ఇంట్లో ప్రేమ్‌చంద్‌-7 ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్ర

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌.శాంతసుందరి

(గత సంచిక తరువాయి)
”అలాగే, వెళ్తాను.”
ఆవిడ పది రూపాయలు అడిగి తీసుకుని సాయంకాలం రైలుకి వెళ్లింది.
నాకు ఒంట్లో బాగాలేదని తెలిసి నాన్న మళ్లీ రమ్మని పిలిచారు. ఆ ఉత్తరానికి మా ఆయనే జవాబు రాశారు, ”సెలవలివ్వగానే నేనే స్వయంగా వెంటబెట్టుకుని తీసు కొస్తాను.”
మేము సామనంతా సర్దుకుని ప్రయాణవబోతూ ఉంటే, పిన్ని దగ్గర్నించి టెలిగ్రాం వచ్చింది – నాకిక్కడ ఏమీ తోచట ం లేదు, ఇంటికి వచ్చేస్తున్నాను అని.
మా ఆయన అప్పుడే రావద్దనీ, మేం అలహాబాద్‌కి బైైలు దేరుతున్నామనీ జవాబిచ్చారు.
అలహాబాద్‌కి చేరుకున్నాక, నేను మా పల్లెటూరికి వెళ్లిపోయాను. ఆయన కూడా తరవాత వచ్చి మా పుట్టింట్లో పదిహేను రోజులున్నారు. ఆ తరవాత ఆయన కాన్పూరుకి వెళ్లిపోయారు.
పుట్టింట్లో నాకు వైద్యం మొదలయింది. ధున్నూకి పాలివ్వటానికి ఒకావిడని కూడా కుదుర్చుకున్నాం. వాడి ఆరోగ్యం కోలుకో సాగింది. నాకు విరోచనాలు తగ్గాయికాని, జలుబు, దగ్గూ పట్టుకున్నాయి. ఈ సంగతి మా నాన్న ద్వారా విని ఆయన పరిగెత్తు కుంటూ వచ్చారు. మళ్లీ పదిహేను రోజులు నాతోనే ఉన్నారు. ఆయనకి కూడా అక్కడ కొద్దో గొప్పో వైద్యం జరిగింది. ఆ తరవాత ఆయన మళ్లీ కాన్పూర్‌కి వెళ్లిపోయారు.
స్కూలు తెరవటానికి ఇంకా పదిహేనురోజులుందనగా ఆయన వచ్చి నన్ను తనతో పంపమని మా నాన్నని అడిగారు. ”ఇప్పుడిప్పుడేగా కోలు కుంటోంది? ఇప్పుడు పంపమంటారేమిటి? నాకు పంపాలని లేదు,” అన్నారు నాన్న.
”నా గురించి కూడా కొంచెం ఆలోచించండి. నా ఆరోగ్యం కూడా అంత బాగాలేదు కదా? నేనూ ఆవిడకి కావలసిన వాణ్ణే కదా? ఒంటరిగా వెళ్లడం నాకూ కష్టంగానే ఉంటుంది. ఆవిడ నాతో ఉంటే నాకిక ఏ చింతా ఉండదు,” అన్నారు.
మా నాన్న ఒప్పుకున్నారు. ఇంటికి చేరుకోగానే బి.ఏ. రెండో సంవత్సరం పరీక్షలకి ఆయన చదువుకోసాగారు.
ఒకసారి మా ఆవు కలెక్టర్‌ బంగళా ఆవరణలోకి దూరింది. ‘మీ ఆవుని తోలుకెళ్లండి, లేకపోతే దాన్ని కాల్చి పారే స్తాను,’ అని కలెక్టర్‌ కబురు పంపించాడు. మా ఆయనకి ఆ విషయం అసలు తెలీనే లేదు, కానీ ఒక మూడు వందల మంది కుర్రాళ్లూ, నౌకర్లు ముకుమ్మాడిగా వచ్చారు. గొడవ ఏమిటా అని గుమ్మం లోంచి తొంగి చూసి ఈయనతో.
”బైట అంత గొడవ జరుగుతూంటే మీరు హాయిగా రాసుకుంటూ కూర్చున్నారేమిటి?” అన్నాను.
”అవునా?” అని, లేచి ఒక చొక్కా వేసుకుని, చెప్పులూ తొడుక్కుని బైటికెళ్లారు. మంచి చలికాలం. ఆయన అలా పల్చని చొక్కాతోనే కలెక్టర్‌ బంగళా వైపుకి వెళ్లారు. అక్కడికెళ్లి, ఆ గుంపుని ఇక్కడికెందు కొచ్చారని అడిగారు.
”కలెక్టర్‌గారి ఆవరణలోకి ఆవొ చ్చింది. ఆయన దాన్ని తుపాకీతో కాల్చి పారెయ్యమంటున్నారు,” అన్నారు వాళ్లు.
”మీకెలా తెలిసింది?”
”కలెక్టర్‌ మనిషి చెప్పాడు.”
”బంట్రోతు వస్తే నాతో చెప్పాలికదా?”
”మీదాకా ఎందుకులే, మేమే చూసుకుంటాం అనుకున్నాం.”
”తుపాకీతో కాల్చి చంపాలంటే నాకు కబురు పంపటం దేనికిట? ఎలా చంపుతారో చూపించటానికా?”
”ఆవుని తీసుకుపోకుండా కదిలేది లేదు!” అన్నారు కుర్రాళ్లు.
”ఒకవేళ కలెక్టర్‌ కాల్చిపారేస్తేనో?” అన్నారు ఈయన.
”కాల్చటం అంటే ఆటలాడ్డం అను కుంటున్నాడా ఆయన? ఇక్కడ నెత్తుటేర్లు ప్రవహిస్తాయి! ఇదే ముస్లిం ఎవరైనా హత్య చేస్తే నెత్తుటి నదులు ప్రవహిస్తాయే?” అన్నారు కుర్రాళ్లు.
”ఆర్మీ వాళ్లు ప్రతిరోజూ ఆవుల్ని కోసుకుని తినటంలేదా? అప్పుడు మీరెక్కడ నిద్రపోతూ ఉంటారు? ముసల్మానులు ఒక్క తప్పు చేస్తే వందల మంది హిందూ ముసల్మానులు కొట్టుకు చావటం ఎంత తప్పు! ఆవు మీకు ఎంత అవసరమో ముస్లిములకి కూడా అంతే అవసరం. పదండి, ఆవుని తెచ్చుకుందాం,” అన్నారు ఈయన.
కలెక్టర్‌ దగ్గరకెళ్లి, ”నన్ను రమ్మన్నా రుట?” అన్నారు.
”నీ ఆవు నా ఆవరణలోకి వచ్చింది. మేము ఇంగ్లీషు వాళ్లం. దాన్ని కాల్చి పారెయ్యగలం!”
”సార్‌! కాల్చి పారెయ్యాలను కున్నప్పుడు నన్నెందుకు రమ్మన్నారు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు కదా? నా ఎదురుగ్గానే దాన్ని తుపాకీతో కాల్చచ్చే?”
”అవును. మేం. ఇంగ్లీషువాళ్లం. కలెక్టర్‌లం. మా దగ్గర అధికారం ఉంది. మేము తుపాకీతో కాల్చగలం!”
”మీరు ఇంగ్లీషు వారే. కలెక్టరే. అన్నీ మీరే, కానీ పబ్లిక్‌ కూడా తక్కువదేం కాదు!”
”ఇవాళ్టికి వదిలేస్తున్నాను. ఇంకోసారి అది ఇటువస్తే తప్పక కాల్చి పారేస్తాను!”
”తప్పకుండా అలాగే చెయ్యండి. మీ ఇష్టం, కానీ నాకు కబురుపెట్టి రమ్మనకండి,” అంటూ మా ఆయన బైటికొచ్చేశారు.
కలకత్తాలో ప్రెస్‌ కొనాలన్న ఆలోచన
ఆరోజుల్లో ఆయన తమ్ముడు కలకత్తాలో ఉద్యోగం చేసేవాడు. అతనక్కడ ఒక ప్రెస్‌ కొనాలని అనుకున్నాడు. అతను మా ఆయనకి ఒక ఉత్తరం రాశాడు. తొమ్మిదివేలకి మేం ప్రెస్‌ కొంటున్నాం, మీరు నాలుగువేల ఐదువందలు ఇవ్వండి.
నేను పొదుపు చేసిన డబ్బు, అదికాక ప్రామిసరీనోట్‌ మీద మరికొంతా తీసుకుని అతనికివ్వటానికి మూడువేలు కూడబెట్టాం. పదిహేనువందల రూపాయలు ఆయన తన చిన్నాన్న కొడుకుని అడిగాడు. అతను ఇందూర్‌నించి వెయ్యి రూపాయలు పంపించాడు, ఐదు వందలు తరవాత పంపిస్తానన్నాడు.
ఒకరోజు నేనాయన్ని, ”రూపాయలు ఏ పద్ధతిలో ఇస్తున్నారు? ప్రెస్‌ కొనటానికి షరతులేవైనా ఉన్నాయా?” అని అడిగాను.
”షరతులేమున్నాయి! ప్రెస్‌ తనదే, వచ్చే లాభాల్లో నీకు కూడా వాటా ఇస్తాడు.”
”అలాటి షరతులమీద డబ్బివ్వటం మంచిది కాదు. పోనీ ధున్నూ పేర కొనమనండి. ప్రెస్‌ వాళ్లని నడుపు కోమనండి.
”ఒద్దు వాడికి కోపం వస్తుంది.”
”అయితే ఈ డబ్బు మీది కాదు, మీరు మీ డబ్బిచ్చుకోండి. నా డబ్బు ఇవ్వాలంటే నేను పెట్టే షరతులకి ఒప్పుకోవాల్సిందే!”
”సరే, ధున్నూ వాళ్లమ్మ ఈ షరతు మీదైతే డబ్బిస్తుందిట, అని నేను వాడికి రాసేస్తాను.”
”ఆ ఉత్తరానికి జవాబు నాలుగో రోజున వచ్చింది. నన్ను చూసి ఇక్కడ అందరూ నవ్వుతున్నారనీ, మీకు నా మీద నమ్మకం లేదా, అనీ నాకు మాత్రం ఎవరున్నారు, ధున్నూ నాకు కూడా కొడుకు లాంటి వాడే కదా, అనీ, నా మనసుకి చాలా కష్టం వేసిందనీ, అతను జవాబు రాశాడు.
ఆ ఉత్తరం నాకు చదివి వినిపించి, ”చాలా పొరపాటయిపోయింది,” అన్నారు.
”ఏమీ కాలేదు. నా జీవితాన్ని ఇంకోళ్ల చేతుల్లో పెట్టటం నాకిష్టం లేదు. అన్ని పనులూ సరైన పద్ధతిలో జరగాలి. నేను చాలామందిని చూశాను. మీరు కళ్లు మూసుకుని పనులు చేస్తారు, నేనలా కాదు, అన్నీ జాగ్రత్తగా గమనిస్తాను.”
”సరే, దీనికి జవాబేం రాయ మంటావు?”
”నేనన్నట్టుగా రాయండి, నాకు పిల్లల్లేనన్నాళ్లూ, నువ్వే నాకన్నీ అనుకునే దాన్ని. నా పిల్లవాడు నీకంత ఆప్తుడైతే వాడి పేర పెట్టటానికి నీకేమిటి అభ్యంతరం? నువ్వొకసారి ఇక్కడికొస్తే అన్నీ స్పష్టంగా మాట్లాడుకుందాం. పైగా ప్రెస్‌ నీ చేతిలోనే ఉంటుంది,పేరు మాత్రమే వాడి దుంటుంది.”
నా ఉత్తరం అందిన నాలుగోరోజుకి ఆయన తమ్ముడు నిప్పులుకక్కుతూ వచ్చాడు. ”జనం నన్ను హేళన చేస్తున్నారు!” అన్నాడు.
”హేళన చేసేవాళ్లకి బుద్ధిలేదు. వాళ్లు అర్థం చేసుకోవాలి. ఇక మీరేమో వైశ్యులాయె. వైశ్యుల్లో డబ్బులెక్కలు తండ్రీ కొడుకుల మధ్యకూడా ఉంటాయి. ఇందులో బాధపడటానికేముంది?” అన్నాను.
”మీ షరతుల మీద నేను డబ్బు తీసుకోలేను,” అన్నాడతను.
”నేను కూడా ఇంకేం చేసే స్థితిలో లేను.” అని, ”అన్నయ్యగారి డబ్బులు కూడా వెనక్కి పంపెయ్యండి,” అన్నాను.
”పంపించేస్తాను.”
”లేదు, వెంటనే పంపండి. అవి మీ దగ్గరెందుకు? వాటితో ఇక పనేమీ లేదుగా?” అన్నాను. అతను వెళ్లిపోయాడు.
1920 : గాంధీజీ : ఉద్యోగం రాజీనామా
అవి సహకార నిరాకరణోద్యమం రోజులు. గాంధీజీ గోరభ్‌పుర్‌ వచ్చారు. మా ఆయన జబ్బుగా ఉన్నారు అయినా నేనూ, ఇద్దరు పిల్లలూ, ఆయనా మీటింగుకి వెళ్లాం. మహాత్ముడి ఉపన్యాసం విని మేమిద్దరం చలించి పోయాం. జబ్బుగా ఉన్నారు, దానివల్ల నిస్సహాయ స్థితి ఉంది. అయినా అప్పుడే ప్రభుత్వోద్యోగం పట్ల ఒకరకమైన విరక్తి కలిగింది.
రెండేళ్ల క్రితమే ఆయన బీ.ఏ. పాసయారు. ఎమ్‌.ఏ. చదవాలనే ప్రయత్నం లో పడ్డారు. ఫీజు కూడా కట్టేశారు. జబ్బుగా ఉన్నా ఎటువంటి మందులూ వేసుకునేవారు కాదు. జబ్బుగా ఉన్నప్పుడు నన్ను తన పక్కనే ఉండమని, ఎటూ కదలనిచ్చేవారు కాదు. మందు మాత్రం ప్రాణం పోయినా వేసుకోరు.
ఒకరోజు చాలా విసుగేసి, ”ఈరోజు ఈ విషయం అటో ఇటో తేలిపోవాలి. మీరు మందులు వేసుకుంటారా, లేదా?” అన్నాను.
”మందుతో ఏమీ కాదు,” అన్నారు.
”అలా కాదు, వేసుకుంటారా లేదా, ఆ ప్రశ్నకి మాత్రం జవాబివ్వండి.”
”అబ్బ, మందు వేసుకుంటే ఏమవు తుంది? పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది!”
”మళ్లీ అదే మాటా! నాకు మీ నిర్ణయం చెప్పండి.”
”ఏం చేస్తావు నా నిర్ణయం విని?”
”పావలాకి విషం తెప్పించుకుని మింగుతాను. పీడ విరగడౌతుంది. రెండు నెలలు కూడా కాలేదు బాబు పోయి. ఇప్పుడు మీకు ఒంట్లో బాగాలేదు. ఇంటి పనే చెయ్యనా, పిల్లల్నే చూసుకోనా? మీరిలా జబ్బుగా పడుకుంటే చూస్తూ ఊరుకోవటం నావల్ల కాదు.”
”సరే, మందు వేసుకుంటాలే. నీ మొండితనం నీదే! కానీ మందులతో ఏమీ జరగదు. నువ్వు చెపుతున్నావు కాబట్టి వేసుకుంటాను.”
”మందు వేసుకోవటమే మన పని, ఇక అది పనిచెయ్యటం, చెయ్యకపోవటం దేవుడి దయ. ఎప్పట్నించి మొదలు పెడతారు? రేపట్నించా?”
”అవును, రేపట్నించే.”
”అలాగే, రేపే మొదలుపెట్టండి. రేపు ఎంతో దూరం లేదు!”
నేనలా అనేసరికి ఎందుకోగాని ఆయనకి నవ్వొచ్చింది.
”నవ్వటం ఎందుకు? రేప్పొద్దున్నే మందులు ప్రారంభించాలి!”
”అలాగే!”
మర్నాడు పొద్దున్నే వైద్యుడి దగ్గరకెళ్లి మందులూ, ఏవో ఆకులూ తెచ్చుకున్నారు.
నేను మందు కలిపి ఆయన ముందు పెట్టాను.
ఎనిమిది రోజులు విడవకుండా నీళ్ల విరేచనాలు అయాయి. అదిచూసి ”వెంటనే మీరా వైద్యుడి దగ్గరికి వెళ్లండి!” అన్నాను.
”ఏం ఫరవాలేదు. పొట్టలో ఉండే దంతా బైటికిపోతోంది. ఒక భస్మం ఇస్తున్నాను. ఇది మీ ఒంటిని వెచ్చగా ఉంచుతుంది. నీరసం తగ్గుతుంది,” అన్నాడు వైద్యుడు.
మళ్లీ ఒకవారం అలా నీళ్ల విరేచనాలు అయిన తరవాత వైద్యుడు వేరేమందు ఇచ్చాడు. ఉడికించిన కూరలూ, ఇంట్లో దంపిన గోధుమ పిండిని జల్లించకుండా, దాంతో చేసిన రొట్టెలూ తినమని చెప్పాడు. అలా కొన్నాళ్లకి ఆయన కోలుకున్నారు.
ఒకరోజు నాతో, ”నువ్వు సరేనంటే నాకీ ఉద్యోగం వదిలెయ్యాలని ఉంది,” అన్నారు.
ఆవిషయం గురించి ఆలోచించటానికి ఒకటి రెండ్రోజులు గడుపు కావాలని అడిగాను.
”అవును, నువ్వు బాగా ఆలోచించుకున్నాకే సలహా ఇయ్యి.”
ఆయనలాగే నేను కూడా రెండు మూడు రోజులు ఎటూ తేల్చుకోలేక పోయాను. అసలీయన బీ.ఏ. చదవటం ఉద్యోగంలో ఎదగటానికే కదా! మునుపంతా ఆయన ప్రొఫెసర్‌ స్థాయికి ఎదుగుతారనీ, జీవితం సుఖంగా వెళ్లిపోతుందనీ అనుకున్నాం. కానీ ప్రస్తుతం ఉన్నది కూడా వదిలేసి గాలివాటాన బతుకుదా మంటున్నారు. అప్పుడాయనకి మొత్తం అంతా కలిపి 125 రూపాయలు చేతికందేవి. స్కూల్లో ఉద్యోగం కాబట్టి ఇంటి దగ్గర పని చేసుకునేందుకు కూడా తీరిక దొరికేది. పైగా ఉద్యోగం మానేసి ఈయన ఏం చేస్తారనే ప్రశ్న ఒకటి నాలో తలెత్తింది. ఇప్పటికే ఇద్దరు పిల్లలు, ఆపైన ఇంకా పిల్లలు పుట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఆయన ఉద్యోగం వదిలేశాక 1921లో బన్నూ పుట్టాడు. ముందరి కాళ్లకి బంధంగా మారి వాళ్లని ముందుకి పోకుండా ఆపటం కూడా నాకిష్టం లేకపోయింది. అంటే నాకు డబ్బు విలువ తెలీదని కాదు. ఎన్నో రోజులుగా ఆయనకి ఒంట్లో బాగాలేదాయె, మాకంటూ ఒక ఇల్లు లేదు, ఇవన్నీ ఆలోచించి, ఉద్యోగం మానద్దని అందామనిపించింది. రెండ్రోజులు గడువు అడిగినదాన్ని, ఐదోరోజుకి కూడా ఎటూ నిర్ణయించుకోలేక పోయాను.
ఆరో రోజున ఆయన మళ్లీ నా అభిప్రాయం అడిగారు, ”ఉద్యోగం వదిలెయ్యనా, వద్దా?” ఒక్కరోజు గడువు అడిగి, బాగా ఆలోచించాను. ఈమధ్య ఆయన మంచం పట్టినప్పుడు ఇక బతికి బట్టకటరనే అనుకున్నాను, కానీ ఆయన కోలుకున్నారు. అప్పుడు ఆయనకేమైనా అయి ఉంటే నేనేమైపోయేదాన్ని! బహుశా దేవుడు ఇందుకే ఆయన్ని బతికించి ఉంటాడు, అనుకున్నాను.
ఆ రోజుల్లోనే జలియన్‌వాలా బాగు మారణకాండ జరిగింది. దాని తాలూకు మంటలు ప్రతి మనసునీ తాకాయి. బహుశా నా మనసులోనూ దాని తాలూకు ఎదుర్కోటానికి నన్ను నేను మర్నాటికల్లా సిద్ధం చేసుకున్నాను. మర్నాడు ఆయనతో, ”ఉద్యోగం మానెయ్యండి!” అన్నాను. పాతికేళ్లు చేసిన ఉద్యోగం వదిలిపెట్టటం కష్టమే అనిపించినా, దేశ ప్రజల మీద జరుగుతున్న అత్యాచారం ముందు మా కష్టాలేపాటి, అనిపించింది. అదేమాట ఆయనతో అన్నాను.
ఆయన చిన్నపిల్లాడిలా నవ్వుతూ, ”మిగతావాళ్ల గురించి ఆలోచించే ముందు, నీ గురించి ఆలోచించు!” అన్నారు.
”ఆలోచించాను, మీరు అంత పెద్ద జబ్బునించి బైటపడి కోలుకున్నారు, ఇక ఏకష్టమొచ్చినా ఎదుర్కోగలను. అంతా మనమంచికే అనుకోవాలి.” అన్నాను.
”బాగా ఆలోచించుకో, ఆ తరవాత, ‘మీరు ఇబ్బంది పడటమే కాక నన్ను కూడా ఇబ్బందుల్లో పడేశారు,’ అనకూడదు. ఎందుకంటే ఇక పోనుపోనూ జీవితంలో కష్టాలు పెరుగుతాయి. బహుశా తినటానికి తిండికూడా దొరక్కపోవచ్చు.”
”ఆ విషయం కూడా ఆలోచించాను. ఆపద వచ్చి మీద పడితే ఎవరైనా తట్టుకో గలుగుతారని నాకు తెలుసు. గొప్పింటివాళ్లకే తప్పదు, ఇక మన సంగతి చెప్పేదేముంది”
”ఇదే నీ నిర్ణయమా?”
”అవును!”
”అయితే రేపే రాజీనామా ఇచ్చేస్తాను. రేపే మనం ప్రభుత్వం ఇచ్చిన ఈ ఇంటిని కూడా వదిలెయ్యాలి. ఎక్కడికెళ్లాలో ఏమిటో కూడా తెలీదు,” అన్నారు.
”మన ఊరికెళ్దాం.”
”ఊళ్లో మాత్రం నువ్వుండేందుకు ఇల్లేదీ? పాత ఇంట్లో పిన్నీ వాళ్లూ ఉంటున్నారుకదా? అక్కడ నీకు చోటేదీ?”
”అయితే ఆ ఇల్లు వాళ్లదా?”
”ఎక్కడ చోటు దొరికితే అక్క డుంటావా, లేకపోతే మరొకళ్ల ఇంట్లో ఉంటావా?”
”ఉన్న కాస్త ఇంట్లోనే వాళ్లూ మనం సర్దుకోలేమా?”
”అందులో చోటెంతుందని?”
నాకు కోపం వచ్చేసింది, ”ఎంతుంటే అంతే! మనం ఎందుకు వాళ్లకి వది లెయ్యాలి? వాళ్లే మరో చోటికి పోవచ్చుగా? వాళ్లు మన సుఖ-దుఃఖాల గురించి పట్టించుకోనప్పుడు, మనం మాత్రం ఎందుకు పట్టించుకోవాలి?”
”అలా అయితే, మిగతావాళ్లెవరూ ప్రభుత్వోద్యోగాలు వదలనప్పుడు, నేను మాత్రం ఎందుకు వదిలేస్తున్నానని, నువ్వు అడగొచ్చే!” అన్నారు.
”మీరు చేసేది దేశమంతటికీ సంబంధించినది. ఇందులో త్యాగం, తపస్సు, ఉన్నాయి. ఇది తల్చుకుంటే ఎవరైనా చెయ్యచ్చు.”
ఆయన నవ్వి, ”నువ్వు త్యాగం, తపస్సు, ఆత్మ సమర్పణ అనుకుంటున్నది, ఏవీ నిజం కాదు. ఇవి మనిద్దరం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవటమే అనాలి,” అన్నారు.
”అయితే మనం చేసిన పాపాలేవిట?”
”నువ్వు కాకపోతే నీ పూర్వీకులు చేశారు! ఎందుకంటే విలాసాల మత్తులో మునిగితేలింది వాళ్లే…. గుడ్డిగా ఏమీ పట్టించుకోకుండా బతికారు. అందుకే దేశంలో చిచ్చురగిలింది. ఇద్దరి మధ్య జరిగే పోట్లాటని సొంత ప్రయోజనాలకి ఉపయోగించుకుని, మూడోవాడు అధికారం చేపట్టాడు. బహుశా అలా విలాసాలతో మునిగి తేలింది, పోయిన జన్మలో నువ్వూ, నేను అయుండచ్చు కదా! ఈ చిక్కుప్రశ్న అర్థం కూడా కాదు. ఈరోజు నీమీద అధికారం చేస్తున్నవాళ్లు నిజంగా విజయాన్ని సాధించారా? వీళ్ల తాత ముత్తాతలు సాధించారు.”
”గెలిచిన వాడికి ఎక్కడైనా గర్వంతో కళ్లు మూసుకుపోతాయా?”
”నీ ఆలోచన సరైనది కాదు. గెలిచిన వాడి కళ్లు ఎప్పుడూ గర్వంతో మూసుకు పోయే ఉంటాయి. అలా మూసుకుపోకపోతే వాడు మనిషే కాదు, దేవుడై పోతాడు. అసలు విజేతలే కాని మన తోటి వాళ్లు మాత్రం కళ్లు మూసుకుపోయి ప్రవర్తించటం లేదూ? భారతీయులు కాస్త అధికారం చేతికొస్తే చాలు, ఇంగ్లీషు వాళ్ల కన్నా కఠినంగా రాజ్యం చేస్తారు. వాళ్లని చూసి యువకులు కూడా అదే పంథాలో ముందుకి పోతున్నారు. బంటుని మంత్రిని చేస్తే వంకర టింకరగా నడవటం మొదలు పెడతాడని, కవి రహీం అననే అన్నాడు గా! మనవాళ్లు తమ ధోరణి మార్చుకునేందుకు చాలా కాలం పడుతుందని నా నమ్మకం. ఐదువందల ఏళ్లుగా బానిస బతుకు బతికిన వాళ్ల ఆత్మ పది, పన్నెండేళ్లలో బాగయిపోతాయని అనుకుంటున్నావా? స్వరాజ్యం నచ్చాక కూడా ఈ ధోరణి మారటానికి చాలా కాలం పడుతుంది, కావాలంటే చూడు!”
”మరైతే ఎక్కడి కెళ్తాం?” అన్నాను.
”నన్నడిగితే, ఇక్కడే, గోరఖ్‌పూర్‌లోనే, ఏదో ఒక పని వెతుక్కోవటం నయం. ఎంత లేదన్నా యాభైయో, అరవైయో దొరకవా? ఇక్కడే ఏ పదిరూపాయల అద్దెకో ఇల్లు తీసుకుని పడుంటే సరి. ఒక సంఘం ఏర్పాటు చేసుకుని రాట్నాలతో నూలు వడికే పని మొదలు పెడదాం. పోద్దార్‌ కూడా దీనికి సుముఖంగానే ఉన్నాడు.”
”ప్రభుత్వోద్యోగం వదిలి పెట్టాక ఇంకా ఇక్కడుండటంలో అర్థం లేదు. పైగా ఇక్కడి నీళ్లు కూడా మీకు పడటం లేదు. ఇక ఇక్కడ ఉండటం దేనికో తెలీటం లేదు. ఇన్నాళ్లూ ప్రభుత్వోద్యోగం ఉందనే కారణం ఒకటుండేది.”
”ఇంకెవరూ లేకపోయినా, మన వాళ్లంటూ ఉన్నారు కదా?”
”ఇన్నాళ్లూ నీ వాళ్లని అనుకుంటున్న వాళ్లు తమ స్వార్థం చూసుకున్నారే తప్ప, నీ గురించి ఆలోచించలేదు. నీ దగ్గర డబ్బులేకపోతే నీకెవరు సాయం చేస్తారు? నీ సంగతే చూడు, నాకు బాగా జబ్బు చేసినప్పుడు పిన్నిని కొన్నాళ్లు ఉండమని అడిగాను, ఆవిడ ఉందా? ఆవిడ కొడుకు సంపాదిస్తున్నాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు, ఇక ఆవిడ నాకెందుకు సాయం చేస్తుంది? ఇంకా కావాలంటే నేనే తనకి సాయపడాలని ఎదురుచూస్తుంది. అలాంటి స్థితిలో నన్ను వదిలేసి వెళ్లిందే, ఒక్కసారైనా మళ్లీ చూడటానికి వచ్చిందా? మీ అన్నే రెండు సార్లు నన్ను తన వెంట తీసుకుపోవటానికీ, వైద్యం చేయిస్తానని చెప్పటానికీ వచ్చాడు.”
”పిలిచినా మీరు వెళ్లలేదుగా?”
”నేను వెళ్తానో, లేదో, అది వేరే విషయం. వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారా లేదా? అంటే నా మంచికోరే వాళ్లు వాళ్లే కదా? నా వాళ్లని నేను భ్రమపడ్డ వాళ్లు నా వాళ్లు కాకుండా పోయారు. అందుకే అడుగు తున్నాను, వాళ్ల దగ్గరకెళ్తే నీకేం సుఖం?”
”ఇల్లు గడవాలిగా? వాళ్లు నాకేమీ వండి వార్చక్కర్లేదు. నాకే కనక కష్టాలు భరించే శక్తి లేకపోతే మిమ్మల్ని రాజీనామా ఇమ్మని చెప్పేదాన్నా? బెనారస్‌లో వాళ్లున్నారని అసలక్కడికి వెళ్లటమే మానుకుంటామా?”
”అక్కడికెళ్తే లాభం ఏమిటి చెప్పు! ఊరికే మనస్పర్థలు పెరుగుతాయే తప్ప ఏమీ జరగదు.”
”అలాటి వాటికి భయపడి అన్నిటినీ, అందరినీ వదులుకుంటామా? అలా అయితే సన్యాసం తీసుకోవలసిందే!”
”సరే, అయితే నీ ఇష్టం!”
”అవును నా ఇష్టం అదే. నేను జీవితంలో ఎన్నడూ భయపడటం నేర్చుకోలేదు. నా అంతట నేను ఎవరి జోలికీ వెళ్లను. కానీ నా జోలికి వచ్చిన వాళ్లని చూసి భయపడి పారిపోను.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో