‘మనలో మనం’ రచయిత్రుల ఉమ్మడి వేదిక రాష్ట్ర స్థాయి సదస్సు

సుభాషిణి

‘మనలో మనం’ రచయిత్రుల ఉమ్మడి వేదిక రాష్ట్ర స్థాయి సదస్సు జూన్‌ 27, 28 తేదీలలో యోగి వేమన విశ్వవిద్యాలయంచ కడపలో జరిగింది. ఉత్తరాంధ్రలోని అనకాపల్లిలో తొలుత ఈ ఉమ్మడి వేదిక ఏర్పడింది. తరువాత వరంగల్‌ పిమ్మట రాయలసీమలోని కడపలో ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముస్లిం స్త్రీల సాహిత్యం, రాయలసీమ స్త్రీల సాహిత్యం అనే రెండు అంశాల గురించి తొలి రోజు కార్యక్రమం జరిగింది. సాహితీ విమర్శకురాలు డా|| పి. సంజీవమ్మ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షురాలు డా|| పి. కుసుమ కుమారి కీలకోపన్యాసం చేశారు. తొలుత డా|| కె. సుభాషిణి కార్యక్రమ అజెండా సమర్పించారు. కుల, మత, వర్గ, జాతి హింసలకు వ్యతిరేకంగా సాహిత్యసృజన, ప్రత్యేక అస్తిత్వాలను గుర్తించడం, వివిధ అస్తిత్వాలకు దామాషా, పారదర్శకత్వం, జవాబుదారీతనం పాటించటం…. తమ అజెండాలోని అంశాలుగా పేర్కొన్నారు.
సాహిత్యం స్త్రీలకు, స్త్రీల సమస్యలకూ మాత్రమే పరిమితం కాదు. సాహిత్యం సమాజం కోసం. అన్ని సమస్యలనూ పట్టించుకుంటాం. స్త్రీల సమస్యలను యింకాస్త ఎక్కువగా పట్టించుకుంటాం. స్త్రీలు, వారి సమస్యలు అందులో భాగంగా పంచుకుంటాయి. డా|| పి. సంజీవమ్మ అధ్యక్షోపన్యాసంలో తెలిపారు.
స్త్రీవాద సాహిత్యంతో ‘భూమిక’ వంటి పత్రికలు చైతన్యం తెస్తున్నప్పటికీ మహిళాబిల్లు వస్తే విషం తాగి చస్తామనే రాజకీయ నేతలున్న నేపథ్యంలో సాహిత్యం ఎలా ఉండాలని డా|| పి. కుసుమ కుమారి కీలకోపన్యాసంలో తెలిపారు. ముస్లిం, బహుజన సాహిత్యాలు అంతకు ముందు స్పృశించని ఆలోచనలు, సమస్యలు, పరిష్కారాలు వస్తున్నాయి. ఎదుటి వ్యక్తి దృష్టితో సమస్యను పరిష్కరించే చిత్తశుద్ధి (లిళీచీబిశినీగి) కావాలన్నారు. అవకాశాల లేమిని గుర్తించాలన్నారు. ప్రపంచ స్త్రీల సాహిత్యం పరిశీలిస్తే మనమే మెరుగైన స్థితిలో ఉన్నామని అభిప్రాయ పడ్డారు. సాహిత్యమంతా ఒక ఎత్తైతే వ్యాసాలు వేరని పేర్కొన్నారు. మన తెలుగు వ్యాసాలకు దృఢమైన మూలాలున్నాయి. చైతన్యాన్ని విస్తరింప చేయాలి. అందులో పరిశోధక విద్యార్థులను భాగస్వాములు చేయాలి. రాన్రాను విద్యార్థులలో సాహిత్యం పట్ల ఆసక్తి సన్నగిల్లుతోంది. సమాజంలోకి వెళ్లి ప్రజలతో పనిచేయటం ద్వారా వచ్చే వ్యక్తులు యిరువురూ సమాజంపై కలిగించే ప్రభావం అది. రచనారంగం, ఏదైనా రంగంలో రాణించాలంటే విషయం పట్ల అవగాహన ఉండాలి. విషయ పరిజ్ఞానంతో చైతన్యవంతమైన సమాజం ఆవిర్భవిస్తుంది. అందుకు అధ్యయనం చాలా అవసరం. పాత భావాన్ని కొత్తగా చెప్పటం అనేది భిన్నంగా ఆలోచించటం స్త్రీవాద సాహిత్యం చదివాక సానుభూతి కలిగింది. స్త్రీ దృష్టితో చూడటాన్ని అంతర్జాతీయంగా ‘గైనో క్రిటిసిజమ్‌’ అనే పదంతో వాడుతున్నారు. స్త్రీవాదంతో రాసిన చలం కథలను యిప్పటికీ చదువుతున్నాం. ఒకే కథని కొంతకాలం తర్వాత చదివితే ఏమనిపిస్తుంది? పాత విషయాన్ని కొత్త దృష్టితో చూడాలి. ఆ కోవలోని వారే వెంగమాంబ, మీరాబాయి.
ఉమ్మడి వేదిక ద్వారా రచయిత్రులు ఆలోచించుకుని సామాజిక, రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛని స్త్రీ, పురుషులలో కలిగించాలి. ఎక్కడైతే స్త్రీలకు అవకాశాలు లేవని భావిస్తున్నామో, అక్కడ వారిని భాగస్వాములను చేయడానికి దోహదపడే రచనలు చేయాలి. పొరపాట్లను లర్నింగు ఎక్స్‌పీరియెన్సెస్‌గా తీసుకుని లక్ష్యంవైపు పయనించాలి. నిర్ణయాత్మక స్థానాల్లో స్త్రీలు ఉండాలి. స్త్రీ సామర్ధ్యం పట్ల ఒక గుర్తింపును తీసుకురావాలి. ప్రస్తుతం స్త్రీలను మార్జినలైజ్డ్‌గా గుర్తిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని టైం బౌండ్‌ కార్యక్రమంగా రూపొందించాలి. చైతన్యం కలిగించటం, రాతను పదిలపరచటం, సాహితీ పాఠశాల నిర్వహణ, స్త్రీ అభివృద్ధిని పదునుపెట్టటం, అమెచ్యూర్‌ రైటర్స్‌ను ప్రోత్సహించటం వంటివి చేయాలి. ఆ బాధ్యత 80% విశ్వవిద్యాలయాలపై ఉందనీ, అందుకు విశ్వవిద్యాలయాలు సహాయ సహకారాలు అందిస్తాయనీ అన్నారు. పరిపాలనా నిర్వహణలో ఉన్న తనకు అవగాహన కలిగించింది సాహిత్యమనీ, పరిపాలనా నిర్వహణలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించేలా చేసింది సాహిత్యమనీ పేర్కొన్నారు.
ముస్లిం స్త్రీల సాహిత్యం సదస్సుకు డా|| కాత్యాయని విద్మహే అధ్యక్షత వహించారు. ‘మనలో మనం’ రచయిత్రుల ఉమ్మడి వేదికలో భాగంగా తెలంగాణలో దళిత సాహిత్య సదస్సు, తెలంగాణ సాహిత్య సదస్సు నిర్వహించామన్నారు.
ముస్లిం కవయిత్రి ఖలీదా పర్వీన్‌ మాట్లాడుతూ పేదరికం, అవిద్య ముస్లిం స్త్రీల వెనుకబాటుకు గల కారణాలుగా పేర్కొన్నారు. ఇస్లాం మతంలో ఎలాంటి నిర్బంధం లేదు. మతాన్ని విశ్వసించినవారు పరదా వేసుకుంటారు. ఈ విషయంపై చర్చించుకోవటానికి ఆమె షాజహానాను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.
‘ముస్లిం స్త్రీల కథాసాహిత్యం’ గురించి షహనాజ్‌బేగం మాట్లాడారు. ముంతాజ్‌ తన రచనా వ్యాసంగం గురించి మాట్లాడారు. ముస్లిం మైనారిటీ స్త్రీల సాహిత్యం గురించి పరిశోధన చేస్తున్న విద్యార్థిని శోభారాణి ముస్లిం కవయిత్రుల గురించి ప్రసంగించారు.
భోజన విరామం అనంతరం ‘రాయలసీమ స్త్రీల సాహిత్యం’ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి డా|| కె. సుభాషిణి అధ్యక్షత వహించారు. పుష్పాంజలి ప్రసంగిస్తూ జోళపాళెం మంగమ్మ ఆకాశవాణి వార్తా చదువరిగా పనిచేశారన్నారు. ఒకటి, రెండు కథలు వ్రాసిన మంగమ్మ చారిత్రాత్మక పరిశోధనా వ్యాసాలు చాలా వ్రాశారు. చిత్తూరు జిల్లా రచయిత్రి ఆర్‌. వసుంధరాదేవి కథలు అంతర్లీనంగా బహిరంగంగా మానవ ప్రవృత్తులకు అసలు కారణాలు ఏమైనా ఉన్నాయాని, జీవితంలో ఎదుర్కునే చిక్కుముడులను విప్పడానికి ప్రయత్నం చేస్తాయి. ఈమె కథలు తత్వాన్వేషణ వైపు నడిపిస్తాయి. తమ ‘పెంజీకటి’ నవలలో మానవ సంబంధాలను క్యాన్సర్‌ కణాలతో పోలుస్తారు.
డా|| శ్రీదేవి రాయలసీమ స్త్రీల కథా సాహిత్యం గురించి ప్రసంగించారు. 1992లో ‘సీమకథలు’ కథాసంపుటి వెలువడినా అందులో ఒక మహిళా రచయిత అయినా లేరు. జనవరి 2003లో ఆర్‌. శశికళ ‘చెదిరిన పిచ్చిక గూడు’ కథాసంపుటి వచ్చింది. నిర్మలారాణి ‘గాజుకళ్ళు’ కథాసంపుటం వెలువరించారు. ‘రాయలసీమలో ఆధునిక సాహిత్యం సామాజిక సాంస్కృతిక విశ్లేషణలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఈ కథా రచయిత్రుల కథలనేవీ ప్రస్తావించకపోవడం గమనార్హం. రాయలసీమ రచయిత్రులను రాయలసీమ రచయితలే గుర్తించలేదన్నారు. నిర్మలారాణి కరువు నేపథ్యంలో కథలు వ్రాశారు. ఆర్‌. శశికళ కరువు, ఫ్యాక్షన్‌ నేపథ్యంలో కథలు వ్రాశారు. డా|| కె. సుభాషిణి ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యావ్యవస్థ గురించీ, కులం, కట్నం సమస్యలను అంతర్లీనంగా ‘కరువెవరికి?’ కథలో స్పృశించారు. కడప జిల్లాకు చెందిన యువ కథారచయిత్రి వరలక్ష్మి ఇంజినీరింగు విద్యలోని అన్‌హ్యాపీడేస్‌ గురించి కథ రాశారు. రాయలసీమ స్త్రీల కథాసాహిత్యంలో కరువు, ఫ్యాక్షన్‌, బాల్యవివాహాలు, ఎయిడ్స్‌, వేశ్యవృత్తి వంటి సమస్యలెన్నో కనిపిస్తాయి.
అనంతరం రాయలసీమ స్త్రీ కవితా సాహిత్యం సదస్సు జరిగింది. కొండవీటి సత్యవతి సభకు అధ్యక్షత వహించగా, డా|| పి. సంజీవమ్మ, ఆర్‌. శశికళ వక్తలుగా పాల్గొన్నారు. డా|| పి. సంజీవమ్మ మాట్లాడుతూ కడపకు చెందిన పసుపులేటి పద్మావతమ్మ 1988లో ‘మౌనఘోష’ పేరుతో కవితా సంకలనం తెచ్చారన్నారు.
ఆర్‌. శశికళ మాట్లాడుతూ ముందుగా వేంపల్లికి చెందిన చెంచులక్ష్మమ్మ శంకరమంచి భక్తిగీతాలను పేర్కొన్నారు. అయితే అవి రాతమూలకంగా భద్రపరచబడ్డాయో, లేదో తెలియదన్నారు. కర్నూల్‌ జిల్లాకు చెందిన నాగమ్మ పూలే ‘కులగీత’ వచనకావ్యం వ్రాశారు. అనంతపురం జిల్లా నుండి ‘ఒరుపు’ కవితా సంకలనం వచ్చింది. హిమబిందు, పేరిందేవి, డా|| మోక్షప్రసూన, స్నేహలత ‘అనంతకరువు’, చిలుకూరి దీవెన ‘చినుకు’ కవితలు అందులో ఉన్నాయి. ముక్తాపురం స్నేహలత ‘కొత్తపొద్దు’ కవితా సంకలనం వెలువరించింది. ఇందిరారాణి పెప్సీకుర్రాడు గురించి రాసిన కవిత భూమికలో ప్రచురితమైంది. గంగరత్న 2004 నుంచీ కవిత్వం రాస్తున్నారు. వి. సుభాషిణి బాలకార్మికుల గురించి ‘రాతిహృదయం’ కవిత రాసారు.
రాయలసీమ స్త్రీల వ్యాస సాహిత్యం సదస్సుకు ఆర్‌. శశికళ అధ్యక్షత వహించారు. పి. వరలక్ష్మి వక్తగా పాల్గొన్నారు. ఎం విజయలక్ష్మి భాషా సాహిత్యం మీద 1997లో పరిశోధన చేశారని పేర్కొన్నారు. కొలుకలూరి మధుజ్యోతి, సంజీవమ్మ, పద్మావతమ్మ వ్యాసాలు వ్రాశారు. అనంతపురం జిల్లాలో శశికళ, నిర్మలారాణి వ్యాసాలు వ్రాశారు. చిత్తూరు జిల్లాలో విష్ణుప్రియ ‘మహిళామార్గం’లో వ్యాసాలు వ్రాశారు.
డా|| పి. సంజీవమ్మ రాయలసీమ స్త్రీల నవలా సాహిత్యం గురించి మాట్లాడారు. సాహిత్య సృజన ద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగించవచ్చన్నారు.
రెండవరోజు (28వ తేదీ) ‘స్త్రీవాద సాహిత్యం -వర్తమానం-అవసరాలు’ గురించీ సదస్సులో పాల్గొన్న రచయిత్రులందరూ తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో