”నింగి…నేల…నాదే ! ” – ఒక గొప్ప విభిన్న చిత్రం

ఆర్‌.సత్య
గాలి పటాలు ఎగరేస్తూ తోటిపిల్లలతో హాయిగా ఆడుకుంటూ ఉంటూంది ఓ అందమైన అమ్మాయి. అంతలో గాలిపటం కరెంట్‌ తీగల్లో ఇరుక్కుంటుంది. ఆటలో ఉన్న ఉద్వేగంలో ఆ అమ్మాయి దాన్ని విప్పబోతుంటే, విద్యుద్ఘాతంతో రెండు చేతులూ పోతాయి. హఠాత్తుగా జరిగిన సంఘటనవలన తల్లికి ‘మనోవైకల్యం వస్తుంది’. ఇక ఆ పిల్లకి స్కూలు ఉండదు. హోం వర్కు చేయలేదు కనుక స్కూల్లో వాళ్లు వెనక్కి పంపేస్తారు. నిరాశానిస్పృహలతో కుంగిపోకుండా ఎంతో కష్టపడి పాదాలతో రాయడం, తిండి తినడం, మొహం కడుక్కోవడం, బట్టలు వేసుకోవటంలాంటివి నేర్చుకుంటుంది. తల్లిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. కాని ఆమె మానసిక స్థితి సరిగ్గా లేకపోవటంవలన దగ్గరున్న సరస్సులోకి వెళ్లిపోతుంది. తల్లిని రక్షించడానికి ఆ అమ్మాయి ప్రయత్నిస్తుంది. చేతులు లేకపోవటంవలన ఈదలేదు, తల్లితోపాటు మునిగిపోకుండా అతి కష్టం మీద ఒడ్డుకి చేరుకుంటుంది. అపుడే ఆమెకు ‘ఈత నేర్చుకోవాలన్న దృఢసంకల్పం కలుగుతుంది. చదువులో బాగా రాణించి, యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ పాసవుతుంది. కాని చేతులు లేని కారణంచేత తను ఆశించిన మెడికల్‌ సీటు దొరకదు. ఈ లోగా తల్లికి పిచ్చి ముదిరి ఇంట్లోంచి ఎటో వెళిపోతుంది. ఇక ఆ అమ్మాయి ఏకైక లక్ష్యం ఈతలో ప్రావీణ్యం సంపాదించటమే! అంతర్జాతీయవికలాంగుల ఈత పోటీలో గెలుస్తుంది. దానికి గుర్తింపుగా ఆమెకు యూనివర్సిటీలో ‘ఫిిజికల్‌ ఎడ్యుకేషన్‌లో సీటు ఇస్తారు.’ ఆమె కోసం ఆమె తల్లి కన్న కల నేరవేరుతుంది, కాని తల్లి మాత్రం వెనక్కిరాదు.
ఇదొక వాస్తవగాధ. ఘోరమైన ప్రమాదానికి గురైనా ఆత్మవిశ్వాసంతో అడ్డంకులను అధిగమించి అంతర్జాతీమ స్థాయిలో క్రీడాకారిణిగా విజయం సాధించిన లీచింగు యాన్‌ వో, ప్రభుత్వచలన చిత్ర విద్యా సంస్థలో ఉన్నతాధికారిగా ఉన్న ఫెంగు ”రిదీఖీరిరీరిలీజిలి గీరిదీవీరీ ” అన్న పేరుతో చిత్రం నిర్మించారు. ”మొట్ట మొదటి సారి రెండు చేతులు కోల్పోయిన ఒక అమ్మాయి కుంగిపోకుండా కఠోర శ్రమతో విజయం సాధించిన సంగతి పేపర్లో చదివినప్పుడు నేనెంతో చలించిపోయాను. అదే సమయంలో కొందరు విద్యార్ధులు మార్కులు రాలేదనో లేక మరే కారణాలవలనో ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు కూడా చదివాను. కొత్త బంగారు లోకం నిర్మాణంలో భాగస్వాములు కావలసిన యువతీ యువకులు తమ తల్లి దండ్రులకు, సమాజానికి శాశ్వతంగా విషాదాన్ని మిగిల్చిపోవడం నన్ను దిగ్భ్రాంతినికి గురి చేసింది. వారెందుకు అలా చేశారు? లీని చూసి స్ఫూర్తి పొందలేదా? ఈనాడు చైనాలో కొన్ని లక్షల మంది తెలివైన పిల్లలున్నారు, ఎంతో ఆనందంగా ప్రశాంతంగా గడుపుతున్నారు. వారి జీవనశైలి రోజు రోజూకూ మెరుగవుతూ వస్తోంది. కాని అనుకోని ఆటంకాలు ఎదురైనపుడు , ఈ యువతకు నిలదొక్కుకునే ఆత్మస్థైర్యం ఉందా? ఈ నేపథ్యంలో, చేతుల్లేని ఒక అమ్మాయి శారీరకంగా అసహాయురాలునైప్పటికీ, మానసికంగా దృఢంగా ఉండి, తనలోని ఆత్మశక్తితో తన జీవితం విధించిన పరిమితులకు అతీతంగా పోరాడి, విజయం సాధించటం నాకెంతో నచ్చింది. ఆమె జీవితంలో అంతర్గతంగా ఉన్న అద్భుతమైన ఆత్మశక్తిని ఆ అమ్మాయిచేతే తన అనుభవాలను పున:సృష్టిి చేయించి తెరపైకి ఎక్కించాను. అంతేకాదు, ఆ తల్లీ కూతుళ్ళ అపురూప బాంధవ్యాన్నికూడా అత్యంత సున్నితంగా చిత్రించాను. వికలాంగురాలయిన కూతుర్ని చూసి మానసిక వైకల్యం చెందిన తల్లి, తనకున్న అసహాయతతోపాటు, ఆ తల్లిని కూడా రక్షించుకోవాలన్న కూతురు తపన… ఎంతో హృద్యంగా చిత్రించానని రసజ్ఞులన్నారు. ఈ చిత్రం చూశాక, మీ హృదయంలో ఎక్కడో కలుక్కుమనిపించినా లేదా ఈ చూసిన ఏ మూడేళ్ళ తర్వాతో ఇందులోని ఏ సన్నివేశమైన మీకు జ్ఞాపకం వచ్చినా- అదే మీరు నా శ్రమకు ఇచ్చే అత్యుత్తమ ప్రతిఫలం.” అంటారు ఫెంగు.
మానవ జీవితంలో దాగున్న ఆత్మశక్తిని ఆవిష్కరిస్తూ, ఫెంగు చిత్రీకరించిన లీ వాస్తవగాధ, అది అందిచ్చే అమూల్యమైన సందేశం ఎందరినో ఆకట్టుకుంది. చైనాలోనే కాదు, ఇతర దేశాల్లోని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో బహుమతులు పొందింది. మనదేశంలో జరిగిన 15వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో 2007గాను గోల్డెన్‌ ఎలిఫెంట్‌ పురస్కారం పొందింది. బీజింగు అంతర్జాతీయ క్రీడోత్సవాలను ఈ చిత్రంతో ప్రారంభించారు.
ఈ చిత్రాన్ని ‘నింగి..నేల..నాదే” అన్న పేరుతో ప్రముఖ పాత్రికేయులు జగన్‌, సుధారాణి చావా తెలుగులోకి డబ్‌ చేశారు. ఫెంగు తన చిత్ర నిర్మాణంలో పడ్డ కష్టాలు కన్న తెలుగులో ఈ చిత్రాన్ని అందించటానికి నిర్మాతలెంతో కష్టపడ్డారు. బీజింగుకు వెళ్లి చిత్రం హక్కులు కొనడానికి అవసరమయ్యే ఫారెన్‌ ఎక్సెంజీ సమకూర్చుకోవడం దగ్గరనుంచి, ఇంగ్లీషు అసలు రాని నిర్మాత, దర్శకులతో సంప్రదింపులు జరపటం, చైనా భాషనుంచి ఒక భారతీయ భాషలోనికి అనువదించడంలోని సమస్య. (చైనా భాషలోంచి తెలుగులో డబ్‌ చేయడంలో బహుశా ఇదే మొట్టమొదటిదేమో!) ఆర్ధిక మాంధ్యం సృష్టిించిన అదనపు ఇబ్బందులు…అయితే, చితంలోని లీలాగే, కసితోనూ, పట్టుదలతోనూ అన్నిటినీ అధిగమించి వెన్నెలకంటి సరళమైన సంభాషణలతో, చంద్రబోస్‌ మధురమైన పాటలతోనూ,. వందేమాతరం సమకూర్చిన శ్రావ్యమైన సంగీతంతోనూ సుధా-జగన్‌ ‘నింగి..నేల..నాదే’ తీసుకొచ్చాడు. ‘దిల్‌’ రాజు త్వరలోనే పంపిణీ చేయబోతున్న ఈ చిత్రాన్ని చూసిన అక్కినేనితో పాటు అందరూ ఏకకంఠంతో అనేమాట. ”ఆశావాదాన్ని, మనోస్ధైర్యాన్ని పెంచగల ఉత్తేజభరితమైన వాస్తవగాధ..పిల్లలూ, పెద్దలూ అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం”అని
రండి.. మనం కూడా ఈవిభిన్న చిత్రాన్ని ఆదరించి తెలుగువారు ఒట్టి ‘పోకిరీ”లు మాత్రం కాదని నిరూపిద్దాం.

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

One Response to ”నింగి…నేల…నాదే ! ” – ఒక గొప్ప విభిన్న చిత్రం

 1. kusumakumari says:

  జగన్, సుధా రాణి ల ఆదర్శ భావాలు,పట్టుదల ఫలితంగా ఇంత మంచి చిత్రం తెలుగు ప్రేక్షకుల లోగిలికి వచ్చినది.
  చీనా దర్శకుని సదాశయాలు,మీరన్నట్టుగా ఈ నాటి యువతకు ఎంతో స్ఫూర్తిని అందిస్తున్నది.
  కథానాయిక”లీ”నిజ జీవిత గాథ,ఫెంగు ప్రతిభతో వెండి తెర రూపం దాల్చినది.
  మంచి సినిమా సమీక్షను అందించిన సత్య గారికి ధన్య వాదములు.
  లాభాపేక్షను దృష్టిలో పెట్టుకోకుండా,ఇలాంటి చిత్రరాజంపై పెట్టుబడులు పెట్టాలంటే “దిల్ ఉండాలి.
  అందుకనే ముఖ్యంగా నిర్మాతలకు,పంపిణీ దారులకు ఎన్ని కృతజ్ఞతలను చెప్పుకున్నా తక్కువే కదా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో