ఆ ప్రవాహపు జాడల్లో…. వి.శాంతి ప్రభోద

నిత్యం ప్రవహించే నది లాంటిది పుట్ల హేమలత.

ఒకే ప్రవాహం పాయలు పాయలుగా విడిపోయి దిశలు మార్చుకుంటూ ప్రయాణిస్తున్నప్పుడపు… ఆమెని ఆ పాయలు తమలోకి మాత్రమే లాక్కోవాలని ప్రయత్నం చేసినప్పుడు లోలోన ఎంతో సంఘర్షణ పడినప్పటికీ, చింత పడినప్పటికీ ప్రవాహ దిశలేవైనా అంతిమ లక్ష్యం ఒకటే కదా అనుకున్నారు. పాయలు పాయలుగా ఉన్న సమూహాలతో స్నేహ సంబంధాలు యధావిధిగానే కొనసాగించారు.

తన ప్రవాహ గమనంలో అడ్డుకట్టలెన్ని వస్తున్నా తట్టుకుంటూ… ఆ బాధల్ని ఓర్చుకుంటూ ఉత్సాహంతో ఉరకలేసే నవ యవ్వనిలా ఉండేదామె. ఎప్పటికప్పుడు మిత్రులందరినీ పలకరిస్తూ… స్తబ్దంగా ఉన్నవాళ్ళని ఉత్తేజపరుస్తూ, ఉత్సాహపరుస్తూ తన మాట వినని శరీరాన్ని పట్టించుకోలేదా..

ఇప్పుడా జీవనది జీవం ఇంకిపోయిందా…?!

ప్రవాహం ఆగిపోయిందా…?!!

నమ్మడం చాలా కష్టంగా ఉంది. కానీ తప్పదు. అది నిజమని నమ్మక తప్పదు.

ఆ నదీ ప్రవాహం ఇప్పుడగుపించకపోవచ్చు గానీ అది సస్యశ్యామలం చేసిన మొలకలున్నాయి, ఎదిగిన మొక్కలున్నాయి, చెట్లున్నాయి, అన్నిట్లో ఆ ప్రవాహపు జాడలు అగుపిస్తూనే ఉన్నాయి.

ప్రరవేతో నాకు అనుబంధం ఏర్పడిన తొలిరోజుల్లోనే వరంగల్‌లో పుట్లగారితో పరిచయం అయింది. ప్రరవే కుటుంబ సభ్యులుగా మా మధ్య అనుబంధం పెరిగింది. స్నేహం వికసించింది.

నిన్నటికి నిన్న విశాఖపట్నం ప్రరవే పదేళ్ళ సదస్సులో కలిసినప్పటి రూపమే మదినిండా… సభలు ముగిసి బయలుదేరేటప్పుడు రాజమండ్రి రారాదూ.. రెండ్రోజులుంటే బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు అన్నారు. ఇప్పుడు కాదులే, మరోసారెప్పుడయినా వస్తానంటే నేనే ఏప్రిల్‌ తర్వాత హైదరాబాద్‌ వచ్చేస్తున్నాగా అన్నారు.

ప్రరవే కార్యవర్గంలో ఆవిడ విలక్షణ వ్యక్తిత్వం బాగా అర్ధమయింది. ఎంత మృదు స్వభావిగా కనిపిస్తారో అంత దృఢ చిత్తం ఆమెది. చెణుకులు విసురుతూ ఎంత సరదా మనిషిలా అగుపిస్తారో అంత లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తారు. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడం ఆమె నైజం. ప్రశ్నలు లేవనెత్తి చర్చను నడిపించడంలో మహా దిట్ట పుట్ల హేమలత.

పదేళ్ళ ప్రరవే ప్రస్థానంలో పుట్ల క్రియాశీలక పాత్ర మరువలేనిది. ముఖ్యంగా దళిత, బహుజన, క్రిస్టియన్‌, మైనారిటీ మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ. ఆ వర్గాల పట్ల వకాల్తా పుచ్చుకుని మాట్లాడేవారు. అలాగని ఇతరులను కించపరచడం, తక్కువ చేసి మాట్లాడడం ఏనాడూ చూడలేదు.

”జోగిని” నవలను విహంగలో ధారావాహికగా ప్రచురించాలనుకున్నానని చెప్పి సాఫ్ట్‌ కాపీలు అడిగారు. అప్పుడు అది నా దగ్గర లేదు. అదే చెప్పాను. ఆవిడ వదల్లేదు. మళ్ళీ మళ్ళీ అడుగుతుండడంతో పబ్లిషర్స్‌ అయిన ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ వాళ్ళనడిగి తీసుకుని ఇచ్చాను. అన్నట్లుగానే విహంగలో చాలాకాలం సీరియల్‌గా వేశారు. విహంగ మనందరిది. అందరూ విహంగ మీది అనుకుని రాయండి అంటూ ప్రోత్సహించేవారు. నేనూ కథలు, కవితలు, వ్యాసాలు పంపించేదాన్ని. ఏదైనా తన పని తాను చేయాలన్నా, ఎదుటివాళ్ళతో చేయించాలన్నా దానిమీదే దృష్టి పెట్టేవారు.

పుట్ల హేమలతగారి కవితా సంకలనం ‘వేకువ రాగం’ వేసేటప్పుడు సమీక్ష చేసి సారంగకి పంపగలవా అని అడిగారు. సాఫ్ట్‌ కాపీ పంపించారు. అదేవిధంగా మెర్సీ మార్గరెట్‌ ‘మాటలమడుగు’ పుస్తకానికి కూడా సమీక్ష చేయగలవా అన్నారు. ఆవిడ అడిగిన ఆ రెండు పనులూ అప్పుడు మా ఊళ్ళో ఇంటర్నెట్‌ సమస్యల వల్ల, నాకున్న సమయాభావం వల్ల మొదలుపెట్టి కూడా పూర్తి చేయలేకపోయాను.

గత సెప్టెంబరులో దళిత రచయిత్రులను పరిచయం చేస్తూ ఓ సంకలనం తెస్తున్నట్లు చెప్పి నా ఎరుకలో ఉన్న దళిత రచయిత్రులని చెప్పమన్నారు. ఆ క్రమంలో ఒక రచయిత్రిని పరిచయం చెయ్యమని అడిగారు. నేనప్పుడు ఆస్ట్రేలియాలో కొంచెం బిజిగా ఉన్నాను. అందుకే నాకు వీలుపడదు అని చెప్పినా ఒప్పుకోలేదు. రాయగలిగేవాళ్ళు రాయకపోవడం నేరం అని నాతో రాయించారు. ఆ పుస్తకం ఇంకా బయటకు రాకుండానే ఆవిడ వెళ్ళిపోయారు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే ఆ నిండైన రూపం ఇక కనిపించదు. పసిపాప నవ్వులా ఉండే స్వచ్ఛమైన ఆ నవ్వు స్థానంలో ఆమె నిర్జీవ రూపాన్ని చూడలేక కడసారి చూపుకు వెళ్ళలేదు.

ఇప్పుడు ఆవిడ గురించి బరువెక్కిన హృదయంతో ఇలా రాయడం ఏనాడూ ఊహించనిది.

హేమలతగారి ఆశయాల్ని, ఆశల్ని బతికించుకోవడమే ఆమెకి మేమిచ్చే నివాళిగా భావిస్తున్నా.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో