స్నేహాన్ని పంచిన… పరిమళాల తీగ – కొలిపాక శోభారాణి

పుట్ల హేమలత గారు! ఇకలేరు అన్న విషయం నమ్మలేక పోయాను. ఒక ఆత్మీయ మిత్రురాలు దూరమయ్యారన్న బాధ.. మనస్సునంతా తొలిచివేస్తోంది. ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక పది సంవత్సరాల సంబరాల సమాలోచనలో మాతో పాలుపంచుకున్న హేమలత గారు మా నుండి అర్థాంతరంగా నిష్క్రమించటం బాధాకరం. 2019 ఫిబ్రవరి రెండవ తేదీన మేమంతా విశాఖ చేరి ్‌వీజూ లో రెడీ అయ్యి ఆంధ్ర యూనివర్సిటీ హింది బ్రాంచి సెమినారు హాల్లో ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక సభ్యులందర్ని కలిసి నవ్వులు, కేరింతల్లో మునిగి ఉన్నప్పుడు హేమలత మేడం గారు తెల్ల చీరపై నల్లని గీతలున్న నూలుచీరతో మెడలో తెల్లని పూసల గొలుసుతో మమ్మల్ని బాగున్నారా! అంటూ ఎలాంటి బేషాజాలు లేకుండా పలుకరించారు. మేడం! మీరు శాంతి దూతలా (నూలు చీరలో) మెత్తగా బాగున్నారు అని పరస్పరం పలుకరించుకొన్నాము.

ఎప్పుడైనా ఏదైనా సలహా కాని, సూచనగాని, తెలియని విషయం ఏదైనా అడిగినా ఎప్పుడూ సౌమ్యంగా సమాధానం చెప్పేవారు. మా అమ్మాయి సుష్మ హిందిలో ూష్ట్రణ చేయాలంటే ఎట్లా మేడం అని అడిగితే నేను సుధాకర్‌ సార్‌తో మాట్లాడి చెపుతానని తన సెల్‌ నంబర్‌ తీసుకొన్నారు.

స్త్రీల పై అత్యాచారాలు, దళితుల పట్ల జరిగే అన్యాయాల గురించి చాలాసార్లు కలత చెందుతూ మనం మన వంతుగా ఈ కడగండ్లు, కన్నీళ్ళని ఎత్తి చూపాలని బలంగా ఉద్భోదించేవారు. మేము రాజమండ్రికి వెళ్ళినప్పుడు బొమ్మూరులో సమావేశాల అనంతరం మాతో ఎలాంటి అరమరికలు లేకుండా, వసతి సదుపాయాలు చూపి మాకు స్ఫూర్తిగా మెదిలారు.

ప్ర.ర.వే. మీటింగ్స్‌లో భాగంగా ఢిల్లీలో సమావేశానంతరం తిరుగు ప్రయాణంలో స్వామి నారాయణ టెంపుల్‌, ఇంకా ఇతర ప్రదేశాలు చూద్దామని బయల్దేరి, బస్సును పేవ్‌మెంటు పక్కన ఆపి దాదాపు అందరూ వెళ్ళారు. నేనెందుకో చిక్కుపడి అక్కడే కొంతసేపు ఆగి పోయాను. మేడం చాలా ఆయాస పడుతూ శోభా! నా కాళ్లు లాగేస్తున్నాయి, దాహంగా ఉంది అంటూ పేవ్‌మెంటుపై కూచుండి పోయారు… కన్నీళ్ళు చిప్పిల్లగా! నేనూ ఆగిపోయి హేమా మేడంకు నీళ్ళు ఇచ్చి సాయం పట్టి రాకపోయినా ఫర్వాలేదు బస్సులోనే విశ్రాంతిగా ఉండండి అని కూర్చోబెట్టాను.

ఇక నిన్న ఫిబ్రవరి 3, 2019 న వీడ్కోలు చెప్పుతూ త్వరలో మనం మళ్ళీ కల్సుకుందాం.. మీ రచనలు ”విహంగ”కు’ పంపండి. ఆదీవాసిలకు సంబంధించి అన్ని విషయాలు అధ్యయనం చేద్దాం అని వీడ్కోలుతో పాటు మాతో ఫోటో తీసుకొన్నారు.

కానీ ఇంతలోనే మనలో మనంగా.. లేకుండా భౌతికంగా, శాశ్వతంగా సెలవు తీసుకోవటం బాధాకరం. బంగారు తీగలాఎలాంటి భేషజాలు లేకుండా స్నేహ పరిమళాల్ని పంచిన హేమలత మేడం గార్కి నా హృదయపూర్వకంగా నివాళి. వారి కుటుంబ సభ్యులందరికీి నా మనఃపూర్వక సానుభూతిని తెలుపుతూ!!!

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో