతీయ విశ్వవిద్యాలయం మహిళాధ్యయన కేంద్రం, మనలో మనం రచయిత్రుల తాత్కాలిక వేదిక సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించారు.
కొండవీటి సత్యవతి ఈ సదస్సును ప్రారంభిస్తూ రచయిత్రుల ఉమ్మడి వేదిక ఇదే విధంగా నిబద్ధతతో కొనసాగి రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో వివిధ అస్తిత్వాలను అధ్యయనం చేస్తూ, చర్చిస్తూ సదస్సులు నిర్వహించుకుంటుందని చెప్పారు.
ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆచార్య టి.జ్యోతిరాణి మహిళాధ్యయన కేంద్రం, కె.యు. డైరక్టర్‌ మాట్లాడుతూ రచయిత్రులు సమాజంలోని అన్ని అసమాన త్వాలను ఎదుర్కోవడానికి ఉమ్మడి కృషి చేయాలనీ జండర్‌ సమానత్వ సాధన లక్ష్యంగా భావజాల నిర్మాణం చేసుకుంటూ పటిష్టంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
సదస్సు సమన్వయ కర్తగా అనిశెట్టి రజిత ఈ సదస్సు గురించిన తన అవగాహనను వివరిస్తూ ఇప్పటి వరకూ విస్మరణకు, అవమానాలకు గురైన వివిధ అస్తిత్వ వర్గాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. విశాఖపట్నంలో జరిగిన ఃమనలో మనంః నిర్మాణ సమావేశాల్లో భిన్న వర్గాలకు చెందిన రచయిత్రులు తమ తమ భావాలను ఆలోచనలనూ, అస్తిత్వాలనూ ప్రకటించారు. దానికి మలి అడుగుగా ఃఃదళిత, తెలంగాణ స్త్రీ జీవితాలకు సంబంధించిన సాహిత్యాన్ని వెలికి తీసి, కొత్తగా రాస్తున్న రచయిత్రులను ప్రోత్సహిస్తూ, ఈ తరం విద్యార్థినుల్లో సాహిత్యాసక్తిని కలిగిస్తూ వారికి వేదిక కల్పించడం కూడా ఈ సదస్సులో కొత్తగా చేయడం జరిగిందన్నారు.
సమాజంలో ఎన్నో రకాలుగా ఉన్న బాధిత వర్గాలపట్ల ఆప్తితో బాధలూ బాధితులూ, పీడితులూ లేని సమాజం కోసం సాహిత్యకారులు బాధితులతో మమేకమై పనిచేయాలనీ వారికి అండగా నిలబడాలని.. సాహిత్య రంగంలో స్త్రీల రచనల పట్లా వారి వేదికలపట్లా ఉన్న చిన్న చూపును పక్కకు నెట్టి సాహిత్య సాంస్కృతిక సామాజిక కార్యకర్తలుగా మన కోసం మనలో మనం ఎదగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
కాత్యాయనీ విద్మహే ఈ సదస్సు అవగాహనను విపులంగా విశ్లేషించారు. సాహిత్య రంగంలోని స్తబ్ధతను తొలగించేందుకు సమిష్టి కార్యాచరణ కృషి అవసరం. ఈ కృషి ప్రజాస్వామిక సమిష్టి కృషిగా ఉంటేనే సరైందని నాటి అభ్యుదయ రచయితలు భావించడాన్ని ఉటంకిస్తూ మొత్తం సాహిత్య రంగంలోనే స్త్రీల కృషి అసమగ్రంగా రికార్డ్‌ అయ్యిందనీ స్త్రీలు రచనలు చేసారంటే ఎందుకు చేసారన్న దృష్టితో పరిశీలించాలనీ, ఏం రాసారు, ఎంత రాసారు అని తూకం వేయడం ముఖ్యం కాదు ముందుగా పరిణామాత్మక అధ్యయనం తర్వాతనే గుణాత్మక అధ్యయనం చేయాలి. పితృస్వామిక వర్గీకరణల్లో స్త్రీల అణిచివేత అన్ని రంగాల్లో జరిగింది. పితృస్వామిక అణిచివేత, మరోటి కులపరమైన వివక్షతకు గురైన స్త్రీల సాహిత్య అధ్యయనం ప్రత్యేకంగా ఇప్పుడు జరగాల్సి ఉందన్నారు. మార్జినలైజ్‌ చేయబడిన స్త్రీలుగా వారికి ఉన్న అవకాశాలు, పొందగలిగిన అవకాశాల నేపధ్యంలో సాహిత్యాన్ని అంచనా వేయాలి. వారి పైన వివిధ వివక్షతలనూ అధ్యయనం చేయాలి. అనేక అస్తిత్వాల నేపధ్యంలో వచ్చిన సాహిత్యాన్ని చర్చించాలి. గత దశాబ్ద కాలంగా ఆ పని జరగలేదు అందుకే కింది స్థాయి నుండి ఆ పనిని ప్రారంభించాలి. అందులో భాగంగానే ప్రప్రధమంగా దళిత, తెలంగాణా స్త్రీల సాహిత్య అధ్యయనాలపై ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె చెప్పారు. ప్రారంభ సమావేశానికి యం. శ్యామల కృతజ్ఞతలు తెలియజేసారు.
ఃదళిత స్త్రీల సాహిత్యంః అంశంపై మొదటి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జాజుల గౌరి అధ్యక్షత వహించి దళిత కధ, కవిత్వంపైన పత్ర సమర్పణ చేసారు. క్రైస్తవమైనార్టీ సాహిత్యంపై పుట్ల హేమలత, దళిత స్త్రీ వ్యాసాలపై కందాళ శోభారాణి, జూపాక సుభద్ర కవితపై పాత్ర శ్రీలక్షి, జి.కస్తూరి కథపై సుమలత ప్రత్యేక విశ్లేషణలతో కూడిన పత్రాలను సమర్పించారు.
రెండవ సదస్సు తెలంగాణ స్త్రీల సాహిత్యం పైన జరిగింది. ముదిగంటి సుజాతా రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ ఇది అస్తిత్వ పోరాటాల యుగమనీ, ఈ పోరాటాల్లో స్త్రీల అస్తిత్వం అణిచివేతకు గురైందనీ కేవలం ప్రాంతీయత పరంగానే కాకుండా జండర్‌ పరంగా కూడా తెలంగాణ స్త్రీలు వివక్షతకు గురవుతున్నారని చెప్పారు. ఒక ప్రాంతం వెనుక బడినప్పుడు దానికి సంబంధించిన ప్రతికూల ఫలితాలు, పర్యవసానాలు ముందుగా అక్కడి స్త్రీల మీద ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ఎంత వెనకబాటుతనం ప్రభావం ఉన్నా తెలంగాణ స్త్రీలు విస్త్రృతంగా సాహిత్య సృష్టి చేయగలిగారన్నరు. అనేక ఉద్యమాల వాతావరణం వల్ల స్త్రీలు చైతన్యవంతమైన రచనలు చేసారని చెప్పారు. అనిశెట్టి రజిత ఈ సదస్సులో తెలంగాణ నవలపై డాపపభారతి (గీతాంజలి), తెలంగాణ స్త్రీలపై కథపై నిదాన కవి నశ్చల, తెలంగాణ కవిత్వంపై అనిశెట్టి రజిత, తెలంగాణ స్త్రీల వ్యాసం ప్రక్రియపై ఏ.జ్యోతి పత్ర సమర్పణ చేయగా విద్యార్థిని రజిత దీర్ఘకవిత ఃఓ లచ్చవ్వః పై విశ్లేషణాత్మక పత్రసమర్ఫణ చేసారు. కందాళ శోభారాణి ఈ సదస్సుకు వందన సమర్పణ చేసారు.
రెండవ రోజున అత్యంత ఉత్సాహపూర్వకంగా ఃమనలో మనంః రచయిత్రుల సర్వసభ్య సమావేశం జరిగింది. చర్చలు విస్త్రృతంగా జరిగాయి. మొదట అధ్యయన కార్యక్రమాల అవసరం దృష్ట్యా అకడమీషియన్స్‌కు కూడా ప్రాతినిధ్యం ఉండాలని కమిటీ తీర్మానించింది. కాత్యాయనీ విద్మహే గారిపేరును సర్వ సభ్య సమావేశం ఆమోదించింది. బీ.సీ. ల అస్తిత్వ విస్తృతి దృష్ట్యా కె. వరలక్ష్మి గారిని మరొక ప్రతినిధిగా కమిటీలోకి తీసుకోవడం సభామోదంతో జరిగింది.
వివిధ సందర్భాలలో సమస్యలను బట్టి స్పందనను తెలియజేసే బాధ్యతను, సమస్యల అధ్యయనం బాధ్యతను జాజుల గౌరి, రత్నమాల కాత్యాయనీ విద్మహేలకు కమిటీి అప్పగించడం జరిగింది.
కమిటీ సమాచార సమన్వయకర్తలుగా పి. సత్యవతి, కె.ఎన్‌. మల్లీశ్వరిలను, ఆర్థిక వ్యవహారాలను విష్ణుప్రియ నిర్వహించాలని తీర్మానించారు. రాయలసీమ ప్రాంతంలో ఃమనలో మనంః రెండవ ప్రాంతీయ సదస్సు ఃఃరాయలసీమ అస్తిత్వం మైనార్టి స్త్రీల అస్తిత్వ సాహిత్యాలను అధ్యయనం చేయాలని తీర్మానించారు. కె. సుభాషిణి, విష్ణుప్రియ, ఃమనలో మనంః కమిటీ సభ్యుల సహకారంతో ఆ సదస్సు నిర్వహణ బాధ్యతలను వి. ప్రతిమ స్వీకరించారు.
తెలంగాణ, మాదిగ దండోరాలపై వేదిక అభిప్రాయం తెలియజేయాలన్న కొందరు సభ్యుల డిమాండ్‌ను అనుసరించి వేదిక లక్ష్య ప్రకటనను మల్లీశ్వరి చదివి వినిపించారు. తెలంగాణ, మాదిగ దండోరాలతో సహా అదనపు అణచివేతకు గురయ్యే వర్గాలన్నింటి పట్ల వేదిక సంఘీభావం కలిగి ఉందని, కొత్తగా ఏర్పడే అస్తిత్వ సమస్యల్ని అర్థం చేసుకుంటూ సమన్వయ పరిచే విస్తృతి, పరిధి వేదికకు ఉందని చెప్పారు.
హేమలలిత దళిత క్రైస్తవ స్త్రీల సాహిత్యానికీ క్రైస్తవ మైనారిటీ స్త్రీల సాహిత్యానికీ మధ్య నున్న తేడాను గుర్తించి సాహిత్యాధ్యయనం చెయ్యాలన్నారు. రాజ్యం వల్ల భయం, మతం వల్ల భయం రీత్యా చర్చీలు స్త్రీలకు చేస్తున్న అన్యాయాన్ని చెప్పుకోలేక పోతున్నారనీ, కానీ ఇకపై వాటిని చెప్పదల్చుకున్నామనీ అన్నారు.
ఇకమీదట మనం ఃఅగ్రకులాలుః అనే పదాన్ని వాడకుండా ఃఆధిపత్యకులాలుః లేదా ఃప్రాబల్యకులాలుః అన్న మాటను ఉపయోగించాలన్న హేమలలిత ప్రతిపాదనను సభ ఆమోదించింది. రెండో రోజు సభకు రాలేకపోయిన కొండవీటి సత్యవతి లేఖ ద్వారా తెలియజేసిన అభిప్రాయాలను సభ చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
ప్రతికూలతల్ని పట్టించుకోకుండా ఉల్లాసకర వాతావరణంలో ఎన్నో కొత్త ప్రతిపాదనలకు, అంశాలకు తావిస్తూ జరిగిన ఈ రెండు రోజుల సదస్సు, కాకతీయ విశ్వవిద్యాలయం, మహిళాధ్యయన కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త రచయిత్రుల తరాన్ని తయారు చేయగలమన్న ఆశాభావంతో ముగిసింది.
ఈ సదస్సులో రచయిత్రులు, పరిశోధకులు, సామాజిక కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు. రచయిత్రులు : జాజుల గౌరి, పి. సత్యవతి, కె. వరలక్ష్మి, ముదిగంటి సుజాతారెడ్డి, మల్లీశ్వరి, గీతాంజలి, వి. ప్రతిమ, కె. సత్యవతి, శిలాలోలిత, ఘంటశాల నిర్మల, రాణి పులోమజా దేవి, కొండేపూడి నిర్మల, అనిశెట్టి రజిత, పుట్ల హేమలత, నల్లూరి రుక్మిణి, డి.ఎల్‌.సుహాసిని, రత్నమాల, వాయమ్మ కరుణ, శివలక్ష్మి, శాంతి ప్రబోధ, సమతారోష్ని, కొమర్రాజు రామలక్ష్మి, మానం పద్మజ, కె. రాణీ ప్రసాద్‌, రేణుక అయోల, కందాళ శోభారాణి, విమర్శకురాలు ఆచార్య కాత్యాయనీ విద్మహే, ఆచార్య తోట జ్యోతీరాణి, యం. ఉషారాణి, కామేశ్వరి, సులోచన, బి. సుజాత, బి. రమాదేవి, జరీనాబేగం, యం. శ్యామల, ఎన్‌. నిశ్చల, జనగామ రజిత, పి. శ్రీలక్ష్మి, సుమలత, ఎ. జ్యోతి, పి. శోభ, మాధవీలత, మార్గరేట్‌, మంగళ, అరుణాదేవి.
ఈ సదస్సుకు రాలేని అనివార్య పరిస్థితుల్లో ఫోన్‌ ద్వారా తమ సంఘీభావాన్ని తెలిపిన రచయిత్రులు: ఆదిలాబాద్‌కు చెందిన గోపి భాగ్యలక్ష్మి, నిజామాబాద్‌కు చెందిన తుర్లపాటి లక్ష్మి, అమృతలత, కిరణ్‌ బాల, సిరిసిల్ల నుండి కొలిపాక శోభారాణి, కరీంనగర్‌ షహనాజ్‌ ఫాతిమా, అడువాల సుజాత, నల్గొండ దుర్గాబాయి, బండారు సుజాతా శేఖర్‌, హైద్రాబాద్‌ భండారు విజయ, శ్రీపాద స్వాతి, శాంతసుందరి, వి. నాగలక్ష్మి, సుజాతా పట్వారి, గీత, విశాఖపట్నం జి. సీతామహాలక్ష్మి తదితరులు

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో