టాప్‌ గర్ల్స్‌

కారల్‌ చర్చిల్‌
అనువాదం : కె.సునీతారాణి

(కిందటి సంచిక తరువాయి)
నీ : మంచి బట్టలు వేసుకోవడం నీకిష్టం లేదా? నా బట్టలంటే నాకెంతో ఇష్టం. / రాజుగారి తమ్ముడికి సేక్‌ ఇవ్వడానికి నన్ను ఎనుకున్నారు.
మ : ఇజబెల్లా బట్టలకంటే అందమైన బట్టలుండేవి నీకు.
మ : అవును,
జో : ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు అబ్బాయిలాగా వేషం వేసుకున్నాను.
నీ : ఆకుపచ్చ జాకెట్‌. ఆకుపచ్చ, గులాబీ రంగుల అయిదు పొరల గౌను వేసుకుంది లేడీ బెట్టో.
ఇ : నువ్వు మగవేషం వేసుకున్నావా?
మ : అవును మరి / క్షేమంగా ఉండడం కోసం.
జో : చాలా సులభం. నాకప్పటికి పన్నెండేళ్ళే. ఆడవాళ్ళను లైబ్రరీలోకి అనుమతించే వాళ్ళు కాదు. మేము ఏథెన్స్‌లో చదువుకోవాలనుకున్నాం.
మ : ఒక్కదానివే పారిపోయావా?
జో : లేదు. ఒక్కదాన్నే కాదు, ఓ స్నేహితుడితో కలిసి / అతనికి పదహారేళ్ళు.
నీ : ఓ, లేచిపోయారు.
జో : కానీ అతనికి తెలిసిన దానికంటే ఎక్కువ సైన్సు, అతనికి తెలిసినంత తర్కశాస్త్రం నాకు తెలుసనిపించేది.
ఇ : నేనైతే ఎప్పుడూ స్త్రీగానే ప్రయా ణం చేశాను. ఆడలక్షణం కాదని ఎవరైనా అంటే వెంటనే ఖండించేదాన్ని.
మ : ఆఫీస్‌కు వెళ్ళేటప్పుడు ట్రౌజర్స్‌ వేసుకోను / వేసుకోవచ్చు కాని వేసుకోను.
ఇ : నా వయసు, అందం ఉన్న స్త్రీకి పెద్ద ప్రమాదమేమీ లేదు.
మ : అలాగే ఉండిపోయావా జోన్‌?
జో : అప్పుడలాగే ఉండిపోయాను.
వెయిట్రెస్‌ భోజనం తీసుకొస్తుంది.
మ : మరి ఎవ్వరూ గుర్తుపట్టలేదా?
జో : నేను చాలా తెలివైన అబ్బాయిನని గమనించారు / ఆ తర్వాత నేను.
మ : నేనైతే అంతకాలం నటించలేకపోయేదాన్ని.
జో : లాడ్జింగు హౌస్‌లో నా ఫ్రెండ్‌తో కలిసి ఒకే పక్కమీద పడుకున్నప్పుడు నటిస్తున్న విషయం మర్చిపోయాననుకుంటాను. ఇద్దరు బీద విద్యార్థులు ఒక లాడ్జింగు హౌస్‌లో ఉండడం మామూలే.
ఇ : రాకీ మౌంటేన్‌ జిమ్‌ నూజెంట్‌ నాపట్ల అగౌరవమేమీ చూపించలేదు. నేను కేకులు, సశువులకు ముక్కు తాళ్ళు కూడా తయారుచెయ్యగలనని తెలిసి చాలా ఆసక్తి చూపించాడు. నన్ను ప్రేమిస్తున్నానని కూడా ప్రకటించాడు. అదే నన్ను చాలా బాధపెట్టింది.
నీ : ఏమన్నాడతను? / మేమెప్పుడూ ముందు కవితలు పంపించేవాళ్ళం.
మ : నువ్వేమన్నావు?
ఇ : విస్కీ తాగడం మానెయ్యమని బతిమాలాను. / కానీ అతను ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నాడు.
మ : అయ్యో ఇజబెల్లా.
ఇ : అతను ఆ కొండల్లో ఒంటరిగానే చాలా ఏళ్ళు బ్రతికాడు.
మ : కానీ నువ్వు?
వెయిట్రెస్‌ వెళ్ళిపోతుంది?
ఇ : నూజెంట్‌ ఎలాంటి వ్యక్తంటే, ఏ స్త్రీ అయినా అతన్ని ప్రేమిస్తుంది. కానీ ఏ స్త్రీ కూడా అతన్ని పెళ్ళి చేసుకోలేదు. నేను ఇంగ్లాండుకు తిరిగి వచ్చేశాను.
నీ : వచ్చే ముందు అతనికే కవిత రాశావా? కొండల మీద.
మ : మళ్ళీ ఎప్పుడూ అతన్ని చూడలేదా?
ఇ : లేదు, లేనే లేదు.
నీ : మంచు. నా స్లీవ్స్‌ కన్నీటితో తడిసిపోయాయి. ఇంగ్లాండ్లో కన్నీళ్ళూ లేవు, మంచూ లేదు.
ఇ : లేనే లేదంటున్నాను. ఓ రోజు తెల్లవారు ఝామున స్విట్జర్లాండ్లో, ఓ సంవత్సరం తర్వాత, అతను కనిపించినట్లయంది. / నేను చివరిసారిగా అతన్ని చూసిన వేటగాడి దుస్తుల్లో, ముఖం కప్పేసే జుట్టుతో.
నీ : దయ్యం!
ఇ : ఆ రోజే! నాకు తర్వాత తెలిసింది. అతను చనిపోయాడు.
నీ : ఆ!
ఇ : తలకు బుల్లెట్‌ తగిలి. / వంగి అభివాదం చేసి మాయమయ్యాడు.
మ : అయ్యో ఇజబెల్లా.
నీ : ప్రియుడు చనిపోయినప్పుడు – నా ప్రియుల్లో కూడా ఒకరు చనిపోయారు / ప్రీస్ట్‌ ఆరియాక్‌.
జో : నా స్నేహితుడు కూడా చనిపోయాడు. మనందరికీ చనిపోయిన ప్రియులున్నారా?
మ : సారీ, నాకు మాత్రం కాదు.
నీ : (ఇజబెల్లాతో) నేనప్పటికి నన్‌ కాదు. ఇంకా ఆస్థానంలోనే ఉన్నాను. అతను మాత్రం ప్రీస్ట్‌. నా దగ్గరకు వచ్చినప్పుడు తన జీవితాన్నే నరకానికి రాసిచ్చాడు. / చనిపోయాక అథోలోకాలకు వెళతాడని అతనికి తెలుసు. అతను చనిపోయాడు. చచ్చేపోయాడు.
జో : (మర్లిన్‌తో) భగవంతుని గురించి అజ్ఞానం తన గురించి తనకు ఉన్న అజ్ఞానం లాంటిదే అని చెప్పే జాన్‌ స్కాట్‌ బోధనల విషయంలో నేనతనితో గొడవ పడ్డాను. ఆయన సృష్టించిన వాటి గురించి మాత్రమే ఆయనకు తెలుసు. ఎందుకంటే, ఆయనకు తెలిసిందల్లా ఆయన సృష్టిస్తాడు. కానీ ఆయన సృష్టికి అతీతుడు. అర్థమవుతోందా?
మ: లేదు, చెప్పు.
నీ : మళ్ళీ ఎలాపుడతాడోనన్న ఆలోచనను/తట్టుకోలేకపోయాను.
జో : కొత్త ప్లటోనిక్‌ భావాలను భగవంతుడి నుంచి వేరు చెయ్యలేమన్నారు సెయింట్‌ అగస్టిన్‌. కానీ నేను మాత్రం.
ఇ : బుద్ధిజం నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
జో : ఈ ప్రపంచం భగవంతుడి ఆలోచనల సారమన్న జాన్‌తో ఏకీభవించాను. డెనిస్‌ చెప్పినట్లు, జనం మామూలుగా దేవుడికి ముందో పేరు పెడతారు, తర్వాత కాదంటారు / తర్వాత ఒప్పుకుంటారు.
నీ : మళ్లీ ఏ రూపంలో తిరిగి వస్తాడో!
జో : వివరంగా ఆలోచించాక అందులో ఏదో తేడాలున్నాయని / ఆ విషయాలు.
మ : సారీ, ఏంటి? డెనిస్‌ ఏమన్నాడు?
జో : ఆ విషయంలో మేం విభేదించాం. గొడవ పడ్డాం. తర్వాత రోజే అతను జబ్బు పడ్డాడు. / అతనితో నాకెంత విసుగ్గా ఉండిందంటే, ప్రతిక్షణం నేను.
నీ : ఈ జన్మలో దుఃఖం, మరుజన్మలో మరింత దారుణం, అంతా నా వల్లే.
జో : అతనికి సేవ చేస్తున్నా కూడా అతనితో వాదనలు నా బుఱ్ఱలో తిరుగుతూండేవి. సారాన్ని తెలుసుకోవడానికి స్థూలద్రవ్యం సాధనం కాదు. అన్ని జాతులకూ మూలం ఆలోచన. కానీ నా వాదన అతనెన్నటికీ అర్థం చేసుకోలేదన్న విషయం నాకర్థమైంది. ఆ రాత్రే అతను చనిపోయాడు. వ్యక్తి నిరాకారుడౌతాడని / వ్యక్తి శాశ్వతత్వం ఉండదని అన్నారు జాన్‌ ద స్కాట్‌.
ఇ : నేను జాన్‌ మేజంట్‌ను ప్రేమించాననుకోకండి. కేవలం అతన్ని కాపాడాలన్న తపన మాత్రమే.
మ : (జోన్‌తో) అయితే మరి నువ్వేం చేశావు?
జో : మొదట మగవాడిగానే ఉండిపోదామనుకున్నాను. నాకు అలా అలవాటైపోయింది. అధ్యయనానికే నా జీవితం అంకితం చేయాలనుకున్నాను. నేను రోమ్‌కెందుకు వెళ్ళానో తెలుసా? ఇటలీలో మగవాళ్ళకు గడ్డాలుండవు.
ఇ : జీవితంలో నేను ప్రేమించింది హెన్నీని, నా పెంపుడు జంతువును, చివరి క్షణాల్లో హెన్నీకి సేవ చేసిన నా డాక్టరు భర్తను. హెన్నీ మరణం బాధాకరం అని తెలుసు. కానీ ఎంత బాధాకరమో తెలీదు. నాలో సగభాగం వెళ్ళిపోయినట్లనిపించింది. ఇంట్లో ఉండి నా ఉత్తరాల కోసం ఎదురుచూసే నా ప్రియనేస్తం లేకుండా నేనెలా ప్రయాణం చెయ్యను? ఆమె చివరిక్షణాల్లో డాక్టర్‌ బిషప్‌ ఎంతో శ్రద్ధగా సేవ చెయ్యడం చూసి అతన్ని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. హెన్నీ లాగానే అతనిది కూడా ఎంతో మృదువైన మనస్తత్వం. నేనలా కాదు.
నీ : రాజు మనస్తత్వం కూడా మృదువైనదే అనుకున్నాను. ఎందుకంటే, ఆరియాక్‌ విషయం తెలిసినప్పుడు రాజు చాలా దయగా వ్యవహరించాడు నాతో. అప్పటికే రాజుకు నా మీద ఆసక్తి పోయింది. నిజానికి ఒకరోజు రాత్రి నా వెంట పడుతున్న వ్యక్తి దగ్గరకు నన్ను పంపించాడు కూడా. తెరల చాటున మేలుకునే ఉండి అంతా విన్నాడు.
ఇ : పెళ్ళి ఓ మెట్టుగా ఉంటే బాగుంటుందనుకున్నాను. జీవితంలోని అతి మామూలు సమస్యలను ఎదుర్కోవడానికి ఎంతో ప్రయత్నించాను. వెన్నెముక మీద పుండుతో, నరాల వ్యాధితో మళ్ళీ జబ్బు పడ్డాను. మూడు చక్రాల సైకిలు పురమాయించాను. దాని మీద కూర్చునే సాహసాలు చేయాలని అప్పటి నా ఆలోచన. జ్వరం, రక్తహీనతతో జాన్‌ కూడా జబ్బు పడ్డాడు. నేనతన్ని మనసారా ప్రేమించాను. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఎముకలు బయటపడి, పాలిపోయి అస్థిపంజరంలా ఉన్నాడు. చక్రాల కూర్చీలో సముద్రతీరాలకు తీసుకువెళ్ళాను. అతనలా కరిగిపోయి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నా జీవతంలో ఇంకేమీ మిగల్లేదు. నాకు గేట్‌ వ్యాధి వచ్చిందన్నారు డాక్టర్లు / గుండె బాగా దెబ్బతిన్నది.
నీ : నా జీవితంలో ఏమీ లేదు. ఏమీ లేదు, రాజు అభిమానం లేకపోతే. రాణి నాకెప్పుడూ శత్రువుగానే ఉండిపోయింది. మూడు పొరల గౌను వేసుకునే హక్కు నాకు లేదంది, మర్లీన్‌! కానీ నేను ప్రధానమంత్రి అయిన మా తాతకు పెంపుడు కూతుర్ని. పల్చటి పట్టు బట్టలు వేసుకోవడానికి నాకు అనుమతి ఉండేది.
జో : జీవితంలో అధ్యయనం తప్ప నాకేమీ లేదు. సత్యాన్వేషణలో నిండా మునిగిపోయాను. రోమ్‌లోని గ్రీక్‌ స్కూల్లో పాఠాలు చెప్పాను. సెయింట్‌ అగస్టిన్‌ వల్ల ఆ స్కూలుకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. పేదరికంలో ఉన్నా కష్టపడి చదివాను. చాలా తెలివిగా మాట్లాడేదాన్నంటారు. చిన్న వయసు, కొత్త ఊరు, అయినా తొందరగానే మంచి పేరు సంపాదించుకున్నాను. అందరి అభిమానాన్నీ గెలుచుకున్నాను. నన్ను కార్డినల్‌ను చేసిన మరుసటిరోజే జబ్బు పడ్డాను. భయంతో, పశ్చాత్తాపంతో మాట రాలేదు. / తర్వాత కోలుకున్నాను.
మ : అవును, విజయం చాలా….
జో : ముందు సాగిపోవాలన్న కృతనిశ్చయంతో. మళ్ళీ నన్ను ముంచెత్తింది / జ్ఞాన శిఖరాన్ని చేరుకోవాలన్న బలమైన ఆకాంక్ష.
ఇ : అవునవును, ముందుకు సాగడానికి. హెన్నీ పువ్వుల మధ్య కూర్చుని ఊలుతో డ్రెస్సు అల్లాను. నాకప్పుడు యాభై ఆరేళ్ళు.
నీ : ఆయన అభిమానం పోయినా నేనేం చచ్చిపోలేదు. కాలి నడకన బయల్దేరాను. నన్నెవ్వరూ చూడలేదు. తర్వాత ఇరవై ఏళ్ళూ జపాన్‌ అంతా నడిచాను.
గ్రె : నడక మంచిది.
వెయిట్రెస్‌ వస్తుంది.
జో : పోప్‌ లియో చనిపోయాడు. నన్ను పోప్‌గా ఎన్నుకున్నారు. సరే, బాగుంది. నేను పోప్‌ని. నాకు దేవుడు తెలుసు. నాకన్నీ తెలుస్తాయి.
ఇ : నా ఆవేదనను పక్కన పెట్టి టిబెట్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను.
మ : మీరందరు చెప్పిందీ అద్భుతంగా ఉంది. ఇంకొంచెం వైన్‌, బహుశా ఇంకో రెండు సీసాలు. గ్రిసెల్డా ఇంకా రాలేదు.
ఇ : తప్పకుండా తీసుకోండి. / మేమిక్కడికొచ్చిందే నీ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోడానికి.
నీ : అవును మర్లీన్‌.
జో : అవునూ, అసలింతకీ విషయమేమిటి మర్లీన్‌?
మ : పోప్‌ కాదు, మానేజింగు డ్రెరెక్టర్‌.ఎ
జో : అందరికీ ఉద్యోగాలు వెతికి పెడతావన్నమాట.
మ : అవును, ఎంప్లాయ్‌మెంట్‌ ఏజెన్సీ.
నీ : నీతో పనిచేసే ఆడవాళ్ళందరికీ, అధికారివన్నమాట, మగవాళ్ళక్కూడా అనుకో.
ఇ : అందుకు మర్లీన్‌ అన్ని విధాలా తగిన వ్యక్తి. అసాధారణ విజయాలకు ఇది కేవలం మొదలేనన్నది మాత్రం నిజం.
మ : పార్టీ చేసుకోవాల్సిన సందర్భం.
ఇ : మర్లీన్‌ కోసం.ఎ
మ : మనందరి కోసం.
జో : ఎమర్లీన్‌.
నీ : మర్లీన్‌.
గ్రె : మర్లీన్‌.
మ : మనందరం చాలా దూరం నడిచాం. మన ధైర్యానికి, మన జీవితాలను మనం మార్చుకున్న పద్ధతికి, అసాధారణమైన మన విజయాలకు. నవ్వుకుంటూ డిన్నర్‌ కొనసాగిస్తారు.
ఇ : ఎలాంటి సాహసాలు! ఏడు వేల అడుగున ఎత్తున ఓ పర్వతకనుమ దాటుతున్నాం. వంటవాడు కూలిపోయాడు. మ్యూత్‌ను నడిపేవాళ్లకు జ్వరం, మంచువల్ల గుడ్డితనం వచ్చేశాయి. అయినా, నా వెన్నెముక నరకయాతన పెడుతున్నా, నేను ముందుకే నడిచాను.
మ : అద్భుతం.
నీ : ఒకసారి నాకు జబ్బు చేసి నాలుగు నెలల పాటు ఒక హోటల్లో ఒక్కదాన్నే ఉండాల్సి వచ్చింది. గుఱ్ఱాన్ని నడిపించడానికి కూడా ఎవరూ లేరు. నాకోసమే నేను బ్రతకాల్సి వచ్చింది, బ్రతికాను కూడా.
ఇ : అవున్నిజమే, బ్రతికావు. టోబర్‌మోరీకి తిరిగి వెళ్ళడం మరీ అధ్వానం. కదలకుండా ఉంటే నాకెందుకో బాగా నిరుత్సాహంగా అనిపించేది / అందుకే నేనెప్పుడూ ఎక్కడా కదలకుండా ఒకేచోట ఉండలేకపోయాను.
నీ : అవును, ఖచ్చితంగా అలాగే ఉంటుంది. కొత్త దృశ్యాలు, బీచ్‌ పక్కన ఆలయం, సముద్రం మీద మెరుస్తున్న చంద్రుడు. ప్రతి ప్రాణినీ రక్షిస్తానని దేవత మాట ఇచ్చింది. చేపల్ని కూడా రక్షిస్తుంది. నాకా నమ్మకం ఉండేది.
జో : పోప్‌కు అన్నీ తెలుస్తాయను కున్నాను. దేవుడు నాతో స్వయంగా మాట్లాడతాడనుకున్నాను. నేను ఆడదాన్నని దేవుడికి తెలుసనుకోండి.
మ : కానీ ఇంకెవ్వరికీ కనీసం అనుమానం కూడా రాలేదా?
వెయిట్రెస్‌ మరోసారి వైన్‌ తీసుకొస్తుంది.
జో : చివరికి మళ్లీ నేను ఇంకొకర్ని ప్రేమించాను.ఎ
ఇ : వాటికన్లోనా?
గ్రె : వెచ్చగా ఉండడానికి.
నీ : ఓ, ప్రేమికుడు.
మ : మంచిదే.
జో : ప్రతీహారి. పోప్‌కు ఎంతోమంది పనివాళ్ళుంటారు. మంచి భోజనం. నాకు సత్యం తెలుసన్న విషయం కూడా నేను తెలుసుకున్నాను. ఎందుకంటే పోప్‌ ఏం మాట్లాడితే అదే సత్యం.
నీ : అతనెలా ఉన్నాడు? ఆ ప్రతీహారి?
గ్రె : మగతనం ఉన్నవాడు.
ఇ : అబ్బా, గ్రేట్‌.
మ : నువ్వు మగవాడివనుకునే అతను నీమీద మనసు పడ్డాడా?
నీ : అతనెలా ఉండేవాడు?
జో : గుట్టు కాపాడగలిగే వాడు.
మ : అంటే, నీకంతా తెలుసన్నమాట.
జో : అవును, పోప్‌గా ఉండడం నాకెంతో నచ్చింది. బిషప్పులకు దైవకార్యాలప్పగించాను. నా పాదాలను ముద్దు పెట్టుకోవడానికి జనానికి అనుమతిచ్చాను. చర్చికి వచ్చిన ఇంగ్లండు రాజును ఆహ్వానించాను. దురదృష్టవశాత్తూ భూకంపాలొచ్చాయి. కొన్నిచోట్ల రక్తపు వర్షం కురిసినట్లు వార్తలొచ్చాయి. ఫ్రాన్స్‌లో రాకాసి మిడతల దండు. కానీ అది నా తప్పని నేననుకోను. మీరేమంటారు? నవ్వులు.
మిడతలన్నీ ఇంగ్లీష్‌ ఛానెల్లో పడి చచ్చిపోయి ఒడ్డుకు చేరాయి. అవి కుళ్ళిపోయి ఆ విషం గాలిలో వ్యాపించి చుట్టుపక్కల వాళ్ళంతా చచ్చిపోయారు.
నవ్వులు. (ఇంకా వుంది)

Share
This entry was posted in నాటకం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>