సమ్మోహనం

ఇంద్రగంటి జానకీబాల

తలుపుతీసి ఎదురుగావున్న వ్యక్తిని చూసి ‘ఎవరా’ అని సందేహంలో పడ్డాను. ఎక్కడా చూసిన గుర్తు రావడం లేదు. ఆయన నా అవస్థనేం పట్టించుకోకుండా ”జానకీబాల గారున్నారాండీ” అన్నాడు.
మీరూ… అంటూ ఆగాను. ఆయన తన పేరు చెప్పారు.
ఓ… మీరా – రండి లోపలికి” అన్నాను. ప్రత్యక్షంగా ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. ఆయనా నన్ను చూడలేదు.
” అంటే… ” అని ఆగాడు.
”నేనేనండి” అన్నాను. ఆయన ముఖమంతా ఆశ్చర్యమే. అది తట్టుకోలేక ”ఫోన్లో మీ వాయిస్‌ చాలా యంగుగా వుంటే మీరు చిన్నవారనుకున్నాను” అనేసి నాలిక్కరచుకున్నాడు.
ఫర్వాలేదు, మీరు నా వాయిస్‌ యంగుగా వుందన్నారు కదా! అది నాకానందమేలెండి-” అన్నాను.
ఇంతకీ నాతో ఆయన చాలాసార్లు, చాలాసేపు ఫోన్లో మాట్లాడారు-,
ఇంక ఆయన సంగీతం గురించి, సినిమా పాటల గురించి, గాయకుల గురించి మాట్లాడేయడం మొదలుపెట్టాడు -, రెండు నిమిషాల్లో ఆయనకి సంగీతమంటే ఏం తెలీదనీ, కానీ విపరీతమైన ఇష్టం అని అర్థమైంది. ”కొన్ని పాటలు వింటూంటే, ఎక్కడో విన్నట్టు, వేరే పాట పోలికలున్నట్టు అనిపిస్తుంది. శ్రద్ధగా వింటే కాపీ అనడానికి వుండదు. ఎందుకంటారు” ”ఒకే రాగంలో రకరకాల పాటలు కంపోజ్‌ చేస్తూంటారు. అలాంటప్పుడు మీకు పోలిక కనిపిస్తుంటుంది”. -,
మొన్న సినిమాలకి మ్యూజికిచ్చే ఒకామె చెప్పిందండీ – , సంగీతం అంటే శాస్త్రీయ సంగీతం రానవసరం లేదు సినిమాకి మ్యూజిక్‌ కూర్చాలంటే’ అంటూ చెప్పుకొచ్చిందామె. నిజమాండి.
”మరేం తెలియాలి”-
”పాటలు వింటే చాలన్నారు. అప్పట్నించి నాకు ఆశగా వుంది. నేను కూడా ట్రై చేస్తే సినిమాకి సంగీతం కంపోజ్‌ చెయ్యగలనేమోననీ – ఏమంటారు?” ”పాటలు వింటే కాపీ కొట్టడం బాగా వస్తుంది. సొంతంగా ఒక ట్యూన్‌ కంపోజ్‌ చేయడం రాదు. రాగాలు, తాళాలు-, శాస్త్రం బాగా తెలియాలి సొంతంగా ఆలోచించేశక్తి సంపాదించాలి-, ఒక రాగంలో పాటలు కంపోజ్‌ చెయ్యాలంటే రాగం బాగా మనసుకి పట్టాలి కదా!
”ఒకటి చెప్పండి” –
ఇప్పుడు మోహనరాగంలో ఎన్నో సినిమా పాటలున్నాయి. అవన్నీ ఎందరో సంగీత దర్శకులు అందంగా బాణీలు ‘మోహన’ లోనే కంపోజ్‌ చేశారు.
మనందరం ఎంతో యిష్టపడి పాడుకునేపాట ‘లాహిరి లాహిరి లాహిరిలో’ (విజయా వారి మాయా బజార్‌) పాట మోహనరాగం – అలాగే కొన్ని చెప్తాను.
పాడవేల రాధికా /తెల్లవారవచ్చె /కళ్ళు తెరచి కనరా /చందన చర్చిత నీలకళేబరు /మౌనముగా నీ మనసు పాడిన /ఎచటనుండి వీచెనో ఈ చల్లనిగాలి/తెలుసుకొనవె యువతీ/శివశివ శంకర భక్తవశంకర /జయకృష్ణాముకుందామురారీ
ఇలా ఎన్నో పాటలు అందమైన మోహన రాగంలో వున్నాయి. కర్నాటక సంగీతంలో మనం మోహన అని పిలిచే రాగాన్ని హిందూస్తానీలో భూప్‌, భూపాల్‌ (మన భూపాలరాగం వేరుసుమండీ) దేశికల్‌ అనే పేర్లతో పిలుస్తారు. ఇది అయిదే స్వర్ణాలుగల అందమైన రాగం -స-రి-గ-ప-ద-స. కానీ ఇందులో పలకని భావం లేదు ఒదగని అందం లేదు.
తెల్లవార వచ్చె- సున్నితంగా, ప్రశాంతంగా తెలతెలవారు తున్నట్లుంటుంది. పాడవేల రాధికా – శృంగార భావంతో గిలిగింతలు పెడ్తుంది. లాహిరి లాహిరి లాహిరి కొంటె తనం సినిమా చూస్తే తెలుస్తుంది. కృష్ణాముకుందామురారీ భక్తి పారవశ్యంతో కదను తొక్కుతుంది.  కళ్ళు తెరచికనా – సత్యం ఒళ్ళు మరచి వినరా’ అంటూ విప్లవాత్మకంగా వుంటుంది.
ఈ మోహన చాలా జనరంజకమైన రాగం-, విప్లవ గీతాలు- శ్రామిక గీతాలు, జానపద గీతాలు ఎక్కువగా ఇందులోనే వుంటాయి, శాస్త్రీయ సంగీతంతో సంబంధం లేకుండా హాయిగా గొంతెత్తి పాడుకునే సామాన్యుల సంగీతం ఇందులోనే అమరి వుంటుంది.
80ల వరకు సినిమాలకి పనిచేసిన సంగీత దర్శకులందరూ సంగీతంలో ఎంతో కృషి చేసినవారు. కానీ తరువాత క్రమంగా సరిగమలు రాకుండా సినిమాకి సంగీతం కూర్చవచ్చును అనే సంస్కృతి వచ్చింది. ఇళయరాజా వరకే మనకి చెప్పుకోదగిన సినిమా పాటలు వచ్చాయి. పాటల్ని ఎక్కడ్నించి దిగుమతి చేసుకుందామా అనే ఆలోచన పెరిగింది.
‘ఘనా ఘనా సుందరా!/రా రా ప్రియా సుందరా!/పులకించని మది పులకించు’/పిలిచినదీ – పలికినదీ’ – అంటూ మోహన మనల్ని అలరిస్తూనే వుంది. సినిమా పాట అంటేనే ఎప్పుడైనా ఒక అన్యస్వరం పడే అవకాశం అంటుంది.
ఈ రాగంలో సాలూరి రాజేశ్వరరావు-, ఘంటసాల, విశ్వనాధన్‌ రామ్మూర్తి, టి.వి. రాజు, సత్యం, ఆదినారాయణరావు – ఇళయరాజా ‘నిన్ను కోరి వర్ణం’ ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే-,
నేను చెప్పుకుంటూపోతే దానికి దరీ దాపూ వుండదు. అందుకని నా టెలిఫోన్‌ ఫ్రెండు నన్ను ఆపి శలవు తీసుకుంటూ – మళ్ళీ వస్తానండీ ఈసారి మరో రాగం గురించి ఇలాగే చెప్పాలి’ – అన్నాడు.
పాటల్లో మాటల్లో పడితే సమయమే తెలీదుమరి.
అనువాద కథ
ఏడో కూతురు
ఉర్దూ మూలం : సుఘ్రా మెహ్‌దీ
అనువాదం : సి.హెచ్‌. శ్రీనివాసమూర్తి
పూర్వకాలంలో ఒక రాజుండేవాడు. ఆయనకు ఏడుగురు కుమార్తెలు. ఉన్నట్లుండి అతని బుర్రలో ఏ పురుగు తొలిచిందో, ఏమో, తన కూతుళ్ళనందరినీ విడివిడిగా పిలిచి, ”నీవు ఎవరి అదృష్టంతో జీవిస్తున్నావు?” అని ప్రశ్నించాడు. వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు ”మీ అదృష్టం మీదనే ఆధారపడి బ్రతుకుతున్నామని” తడుముకోకుండా జవాబిచ్చారు. ఏడో కూతరు మాత్రం ”నేను నా అదృష్టంమీదనే ఆధారపడి జీవిస్తున్నానని చెప్పింది. రాజు గారికి కోపం పెల్లుబికింది. ఒక పల్లకీని పిలిపించి, ఏడో కూతురిని ఒక దాయాను తోడిచ్చి, అడవిలో వదిలి రమ్మని ఆదేశించాడు, తన అదృష్టం మీదనే బ్రతకమని.
ఎక్కడా జనసంచారం లేని దట్టమైన అడవి. కాని యువరాణి ఏమాత్రం భయపడలేదు. మట్టితో బొమ్మలు చేస్తూ, కాయలు ఫలాలు తింటూ నిర్విచారంగా గడపటం మొదలుపెట్టింది. వెంటవచ్చిన ఆయా, తండ్రిని క్షమాపణ కోరమని ఎంతగానో బ్రతిమిలాడింది. కానీ యువరాణి ససేమిరా ఒప్పుకోననింది. అనుకోకుండా ఒకరోజు వేట నిమిత్తం అడవికి వచ్చిన ఒక యువరాజు ఆమెను చూసి మోహితుడైనాడు. ఆమెను తన రాజ్యానికి తీసుకుపోయి ఆమెను తనరాణిగా పరిణయమాడాడు. విషయం తెలిసిన తండ్రికి తన కూతురి అభిప్రాయంతో ఏకీభవించక తప్పలేదు.
ఈ కథంటే సతమ్‌కు మహాయిష్టం. మాటమాటికి అడిగి బ్రతిమిలాడి మరీ చెప్పించుకునేవాడు. ఇజాజ్‌ మియాగారింట్లో ఏడో కూతురు పుట్టిందని తెలిసిన రోజున, ఆ పిల్లరాకకు, అందరూ ఆదుర్దా పడుతుంటే అతనొక్కడికే అమితమైన ఆనందం కలిగింది.
”ఇజాజ్‌ బయాకు ఎన్ని కష్టాలు! యిప్పుడు కూడా అమ్మాయే! ఆరు కుంపట్లను గుండెలమీద పెట్టుకుని మోస్తుంటే ఇప్పుడీ ఏడోకుపంటి!….”
”పెళ్ళిళ్ళు చేయలేక గుండె పగిలిపోతుందేమో…..”
కానీ సతమ్‌కు బొద్దుగా, ఎర్రగా ఉన్న ఆ చిన్నపిల్ల తోడిదే లోకమయింది. అతనికి సారాకు కేవలం ఐదేళ్ళ వయసు తేడా. ఎప్పుడూ ఆ పిల్లను ఎత్తుకుని తిరిగేవాడు. కొద్దిగా పెద్దయిన తర్వాత చేయిపట్టుకుని నడిపించేవాడు. కోతుల ఆటను చూపించాడు. తనతో కలిసి ఆడాడు. మరి కొంత ప్రాయానికి రాజుగారి ఏడో కూతురి కథను పదే పదే వినిపించేవాడు. ఆమె చిన్న తనంలోనే సతమ్‌కు, రాజుగారి సప్తమ పత్రికాఛాయలు కన్పించాయి.
”సారా! సతమ్‌భాయ్‌ నీ కంటే పెద్దవాడు. మర్యాద యివ్వటం నేర్చుకో” అనేది తల్లి.
”అవునవును. పెద్దన్నగదా!” అంటూనే, తిరిగి అతన్ని ఆట పట్టించటం మానేది కాదు. అతనితో సమానంగా దెబ్బలాడేది. సమానంగా అల్లరి చేసేది. సమానంగా వాదించేది. గోటీబిళ్ళ ఆడేది. గాలిపటాలు ఎగరవేసేది. క్రికెట్‌ ఆడేది. ఎవరైనా ఆటల్లో తొండి చేస్తే ఆమె చేసే హంగామా చూసి అచ్చంగా రాజు గారి ఏడో కూతురేనని సంతోషించే వాడు సతమ్‌. మళ్ళా ఈ రూపంలో జన్మించిందనిపించింది. ఆమె తన కోసమే పుట్టినట్లు, నిర్మానుష్యమైన అడవిలో నుండి రక్షించిన రాకుమారుడి స్థానంలో తననూ ఊహించుకునిపొంగి పోయేవాడు.
”సారా! ఇంకా ఎంత కాలం యిలా అల్లరి చిల్లరగా తిరుగుతావ్‌”.
”నేను యిలాగే తిరుగుతాను. వీళ్ళంతా తిరగటంలేదా?”
”వాళ్ళు మగపిల్లలు…..”
”అయితే ఏం?…..” నిర్లక్ష్యంగా తల ఎగరేసి, కళ్ళమీది కొచ్చిన వెంట్రుకలను వెనక్కు నెట్టి, క్రికెట్‌ ఆటకు దౌడుతీసేది.
అక్కచెల్లెళ్ళందరూ ఒక్కచోట చేరిన వేళ, తాము పోవాల్సిన పరాయి యిళ్ళను గురించి ముచ్చటించుకునేవాళ్ళు. తాము పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే అమ్మానాన్నలు ఒంటరి వారైపోతారు. వృద్ధాప్యంలో వారిని ఎవరు ఆదుకుంటారు? అని మధనపడేవాళ్ళు.
”నేనున్నానుగా!” ఠక్కున సమాధానం చెప్తుంది సారా.
”నువ్వు కూడా పెద్దయితే మరో యింటికి పోవాలిగదా?”
”లేదు. నేను మరోయింటికి పోనేపోను.” తెగేసి చెప్పి సతమ్‌ దగ్గరకు పరుగుతీసేది.
”సతమ్‌ భాయ్‌, ప్రతి ఆడపిల్ల పరాయింటికి పోవటం అవసరమా? తనయింట్లోనే ఉండటానికి వీలులేదా? అని సవాలక్ష ప్రశ్నలు సంధించేది.
”ఎదుకుండగూడదు. సారా! నీవు నీ యింట్లోనే ఉండు” అనేవాడు.
ఆ పిల్ల తృప్తిగా, నిశ్చింతగా తిరిగి తన ఆటల్లో నిమగ్నమయ్యేది.
పెద్దమ్మకు వీరిరువురి సన్నిహితం నచ్చేది కాదు. ఈ విషయం సారా అమ్మకు కూడా తెలుసు. అప్పుడప్పుడూ ఈ విషయంలో సారాను మందలిస్తే ”నేను సతమ్‌ భాయ్‌తో తిరిగితే తప్పేముంది. నేనిలాగే తిరుగుతాను” అని మొండిగా సమాధానం చెప్పేది.
ఎ               ఎ               ఎ
సారా క్రమంగా పెద్దదవుతూ వచ్చింది. అక్కలందరూ ఒకరి తర్వాత ఒకరు పరాయి యిళ్ళకు ప్రయాణమైనారు. వారిని ఒకయింటి వారిని చెయ్యటంలో ఇజాజ్‌ మియాకు ఉన్నదంతా ఊడ్చి పెట్టక తప్పలేదు. ఆరో కూతుర్ని అత్తవారింటికి పంపిన తర్వాత, నెలనెలా వచ్చే కొద్ది పాటి పెన్షన్‌ తప్ప ఆయన కేమీమిగలలేదు.
”ఇప్పుడు సారాను ఎలా పంపించాలి?” అని భార్యతో విచారం వెలిబుచ్చాడు.
”నా గురించి మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా. నా కోర్సు పూర్తి కానీయండి. మరో సంవత్సరం. అంతే. నేను ఉద్యోగం చేస్తాను. మీరు నాకేమీ ఖర్చు చేయాల్సిన పనిలేదు.” అనునయించింది సారా.
”అయితే ఇక ఇజాజ్‌ మియా కూతురి సంపాదన మీద బతకాలన్నమాట” అని ఎకసెక్కేలాడింది పెద్దమ్మ.
”ఇందులో తప్పేముంది పెద్దమ్మా? నీవు మాత్రం సతం భాయ్‌ సంపాదన మీద బతకటంలా?” అని ఎదురు ప్రశ్న వేసింది సారా.
”నువ్వు మాట్లాడదకు. నీ నోటికి నేను సరితూగలేను” అని విసురుగా వెళ్ళిపోయింది పెద్దమ్మ.
ఎ               ఎ               ఎ
కాలం గడిచింది. సతమ్‌ వివాహప్రయత్నాలు మొదలైనాయి. అందం, ఐశ్వర్యం గల యువతుల అల్బంతో సతం వాళ్ళ అమ్మ కొడుకుతో పెళ్ళి ప్రస్తావనతెస్తే. సతమ్‌ మొఖం చాటేశాడు. అందగాడు, సంపాదనా, పరుడైన యువ రత్నానికి అందులో ఉన్న వాళ్లెవరూ నచ్చలేదు. ఒకరోజు తన మనసుతో ఉన్న మాటను ధైర్యంగా తల్లికి చెప్పాడు, తను సారాను పెళ్ళాడదలిచానని. ఆమె అగ్గి మీద గుగ్గిలమయింది.
”నువ్వు మతి వుండే మాట్లాడుతున్నావా సతం? గర్విష్టి, నోటి దురుసుగల పిల్లను నాకు కోడలిగా తెస్తావా? ఒక అందం లేదు, ఒక చందం లేదు. పైగా నీకుయివ్వటానికి ఆ అమ్మాయి తండ్రికి చిల్లిగవ్వలేదు.”
”అమ్మా, ఇది నా చివరి నిర్ణయం పెళ్లంటూ చేసుకుంటే నేను సారానే చేసుకుంటాను” తేల్చి చెప్పేశాడు సతం.
”వాహ్‌…..వాహ్‌…హియర్‌….హియర్‌…” వాకిట్లోనుంచి వినిపించిన మాటలు. తలలు తిప్పిచూస్తే వాకిట్లో సారా.
సతమ్‌ భాయ్‌… నీ నిర్ణయానికి నా జోహార్లు. కానీ ఈ నిర్ణయం నాకు సమ్మతమో కాదో. కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా నువ్వే నిర్ణయం తీసేసుకున్నావన్నమాట.. సెభాష్‌…” అంది అవహేళనగా.
”సారా! నువ్వు…. నీకు….” అంటూ చేయిపట్టి గదిలోకి తీసుకుపోయాడు సతం.
”సతమ్‌ భాయ్‌. నువ్వంటే నాకు ప్రేమ ఉంది. అభిమానం ఉంది. నేను నిన్ను అమితంగా ప్రేమిస్తాను. నువ్వునా అన్నవి. స్నేహితుడివి. కానీ పెండ్లి విషయంలో… సారీ సతం భాయ్‌… నాకు నిన్ను చేసుకునే ఉద్దేశం లేదు…. సారీ.” తేల్చి చెప్పింది.
ఆకస్మాత్తుగా తననెవరో అగాధంలోకి నెట్టేసినట్లయింది సతంకు. అంధకార బంధురమైన గుయ్యారం. తనీ చిన్న విషయాన్ని ఎలా మరిచి పోయాడు! సారాతో ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేకపోయాడు? తను కథలోని యువరాజుననీ, తను చెప్పగానే ఎగిరి గంతేసి సారా తన  వొడిలో వొదిగి పోతుందనీ ఎందుకు పొరపాటు పడ్డాడు? బహుశా చిన్నతనం నుండి తను విన్ని కథ ప్రభావమేమో! తను సారాను అర్థం చేసుకోవటంలో పొరపాటు పడ్డాడా?
అతను అనునయించి నచ్చచెప్పటానికి ప్రయత్నించినా ఆమె అంగీకరించలేదు. తన మనసులో చీకటి, చిక్కనైనట్లని పించింది. ఆ చీకట్లలోంచి అతి ప్రయత్నం మీద బయట పడితే అమ్మాయిల అల్బమ్‌తో అమ్మప్రత్యక్షమైంది. అన్యమనస్కంగానే మొదటి ఫోటో మీద వేలుంచాడు చూడకుండానే.
జీవితాలు, తమ తమదారుల్లో, తమ తమ యిచ్చానుసారం సాగుతాయి. వారిరువురి బ్రతుకులు అలాగే సాగాయి. సతం తన జీవితం నుండి సారాను పూర్తిగా తొలగించుకున్నాడు కాని ఆమెను గురించిన చిన్న చిన్న విషయాలు అతనికి యితరుల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. సారాకు ఉద్యోగం దొరికింది. ఇల్లు అమ్మి, అమ్మను, నాన్నను తన తోనే తీసుకుపోయింది. చాలా మంచి పెయింటర్‌గా పేరు తెచ్చుకుంది. చాలా చోట్ల ఆమె చిత్ర కళా ప్రదర్శనలు కూడా జరిగాయి. అమ్మానాన్నల అనుమతి లేకుండానే ఆమె ఒక విదేశీ పెయింటర్‌ను పెళ్ళాడింది. ఈ దుఃఖంతో తండ్రి కొంత కాలానికి తనువు చాలించాడు. సారా తన భర్తకు విడాకులివ్వాల్సి వచ్చింది. తన దారిన తను ఒంటరిగా ఉంది. తరువాత్తరువాత అమ్మకూడా ఆమెను వీడి తండ్రి ననుసరించింది. సారా చిత్రాలు అంతర్జాతీయఖ్యాతి నార్జించాయి. చాలా బహుమతులు, అవార్డులు అందాయి. సారా గుండెజబ్బుతో బొంబాయి చేరినట్లు తెలిసింది సతంకు.
”భయ్యా… సారా ఆరోగ్యపరిస్థితి సరిగ్గాలేదని తెలిసింది. ఒక్కసారి ఆమెను చూసి రావూ, వీలుంటే ఆమె నిక్కడికి పిలుచుకువస్తే చాలా మంచిది. అది ఒంటరిదైపోయింది. ఎంతయినా అది మన చెల్లెలే కదా!” అక్క దగ్గర నుండి ఉత్తరం. సతం హతాశుడైనాడు.
 కాని సారా అతని సహాయాన్ని స్వీకరిస్తుందా? చెప్పినట్లు విని తనతో బయలు దేరుతుందా? యిటువంటి సమయాల్లో ఆమె ఒంటరి తనానికి ఆమెను వొదిలి పెట్టటం న్యాయమా? అతను అక్కయిచ్చిన అడ్రసుకు టెలిగ్రాం యిస్తే జవాబొచ్చింది. సారా నుంచి కాదు. ఆమెకు తెలిసిన వాళ్ళనుండి, సారా ఆపరేషన్‌ కోసం హాస్పిటల్‌లో చేరిందని. అతను వెంటనే బయలు దేరాడు.
”సక్సెస్‌ అయే అవకాశం శాతం తక్కువని చెప్పినా వినిపించుకోకుండా ఆపరేషన్‌ కోసం పట్టుబట్టింది. తనకు అశక్తురాలిగా మరొకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతకటం యిష్టం లేదని చెప్పింది,” డాక్టర్‌ అన్నాడు.
సతమ్‌ సారా గురించి ఆలోచిస్తూ నిల్చుండి పోయాడు. తను సారాను రెండోసారి కూడా తప్పుగా అంచనా వేసుకున్నట్లు అర్థమైంది.
రాజుగారి ఏడోకూతురు, తన అదృష్టం మీద తనయిష్టప్రకారం జీవించటానికి నిర్ణయం తీసుకోగలిగితే, తనయిష్టప్రకారం చావుకు కూడా భయపడదని అర్థమయింది.

Share
This entry was posted in పాటల మాటలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.